మధుమేహాన్ని నిర్వహించడానికి  చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం,  చక్కెరకు దూరంగా ఉండటం,  అధిక మద్యపానాన్ని నివారించడం,   ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.  కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా?

 గుడికి వెళ్లడం  వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని,  కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది  నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే..

గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది.  ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత.  గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది.  గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర  విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.

సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు.

                                        *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..