రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? - 3

 Shri Rudram or the Namakam (chapter five) describes the name or epithets of Rudra, which ... There are eleven hymns; each has its own purpose and meaning.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్
యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు.
కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాక.
అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక.
" తముష్టుహి యస్స్విషుసు  ధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా మహే సౌ మనసాయ రుద్రం న మో భిర్దేవ మసురందువస్వ.
ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు.
అయంమే హస్తో భగవానయంమే భగవత్తర: అయంమే విశ్వభేషజోయం శివాభిమ ర్శన:
శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము.
యేతే సహస్ర మయుతం పాశా మృత్యోమర్త్యాయ  హంతవే  తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంధిరసి రుద్రోమా విశాంతక: తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి మమ సర్వాప మృత్యుర్నస్యతు ఆయుర్వర్ధతాం”
ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము,ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.
నమకము భావము సమాప్తము.

శ్రీ రుద్ర  చమకము.
అనువాకము 1.
శ్రుతి:-
వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే.
ఓ అగ్నావిష్ణులారా! అన్నమును, అన్న భోజనమునకు అనుమతియును, శుద్ధియును, బంధనమును, అనగా అన్న విషయకమైన ఔత్సుక్యమును నాకు సంపాదించెదరు గాక.
ధీతిశ్చమే  క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే.
అన్న ధారణమును, అన్న హేతువైన యజ్ఞమును, ఉదాత్తాది మంత్ర స్వరమును, స్తుతిని నా కొసంగుము.
శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే.
విని, వినిపించెడి శక్తిని, సామర్థ్యమును, ప్రకాశమును, స్వర్గమును నా కొసగుము.
ప్రాణశ్చమే  உపానశ్చమే వ్యానశ్చమే உసుశ్చమే
ప్రాణ వాయువును, అపాన వాయువును, వ్యాన వాయువును, ప్రాణాపానాది వృత్తులు కల వాయువును నాకొసగుము.
చిత్తంచమ అధీతంచమే వాక్చమే మనశ్చమే.
మనస్సున జనించిన జ్ఞానమును, మనోజ్ఞానముచే సర్వదా ఇంద్రియములను గోచరించు ద్రవ్యమును, వాక్కును, మనస్సును నా కొసంగుము.
చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ
నేత్రమును చెవిని జ్ఞానేంద్రియములకు చెందిన నేర్పును నా కొసంగుము.
ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ.
బల హేతువగు అష్టమ ధాతువును, శత్రువును పరాభవింప గల శక్తిని, ఆయుర్దాయమును, ఆయుస్సు తగ్గి చర్మము ముడతలు పడి, జుత్తు పండే స్థితిని నాకు చేకూర్చుము.
ఆత్మాచమే తనూశ్చమే శర్మచమే వర్మచమే.
శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మయును, చక్కని సన్నివేశము గల శరీరమును, సుఖమును, శరీరమును రక్షించు కవచాదికమును నాకు అగు గాక.
అంగానిచమే உస్థానిచమే వరూగ్ ఁషిచమే శరీరాణిచమే.
శరీరావయవముల నన్నింటిని, యథా స్థానమున గల యముకలను అంగుళ్యాది పర్వములను, ఇంతకు మున్ను చెప్పని అవయవములను, నాకు చేకూర్చుదురు గాక.
అనువాకము 1 సమాప్తము.

