ఈ మొక్కలను తులసి దగ్గర ఉంచితే ఇంట్లో ఆనందం ఆవిరి అయిపోతుంది..!
ప్రతి భారతీయ హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్క చూస్తుంటాం. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం తులసి పూజ చేస్తారు. ప్రతి నిత్యం తులసి ముందు దీపారాధన చేస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లోకి యమ భటులు ప్రవేశించలేరు అన్నది చాలామంది చెప్పే మాట. అయితే వాస్తు ప్రకారం తులసి మొక్క దగ్గర కొన్ని మొక్కలు ఉంచకూడదు. దీని వల్ల ఆ ఉంట్లో అశాంతి నెలకుంటుంది. కుటుంబంలో ఆనందం ఆవిరి అయిపోతుంది. ఇంతకీ ఆ మొక్కలేంటో తెలుసుకుంటే..
కాక్టస్ మొక్క..
కాక్టస్ మొక్కను ఇంటి అలంకరణలో భాగంగా పెంచుతుంటారు. కానీ తులసి దగ్గర ఈ మొక్కను పెంచకూడద. ముళ్ల మొక్కలు కేతు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయట. ఈ మొక్కలను తులసి పక్కన పెంచితే ఆ ఇంటి వ్యక్తులకు కష్టాలు పెరుగుతాయట. కాక్టస్ మొక్కను తులసి దగ్గరే కాదు.. ఇంట్లో కూడా పెంచకూడదట.
ఇవి కూడా..
తులసి దగ్గర పాలలాంటి ద్రవాన్ని స్రవించే మొక్కలు కూడా పెంచకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయట. దీని కారణంగా ఇంట్లో గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తాయట.
తులసి ఎక్కడ ఎలా ఉండాలి..
వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను ఉంచే స్థలంలో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తులసిని పొరపాటున కూడా చీకటి ప్రదేశంలో ఉంచకూడదు. ఇవన్నీ పాటిస్తే ఆ ఇంట్లో శుభ ఫలితాలు, కుటుంబం సభ్యుల సామరస్యం, కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది.
*రూపశ్రీ.