సుదంతుడు చేసిన హనుమంతుని స్తోత్రం... అర్థాలు

 

 

నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే |
అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1|
ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునాకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము

యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ |
భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2|
యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణమూల రోగమునకు ఔషధమువంటివానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము

రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే |
సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3|
శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము.

గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే |
వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4|
పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము.

బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే |
శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే |5|
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతలా స్వరూప మయినవానికి, శతకంఠరావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణానక్షత్రమున.

 
అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః |
నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం |6|
అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము. ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.

మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః |
అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద |7|
నా అపరాధములను నీవుకూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు

పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ
సురాంత కాక్షాసుర మర్ధనాయ |
నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ
వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ |8|
తోకనిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి, దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి వారధి నిర్మించు బీభత్సకార్యంలో బీభత్స రాసోత్సవమున నున్న నీకు నమస్కారము

జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్ |
ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్ |9|
జనన మరణములు లేనట్టియు, శాంతస్వరూపము కల్గినట్టియు, వానర సమూహంచే సేవింపబడునట్టి, పాపములను పటాపంచలు చేయగల్గినట్టి, తాబేలు వెన్ను నధిరోహించినవానిని

కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్ |
వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే |10|
అర్జనుని రథపుటెక్కెమున సంచరించువానిని, వాలాభిల్యాది మునులచే స్తుతింపబడినవానిని, వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను

ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో
దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః |
ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్
యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే |11|

ఇంద్రవ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని, పూర్వపశ్చిమాద్రుల పాదము లుంచియున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహంచేశాడు. అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.


More Hanuman