వర్షాకాలం లో కళ్ళకలక ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీని బారినుండి రక్షించ బడాలంటే 7 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వర్షాలు కురవడం తో వాతావరణం అద్భుతంగా ఉంటుంది.అలాగే రోగాలు వచ్చి పడతాయి.చాలా సహజమైన రోగాలలో కళ్ళకలక ఒకటి.దీనిలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కళ్ళకలక ను సామాన్య పరిభాష లో పింక్ ఐస్ అనికూడా అంటారు.

కళ్ళు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి.వైద్య పరిభాష లో కన్జేక్టి వైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా రావచ్చు.ఇది వర్షాకాలం లో చాలా సహజంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్. వర్షాకాలం లో వాతావరణం తడిగా ఉండడం వల్ల కళ్ళకలక వస్తుంది.కళ్ళ కలక అదే కంజక్టి వైటిస్ ఒకరినుండి మరొకరికి సోకేఅవకాసం ఉంది. కంజక్టివైటిస్ ఎలర్జీ లేదా రాసాయనాల రియాక్షన్ కారణంగా వస్తుంది.

కంజక్టి వైటిస్ లక్షణాలు -----

కళ్ళు ఎర్రబడడం.
కంటి చుట్టుపక్కల దురద.
కంటి నుండి నీరు కరడం.
కంట్లో పుసులు కట్టడం.
కంట్లో గుచ్చుకున్నట్లు,నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి.

కళ్ళకలక సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

1)మీచేతులను రోజులో చాలాసార్లు కడగండి...

అన్నిరకాల వైరస్ లు బ్యాక్టీరియా నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎక్కువసార్లు కడగాలి.

2)చేతితో కంటిని తాకకండి----

బ్యాక్టీరియా లేదా వైరస్ మీ చేతికి ఉండవచ్చు. చేతి ద్వారా మనకంటికి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చేరే అవకాసం ఉంది. చాలా సులభం కూడా కావాలంటే ప్రతిరోజూ మీ ముఖాన్ని చేతిని ఎన్నిసార్లు కడుగుతారు.అయినాసరే మీచేతిని మీకంట్లో చేయి పెట్టకుండా.మీ కంటిని రక్షించుకోండి. మీ చేయి ముఖాన్ని తాకడం వల్ల కంజేక్టివైటిస్ తో పాటు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది.

౩)ముఖం పరిశుభ్రంగా ఉంచేందుకు మెత్తటి టవల్స్ తీసుకోండి...

మీకంటి లోపలికి బ్యాక్టీరియా వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది.మన ముఖాన్ని తుడిచినప్పుడు మనకంటిని మెత్తగా ఉన్న టవల్ తువ్వాలు లేదా న్యాప్కీన్ తో శుభ్రంగా తుడవాలి. వర్షాకాలం లో తువ్వాళ్ళు టవల్స్ తడిగా ఉంటాయి.అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.ఈ సమయంలో ప్రతిరెండు రోజుల కు ఒకసారి టవల్స్ మార్చాలి. 

4)మీ టవల్ ను మరొకరితో పంచుకోకండి....

మీ టవల్ ను లేదా వేరొకరి టవల్ ను వేరొకరు వాడి ఒదిలేసిన టవల్ ను ఎప్పుడు వాడకండి.దీనివల్ల వేరొకరికి సోకినకళ్ళ కలక మరొకరికి సోకుతుంది.మీటవల్ ను వేరొకరికి దూరంగా ఉంచండి.

5) కాలం చెల్లిన మేకప్ సామాగ్రి ని వాడకండి...

చాలామంది మహిళలు అందంగా కనపడడానికి తెగ తాపత్రయ పడుతూఉంటారు.ఈ క్రమంలో కాలం చెల్లిన మేకప్ సామగ్రిని వాడతారు.ఇలా చేయడం వల్ల కళ్ళకలక సోకే అవకాసం ఉందని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

6) కంటి పరీక్షలు చేయించండి...

సహజంగా చాలామంది కళ్ళు ఎర్రబడగానే కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించకుండా సమీపం లో ఉన్న మందుల దుకాణం వారు ఇచ్చిన కొన్నిరకాల డ్రాప్స్ ను వెసెస్థూన్తారు. మేక్అప్ లాగానే కంట్లో వేసే మందుల విషయం లో ఆమందులుకాలం చెల్లిందా కదా ఎన్నిరోజులు సమయం వరకు ఉంది అన్న విషయం  తెలుసుకోకుండా ముఖ్యంగా కంటి లో వచ్చిన ఇన్ఫెక్షన్ కు కారణం ఏమిటి,బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక ఇన్ఫెక్షన్ కు కారణం అయిన అంశాలు తెలుసుకున్నకే కంట్లో చుక్కలు వేసుకోవాలని అలాకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఆకురసాలు లేదా ఇతర చుక్కలు వాడరాదని పరీక్షించకుండా చుక్కలు వేయడం వల్ల చర్మాసంబంద మైన రక్షణ కోసం వాడే ఉత్పత్తులపై అవగాహన అవసరం.మనం వాడే చుక్కల మందుల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు లేదా ఒక్కోసారి కళ్ళే పోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

7)తలగడ కవర్లు మార్చడం అవసరం...

మనం పడుకోవాలంటే తలకింద తలగడ అవసరం కొన్ని ప్రాంతాలాలో దిండు అని తకియా అని అంటారు తలకింద దిండు తలగడ లేనిదే కొందరికి నిద్రకూడా పట్టదు.ఇక్కడ కళ్ళ కలక వచ్చిన వ్యక్తి ముఖాన్ని తలగడ పైనే ఉంటుంది.సహజంగా చాలామంది ఇళ్ళలో వారానికి పైగానే తమ దిండు మీద తలగడ మీద కవర్ ను మారుస్తారు కొనరు నెలల తరబడి దిండు కవర్లు మార్చారు. ఈ కారణంగా బ్యాక్టీరియా ఏర్పడి వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు కంటితోపాటు ముక్కు,ముఖం పై ప్రాభావం చూపుతుంది. ఇలా కళ్ళ కలక వచ్చిన వారు జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు.