మహిళలలో అండాల నాణ్యత పెరగాలంటే.. ఈ టిప్స్ కావాల్సిందే!


పురుషులలో వీర్యకణాలు,  మహిళలలో అండాలు నాణ్యంగా ఉంటేనే వారికి తల్లిదండ్రులు అయ్యే అవకాశం లభిస్తుంది.  పునరుత్పత్తి విషయంలో మహిళలలో అండాల ప్రాధాన్యత ఉంటుంది. అండాల విడుదల, వాటి నాణ్యత సరిగా లేకపోతే మహిళలు గర్బం దరించడం చాలా కష్టం.  అయితే.. నేటి కాలంలో వయసు పెరగడం లేదా ఆలస్యంగా వివాహాలు చేసుకుని ఆలస్యంగా పిల్లలు కనడానికి ప్రయత్నం చేయడం,  ఒత్తిడి,  సరైన జీవనశైలి లేకపోవడం వంటివి మహిళలలో అండాల నాణ్యతను ప్రభావితం చేస్తాయి.  కానీ మహిళలు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే అండాల నాణ్యత మెరుగవుతుంది.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..


అండాల నాణ్యతకు ఉపయోగపడే టిప్స్..

యాంటీఆక్సిడెంట్లు..

మహిళలలో అండాల నాణ్యత మెరుగ్గా మారాలంటే.. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి.

ఫోలిక్ యాసిడ్..

మహిళలలో ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం.  అందుకే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.

ఒమేగా-3

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.  దీనివల్ల అండాల నాణ్యత చెక్కుచెదరకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్ర..

నిద్రలేమి కేవలం మహిళల అండాల ఆరోగ్యాన్నే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే తగినంత నిద్ర చాలా అవసరం.  నిద్ర సరిగా ఉన్నప్పుడు పునరుత్పత్తి హార్మోన్లు మెరుగ్గా పని చేయడానికి,  అందంగా కనిపించడానికి కూడా సహాయపడుతుంది.

ఒత్తిడి..

ఒత్తిడి అనేది చాలా పెద్ద శత్రువు. ముఖ్యంగా మహిళలలో ఒత్తిడి సమస్య వారి పునరుత్పత్తి వ్యవస్థ మీద, హార్మోన్ల పనితీరు మీద చాలా ప్రభావితం  చూపిస్తుంది.  ఒత్తిడి హార్మోన్లు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

ధూమపానం..

కొంతమంది మహిళలు పొగతాగే అలవాటులో ఉంటారు. ఇలాంటి మహిళలకు గర్బం దాల్చడం చాలా కష్టం.  పొగతాగడం వల్ల గుడ్ల నాణ్యత చాలా వేగంగా తగ్గిపోతుంది.  ప్రత్యక్ష ధూమపానం, పరోక్ష ధూమపానం కూడా ప్రమాదమే.

                         *రూపశ్రీ.