ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బిపి,గుండె జబ్బులు,స్తూల కాయం అన్న మాట
వింటూ ఉంటున్నాం.ముఖ్యంగా కో లేస్త్రాల్ ను గురించిన వాళ్ళు తెలియని వాళ్ళు అది ఎదో భూతం లాగా మనిషికి ప్రజలకి శత్రువు గా మాట్లాడం మనం చూడచ్చు. కొలస్ట్రాల్ ఈ ఆహార పదార్ధంలో ఉంది ఆ ఆహార పదార్ధంలో లేదు.దీనిని త్తినాలి దీనిని తినకూడదు అంటూ క్లాస్ పీకడానికి రెడీ అయిపోతారు. నిజానికి అసలు కొలస్ట్రాల్ అంటే ఏమిటి? అది ఎలా మన ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది? మనిషికి కొలస్ట్రాల్ ఎంతమేరకు అవసరం? ఎంతుంటే ఎక్కువ ఎంతుంటే తక్కువ? అన్న ప్రాస్న్లకు సమాధానాలు చూద్దాం.
కొలస్ట్రాల్ అనేది ఒక మెత్తటి మైనం లాంటి పదార్ధం.లివర్ చేత తయారు కాబడే ఈపదార్ధం రక్తంలో కలిసి మన శరీర మంత ప్రవహిస్తూ వివిధ హార్మోన్లు పిత్తరసం విటమిన్ డి ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
కొలస్ట్రాల్ మనశరీరంలో ఎక్కువ ఉత్పత్తి అయితే అది రక్త నాళాల లో పేరుకు పోయి రక్త ప్రసరణకు అవరోధంగా మారుతుంది.ఎదిరో స్క్లేరో సిస్ అనే సమస్యకు దారితీస్తుంది.దీని వాళ్ళ గుండె పోటు,ఆకస్మిక మరణం సంభవించవచ్చు. కొలస్ట్రాల్ ని రకరకాల్ పర్యాయ పదాలతో పిలుస్తారు.బ్లడ్ కొలస్ట్రాల్,ఆహార సంబంద కొలస్ట్రాల్,అని ఫ్యాట్,అనికోవ్వు అని ఇందులోనే స్యచురేటేడ్ ఫ్యాట్ అని అన్ స్యచురేటేడ్ఫ్యాట్ అని హాయ్ డెన్సిటి లైపో ప్రోటీన్లు అని ఈరకంగా పేర్కొన్నారు.
బ్లడ్ కొలస్ట్రాల్...
రక్తం ద్వారా ప్రవహించే కొలస్ట్రాల్ ను బ్లడ్ కొలస్ట్రాల్ అని అంటారు. ఇది లివేర్లో ప్రవహిస్తుంది.మనం తిన్న ఆహారం నుంచి ప్రేవుల ద్వారా అరిగి రక్తంలో కలుస్తుంది. రక్తంలో ఉండాల్సిన దానికన్నా అధికంగా కొలస్ట్రాల్ ప్రవహిస్తున్నప్పుడు.అది ఇతర కొవ్వు పదార్శాలతో పాటు రక్త నాళాల లోపలి గోడమీద పేరుకు పోతుంది.కొన్ని సంవత్సరాలకు పెరికిపోయిన ఆకోలస్త్రాల్ రక్త నాళా లలో అడ్డుపడి గుండెపోటుకు దారి తీస్తుంది. మేడలు రక్త ప్రసరణకు ఆటంకం కలిగి తల తిప్పడం కళ్ళు తిరగడం లాంటివి ఏర్పడి పక్షవాతానికి దారి తీయవచ్చు.
ఆహార సంబంధ కొలస్ట్రాల్...
జంతువుల రక్త ప్రవాహంలో ప్రయాణించిన కొలస్ట్రాల్ వారి శరీర కణాలలో ఇరుక్కుపోయి.కొవ్వుగా ఏర్పడుతుంది.మాంసం తో పాటు కొవ్వును మనం భుజించినప్పుడు మనశరీరంలో చేరి కొవ్వుగా ఏర్పడుతుంది.దీనిని ఆహార కొలస్ట్రాల్ అని అంటారు. మనం తినే ఆహారం గుడ్లు,మాంసం మొదలైన వాటిలో ఈ రకమైన దైటరీ కొలస్ట్రాల్ ఉంటుందని వైద్యులు అంటున్నారు.
కొవ్వు ఫ్యాట్ కొలస్ట్రాల్...
కొవ్వు మనశరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.శరీరంలో విటమిన్లు అరగడానికి కూడా కొవ్వు దోహదం చేస్తుంది. ఇందులో శారేరానికి రెండురకాల ఫ్యాట్ ను ఇచ్చేవి ఉనాయి ఒకటి శ్యాచురేటెడ్,అన్ శ్యాచురేటేడ్ ఫ్యాట్ గా పేర్కొన్నారు.
శాచురేటెడ్ ఫ్యాట్...
స్యచు రేటెడ్ ఫ్యాట్ మనరక్తం లో కొలస్ట్రాల్ ను పెంచుతుంది.ఈ కొలస్ట్రాల్ మాంసం లో,చికెన్ లో,పాలు,వెన్న,లాంటి పాల ఉత్పత్తుల్లో,గుడ్లు,కొబ్బరి నూనె,పామాయిల్,వంటి వాటిలో ఉంటాయి.సాధారణంగా రెఫ్రిజిరేటర్ టెంపరేచర్లో ఇవి గడ్డ కట్టుకు పోతాయి.
అన్ శాచు రేటెడ్ కొవ్వు ఫ్యాట్...
అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ర్రేఫ్రిజేరేటెడ్ టెంప రేచర్లో కూడా గడ్డకట్టకుండా ద్రవ స్థితిలోనే వుంటుంది.శాచు రేటెడ్ ఫ్యాట్ కన్నా ఇది కాస్త బెటర్ దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి.పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్,మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ గా విభజించారు. సన్ ఫ్లవర్ ఆయిల్,సా ఫ్లవర్ ఆయిల్,సోయాబీన్ ఆయిల్,పోలి అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుందని నిపుణులు తేల్చారు. వేరుసెనగ,నువ్వులనూనె,అలీవ్ ఆయిల్,,ఓడలైన వాటిలో మోనో అన్ శాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.
నిత్య జీవితంలో శాచు రేటెడ్ ఫ్యాట్స్ ను వాడుతూ ఉంటె మన రక్తం లో కొలస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా అది తగ్గు ముఖం పడుతుంది.
లైపో ప్రోటీన్స్...
ప్రోటీన్ కోటింగ్ ఉన్న ప్యాకేజీలు మన రక్తం లో కొలస్ట్రాల్ ని నోసుకుంటూ ప్రవహిస్తాయి.ఇందులో హై డేన్సిటి,లైపో ప్రోటీన్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ అని విభజించారు. హై డెన్సిటి లైపో ప్రోటీన్ మనరక్తంలో కొలెస్ట్రాల్ ని లివరుకు పంపుతుంది దానిని శరీరం నుండి బయటికి పంపుతుంది.మీశరీరంలో హెచ్ డి ఎల్ ఎంత ఎక్కువగా ఉండే గుండె జబ్బుకు దూరంగా ఉంటారు.
లో డెన్సిటి లైపో ప్రోటీన్స్ అంటే ఎల్ డిఎల్ రక్తంలో ఎక్కువగా ఉంటె రక్తంలో ని అధిక భాగాన్ని మీరే స్వయంగా మోస్తూ తీసుకు పోతాయి. అలా తీసుకు పోతున్నప్పుడు అక్కడక్కడా రక్త నాళాల్లో కొంతభాగం కొలస్ట్రాల్ ని వదిలి వేస్తాయి.అలా వదిలేసిన కొలస్ట్రాల్ ఆయా భాగాలలో రక్త ప్రవాహానికి అడ్డుపడి గుండె జబ్బులకి పక్షవాతానికి దారి తీస్తుంది.మీ శరీరంలో రక్తంలో లో డెన్సిటి ఎంత ఎక్కువగా ఉంటె అంతగా మీరు గుండె జబ్బులకు దగ్గరైనట్లు చెప్పవచ్చు.