ఇప్పటి కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు లాంటి పదార్ధం, ఇది జిగటగా ఉంటుంది. రక్త ధమనులలో పేరుకుపోతుంది, ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం చేరడం కష్టతరం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి కూడా ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా ఉబకాయం, కొవ్వు పదార్ధాల అధిక వినియోగం కారణంగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, దానిని తగ్గించడానికి ఆహారంలో అనేక మార్పులు చేయడం అవసరం. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని పదార్థాలు మన ఇంట్లోనే.. వంటగదిలో ఉన్నాయి. కింద సూచించిన మూడు చిట్కాలలో ఏదో ఒకటి ఫాలో అవ్వడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.
దాల్చిన చెక్క
గుండె సమస్యలను తొలగించడంలో దాల్చినచెక్క చాలా ప్రయోజనకరమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ కారణంగా మూసుకుపోయిన ధమనులు తెరుచుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ముఖ్యంగా రక్తలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్కను తీసుకోవడానికి ఉత్తమ మార్గం టీ తయారు చేసి త్రాగడం. దాల్చిన చెక్క టీ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు నీటిని మరిగించి దాల్చిన చెక్క ముక్కలను వేసి కాసేపు ఉడికించాలి. ఈ టీని తేనె కలుపుకుని తాగవచ్చు.
మెంతులు
మెంతి గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతి గింజలు ధమనులలో కొలెస్ట్రాల్ శోషణ ప్రక్రియను తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మెంతి గింజలను తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగవచ్చు. మెంతి గింజలను వంటలలో భాగంగా తీసుకోవచ్చు. అంతే కాకుండా మెంతి గింజలతో టీ తయారు చేసి తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
పసుపు
ఔషధ గుణాలతో నిండిన పసుపు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. పసుపును వేడి నీటిలో మరిగించి టీ లాగా తాగవచ్చు. పాలలో కలిపి తీసుకోవచ్చు.
మూడు చిట్కాలలో ఏదో ఒకటి తప్పకుండా ఫాలో అయితే కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.
◆నిశ్శబ్ద..