కొవ్వును కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు, చెడు కొవ్వులు. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను తగ్గించడంతో పాటు మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల.. ఇలా చాలా విధులు నిర్వర్తిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ కు, అధిక బరువుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అధిక బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోవాలన్నా ఒక శక్తివంతమైన ఫిట్నెస్ రూల్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఆ ఫిట్నెస్ రూలే 30-30-30..
అసలు 30-30-30 అంటే ఏంటి? బరువు తగ్గడంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఎంతవరకు బరువు తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే..
అధికబరువుకు ప్రధాన కారణం జీవనశైలి సరిగా లేకపోవడం. ఈ జీవన శైలిని సింపుల్ రూల్ తో ఒకదారిలోకి పెట్టవచ్చు. దీనికి 30-30-30 రూల్ పేరు పెట్టారు. వ్యాయామం, ఆహారం, ప్రశాంతంగా తినడం. కేవలం ఈ మూడు ప్రధానంగా సాగే ఈ రూల్ గురించి తెలుసుకుంటే..
30 గ్రాముల ప్రోటీన్ తినాలి..
ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30గ్రాముల ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకుంటే అది శరీర అవసరాలకే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ 30 అనే మార్క్ కు ఉన్న మరొక అర్థం ఏమిటంటే రోజూ తీసుకునే ఆహారంలో 30శాతం కేలరీలు తగ్గించాలని. కేలరీలు తగ్గిస్తే సహజంగానే బరువు పెరగరు. ఇక 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరం బలహీనంగా మారకుండా ఉంటుంది. ప్రోటీన్ కండరాలకు ఎంతో అవసరమైనది కాబట్టి 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, 30శాతం కేలరీలు తగ్గించుకోవాలి.
వ్యాయామం..
వ్యాయామం చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారు స్వతహాగా అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటార. ఫిట్నెస్ రూల్ ప్రకారం రోజులో 30నిమిషాలపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించడం సులువు అవుతుంది. ఈ వ్యాయామంలో వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, గేమ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలైనవి ప్రభావవంతంగా ఉంటాయి.
ప్రశాంతంగా తినడం..
ప్రశాంతంగా తినడాన్ని ఇప్పట్లో మైండ్ పుల్ ఈటింగ్ అని అంటున్నారు. తినే ఆహారం మీద ద్యాస పెట్టడమే మైండ్ పుల్ పద్దతి. ఇప్పట్లో చాలామంది ఉద్యోగాలు, చదువుల హడావిడిలో వేగంగా తినేయడం చేస్తుంటారు. మరికొందరు భోజనం చేస్తున్నప్పుడు కూడా టీవి, మొబైల్ చూస్తూ తింటారు. దీనివల్ల కడుపు అయితే నిండుతుంది కానీ ఆహారంలోని శక్తి శరీరానికి సంపూర్ణంగా అందదు. మనం తినే ఆహారం చాలా శక్తివంతమైనదని, అది అమృత సమానమైనదని భావిస్తూ ఆహారాన్ని చేత్తో కలుపుకుని ఆహారం మీద ఎంతో ఇష్టంతో తినాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మునుపు ఆహారం తీసుకున్నప్పటికి, తరువాత మైండ్ ఫుల్ గా తిన్నప్పటికి గల తేడాను స్పష్టంగా చూడగలుగుతారు. ఆహారంలో నిఘూడమైన ఉంటుంది. దాన్ని పొందగలగాలి. ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడిని పూజిస్తున్నప్పుడు ఎంత భక్తితో ఉంటామో ఆహారం దగ్గరా అంతే భక్తితో ఉండాలి. ఆహారాన్ని ఇలా ఫీలవుతూ తినడానికి 30నిమిషాల సమయాన్ని కేటాయించాలి.
కేవలం పై మూడు ఫాలో అయితే కొన్ని రోజులలోనే బరువు తగ్గడం స్పష్టంగా గమనించగలుగుతారు.
*నిశ్శబ్ద