అనువాకము 2.
1) జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే
అన్నిటి కంటే  శ్రేష్ఠముగా నుండుటను, ప్రభువుగా నుండుటను, మనస్సున నుండు క్రోధమును, ఓరిమి లేకుండుట మున్నగు కారణములచే కల్గు బాహ్య క్రోధమును నాకు ఒసంగుము.
2) అమశ్చమే உంభశ్చమే జేమాచమే మహిమాచమే.
స్వల్ప ప్రయత్నముతో శత్రువులు  ఛేదింప శక్యము కాకుండుటను, శైత్య మాధుర్యము గల జలమును జయింప సామర్థ్యమును, మహత్వమును, జయించి సంపాదించిన ధనాది సంపదను నాకు(చేకూర్చుము) .
3) వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాచమే.
కోర దగిన పూజ్యత్వమును, గృహ క్షేత్రాది విస్తారమును,  పుత్ర పౌత్రాదుల శరీరములను, పుత్ర పౌత్రాదులకు చెందిన దీర్ఘత్వమును, నాకు ఒసంగుము.
4) వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్థాచమే.
ఉత్కృష్టమగు అన్నమును, అధికమగు ధనమును, విద్యాదులకు చెందిన గుణములచే కలిగిన గొప్పదనమును, యధార్ధ మాడుటను, పర లోకము కలదను బుద్ధిని, నాకు ఒసంగుడు.
5) జగచ్చమే ధనంచమే పశశ్చమే త్విషిశ్చమే.
స్థావర జంగమమైన గవాదికమును, సువర్ణాది ధనమును, సర్వము స్వాధీనముననుండుటను, శరీర కాంతిని నాకొసంగుము.
6) క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే.
పాచికలాడుట మున్నగు దానిని, క్రీడలచే కలుగు ఆనందమును, కలుగబోవు సంతానమును నాకొసంగుడు.
7) సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే.
ఋక్కుల సమూహమును, ఋగాది మంత్రములచే కలిగిన అపూర్వమును, పూర్వ లబ్ధమైన ధనమును, ఇటుపైన పొంద దగిన ద్రవ్య జాతమును నాకు ఒసంగుము.
8) భూతంచమే భవిష్యంచ మే సుగంచమే సుపథంచమ.
పూర్వ సిద్ధమైన క్షేత్రాదులను, మున్ముందు చక్కగా పొంద దగిన దానిని, చక్కగా వెళ్ళ తగిన తావును, బంధువులు గల గ్రామాంతరాదులను, దొంగలు మున్నగు ఈరి బాధలు లేని మార్గమును, నాకు ఒసంగుడు.
9) ఋద్థంచమ ఋద్థిశ్చమే  క్లప్తంచమే క్లప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే.
వేద్ధి చేయఁ బడిన ధనాదికమును గాని, ఆచరించిన కర్మ ఫలమును గాని, అనుష్టించ బోవు యజ్ఞముల ఫలమును, తమ పనులు చేయుటకు సమర్థమైన ద్రవ్యమును, స్వకీయమైన సామర్ధ్యమును,  పదార్థమును మాత్రమే నిశ్చయించుటను దుర్ఘటములైన రాజ కార్యాదులకు చెందిన నిశ్చయమును నాకొసంగుడు.
అనువాకము 2 సమాప్తము.

అనువాకము 3.
1) శంచమే మయశ్చమే ప్రియంచమే உనుకామశ్చమే కామశ్చమే.
ఐహిక సుఖమును, పర లోక సుఖమును, ప్రీతి కారణమైన వస్తువును, అనుకూలముగానున్న కారణమున కోరఁబడిన పదార్థమును నా కొసంగుము.
2) సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
మనస్సునకు స్వాస్త్యమును కూర్చు బంధు వర్గమును, ఇహ లోకమున రమణీయమైన కల్యాణమును, పరలోకమును నాకొసంగుడు.
3) వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే.
నివాస హేతువులగు గృహాదులను, కీర్తిని, సౌభాగ్యమును, ధనమును నా కొసంగుడు.
4) యంతాచమే  ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే.
ఆచార్యాదుల వలె నియమకుడనగుటను, పిత్రాదుల వలె పోషకుఁడ నగు శక్తిని, ధైర్యమొంది నిశ్చలముగా నుండుటను, నాకొసంగుడు.
5) విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే.
సర్వ జనులకు అనుకూలముగ నుండుటను, పూజను, వేద శాస్త్రము లకు చెందిన విజ్ఞానమును, జ్ఞాపకము చేయు సామర్థ్యమును నాకొసంగుడు.
6) సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమ.
పుత్రాదులను ప్రేరేపించు సామర్ధ్యమును, భ్రుత్యాదులను ప్రేరేపించు సామర్ధ్యనును, గోలాంగూలాదులతో వ్యవసాయమును సాధించు సంపత్తిని, పైని చెప్పిన పనులు చేయుటకు వీలు కాకుండ చేయు ప్రతి బంధమును నివారించుటను నాకొసగుడు.
7) ఋతంచమేஉమృతంచమేஉయక్ష్మంచమే உనామయచ్చ మే.
యజ్ఞాది కర్మను, యజ్ఞాది కర్మ ఫలమును, క్షయ మున్నగు వ్యాధులు లేకుండుటను, జ్వరము మున్నగు చిన్న వ్యాధులు లేకుండుటను, నాకు ఒసంగుడు.
8) జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేஉన మిత్రంచమే உభయంచమే.
జీవన కారణమైన వ్యాధి పరిహారకమైన ఔషధమును, అప మృత్యువు లేకుండుటను, శత్రువులు లేకుండుటను, భయము లేకుండుటను నాకు ఒసంగుడు.
9) సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే.
శోభనమైన గమనమును, శయ్య, తలగడ మున్నగు సంపదను, స్నానాదులచే ప్రకాశించు ప్రాతః కాలమును, యజ్ఞ దానాధ్యనాదులతో కూడిన సంపూర్ణ దినమును నాకు ఒసంగుడు.
అనువాకము 3 సమాప్తము.

