ఈ డ్రింక్స్ తాగుతే బరువు తగ్గుతారు.!
మారిన జీవనశైలి కారణంగా ఊబకాయం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంటి ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ప్రజల జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టిస్తోంది. బిజీ లైఫ్ తో వ్యాయామానికి సమయం దొరకడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చెడు ఆహారపు అలవాట్లను వదిలించుకోవడం..మన ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు కొన్ని డ్రింక్స్ గురించి తెలసుకుందాం. అవి మీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అయితే ఈ డ్రింక్స్ మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
నిమ్మరసం:
నిమ్మకాయ నీళ్లను ఇంట్లో తయారు చేసుకోవడం ఎంత సింపుల్‌గా, సులభంగా ఉంటుందో తెలుసా? దీన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అంతే గొప్పవి. మీరు చక్కెర, ఉప్పు లేకుండా కేవలం నిమ్మకాయ పిండిన నీటిని తాగుతే.. కొవ్వు బర్నింగ్ ప్రారంభమవుతుంది. లెమన్ వాటర్ క్యాలరీ ఫ్రీ డ్రింక్. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
బ్లాక్ కాఫీ:
బ్లాక్ కాఫీలో తక్కువ కేలరీలు ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.మీరు బరువు తగ్గాలనుకుంటే..బ్లాక్ కాఫీని తాగవచ్చు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీవక్రియలు పెరిగి శరీరానికి శక్తిని అందిస్తుంది. మానసిక చురుకుదనాన్ని పెంచడంలో కెఫిన్ వినియోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో కూడా తక్కువ కేలరీలు ఉంటాయి.ఇది బరువు తగ్గడంలో.. బొడ్డు కొవ్వును తగ్గించడంలో వేగంగా ప్రభావాన్ని చూపుతుంది. గ్రీన్ టీ తాగుతే శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. నెల రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగితే బరువులో మార్పు కనిపిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ వెనిగర్ వేసి కలపాలి. నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. అధికంగా కాకుండా మోతాదుగా తాగాలని గుర్తుంచుకోండి.