రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  ఆహారంలో పోషకాలను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులు శారీరక శక్తి పరంగా ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు.  అదే సమయంలో జంక్‌, ఫాస్ట్‌ఫుడ్‌తో రోజు ప్రారంభించే వారి శరీరం క్రమంగా వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అందువల్ల  ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు తీసుకుంటే రోజంతా చురుగ్గా, ఎనర్జీగా ఉండవచ్చు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుంటే..

ఎనర్జిటిక్ ఫుడ్ విషయానికి వస్తే అందులో మొదటి పేరు అరటిపండు. అరటిపండు  తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అటిపండ్లను అల్పాహారంలో  తీసుకోవచ్చు.

చియా విత్తనాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో  సహాయపడతాయి. ఈ విత్తనాలను వేయించి వాటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పీచు వంటి పోషకాలు చియా గింజల్లో లభిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా తగిన మోతాదులో ఉంటాయి.


అల్పాహారంగా  ఓట్స్ తినవచ్చు. ఇందులో ఉండే క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని  వినే ఉంటారు. అందుకే రోజూ అల్పాహారంలో యాపిల్ ను కూడా చేర్చవచ్చు.


పీనట్ బటర్ ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందుతోంది.  పీనట్ బటర్ తీసుకుంటే  శరీరం ప్రోటీన్,  ఆరోగ్యకరమైన కొవ్వులను పొందుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  కండరాలు బలపడతాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కూడా ఇస్తుంది.

                                          *నిశ్శబ్ద.