ఒక్కరాత్రి వేశ్య .. విష్ణుమూర్తిని మెప్పించింది!


ఇప్పట్లో వేశ్యల పట్ల చాలా చిన్నచూపు ఉంది సమాజానికి. కానీ ఒక్కపుడు వేశ్య వృత్తి కూడా ఎంతో గౌరవనీయమైనదిగా ఉండేది. మరీ ముఖ్యంగా కొంతమంది వేశ్యా స్త్రీలు తమ ప్రవర్తన ద్వారా గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఇటువంటి వేశ్యలలో గండకి ఒకరు.


ఎవరు ఈ గండకి..


గండకి పురాణాలలో ఒక వేశ్య. ఈమె పేరుకు వేశ్య అయినా.. ఈమె చేసేది వేశ్య వృత్తి అయినా చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా గండకి తన వృత్తిని గౌరవంగా చూసేది. చాలామంది వేశ్యలు తమ దగ్గరకు వచ్చే వారితో డబ్బు తీసుకుని గంట సేపటికి లేదా పూటకు వారిని సుఖపెట్టి తరువాత వారిని పంపేస్తారు. వారు వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త వ్యక్తిని పిలుస్తారు. కానీ గండకి అలా కాదు. రోజుకు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే తన దగ్గర ఉంచుకునేది. రోజు మొత్తం ఆ వ్యక్తితోనే ఉండేది. తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఒక విటునిగా కాకుండా తన భర్తలాగా చూసుకునేది.  భర్తకు ఏమైనా అయితే భార్య ఎంత విలవిలలాడిపోతుందో అలాగే ఆమె కూడా తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే బాధపడేది. ఆమె మంచితనమో ఏమో ఆమె దగ్గరకు వచ్చి వెళ్లిన ప్రతి వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యేవాడు. దాంతో ఆమె దగ్గరకు వెళ్ళడానికి మగవాళ్ళు పోటీ పడేవాళ్ళు. కానీ గండకి మాత్రం మంచి వాళ్ళను మాత్రమే తన దగ్గరకు రానిచ్చేది.


ఈమె గురించి వైకుంఠంలో ఉన్న నారాయణుడికి తెలిసింది. మోహినీ రూపం దాలిస్తే మహిళలు కూడా అసూయ పడేంత అందం నారాయణుడిది. కానీ ఆయన గండకిని పరీక్షించాలని అనుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతడిని చూసిన గండకి అతడిని రేపు తన దగ్గరకు రమ్మని చెప్పింది. మరుసటి రోజు తన దగ్గరకు వచ్చిన విష్ణువు ఆమెతో "నాకు మొదట స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టు" అని అడిగాడు. 


అతడు అడిగినట్టే గండకి విష్ణువుకు స్నానం చేయించడానికి అతని చొక్కా విప్పింది. అతని శరీరం చూసి ఆశ్చర్యపోయింది. అతని శరీరం నిండా పుండ్లు ఉన్నాయి. అయినా కూడా అసహ్యించుకోకుండా అథానికిస్ స్నానం చేయించింది. ఆ తరువాత శరీరానికి సుగంధ పరిమళాలు పూసింది. అతన్ని తీసుకెళ్లి చక్కని పీట వేసి భోజనానికి కూర్చోబెట్టి కమ్మని వంటను వడ్డించింది. అయితే అతని చేతులకు కూడా పుండ్లు ఉండటంతో అతను అన్నం, కూరలు కలుపుకలేకపోయాడు. దాంతో గండకి తానే అన్నం కలిపి అతనికి తినిపించింది.  ఆ తరువాత అతన్ని పరుపు మీదకు తీసుకెళ్లింది. కానీ అతనికి జ్వరం బాగా వస్తుండటంతో రాత్రంతా అతనికి సేవలు చేస్తూ కూర్చుంది. అయితే అతను చనిపోయాడు. తన భర్తే నిజంగా చనిపోయాడనుకుని భోరున ఏడ్చింది గండకి. తన ఆస్తిపాస్తులు అన్నీ అందరికీ దానం చేసి, ఎవరు ఎంత చెప్పినా వినకుండా చనిపోయిన వ్యక్తితో కలసి చితిలో దూకి సతీసహగమనం చేసుకుంది.  గండకి భక్తికి, ప్రేమకు, ఆమె నిజాయితీకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై నీ వృత్తిని నువ్వు ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని భర్తగా భావించి చివరకు ప్రాణాలు కూడా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. నీకు ఏమి వరం కావాలో కోరుకో.. అని అడిగాడు విష్ణువు.


గండకి విష్ణువుతో "స్వామీ నువ్వు నా కడుపున పుట్టు, ఇదే నా కోరిక" అని అడిగింది.

సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. ఆ వరం కారణంగా మళ్ళీ జన్మలో గండకి నదిగా పుట్టింది. ఆ నదిలోనే విష్ణుపూర్తి అవతార రూపమైన సాలగ్రామలు పుడతాయి. 


ఇలా ఈ ఒక్కరాత్రి వేశ్య విష్ణువును మెప్పించింది..


                                    ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories