ఇప్పటిదాకా ఎండలు ఏమాత్రం తగ్గకుండా వేసవిని తలపిస్తున్నా శరత్కాల ప్రభావం వల్ల క్రమంగా చలి పెరుగుతుంది. సాధారణంగానే అక్టోబర్ నెలలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఉదయం, సాయంత్రం సమయాలలో చలి ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో ఇన్ఫ్లూయెంజా వంటి వైరల్ లు పెరగడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్ అనేది మొండి తలనొప్పి. ఇది వచ్చిందంటే బాధితులను చాలా దారుణంగా హింసిస్తుంది. అసలు మైగ్రేన్ కు చలికి ఉన్న సమస్య ఏంటి? చలికాలంలో దీనికి చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే..
మైగ్రేన్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో గాలి పొడిగా ఉండటం, విపరీతమైన చలి కారణంగా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి తగినంత లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మెగ్రేన్ వంటి సమస్యలు పెంచుతుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది అంతర్గత నిద్ర గడియారం. ఇది అసమతుల్యతకు గురికావడం వల్ల నిద్రలేమి, తద్వారా తలనొప్పి, మైగ్రేన్ కు దారితీస్తుంది.
కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా ధూమపానం, మద్యపానం, కెఫిన్ పానీయాలు తీసుకోవడం, అధికంగా వెలుగు కలిగిన, మెరుస్తున్న లైట్లముందు, ఘాడత కలిగిన వాసనల మధ్య ఉండటం కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి.
మైగ్రేన్ ఎలా నివారించాలంటే..
చలి భరించలేని వారు, చాలా సున్నితమైనవారు మైగ్రేన్ బారిన తొందరగా పడతారు. శీతాకాలంలో వీరు మైగ్రేన్ బారిన పడే అవకాశం ఎక్కువ. మైగ్రేన్ ను నివారించడానికి చలికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. వ్యాయామం శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే చలికాలపు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. వేడి నీరు, వేడి ఆహారం, వెచ్చని వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మైగ్రేన్ ను దూరంగా ఉంచుతాయి.
*నిశ్శబ్ద.