వాతవరణం లో ఊహించని విధంగా ఉష్ణోగ్రతలలో వస్తున్న హెచ్చు తగ్గుల వల్ల వైరస్ లు పెరుగుతున్నాయని అదీ ఎక్కువగా దాదాపు పక్షం రోజుల పాటు ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.కొందరు ఈ వైరస్ ను కోవిడ్ అనుకుని పరీక్షించగా అది కోవిడ్ కాదని తేలడం తో ఊపిరి పీల్చుకున్నారు.ఇది సాధారణ వైరస్ మాత్రమే అని సహజంగా ప్రతి సంవత్చరం వస్తుందని నిపుణులు తెలిపారు.రాయ పూర్ కలకత్తా  వాసులను చుట్టుముట్టాయని అయితే ఈ వైరస్ కోవిడ్ లక్షణాలకు సగ్గర దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు.జ్వరం,దగ్గు, ఒళ్ళు నొప్పులు డయేరియా ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

వాతావరానం లో అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారం రోగులుగా గమనిస్తున్నట్లు ఈ వైరస్ వారం రోజుల పాటు చాలా యాక్టివ్ గా ఉంటుందని ఇది సహజమైన వైరస్ గా పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల దగ్గు వస్తుందని అందుకోసం యాంటి బాయిటిక్స్ వాడాలని సూచిస్తున్నారు.వైరస్ లలో రైనో వైరస్,హ్యూమన్ మెటా నీమో వైరస్, ఎడినో వైరస్, ఇంఫ్లూఎంజా వైరస్ లు కీలక మైనవని డాక్టర్లు అంటున్నారు.అయితే వైరస్ ను గుర్తించడం కష్టంపరీక్షలు చేస్తే తప్ప వైరస్ గుర్తించడం సాధ్యం కాదు అవి చాలా తక్కువే ఉంటాయని నిపుణులు అంటున్నారు.కొన్ని సందర్భాలలో కోవిడ్ పోజిటివ్ అయి ఉండవచ్చని సందేహం ఉంటె పరీక్షించుకోడం అవసరం.కోవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఎవరికీ పోజిటివ్ రాలేదు. గత 15 రోజుల్లో కొంత మంది పిల్లలో ఎడినో వైరస్ ఉన్నట్లు గుర్తించారు.కోవిడ్ లక్షణాలు దగ్గర దగ్గర గా ఉండచ్చు అది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అది తీవ్ర తరం కవాచ్చు చాలామంది రైనో వైరస్ వేరియంట్లు ఇంఫ్లూఎంజా కారణంగా జ్వరం 4 నుండి 5 రోజుల పాటు ఉంటుంది అని కిమ్స్ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, డాక్టర్ పాపారావు పీర్లేస్ ఆసుపత్రికి చెందిన మైక్రో బయాలజిస్ట్ భాస్కర్ నారాయణ చౌదరి అన్నారు.

ఈ వైరస్ ప్రభావం వల్ల సవాల్ప జ్వరం తీవ్రమైన దగ్గు దీని సహజమైన లక్షణం గా డాక్టర్ ఆర్ ఎన్ టాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ కార్డియోక్ సైన్స్ దర్వెన్ పంజా మాట్లాడుతూ అప్పర్ రేస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రైనో వైరస్ వల్ల వస్తుంది అని ఇంఫ్లూ ఎంజా వైరస్ తరచూ గా వస్తూ ఉంటుందని వారం రోజులకు పైగానే ఈ సమస్య ఉంటుందని టాగూర్ విశ్లేషించారు.వాతావరణం లో ని ఉష్నోగ్రతలలో వచ్చే హెచ్చు తగ్గులు  మార్పులు వల్ల వైరస్ వృద్ధి చెందుతుంది అతిగా గనక యాంటి బాయిటిక్స్ వాడితే విరేచనాలు అవుతాయాని అంటున్నారు నిపుణులు. సహజమైన వైరస్ ల వల్ల ఇలాంటి లక్షణాలు మీకు 5 రోజులు ఉంటుంది.65 సంవత్స్చారాలు పై బడిన 12 సంవత్చారాల లోపు వారిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమైనది సత్వరం గుర్తించి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేయడం ద్వారా ఆసుపత్రిలో చేరకుండా నివారించవచ్చు.ఒక్కోసారి యాంటి బాయిక్స్ వికటించే అవకాశం ఉంది అత్యవసర చికిత్చకూడా అవసరం కావచ్చు అని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శాంతనూ రాయ్ అన్నారు.ప్రాధమిక స్థాయిలో గుర్తించి తక్షణం చికిత్చ అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడ వచ్చు. లేదా చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రామాదానికి దారితీయవచ్చు.