అనువాకము 4.
1) ఊర్క్చమే సూనృతాచమే, పయశ్చమే రసశ్చమే.
అన్న సామాన్యమును ప్రియ వచనమును, అన్న విశేషములను, వానిలో చేరిన పాలను, అన్న విశేషములందు సారమును నాకు ఒసంగుడు.
2) ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే.
ఆవు నేయియును, పూతేనియును, బంధువులతోడి భోజనమును, సహ పానమును నాకు ఒసంగుడు.
3) కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచమ ఔద్భిద్యంచమే.
అన్నమునకు హేతువైన వ్యవసాయమును, వర్షమును, జయ స్వభావమును, భూమిని దొలుచుకొని జన్మించు చెట్టులు, పొదలు మున్నగు వానిని నాకు ఒసంగుడు.
4) రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చ మే.
సువర్ణమును, మణులు ముత్యములు మున్నగు వానిని,  పూర్వమే చెప్పఁ బడిన సువర్ణము యొక్క సమృద్ధిని, శరీర పోషణమును నా కొసంగుడు.
5) విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే.
విభువును, ప్రభువును,బహు యను దానిని, భూయః అను దానిని, నాకు ఒసంగుడు.
6) పూర్ణంచమే పూర్ణ తరంచమేஉక్షితిశ్చమే కూయవాశ్చమే.
పూర్ణమును, పూర్ణ తరమును, అక్షితిని, కుత్సితములైన యవలను నాకు ఒశంగుడు.
7) అన్నంచమే உక్షుచ్చమే వ్రీహయశ్చమే యవాశ్చమే.
ఆహారమును, అన్నము చేత ఆకలి బాధను పోగొట్టుటను, ప్రసిద్ధము లైన యవలు మాషములు, తిలలు, ముద్గములు మున్నగు ధాన్యములను, బార్లీలను నాకు ఒసంగుడు.
8) మాషాశ్చమే తిలాశ్చమే  ముద్గాశ్చమే ఖల్వాశ్చమే.
మినుములను, నూవులను, ముద్గములను, పెసలు కంటే పెద్దవిగా నుండు ధాన్య విశేషములను నాకు ఒసంగుడు.
9) గోధూమాశ్చమే మసురాశ్చమే ప్రియంగవశ్చమేஉణవశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమే.
గోధుమలను, ముద్గల వలె సూపమునకు పనికి వచ్చు వానిని, ప్రియంగవములను, సూక్ష్మమైన శాలి ధాన్యములను, గ్రామము లందలి ధాన్య విశేషములను, అరణ్యమందలి ధాన్యమును నాకు ఒసంగుడు.
అనువాకము 4 సమాప్తము.

