పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే..

జీర్ణ ఆరోగ్యానికి..

 ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు..

స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు.

రోగనిరోధక శక్తి..

స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం..

 స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది.


బరువు నిర్వహణ..

 బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.

                                            *నిశ్శబ్ద.