కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ శరీరంలో 200లీటర్ల రక్తాన్ని శుధ్ధి చేస్తాయి. ఏదైనా కారణం వల్ల కిడ్నీలు పాడైతే ఇక రక్తాన్ని శుద్దిచేయడం కుదరదు. ఈ కారణంగా డయాలసిస్ చెయ్యాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రక్రియతో ఎక్కువ కాలం నెగ్గుకురాలేం. కిడ్నీల కారణంగా ఇంత సమస్యలు కొనితెచ్చుకునేపని లేకుండా కిడ్నీలు క్లీన్ గా ఉండాలంటే కేవలం ఐదు ఆహారాలు తీసుకుంటే చాలు. పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాలు మూత్రపిండాల వ్యాధికి మంచివిగా పరిగణించబడతాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, కిడ్నీ జబ్బులు రాకూడదని అనుకునేవారు ఈ ఐదు ఆహారాలు తీసుకుంటే కిడ్నీలలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
రెడ్ క్యాప్సికం..
రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్, సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, కిడ్నీ సమస్యలు ఉన్నవారు దాన్ని మొదట్లోనే నియంత్రించాలని అనుకుంటే రెడ్ క్యాప్సికం తినడం మంచిది. ప్రతిరోజూ అరకప్పు రెడ్ క్యాప్సికం ను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
క్యాబేజీ..
క్యాబేజీ లో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవి మాత్రమే కాదు విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్‌లు కూడా సమృద్దిగా ఉంటాయి. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. డయాలసిస్ రోగులు తమ డైట్‌లో క్యాబేజీ చేర్చుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఆకుకూరలు..
ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పనిని పెంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి రక్తాన్ని వడకట్టే పనిని సులభతరం చేయడంలో మూత్రపిండాలకు సహాయపడతాయి.
ఉల్లిపాయ..
ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, వాటిలో తక్కువ పొటాషియం కూడా ఉంటుంది, ఇది మూత్రపిండాలకు మంచిది.
క్యాలీఫ్లవర్..
కాలీఫ్లవర్ విటమిన్ సితో నిండి ఉంటుంది. ఫోలేట్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ బాగా తీసుకోవడం వల్ల కాలేయంలో ఉండే మురికి పదార్థాలను తటస్థీకరించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
*నిశ్శబ్ద.