మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఆరోగ్యానికి రోగనిరోదక శక్తికి సంబంధం ఏమిటి?
అసలు రోగ నిరోధక వ్యవస్థ గురించి కొన్ని కీలక అంశాలు
తెలుసుకుందాం రోగ నిరోధక శక్తి తగ్గితే శరీరంలో ఏ ఏ అవయవాలు ప్రభావిత మౌతాయి? అన్న విషయం తెలుసుకుందాం. అసలు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తిన డానికి కారణం ఏమిటి? ఏ దైనా పత్రికను తిరగేస్తూ ఉండగా పొరపాటున మధ్య పెజిలో పిన్ను మీ వేలుకు గీసుకుని గాయమతే మీరు ఏమి చేస్తారు?చివ్వుమన్న నొప్పి వస్తే అబ్బ అని వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా మీ వేలును నోట్లో పెట్టుకుంటారు. అసలు పిన్ను గ్గుచ్చుకున్న వంటనే మీ శరీరంలో వచ్చే మార్పు ఏమిటో మీకు తెలుసా? పిన్ను గుచ్చుకోగానే చాలా సూక్ష్మ క్రిములు మీ శరీరం లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి.
వెంటనే మీ శరీరంలో రోగ నిరోధక యంత్రాంగం అలెర్ట్ అయి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి
చేసే ప్రయత్నంలో,గాయాన్ని మాన్పించే ప్రయత్నం లో తల మునక లై పోతుంది. ఆ పోరాటంలో రోగ క్రిములు నశించ వచ్చు.లేదా శరీర కణజాలమునశించ వచ్చు. గుండె ఊపిరి తిత్తులు లాగే రోగ నిరోధక వ్యవస్థను.కూడా మన శరీర మంతా వ్యాపించి ఉంటుంది. బయటి నుంచి మన శరీరం మీద దాడి చేసే మిలియన్ల కొద్ది రసాయనాలు సూక్ష్మ క్రిముల నుంచి జీవితంతాం కాపాడు తూనే ఉంటుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థను మన శరీరానికి సంబందించిన కాణా లేవో స్పష్టం గా తెలిసి ఉంటుంది.
శరీరానికి సంబందించిన కణ జాలం(బ్యాక్టీరియా లాంటిది) ఏ దైనా లోపలికి ప్రవేశించి నప్పుడు.రోగనిరోదక వ్యవస్థ వెంటనే స్పందించి వాటి పైన దాడి చేస్తుంది.శరీరం లోపల యాంటీబాడీస్ ని సృష్టించుకుని బ్యాక్తీరియాతో పోరాడించ వచ్చు.లేదా బ్యాక్టీరియాతో నేరుగా పోరాడే కాణ జలాన్ని ప్రేరేపించిరోగ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది.
మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ క్రింది అవయవాల ద్వారా పని చస్తుంది.
1)థైమస్ గ్రంది.
2)ఎముకలలోని మూలుగ
3)లీంఫ్ గ్రందులు.
4)లింఫ్ నాళాలు.
5)ప్లీహము.
ఇప్పుడు వీటిలో ఒకదాని గురించి ఒకటి తెలుసు కుందాము.
1)ఛాతి ఎముకకు వెనుక వైపున వుండే గ్రంధి ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు టి -లింఫసైట్స్ గా పరిణతిచెంది.శరీరం లోపలి ప్రవేసించిన వైరస్ లతో పోరాడతాయి.
2)టి- సెల్స్ గా పిలవబడే ఈ కణాలకు మరి కొన్ని కణాలు తోడై అన్నీ కలిసి వైరస్ మీద మొత్తంగా పోరాటంకి దిగుతాయి.
3)టి- సెల్ల్స్ తో కూడె మిగతా కణాలు...
సహాయక టి-సెల్ల్స్....
ఈ కణాలు బి-లింప సైట్ అనబడే మరో రకపు కణాలతో యాంటీ బాడీస్ వృద్ధి కావడానికి దోహదం చేస్తాయి.
(ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వైరస్ ఈ హెల్పర్ టి-సెల్స్ నే నాశనం చేసి మనిషని నిర్వీర్యం చేస్తాయి.)
