ఆహారమే ఔషదం అని అంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం,  అనారోగ్యానికి గురి కావాలంటే అనారోగ్యకర ఆహారం కారణం అవుతాయి. సాదారణంగా ఏదైనా జబ్బు చేయగానే చాలామంది మందులు తీసుకుని సమస్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యం మీద భయంతో కొన్నిసార్లు వైద్యులను సంప్రదించేవారు కొందరైతే.. చీటికి మాటికి చిన్న జబ్బులకు కూడా మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడేవారు కొందరు.  కానీ సాధారణంగా అందరికీ వచ్చే అయిదు రకాల జబ్బులకు అస్సలు మందులు వాడాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ జబ్బులను లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. ఇవి ఆహారంలో మార్పులు చేసుకోగానే తగ్గిపోతాయి.  ఆ జబ్బులు ఏంటో.. దానికి తీసుకోవలసిన ఆహారం ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

ప్రస్తుతం ఎవ్వరిని గమనించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది. పూర్తీ ఫిట్ గా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ప్రమాదం అనుకునే అయిదు రకాల వ్యాధులు మాత్రం ఆహారంతోనే తగ్గిపోతాయనే షాకింగ్ నిజం బయటపడింది.

ఆహారంతో తగ్గిపోయే వ్యాధులలో టైప్ 2 మధుమేహం ఒకటి. మధుమేహం ఉన్నవారు జీవితాంతం ఇన్సులిన్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని తిప్పికొట్టవచ్చట.

ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మరణాలకు కారణమవుతున్న జబ్బులలో గుండె జబ్బు మొదటిది. గుండె జబ్బులు వాటి సిరలకు వచ్చే సమస్యలతో ముడిపడి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, బిపి,  అధిక బరువు గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి వీటిని నియంత్రణలో ఉంచుకుంటే గుండె జబ్బులు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా నయమవుతాయి.

గుండె పోటు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మూడు కలిసి మెదడుమీద ప్రభావం చూపిస్తాయి. ఇవి స్ట్రోక్ కు కారణం అవుతాయి. మెదడు నరాలు పగిలినప్పుడు లేదా మెదడుకు రక్తప్రసరణ మందగించినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ముఖ్యం. అవే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

రక్తం సిరల్లో అధిక వేగంతో ప్రసరించినప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అని అంటారు. ఇలా  జరిగినప్పుడు గుండె ఎక్కువ శ్రమకు గురవుతుంది. నరాలు బలహీనపడతాయి.   బిపి 120/80mmHg కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండకూడదు.

శరీరంలో పుట్టెడు జబ్బులకు కేవలం ఉబకాయం మాత్రమే ప్రధాన కారణం అవుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధికబరువు ఉన్నవారు కూడా ఆహారంలో మార్పులు, వ్యాయామం రెండూ చేస్తే బరువు తగ్గుతారు. చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కానీ నిజానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు బయటకు వ్యక్తం చేస్తారు, మరోవైపు ఆహారం, వ్యాయామం విషయాల్లో సీరియస్ గా ఉండరు. అందుకే బరువు తగ్గరు.

పై అయిదు సమస్యలకు కేవలం ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

                              *నిశ్శబ్ద.