చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు.  వీటిని శరీరం ఫిట్ గా ఉండటానికి,  బరువు తగ్గేందుకు ఎక్కువ వాడుతున్నారు. చియా సీడ్స్ మంచి మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు,  సూక్ష్మపోషకాలను అందిస్తాయి. ఇందులో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.  అయితే చియా విత్తనాలను క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటూ తీసుకుంటే షాకింగ్ ఫలితాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు చియా విత్తనాలను ఎలా తీసుకోవచ్చుు? నెలరోజుల పాటూ తీసుకుంటే జరిగేదేంటి?

చియా సీడ్ డ్రింక్..

చియా సీడ్ డ్రింక్ ను తయారుచేసి ప్రతి రోజూ తాగాలి. దీనికోసం దాల్చిన చెక్క ముక్కను ఒక జగ్ నీటిలో వేసి రాత్రంతా అలానే ఉంచాలి. అందులోనే చియా సీడ్స్ వేయాలి.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.


చియా సీడ్ డ్రింక్ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది.  దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి 10 నిమిషాలు ఉడకబెట్టాలి.  దీనిని ఫిల్టర్ చేసి అందులో చియా సీడ్స్ కలిపి తాగాలి.


ఈ డ్రింక్ తాగితే ఏం జరుగుతుంది?


చియా గింజల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా గింజలలో  10 గ్రాముల ఫైబర్‌ను ఉంటుంది. ఇది  సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం,  గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడం,  ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడం  మొదలైన వాటిలో సహాయపడుతుంది.


చియా విత్తనాలలో ఉండే  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్  ఉంటాయి.  ఇవి పరిశోధనలో శోథ నిరోధక ప్రయోజనాలను అందిస్తుంది.


చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి  శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి,  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. చియా విత్తనాలు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.


చియా విత్తనాలు  శాకాహారులు తీసుకుంటే   ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. గాయం నయం చేయడంలోనూ, కండరాల ఆరోగ్యం,  రోగనిరోధక శక్తితో సహా శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందిస్తాయి.

 చియా గింజలను తీసుకుంటే  కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, సెలీనియం, ఫోలేట్, విటమిన్ ఎ, బి విటమిన్లు   అన్నీ లభిస్తాయి.  జీవక్రియ, ఎముకల ఆరోగ్యం,  పునరుత్పత్తి ఆరోగ్యంతో సహా  చాలా విషయాలలో చియా గింజలు ప్రభావవంతంగా ఉంటాయి.


                                         *రూపశ్రీ.