కాలయవనుని భస్మం చేసిన ముచికుందుడు

Muchikunda Maharshi

 

మాంధాత కుమారులలో ఒకడు ముచుకుందుడు. వేలాది సంవత్సరాల పాటు సాగిన దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయపడ్డాడితడు.

యుద్ధ సమయంలో నిద్రాహారాలు మానినందువలన, యుద్ధం ముగిసిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు నిద్రపోవాలనే కోరిక అతడికి కలిగింది.

తనకు నిద్రాభంగం కలిగించిన వారు భస్మం కావాలని దేవతల నుంచి వరం పొంది, జనసంచారం లేనిచోట ఒక గుహలో నిద్రపోయాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడికీ కాలయవనుడుకీ యుద్ధం జరిగింది.

కాలయవనుడి బారి నుంచి తప్పించుకుంటున్నట్లు కృష్ణుడు యుక్తిగా ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి వచ్చి అదృశ్యమవుతాడు.

కృష్ణుడిని తరుముతూ వచ్చిన కాలయవనుడు గుహలో నిద్రిస్తున్న ముచికుందుడిని చూసి, కృష్ణుడిగా భ్రమించి అతడిపై దాడికి యత్నించగా, నిద్రాభంగమైన ముచికుందుడు కళ్ళుతెరిచి కాలయవనుని చూస్తాడు. దాంతో కాలయవనుడు భస్మమవుతాడు.


More Vyasalu