వాస్తులో బీర్వాలు ఎక్కడ ఉండాలి?

(Vastu – Place of Cupboards)

 

వాస్తులో ఏ గది ఎటు ఉండాలో నిర్దేశించినట్లే, ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో నిర్ణయించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే, కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచితే...

వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో, దక్షిణ ముఖం చేసి ఉంటే శ్రేష్టం. బీరువాలో ధనం లేదా నగలు భద్రపరిచేటప్పుడు ఉత్తర ముఖ చేస్తాం అన్నమాట. ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు. ధన ప్రవాహానికి ఆటంకం కలక్కుండా వస్తూ ఉంటుంది.

బీరువాను ఉత్తర దిక్కు మధ్యలో ఉంచితే...

ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు. బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచితే మంచిది.

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి నిత్యం దక్షిణ రూపంలో కుప్పలుతెప్పలుగా సంపదలు వచ్చిపడుతుంటాయి. ఆ వెంకన్న హుండీ దేవాలయంలో ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంది. ధన రాబడి బాగుండాలంటే ఉత్తరదిక్కు మధ్యభాగంలో ధనము, నగలు దాచుకునే బీర్వా ఉండాలని గుర్తుంచుకోండి.

బీర్వా తూర్పు దిక్కున ఉంటే...

బీర్వా గనుక తూర్పువైపున ఉంటే లేనిపోని ఖర్చులు వచ్చిపడతాయి.

 

ఈశాన్యంలో బీర్వా ఉంటే..

బీర్వా ఈశాన్యంలో ఉంటే చిన్న పనికి కూడా అధిక ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బూడిదలో పోసిన పన్నీరులా డబ్బు వృథాగా ఖర్చయిపోతుంది.

 

ఆగ్నేయంలో బీర్వా ఉంటే...

ఆగ్నేయంలో కనుక నగదు భద్రపరిచే బీర్వా ఉంటే ఆ సొమ్మును దొంగలు దోచుకుపోతారు.

 

నైరుతిలో బీర్వా ఉంటే...

బీర్వా నైరుతిలో ఉంచితే ఎంత సొమ్ము వచ్చినా అది మనకు అక్కరకు రాదు. వచ్చిన దారినే పోతూ ఉంటుంది.


More Vastu