పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం  ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్  పరీక్షలు  చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే  ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు.  

ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో  పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం  జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది.

కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు.

హైపెర్ కీల్మియా సమస్యలు...

*రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు.

*కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది.

*కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి.

*డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.       

రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం  పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం 
ను సమతౌల్యం లో ఉంచుతాయి.