వాస్తులో ద్వారాల నియమాలు
(Vastu Doors Conditions)
వాస్తు ప్రకారం ద్వారాలు సరిసంఖ్య లో ఉండాలి. అంటే ఇంటి వైశాల్యం, గదులను బట్టి 2, 4, 8, 12 ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇల్లు బాగా చిన్నదైతే ఒకే ఒక్క తలుపు ఉండొచ్చు. లేదంటే మాత్రం తలుపులు సరి సంఖ్యలో ఉండాలి. అయితే సున్నా ఉన్న సరి సంఖ్య... అంటే పది మొదలైనవి పనికిరావు. ఈ నియమం ఎదురెదురుగా ద్వారాలు పెట్టినప్పుడు, పాతకాలపు పద్ధతిలో ఏటవాలు కప్పు ఉపయోగించిన ఇళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. స్లాబు ఉన్న ఇళ్ళకు ఎన్ని ద్వారాలు ఉన్నా పరవాలేదు.
ద్వారాల విషయంలో అనుసరించవలసిన నియమాలు
సింహద్వారం ఇతర ద్వారాల కన్నా పెద్దగా ఉండాలి.
సింహ ద్వారానికి తప్పనిసరిగా గడప ఉండాలి.
ద్వారం ఎదురుగా పిల్లర్లు కానీ, స్తంభాలు కానీ ఉండకూడదు.
ద్వారం ఎదురుగా చెట్లు ఉండకూడదు.
ద్వారం ఎదురుగా గోతులు కానీ, బావి కానీ ఉండకూడదు.
ద్వారాలు ఎటు ఉంటే మంచిది?
తూర్పు ఈశాన్యం
తూర్పు మధ్యభాగం నుండి ఈశాన్యం వరకూ
పశ్చిమ వాయువ్యం
పశ్చిమ మధ్యభాగం నుండి పశ్చిమ వాయువ్యం వరకూ
ఉత్తర ఈశాన్యం
ఉత్తర మధ్యభాగం నుండి ఈశాన్యం వరకూ
దక్షిణ ఆగ్నేయం
దక్షిణ మధ్యభాగం నుండి దక్షిణ ఆగ్నేయం వరకూ
