పత్రీజీ ధ్యాన మహాయాగంలో 10వ రోజు వేద పఠనం
9. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానుల్లో మంచి ఉత్సాహన్ని నింపాయి. యాగంలో 10వ రోజు డిసెంబర్ 30న నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ధ్యాన విద్యార్ధి సభ్యులు అధ్బుతంగా కోలాటం నృత్యం ప్రదర్శించి అలరించారు. అనంతరం ఖమ్మం మిత్ర వింద్యానృత్యాలయానికి చెందిన చిన్నారి కూచిపూడి నృత్యం, అలాగే ధ్యాన గీతాలపై అధ్బుతంగా నృత్యం చేసి ధ్యానులను ఉల్లాసపరిచింది. అనంతరం హైదరాబాద్ కు చెందిన కళాకారిణి కూమారి నివేదిత, చిన్నారి గౌరిలు కూచిపూడి నృత్యం చేసి అందరి మనుసులు దోచుకున్నారు.ఈ సందర్బంగా PSSM ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పత్రీజీ ధ్యాన మహా యాగంలో 10 రోజు డిసెంబర్ 30 న నిర్వహించిన కార్యక్రమంలో ప్రదర్శించిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ధ్యాన కేంద్రం ఏవీ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పిరమిడ్ ట్రస్టీలు వాసవీ కన్యకాపరమేశ్వరీ ధ్యాన కేంద్రం గురించి వివరించారు. గత 3 ఏళ్లుగా ధ్యాన దసరా ఉత్సాహలను అధ్బుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన బుద్దాపిరమిడ్ ధ్యాన కేంద్రం ఏవీ, కాస్మిక్ వ్యాలీ ఏవీ, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ఏవీ అందరినీ ఆకట్టుకున్నాయి.