4) కిల్లర్ టి సెల్స్...
మన శరీరానికి సంబందించిన బయటి కాణ జాలం లోపలి ప్రవేశించి నప్పుడు ఇవి త్వరిత గతిన వరూధి చెంది వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.మన శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నాశనం చేసేది ఈ కిల్లర్ టి సెల్ల్స్ అని నిపుణులు పేర్కొన్నారు.
5) సశ్రేసర్ టి -సెల్స్....
మన శరీరంలోకి ప్రవేశించిన శత్రువు ఇన్ఫెక్షన్ ఒడి పోగానే ఇక యుద్ధాన్ని ఆపమంటూ.ఈ కణాలు యుద్ధ విరమణ సూచన ను అదేసిస్తాయిసశ్రేటర్-టి సెల్ల్స్ కనుక బలహీన పడ్డ లేక పనిచేయక పోయినా రోగ నిరోధక వ్యవస్థకు చెందిన మిగతా కణాలు పోరాటాన్ని ఆపవు. అలంటి సందర్భంలో ఇన్ఫెక్షన్ అనబడే శత్రువు లేకపోతే అవి మన శరీర కణజాలం మీదే పోరాటాన్ని సాగించి రోమటైద్ ఆర్త్రైటిస్ వంటి కీళ్ళ వ్యాధులకు కారణం అవుతుంది.
6)ఎముకలలో మూలుగ...
మన ఎముకలలో ఉండే మూలుగ అనే పదార్ధం తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ తెల్ల రక్త కణాలుశరీరం లోపలి ప్రవేశించిన స్సూక్ష్మ క్రిములతో పోరాడు తాయి.
7)లింఫ్ గ్రంధులు.....
లింఫ్ గ్రంధులు బి-లింఫో అనబడే ఒక రకమైన తెల్ల రక్త కణాలను తయారు చేస్తాయి.
ఈ బి సెల్స్ పై భాగాన ఇమ్యునో గ్లోబులిన్ అనే ఒక ప్రోటీన్ పదార్ధం ఉంటుంది.ఈ బి సెల్ల్స్ ఇన్ఫెక్షన్ తో పోరాడే యంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి.
8 )లింఫ్ నాళాలు....
ఈ నాళాలు మన శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన భాగాన్నుంచి సూక్ష్మ క్రిములను లింఫ్ గ్రంధుల వద్దకు చేరుస్తాయి.అక్కడ లింఫ్ గ్రంధులు తయారు చేసే యాంటీ బాడీస్ ఆ సోక్ష్మాల పైన దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి.
9)ప్లీహము.....
రక్త ప్రవాహము ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములుఇక్కడ తెల్ల రక్తకణాలతో ముంచెత్త బడి నాశనం చేయబడతాయి.
రక్త నాళాలు....
రక్త నాళాల ద్వారా తెల్ల రక్త కణాలు,యాంటీ బాడీస్,శరీరమంతా ప్రయాణిస్తూ శరీరానికి అపకారం కలిగించే బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతూ మన ఆరోగ్యానికి పహారా కాస్తాయి.
రోగ నిరోధక వ్యవస్థ రెండు రకాలు....
1) ఇన్నేట్ ఇమ్మ్యునిటి 2 )అడప్టివ్ ఇమ్మ్యునిటి.
ఇన్నేట్ ఇమ్యునిటిలో చర్మం కొంత ప్రాముఖ్యత వహిస్త్గుంది.నోరు,గొంతు,కళ్ళు,ప్రేవులు,యోని, మూత్రనాళాలలో తయారయ్యే ఎంజైములు అనబడే పదార్దాలు మిగతా ప్రాముఖ్యత వహిస్తాయి.
2) ఇవన్నీ మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తూ ఉంటాయి.పసి పిల్లలు తల్లి గర్భంలో వుండగాతల్లి శరీరం నుంచి లభించే యాంటీ బాడీస్ ద్వారా రక్షణను పొందితే ఆ తరువాత తల్లి అందించే స్తన్యం ద్వారా రక్షణను పొందుతారు.
