కుండలిని రహస్యం.. జాతకం ప్రకారం జీవితం నడుస్తుందా!

జాతకం అంటే నేటి కాలం వారు కొట్టిపడేస్తారు.  కొందరైతే  జాతకం పేరు చెబితే నవ్వేస్తారు కూడా.  నేటితరం జాతకాన్ని పెద్ద కామెడీ పీస్ గా వర్ణిస్తారు. జాతకాలు చూసి పెళ్లి చేసినా ఆ బందాలు మద్యలో విచ్చిన్నం కావడం,  విడిపోవడం, ఆర్థిక సమస్యలు రావడం, కష్టపడినా విజయం దక్కకపోవడం.. ఇలా చాలా కారణాలు జాతకాన్ని కొట్టి పడేయడానికి కారణం అవుతాయి.  అయితే దేశంలోనే ప్రముఖ జ్యోతిష్యులు కొన్ని కీలక విషయాలు పేర్కొన్నారు.  జాతకాల గురించి పూర్తీ సమాచారం జాతకంలోని గ్రహాలు, నక్షత్రాలలో దాగి ఉంటుంది అని అంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య బందం కొనసాగుతుందా లేదా తెగిపోతుందా? డబ్బు ఎందుకు నిలవడం లేదు? ఏ రాశుల వారు త్వరగా ప్రేమలో పడతారు? ఇవన్నీ జాతకంలోని గ్రహాలు, నక్షత్రాలు వెల్లడిస్తాయట. వీటిగురించి తెలుసుకుంటే..

బంధాలు కనసాగుతాయా లేదా?

నేటికాలంలో భార్యాభర్తల మద్య జరిగే గొడవలు, తగాదాలతో ఇద్దరి మద్య దూరం పెరిగితే చాలా మందికి ఉండే సందేహం.. నా సంబంధం కొనసాగుతుందా లేదా తెగిపోతుందా? అని. దీనికి సమాధారం కుండలిలోని   ఐదవ,  ఏడవ ఇళ్లలో ఉంటుందట.

శని, రాహువు లేదా కుజుడు వంటి క్రూరమైన గ్రహాలు ఐదవ ఇంట్లో ఉంటే సంబంధాలు మళ్లీ మళ్లీ తెగిపోతుంటాయట.

ఏడవ ఇల్లు అంటే వివాహ గృహం బలహీనంగా ఉండి, దుష్ట గ్రహాల ప్రభావంలో ఉండి, బృహస్పతి అనుగ్రహం లేకపోతే వివాహంలో వివాదం లేదా విడాకుల పరిస్థితి తలెత్తుతుందట.

కొన్నిసార్లు ఈ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది, భాగస్వామి అకారణంగా ఇతరులు తలపెట్టే సమస్యలలో  లేదా చట్టపరమైన వివాదాలలో కూడా చిక్కుకుంటారట.

దీని అర్థం వివాహం కేవలం లక్షణాలను సరిపోల్చడం ద్వారా కాదు.. ఏడవ ఇంటిని లోతుగా పరిశీలించడం చాలా అవసరం.

ఏ రాశుల వారు త్వరగా ప్రేమలో పడతారు?

సింహరాశి వారు దానగుణానికి ప్రసిద్ధి చెందారు. వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు.  వారి జీవితాల్లో చాలా సంబందాలు అలా వచ్చి పోతుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంబంధాలలో తులారాశి వారిని బాగా  స్థిరంగా ఉన్నవారిగా భావిస్తారు. భాగస్వాములను మార్చడం కంటే ఎక్కువ కాలం బంధాలలో కొనసాగడం వీరి జాతకంలో స్పష్టంగా కనిపిస్తుందట.

వృశ్చిక రాశి వారు తమ భావోద్వేగాలను దాచుకుంటారు. అందరి మాట వింటారు, కానీ వారి బాధను ఎవరితోనూ పంచుకోరట.

డబ్బు ఎందుకు నిలవదు..

చాలా మంది బాగా  సంపాదిస్తారు, కానీ డబ్బు నిలవదు.  రెండవ ఇంటి అధిపతి ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే, సంపద వస్తుంది కానీ నిలవదని జ్యోతిష్యులు చెబుతున్నారు.


ఎవరి జాతకంలో కుజుడు,  బుధుడు సంయోగం ఉన్నారో వారు మళ్ళీ మళ్ళీ అప్పులు తీసుకోవడం లేదా అప్పులు చేయడంలో చిక్కుకుంటారట.

కన్యారాశిలో బృహస్పతి నీచ స్థితిలో ఉంటే, అలాంటి వ్యక్తులు తరచుగా తమ బంగారాన్ని తనఖా పెడతారట లేదా బంగారు రుణాలలో చిక్కుకుంటారట.


దీనికి పరిహారం..

ఇలాంటి వ్యక్తులు పారిశుధ్య కార్మికులకు క్రమం తప్పకుండా చల్లని పాయసం లేదా పాలు దానం చేయడం వల్ల మంచి మార్పులు ఉంటాయట. ఈ పరిహారం సంపదను స్థిరంగా ఉండటంలో,  అబివృద్ది చెందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందట.

 వ్యాపారం  లేదా ఉద్యోగం..

కన్య రాశి వారు తమ ఉద్యోగాలలో బాగా రాణిస్తారు, కానీ వారు వ్యాపారం చేస్తే వారు తమ ఉద్యోగంలో లాగా క్రమశిక్షణ,  సమయపాలన పాటించాల్సి ఉంటుంది.

తుల రాశి వారు పుట్టుకతోనే వ్యాపారవేత్తలు. వారు ప్రతి సందర్భంలోనూ వ్యాపార అవకాశాలను చూస్తారు.  కెరీర్‌ను నిర్ణయించుకునే ముందు  రాశిచక్రం,  ఇళ్ల పరిస్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఆయా రంగాలలో సక్సెస్ సాధించగలుగుతారు.

పైన చెప్పుకున్న విధంగా కుండలి ఆధారంగా జీవితంలో జ్యోతిష్యం అద్భుతాలు చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

                                 *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories