Morning sun light is good for skin, Morning sun light is good

 

 

పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది అని గుర్తించారు. ఆస్ట్రేలియా పరిశోధకులు. వివరంగా చెప్పుకోవాలంటే మన శరీరానికి విటమిన్ - డి ఎంతో అవసరం. అలా సూర్యరశ్మి ద్వారా విటమిన్ -డి శరీరానికి అందాలంటే సూర్య రశ్మి ఎంతో అవసరం. అలా సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి శరీరానికి అందేలా చేయడం ఉత్తమమైన మార్గం.అలా కాక విటమిన్ - డి మాత్రలు వేసుకుంటే సరి అనుకుంటే పొరపాటే . ఎందుకంటే విటమిన్ - డి ఎక్కువైనా సమస్యలు వస్తాయట . ఎందుకంటే మొత్తం నాడీ వ్యవస్థను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణిలు ఈ విటమిన్ - డి సూర్యరశ్మి ద్వారా తమ శరీరానికి అందేలా చూసుకోవాలి.

....రమ