అన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషిజీవితం వృధా . ఆరోగ్యంగా ఉంటేనే బతుకు.ఆరోగ్యంగా ఉంటేనే అడవిలోనైన బ్రతికేయవచ్చు. వందేళ్ళు నిండు నూరేళ్ళు బతకచ్చు అని నిపుణులు నిరూపించారు. నేను అంటున్న మాట మనిషికే కాదు ప్రతిజీవికి ఇదే సూత్రం వర్తిస్తుంది అని అదే మనుగడ లో ముఖ్యమన సూత్రమని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎరోగాలు రాకుండా ముందుజాగ్రత్త తీసుకుంటే జబ్బులు వచ్చిన వెంటనే చికిత్చ తీసుకోవాలి.బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధాన మని.జీవితం అంటే అందమైన హరివిల్లు జీవితం కలర్ ఫుల్ గా ఉండాలని అంటారు అలాగే జీవితానికి కలర్స్ కి సంబంధం ఏమిటి అన్నదే పెద్ద సందేహం అసలు కొన్ని రకాల సమస్యలకి కలర్ తెరఫీ చికిత్చ చేయవచ్చని అంటున్నారు నిపుణులు ఏమిటి కలర్ తెరఫీ దానిగురించి తెలుసుకుందాము.సూర్యరస్మి మనకు తెల్లగా కనిపిస్తుంది. కాని సూర్యరస్మిలో 7 రంగులు ఉంటాయి. అన్నవిషయం అందరికీ తెలుసు. మానవ శరీరంలో 7 చక్రాలకు 7 రంగులకు సంబంధం ఉందని అలాగే 14 మేరీడియన్స్ 2,72,౦౦౦ వేల నాడులపై ప్రభావం చూపిస్తుందని మానవ శరీరం పై సూర్య కిరణాలు ప్రసరింప బడలేదో దానికి సంబందించిన చక్రం నాడులు దెబ్బతింటాయని ప్రాచీన వైద్యం చెపుతోంది.సూర్యకిరణాలు రంగులు శరీరంలోని వాత,పిత్త,కఫ, దోషాలను సవరించేది సమతౌల్యం చేస్తుంది.సూర్యరశ్మిలోని వివిధరంగులు వాటి ఉపయోగాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం.
గమనిక..
కలర్ థెరఫీ లేదా ఇతరాచికిత్చలు ప్రధమ చికిత్చ మాత్రమే అని మంచి చికిత్చకోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.కలర్ తెరఫీ నికేవలం ప్రాత్యామ్నాయ వైద్య విధానం గా భావించాలని ప్రాముఖ్య మైనదిగా భావిస్తున్నారు.నిపుణులు. ముఖ్యంగా మనకు ఇంద్ర ధనుస్సు లో కనిపించే సహజ రంగులన్నిటికీ స్వస్థత చేకూర్చే గుణాలు ఉన్నవిషయం మనకు తెలుసు.ముఖ్యంగా సూర్య రశ్మి లేనిదే జీవరాసి కి మొక్కలకు మనుగడ లేదన్నది వాస్తవం. ముఖ్యంగా సూర్యారస్మికి ఆరోగ్యానికి సంబంధం ఉందని ఒక్కో సారి బాగా మబ్బు పట్టిన సమయంలో రెండు రోజులపాటు సూర్యుడు కనపడకుంటే ఆరోగ్యంగా ఉండలేమని పేర్కొన్నారు. సూర్యరస్మి లేకుంటే ఆందోళనకు గురిఅవుతారని కొందరు సూర్య దర్శనం కానిదే ముద్దకూడా ముట్టరని అంటారు. చీకట్లో ఉండలేరని మనసికరోగులు వెలుతురు చూడలేరని వెలుతురు లేకుంటే వ్యక్తులు ఒత్తిడికి అంటే డిప్రెషన్ కు గురి కవడాన్నిఅనేక పరిశోదన లలో గమనించవచ్చు.అందుకు కలర్ తెరఫీ సాధన చేసేవారు అటు రంగులను ఇటు వెలుతురును తమ పరికరాలలో ఉపయోగిస్తూ ఉంటారు. కలర్ తెరఫీ మానసిక బౌతిక ఉదేవగాలకు,ఆధ్య్యాత్మిక సమస్యలకు వేటి కైనా ఉపయోగించ వచ్చునని నిపుణులు విశ్లేషించారు.
కలర్ తెరఫీ చరిత్ర...