3)మనిషి పెరిగి పెద్ద పెద్ద అవుతూ వివిధ రకాల సూక్ష్మ క్రిములు దాడికి గురి అవుతున్నా కొద్ది అతని శరీరం తనకు తాను రోగ నిరోధక చర్యలను సంతరించుకుంటుంది.దీనిని అడప్టివ్ ఇమ్మ్యునిటీ అంటారు.దీని మూలంగా శరీరం లోకి ప్రవేశించిన సూక్ష్మ క్రిములను తెల్ల రక్తకణాలను గుర్తుంచుకుని మల్లె అలాంటి క్రిములు లోపలి ప్రవేశించినప్పుడు పూర్వంలో ఉండే యాంటీ బాడీస్ తిరిగి సృష్టించి
విజయాన్ని సాధిస్తాయి. ఈ సిద్దాంతం ఆధారం గానే కృత్రిమంగా టీకాలను తయారు చేసుకుని వాటితో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుచుకుని పోలియో లాంటి కొన్ని వ్యాధులను దగ్గరికి రాకుండా అడ్డుకట్ట వేయగాలిగాం అయితే అదే పద్దతిని అవలంబించ్గడం ద్వారా టీకా తోనే కోవిడ్ వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమని అనుకోవచ్చ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇన్ఫెక్షన్ నిరోదించే ఇతర చర్యలు...
---లాలాజలం ----నోటి ద్వారా లోపలి ప్రవేసించే సూక్ష్మ క్రిములను లాలాజలం తో ఉండే ఎంజైమ్ లు నాశనం చేస్తాయి.
కనీరు ----కంటిలోపలికి ప్రవేసించే సూక్ష్మ క్రిములు కన్నీటి ద్వారా బయటికి పంపడం జరుగుతుంది.ఇంకా ఎమన్నా
సూక్ష్మ క్రిములు కంట్లో మిగిలి ఉంటె కన్నీటి తాలూకు ఎంజైమ్లు వాటిని నసింప చేస్తాయి.
ముక్కు ---- దుమ్ము ధూళి ద్వారా ముక్కు లోకి ప్రవేసించే సూక్ష్మ క్రిములను ముక్కులోపల ఉండే కేస నాళికలుబందించి చీమిడి
ద్వారా ఎమన్నా లోపలి వెళితే దగ్గటం ద్వారా మనం వాటిని మనం బయటకి నెయ్యేస్తాయి.
ప్రేవులు -----
కడుపులో తయారయ్యే యాసిడ్ అక్కడికి చేరుకున్నాక సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.ప్రేవులలోకి ప్రవేశించిన సూక్ష్మ క్రిములను ప్రేవులలోనే
నిలువరించే సహాయక బ్యాక్టీరియా నసింప చ్గేస్తాయి.
మూత్ర నాళాలు----
మూత్రనాళాలలోని సహాయ బ్యాక్టీరియా అక్కడికి ప్రవేసించే సూక్ష్మ క్రిములను నసింప చేస్తాయి.స్త్రీలకు యోనిలో ఉంటె మ్యుకస్ లైనింగ్
కూడా అక్కడ ప్రవేసించే సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.
చర్మం -----
చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే స్వేద గ్రంధులలో ఉత్పత్తి అయ్యే నూనె స్వేదం చర్మం ద్వారా లోపలి కి ప్రవేసింపచేసే సూక్ష్మ క్రిములను
నసింప చేయడానికి ప్రయత్నిస్తాయి.
ఇలా మనశరీరంలోని ప్రతి భాగము బయటి నుంచి వచ్చి దాడి చేసే సూక్ష్మ క్రిములను నాశనం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటాయి.
మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయ్యా లంటే సూత్రాలు-----
విటమిన్లు ,ఖనిజలవణాలు,సమృద్ధిగా లభించే సమతుల ఆహారం తీసుకోవాలి.
ప్రతిరోజూ శరీర వ్యాయామం చేయాలి.
అయితే ఆతిగా వ్యాయామం వద్దు.
ఒత్తిడులకు దూరంగా ఉండాలి.పొగ తాగడం మద్యం సేవించడం మానుకోవాలి. అప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్పై పోరాదగలం.