శనిత్రయోదశి ప్రత్యేకం ...
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. నెలకు రెండు త్రయోదశి లుంటాయి. సంత్సరానికి 12 త్రయోదశిలు. ఇందులో కొన్ని త్రయోదశిలకు హిందువులలో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని 'శనీశ్వరుడు'గా సంభోధింస్తారు. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. నవగ్రహాలకు అధిపతి శనీశ్వరుడు. ఆయన పేరు చెప్తేనే భయపడతారందరూ. కానీ శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిచిన వారికి శుభాలనొసగుతాడని ఏలినాటి శని దశ' వారిని అంతగా బాధించదని పురాణాలూ చెబుతున్నాయి. శనయే క్రమతి సః నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. శని గ్రహం సూర్యుని చుట్టు పరిభ్రమించేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం 24 గంటలు . నత్ నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరున్ని 'మందుడు' న్నారు మహర్షులు. నవ గ్రహాల్లో ఏడో వాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించెందుకే అవతరించాడని ప్రతీతి.
శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మందపల్లి మందుడు
మందపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి.,రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది.ఈ దేవాలయం మందేశ్వరాలయంగా కూడా ప్రశస్తి పొందినది. ఇక్కడకు దగ్గరలొ ధండిచి మహర్షి ఆశ్రమం ఉండేది.పురాణాల ప్రకారం ధండిచి మహరిషి తన వెన్నుముకను ఇంద్రుడుకి వజ్రాయుధం గా అసురలను చంపడానికి ఇక్కడే దానం ఇస్తాడు. మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు.
ఏటా శ్రావణ మాసంలోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.
శనీశ్వరుడి జప మంత్రాలు :
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
శని గాయత్రీ మంత్రం:
ఓం కాకధ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :
1 మయూరి నీలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శనికి తిలభిషేకం చేయించుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట
5 శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువ్వుండలు కాకులకు పెట్టుట వలన
7 శనివారం రోజు రొట్టిపై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నలచరిత్ర చదవటం వలన
10 కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్లనువులు, మేకు కలపటం వలన
11 శని ఏకాదశ నామాలు చదువుట వలన (శనేశ్వర, కోన, పింగల, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర) ప్రతి రోజు చదవటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్లచెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతి శనివారం రాగిచెట్టుకు ప్రదషణం మరియు నల్ల నువ్వులు, మినుములు కలిపినానీటిని రాగి చెట్టుకు పోయటం వలన
15 ఇనుముతో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందుభాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్రాహ్మణునికి నల్లవంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లని దుప్పటి దానం చేయటం వలన
18 ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చగాళ్ళకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాల ధరించుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన ,శ్రీ వెంకటేశ్వరస్వామి మాల ధరించుట వలన
20 ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయంలో శివుని దర్శనం, హనుమంతుని దర్సనం దర్శనం వలన శని గ్రహ దోషం శాంతించును.