కలర్ తెరఫీ ప్రాచీన ఈజిప్ట్ లో పుట్టిందని తెలుస్తోంది. వివిధ ప్రాచీన నాగరికతలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రంగులు వెలుగులపై విస్తృతంగా చేసిన పరిశోదన లలో వ్యాక్తులలో భావోద్వేగా పరమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఒకరంగు పట్ల అందరూ ఒకేలా స్పందించక పోవడం విచిత్రంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. మనం ఆకర్షిత మయ్యే రంగులు మనలో మనలో అసమతౌల్యత ఉందొ పట్టి చెప్తాయని కొన్నిరంగులు మనలో సానుకూల భావాలు మరికొన్ని ప్రతికూల భావాలు,రేకేత్తిస్తాయని వీటిని అధ్యయనం చేసిన వారే కలర్ తెరఫీ చేస్తారు.
కలర్ తెరఫీ కి వాడే పరికరాలు...
రత్నాలు,కొవ్వొత్తులు,దీపాలు,క్రిస్టల్ క్రిస్టల్ లేక గాజు పట్టకం,రంగు బట్టలు,రంగునీటితో స్నానపు చికిత్చ,రంగుకళ్ళ జోళ్ళు, లేజర్లు ప్రధానంగా ఈ పరికరాలను దేరపిస్ట్ చికిత్చ చేస్తారు.ముందుగా మనం వేసుకునే ఎంచుకునే దుస్తులు రంగులు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాము.కొన్ని దుస్తులు గమనిస్తే లేతరంగుల్లోనే ఉంటాయి. వారికి ఆహ్లాదాన్ని విశ్రాంతిని ఇవ్వడానికే ఆరంగులను ఎంచుకుంటారు.మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత వ్యక్తీకరిస్తాయి.ఫ్యాషన్ పేరుతో వెర్రిగా మనకి సరిపడని రంగులు ధరించడం వల్ల దుష్పరిణామాలు కూడా సంభావుస్తాయి కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్స్ నుకూడా ప్రభావితం చేస్తాయి.ఏరంగు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో చూద్దాం.
1) ఎరుపు..
ఈ రంగు ఉత్తేజాన్ని నింపుతుంది. అది మనశరీరం లో కొన్నిలక్షణాలను దంకేతంగా ఉంటుంది.ధైర్యం,బలం, ఉత్తేజం,ఉల్లాసం,లక్ష్యం,అప్రమత్తత,లైంగిక ,సృజనాత్మకత,సంకల్ప బలం ,తీవ్రత వంటి లక్షణాలకు ఎరుపుసంకేతం. అయితే ఎరుపురంగు వల్ల కలిగే లాభాలు అనేకం.ఈ రంగును ఉపయోగించడం వల్ల మనలో ఉండే నకారాత్మక ఆలోచనలు అధిగమించ వచ్చు. ఆత్మవిశ్వాసం,స్థిరత్వం,భధ్రత, ఆధిపత్యం,భావన వంటివి పొందవచ్చు. అంతేకాదు ఎరుపు ఆకలిని పెంచుతుంది.అయితే ఎరుపును ఎక్కువగా వినియోగిస్తే అసహనం శత్రుత్వం,భావన,చికాకు ఆగ్రహం వంటివి పెరుగుతాయి.కోపం అధికంగా ఉంటుంది.
2)ఆరంజ్..
ఆరంజ్ రంగు సంతోషానికి ఉల్లాసానికి సంకేతం.వ్యక్తిలోని మానసిక ఉద్వేగాలకు ప్రభావితం చేస్తుంది.ఈ రంగు వ్యక్తిపై కలుపుగోలు తనం,నలుగురికి విశ్వాసంగా ఉండడం విజయం సంతోషం ఉంటాయి. ఈ రంగు వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సానుకూల దృక్పదం,ఏర్పడడం ఉల్లాసంగా ఉండగలగడం వంటివి జరుగుతాయి.ఈరంగుస్పూర్తినిస్తుందని ఆసక్తులను పెంచి మన కార్యకలా పాలను విస్త్రుత మయ్యేలా చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలతో సంతోషానికి మనలోని సందేహాలను సంకోచాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఈ రంగును అతిగా వాడారో అసహనం చిరాకు ఆకలిపెరగడం జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
౩)పసుపు..
పసుపు అన్నిటా శుభప్రదం ఉత్తేజాన్ని ఎక్కువ స్థాయిలో కలిగిస్తుంది. మానసిక స్పష్టత సంతోషం సానుకూల వైఖరి ఆత్మ గౌరవం,వివేకం స్పూర్తిగా నిలుస్తుంది.ఈ రంగు వాడకం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆశక్తి పెరగడం డిప్రెషన్ తగ్గడం సాదికరాత ఆత్మవిశ్వాసం ,ధైర్యం, ఆందోళన నుండి బయట పడడం శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేందుకు కూడా తోడ్పడుతుంది పసుపు రంగును అతిగా వాడితే సారహీన ప్రవార్తన,ఆతి క్రియాశీలత వంటి దుష్పరిణామాలు కలుగుతాయి.
