కశ్యపుని పేరున వెలసిన ప్రాంతం కాశ్మీరం

Kashyapa Maharshi

 

పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. దేవదానవులకు, నాగజాతికి, మానవ జాతికి జన్మనిచ్చినది కశ్యపుడే అని చెబుతారు.

బ్రహ్మ మనసు ప్రేరేపించడంతో జన్మించిన మరీచుడు కశ్యపుని తండ్రి.

దక్ష ప్రజాపతి తన 13 మంది కుమార్తెలను కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. వారే దితి, అదితి, వినత, కద్రువ, దాను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధవన, ఇడ, ఖస, మునిలను ఆయన వివాహమాడారు.

గరుడ (గురుత్మంతుడు), అరుణ, వినత, కుమారులు, నాగజాతి కద్రువ కుమారులు. ఇలాగే దేవతలు, దానవులు దితి, అదితి వల్ల కలిగిన సంతానం. భాగవతం ప్రకారం స్వర్గంలోకంలో నివశించే అప్సరసలు కశ్యపుని కుమార్తెలు.

స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి.

పరశురాముడు భూమండలంలోని క్షత్రియులందరినీ జయించిన తర్వాత తను పొందిన భూమినంతా కశ్యపునికి దానమిచ్చాడు.

పాండవుల మనుమడైన పరీక్షిత్తు పాముకాటుకు గురై, మరణిస్తాడని శాపం పొందిన సందర్భంలో ఆయనను రక్షించడానికి కశ్యపుడు ప్రయత్నించారు.

అయితే చివరకు నాగరాజైన తక్షకుడి విజ్ఞప్తి ప్రకారం వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

ఇలా అనేక సందర్భాల్లో మనకు కశ్యపుని ప్రస్తావన కనిపిస్తుంది.

 

Kashyapa maharshi and saptharshulu, the story of kashyapa muni, kashyapa maharshi and kashmiram, kashmir named on kashyapa, parashuram and kashyapa


More Vyasalu