వాస్తులో ఉపగృహం

(Vastu & Out House)

 

ఉపగృహం అంటే చాలామందికి బహుశా అర్ధం కాదు. అవుట్ హౌజ్ పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తాం కనుక అదే స్పష్టంగా తెలుస్తుంది.

ఇళ్ళస్థలంలో ఉండే హెచ్చుతగ్గులను సవరించడం కోసం ప్రధాన గృహంతో బాటు, అవుట్ హౌజ్ (ఉపగృహాన్ని) నిర్మిస్తారు. స్థలంలో హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనర్ధాల ప్రమాదం నుండి బయటపడేందుకు అవుట్ హౌజ్ నిర్మించే సంప్రదాయం పుట్టింది. తర్వాతి కాలంలో అవుట్ హౌజ్ లేదా ఉపగృహంలో వాచ్ మాన్ కుటుంబాన్ని ఉంచుతున్నారు.

అవుట్ హౌజ్ వాస్తు పరంగా దోషాలను నివారించడమే కాకుండా, మరో కుటుంబానికి ఆధారం కల్పిస్తోంది.

ఉపగృహం కట్టడం ద్వారా ఈశాన్యం పెంచే వీలు ఉంది.

ప్రధాన గృహాన్ని, అవుట్ హౌజ్ వైపునా తాకకుండా ఉండాలి. చాలామంది ఉపగృహాన్ని అసలు ఇంటితో కలుపుతూ లేదా ఒకవైపున రెండూ కలిసేలా నిర్మిస్తారు. ఇది వాస్తు వ్యతిరేకం.

ఉపగృహం, ప్రధాన ఇంటికే కాకుండా, తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలకు ఎంతమాత్రం తాకకుండా చూడాలి. అంటే రెండిటి మధ్యలో కొంత ఖాళీస్థలం తప్పనిసరిగా ఉండాలి.

 

అవుట్ హౌజ్ కు అనుకూలమైన దిక్కులు

తూర్పు ఆగ్నేయం

పడమర

పశ్చిమ వాయువ్యం

ఉత్తర వాయువ్యం

దక్షిణం

దక్షిణ ఆగ్నేయం

నైరుతి

 

అవుట్ హౌజ్ నిర్మించకూడని దిక్కులు

తూర్పు

ఉత్తరం

ఈశాన్యం


More Vastu