4)ఆకు పచ్చ..
ఆకు పచ్చ నూతన ఉత్చాహానినికి శాతికి గుర్తు ఈరంగు. ఇది ప్రేమకు సంకేతం,శాంతి,నవీకరణ, ప్రేమ,ఆశ, సమతుల్యత,సామరస్యం, స్వీయ నియంత్రణ, జీవితం లో వృద్ధి వంటి వాటికి సంజేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆకుపచ్చ రంగును వాడడం వల్ల ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి, స్థిరత్వం, శాంతి సౌఖ్యం, సమైక్య భావన,సంభావన వంటి అంశాలు వ్యక్తిపై ప్రభావం చూపుతాయి.అతిగా ఆకుపచ్చని వాడితే బద్ధకం వస్తుందని దీనిని ఉపయోగించడం లో జాగ్రత్త అవసరం.
5)నీలం రంగు..
నీలం ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయిఉండే రంగు సమాచార మార్పిడి, సృజనాత్మకత వ్యక్తీకరణ, ఉత్తేజం నిర్ణయాత్మకం, విజ్ఞానం, ఆరోగ్యానికి సంకేతాలు ఈరంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక విశ్రాంతి నిశ్చలత, నిద్రపట్టేందుకు సహాయపడడం, మాటల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టమైన సమాచారం. పిల్లలలో హైపర్ యాక్టివిటీ తగ్గేందుకు సహాయపడుతుంది. అందుకే చాలా పాట శాలలో నీలిరంగు యునిఫాం ఉపయోగించడం గమనించవచ్చు. నీలిరంగును ఎక్కువగా వినియోగిస్తే అభద్రత, నిరాశ, అలసట,ఒత్తిడి, ఉదాసీనత, ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
6) లేత నీలం..
లేత నీలం ప్రశాంతతకు చిహ్నం, భావ వ్యాక్తీకరణకు సంకేతంగా ఉంటుంది. స్వచ్చత, ఓదార్పు, శాంతం, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా మాట్లాడ గలగడం మనసులో నిష్కల్మష మైన ఆలోచనలు లేతనీలం వల్ల విశ్రాంతి,ప్రేమ పూర్వక అభివ్యక్తి, స్వేచ్చాపూరిత భావ వ్యాక్తీకరణ, సుఖనిద్ర,సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు. లేత నీలం ఎక్కువగా వడం వల్ల పెద్దగా దుష్పరిణామాలు ఏమిలేక పోవడం విశేషం.
7)నెమలి కంఠం రంగు..
ఈరంగు మననరాల వ్యవస్థ విశ్రాంతి పొందేందుకు సాయాపడుతుంది. పైగా మన శరీరం అచేతన వ్యక్తిత్వం తో అనుసంధాన మయ్యే రంగుగా నిపుణులు విశ్లేషించారు.ప్రశాంతత సృజన అవగాహనకు సంకేతమని సహజంగా వారిలో జ్ఞానం చైతన్యం, స్పష్టమైన దృక్పదం గాఢ నిద్ర వంటి ఫలితాలు కలుగుతాయని రంగును వినియోగిస్తే ఒత్తిడి ఇతరులనుండి వేరు పడే భావన కలుగుతాయట.
8) వైలెట్ ..
వైలెట్ మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధాన మై ఉంటుంది. ఈ రంగు వాడడం వల్ల ఉదారత,నిస్వార్ధ తత్వం, గాఢ నిద్ర నరాలను నేమ్మదింప చేయడం భావోద్వేగాల నియంత్రణ చిరాకు అతిగా ఆకలి వేయడం వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఈరంగును అతిగా వాడారో డిప్రెషన్ అభద్రతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలు అణచివేయడం వంటివి సాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
9)మేజెంటా రంగు..
వ్యక్తిలో ఉండే భక్తి ప్రేమకు అనుసంధానంఅవుతుందని అంటున్నారు. మేజెంటా విశ్రాంత స్థితి, ఓదార్పు, సున్నితత్వం, వంటి భావాలకు సంధాన మై ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల అంతర్గత
బహిర్గత ఉద్వేగాలు సమతౌల్యం అవుతాయి. శాంతి లభిస్తుంది. అయితే ఈ రంగును అతిగా వాడడం వల్ల నలుగురితో కలవ లేని వారికి మంచిది కాదు.