వర్షా కాలం లో మీ కాళ్ళు కీళ్ళు జాగ్రత్త మరి..

వర్షాకాలం అయితే ఏమిటి మాకాళ్ళకి కీళ్ళకి  వచ్చినసమస్య ఏమిటి అనిమాత్రం అనకండి. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్ధులు పడిపోతూ ఉంటారు.లేదా దెబ్బలు తగలడం వంటి సమస్యలు ఎలా తగ్గించాలి? 

బోన్ అండ్ జాయింట్ డే...

వయస్సు మళ్ళిన వాళ్ళలో కంటికి సంబంధించి లేదా ఒక్కోసారి బలహీన పడడం వంటి సమస్యలు వస్తాయి.ఒక్కోసారి ఈ కారణంగానే వారు పడిపోవడం సంభవిస్తుంది. అదే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది.జారిపడడం సంభవిస్తుంది వయస్సు పెరగడం వల్ల ఎముకలు బలహీన పడతాయి ఈ కారణం గానే ఆస్టియో ప్రోసిస్ లేదా అర్తరైటిస్ వస్తుంది.గ్లోబల్ ఆసుపత్రి కి చెందిన ముంబై లో అర్తోపెటిక్ కన్సల్టేంట్ డాక్టర్ అనూప్ ఖతీర్ మాట్లాడుతూ అస్త్రియో ప్రోరోసిస్ కారణంగా మాములుగా పడినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ కు దారి తీస్తుందని హెచ్చరించారు. వాస్తవానికి సహజంగా మోకాళ్ళ మధ్యలో కీళ్ళ లో వేన్నెముక,లేదా భుజాలు జాయింట్స్ లో నడుములో ఫ్రాక్చర్స్ విరిగి ఉండడం గమనించవచ్చు. కీళ్ళు కాళ్ళు భుజాల జాయింట్స్ లో అరగడం జారడం ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల పడిపోతూ ఉంటారు.ఒక్కోసారి పడిపోయినప్పుడు మెడలో ,గుండెలోని, లేదా ఊపిరి తిత్తులలో ఉన్న ఎముకలకు దెబ్బలు తగులు తూఉంటాయి.అస్త్రియో ప్రోరొసిస్ వల్ల ఎముకలలో వచ్చే ఫ్రాక్చర్స్ సరి చేయాలంటే కొంత సమయం పడుతుంది.దీనివల్ల దీర్ఘకాలం పాటు బెడ్ రెస్ట్ అవసరం రావచ్చని అనూప్ హెచ్చరించారు. ఒక్కోసారి తీవ్రతను బట్టి ఆస్టియో ప్రోరోటిక్ సర్జరీ కి దారి తీయవచ్చు ఎముకల సర్జరీలో  పలు సవాళ్ళు ఎదుర్కోవడం అవి సంపూర్ణ మవ్వడం జరుగుతుంది. ఈ సమస్యల నుండి రక్షింప బడాలంటే వయస్సుపెరిగే కొద్ది పడిపోకుండా పట్టుకోల్పోకుండా సంరక్షింప బడాలి పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలం లోనే దెబ్బలు ప్రమాదకరం...

ముంబై కిచెండిన మసీన్ ఆసుపత్రికి చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ చిరాగ్ బోరానా మాట్లాడుతూ వర్షాకాలం సమయం లో వయస్సు రీత్యా దెబ్బలు తగిలే ప్రమాదం ఉందని వర్షాల వల్ల బురద పాకుడు కారణంగా దుర్ఘటన జరిగే అవకాసం ఉంటుంది. సాధారణ మైన రోడ్ల పై ఏమాత్రం నీరు నిలిచినా బురదకరణంగా కాలు జారినా శరీరం అలసటకు పట్టుకోల్పో యారో వృద్ధులు కుప్పకూలిపోవడం అసందర్భంగా పడిపోవడం ప్రమాదానికి గురికావడం సహజంగా కనిపిస్తుంది.6౦ సంవత్సరాలు పై బడిన అధిక ఆయుష్టు కల వారిలో రోగులలో ఆస్టియో ప్రోరొసిస్ ఉండే అవకాసం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడటాన్ని గమనించ వచ్చు. ఇందులో కీళ్లలో సమస్యలు జాయింట్లు అరగడం భుజాలు ఫ్రాక్చర్స్ కావడం సహజం.

 ఈ సమస్యల నుండి రక్షించ వచ్చా...

ఈ అంశం పై డాక్టర్ కత్రీ మాట్లాడుతూ వయస్సు మళ్ళిన వృద్ధులు జారకుండా ఉండే చెప్పులు తోడుక్కోవాలి.అవి జారి పోకుండా ఉండాలి అలాగే పట్టుకోల్పోకుండా ఉండాలి వాకింగ్ స్టిక్ వినియోగించడం మంచిది.అలాగే మీకంటిని పరీక్షించుకోవడం అవసరం.రాత్రి పూట ఏదైనా టార్చ్ లైట్ వెలిగించి ఉంచండి.ఇంటి దరిదాపుల్లో వీధిదీపాలు స్ట్రీట్ లైట్ వీధి దీపాలు ఉండే టట్లు చూసుకోండి. ఇంటిలోపల చిన్న చిన్న కార్పెట్ లేదా మ్యాట్ ను ఉంచండి దీనివల్ల కాళ్ళు జారి పడే ప్రమాదం ఉంది.

దెబ్బల నుండి రక్షించుకోవాలంటే ఏమి చేయాలి...

డాక్టర్ చిరాగ్ బోరోనా సూచనల మేరకు సీనియర్ సిటిజన్స్ వయస్సు మళ్ళిన వాళ్ళు వృద్ధులు వర్షాకాలం లో వాతావరణం సరైన ఫుట్ వేర్ ధరించాలి దీనివల్ల వారు జారి పడకుండా రక్షింప బడతారు.శరీరం పై పట్టు పటుత్వం కోల్పోకుండా సరిగా ఉంటుంది.>ప్రతిరోజూ మీరు ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయండి. రోజూ వర్క్ అవుట్ చేయడం ద్వారా మీ శరీరంలోని కండరాలు బలంగా ఉంటాయి. మీ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి.శక్తి నిస్తాయి.>ఆస్టియో ప్రోరొసిస్ కేవలం పెద్దలకు వచ్చే అడల్ట్ రోగంగా నిర్ధారించారు.దీనిని సత్వరం గుర్తించడం అవసరం.శరీరం పట్టుకోల్పోయినప్పుడు వచ్చే చిన్న చిన్న దెబ్బలుకూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు సరైన సమయంలో సత్వర చికిత్చ చేయడం అత్యవసరం. అని నిపుణులు సూచిస్తున్నారు.