శరీర బలం చాలా వరకు ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎముకలు మన అవయవాలకు లోపల బయటి నుండి రక్షణ కల్పిస్తాయి. కానీ చాలా మందికి ఉండే ఒక తప్పుడు అలవాటు ఎముకలను బలహీనపరుస్తుందని తెలుసా? నిజం ఆ ఒక్క తప్పు వల్ల శరీరానికి అవసరమైనంత కాల్షియం తీసుకున్నా సరే.. అది స్పాంజ్ నీటిని పీల్చేసినట్టు.. ఆ ఒక తప్పు శరీరంలో కాల్షియంను పీల్చుకుని ఎముకలను పెళుసుగా మారుస్తాయి. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసుకుంటే..
సూర్యకాంతి లేకపోవడం..
శరీరంలో కాల్షియం లోపానికి ప్రధాన కారణం ఎండలో బయటకు వెళ్లకపోవడమే. ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో కాల్షియంకు ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఉదయాన్నే కొద్దిసేపు సూర్యుడి లేత కిరణాలు ఉన్నప్పుడు ఆ ఎండలో కనీసం 10 నుండి 30 నిమిషాలు గడపాలి.
సూర్యకాంతి, విటమిన్ డి..
శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ముఖ్యమైనది. ఈ విటమిన్-డి అవసరాన్ని తీర్చడానికి, కొంత సమయం ఎండలో కూర్చోవడం ముఖ్యం.సూర్యకాంతి శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పై పడినప్పుడు అది శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అదే శరీరంలో తయారు అవుతుంది. ఇలా విటమిన్-డి తయారు కాకపోతే.. విటమిన్-డి లోపం ఏర్పడి శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.
ఎండలో కూర్చోవడం తప్పనిసరి..
ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు, ఉష్ణోగ్రత పెరగుదల ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఉదయం సూర్యరశ్మిని శరీరానికి సోకేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో బాధపడవచ్చు.
సూర్యకాంతికి ఏ సమయం మంచిది?
ఆరోగ్య నిపుణులు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఎంత సమయం..
ప్రతి రోజూ సూర్యరశ్మి కనీసం 15 నుండి 30 నిమిషాలు శరీరానికి సోకేలా చూసుకోవాలి. తీవ్రమైన ఎండ చర్మాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి లేత సూర్య కిరణాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...