పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికి తెలిసిందే. తెలిసిన కూడా అందరూ పొగ త్రాగడం మానివేయడం లేదు. దీనివలన భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందని మర్చిపోతున్నారు. కానీ క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవాలనుకుంటే పండ్లను తినడం మంచిది.
పొగ త్రాగేవాళ్ళు ప్రతిరోజూ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, దీనివల్ల క్యాన్సర్ ముప్పు నుండి కొంతవరకైనా తప్పించుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
కానీ పొగ త్రాగుతూ.. పండ్లను తింటే క్యాన్సర్ రాదనుకుంటే పొరపాటే. ఇది కేవలం కొంతకాలం వరకు మాత్రమే క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది. అసలు క్యాన్సర్ రావొద్దని అనుకుంటే... పొగ త్రాగడం కొద్ది కొద్దిగా మానేయడం మంచిది.