ఉసిరికాయను అమలకి అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా వంటలలో వాడుతుంటారు.  పచ్చళ్లు, పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు.  అయితే ఉసిరికాయ ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కనీసం ఒక ఉసిరికాయను తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  అయితే ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.  అవేంటంటే..


పోషకాలు..

ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు ఉన్నాయి.  ఇందులో పైబర్ కంటెంట్ కూడా ఎక్కువే.. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,  మలబద్దకాన్ని నివారిస్తుంది.  


రోగనిరోధక శక్తి..

ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే యాంటీ బాడీస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.


మధుమేహం..


ఉసిరిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీన్ని తేనెతో కలిపి సేవించడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

జీర్ణక్రియ..

ఉసిరిలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు కూడా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. తేనె,  ఉసిరి రెండూ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.


జుట్టు..

జుట్టు మందంగా,  ఆరోగ్యంగా, నల్లగా పెరగడంలో ఉసిరికాయ సహాయపడుతుంది.  ఉసిరికాయ రసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.  జుట్టు సంబంధ సమస్యలు తగ్గుతాయి.

చర్మం..

ఉసిరిలో విటమిన్-సి, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తాయి.


                                           *రూపశ్రీ.