టీ అనేది భారతీయులకు పెద్ద ఎమోషన్. ఉదయం చాయ్ తో మొదలయ్యే పనులు పూర్తయ్యే వరకు మద్య మద్యలో చాయ్ పడుతూనే ఉండాలి చాలామందికి. చాయ్ తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కొందరికి. మరికొందరు ఆఫీసులలోనూ, పనులలోనూ బ్రేక్ తీసుకోవడానికే చాయ్ ని సాకుగా చూపెడుతుంటారు. టీ అంటే టీ డికాక్షన్, పాలు, పంచదార మాత్రమే కాదు. కొన్ని చోట్ల బ్లాక్ టీ తాగుతారు. మరికొన్ని చోట్ల గ్రీన్ టీ తాగుతారు. కానీ లోటస్ ప్లవర్ టీ గురించి తెలిసినవారు తక్కువ. తామర పువ్వుల టీ చాలా చర్చగా మారింది. ఈ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే..
తామర పువ్వుల టీ రుచిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ తామర పువ్వుల టీ తాగుతుంటే చాలా అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. మొదట దీన్నెలా చేయాలంటే..
తామర పువ్వుల టీ తయారుచేయడం చాలా సులభం. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోయాలి. ఈ నీటిని మరిగించాలి. ఈ నీటిలో ఎండిన లేదా తాజా తామర పువ్వులు వేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత స్టౌవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచాలి.
తామర పువ్వులు ఉడికిన నీరు చల్లారిన తరువాత దాన్ని స్టైయినర్ తో ఫిల్టర్ చేయాలి. ఈ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని, స్వచ్చమైన రోజ్ వాటర్ జోడించవచ్చు. ఇందులో రుచి కోసం కాసింత తేనె కూడా కలుపుకోవచ్చు. అంతే తామర పువ్వుల టీ తాగడానికి సిద్దమైనట్టే.
ప్రయోజనాలేంటంటే..
తామర పువ్వులలో అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి.
తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
మహిళలు తమ పీరియడ్స్ సమయంలో తామర పువ్వుల టీని రోజుకు ఒకటి నుంి రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి అసౌకర్యాల నుండి ఉపశమనం ఉంటుంది.
*రూపశ్రీ.