అనువాకము 5 .
1) అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే, పర్వతాశ్చమే.
రాయియును, మట్టియును, పెద్ద కొండలును, కొండలును, నాకు అగు గాక.
2) సికతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే உయశ్చమే. 
ఇసుకలను, అశ్వత్థాది వృక్షములను, బంగారమును, వెండిని నాకు ఒసంగుడు.
3) సీసంచమే త్రపుశ్చమే, శ్యామంచమే లోహంచమే.
సీసమును, తగరమును, నల్లటి ఇనుమును, కాశ్య తామ్రాదులను నాకు ఒసంగుడు.
4) అగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధశ్చమ ఓషధయశ్చమే.
అగ్నిని, జలములను,  లతలను, ఓషధులను నాకు ఒసగుదు.
5) కృష్టపచ్యంచమే உకృష్ట పచ్యంచమే గ్రామ్యాశ్చమే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం.
దున్నబడిన భూమిలో పండింప బడిన దానిని, దున్న బడని భూమిలో పండిన దానిని,  గ్రామము లందలి పశువులను అరణ్యమునందలి పశువులను నాకొసంగుడు.అవి నిమిత్తమైన యజ్ఞముచే సమర్థములు అగు గాక.
6) విత్తంచమే విత్తిశ్చమే, భూతంచమే భూతిశ్చమే.
పూర్వులచే లబ్ధమైన ధనమును, తన జన్మలో రాబోవు ధనమును, ఐశ్వర్యముతో గూడిన పుత్రాదికమును, స్వకీయమైన ఐశ్వర్యాదికమును నాకు ఒసంగుడు.
7) వసుచమే  వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే.
నివాస సాధనమైన గవాదికమును, నివాసాధారమైన గృహాదికమును, అగ్నిహోత్రాది కర్మ జాతమును, కర్మాచరణమునకు అనుకూలమైన సామర్థ్యమును నాకు ఒసంగుడు. 
8) అర్థశ్చమ ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే.
ప్రయోజన విశేషమును, పొంద దగిన సుఖమును, ఇష్ట వస్తువును పొందుటకుపాయమును, ఇష్ట ప్రాప్తిని నాకు ఒసంగుడు.
అనువాకము 5 సమాప్తము.

అనువాకము 6. 
1) అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే.
నాయొక్క అగ్నియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క చంద్రుఁడును నాకు ఇంద్రుఁడు. నా యొక్క నాయొక్క సమస్తమును ప్రేరేపించు సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క సరస్వతియును నాకు ఇంద్రుఁడు.
2) పూషాచమ ఇంద్రశ్చమే, బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే.
నాయొక్క సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క వేద మంత్రార్థమును చెప్పు బృహస్పతియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క మిత్రః మిత్రుఁడగు సూర్యుఁడు నాకు ఇంద్రుఁడు. నాయొక్క వరుణ దేవు@డు నాకు ఇంద్రుఁడు అగు గాక.
3) త్వష్టాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే உశ్వినౌచమ ఇంద్రశ్చమే.
నా యొక్క త్వష్ట ప్రజాపతియును నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క బ్రహ్మయు నాకు ఇంద్రుఁడగు గాక. నా యొక్క విష్ణువున్ నాకు ఇంద్రుఁడగు గాక. నాయొక్క అశ్వినీ దేవతలును నాకు ఇంద్రుఁడు అగు గాక.
4) మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే. పృథివీచమ ఇంద్రశ్చమే,  உంతరిక్షంచమ ఇంద్రశ్చ మే.
నా యొక్క వాయువు నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క సమస్త విశ్వ దేవతలు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క భూదేవి నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క ఆకాశము నాకు ఇంద్రుఁడగు గాక.
5) ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే. ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే.
నా యొక్క స్వర్గము నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క దిక్కులు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క ఊర్థ్వ దిక్కును నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క విశ్చ కర్మ యను ప్రజా పతియును నాకు ఇంద్రుఁడు అగు గాక.
అనువాకము 6 సమాప్తము.

అనువాకము 7.
1) అగ్ ం శుశ్చమే  రశ్మిశ్చమే உదాభ్యాశ్చమే உధిపతిశ్చమ. 
సోమ గ్రహమును నాకు అగు గాక. రశ్మి గ్రహమును నాకు అగు గాక. అదాభ్య గ్రహమును నాకు అగు గాక. అధిపతి గ్రహమును నాకు అగు గాక.
2) ఉపాగ్ ంశుశ్చమే உంతర్యామశ్చమ ఐంద్ర వాయవశ్చమే మైత్రావరుణశ్చమ.
ఉపాంశువును నాకు అగు గాక. అంతర్యామమును నాకు అగు గాక. ఇంద్ర వాయువులకు చెందిన ఇంద్ర వాయవమును నాకు అగు గాక. మైత్రావరుణులకు చెందినవియును నాకు అగు గాక.
3) అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంథీచమే.
అశ్వినులును నాకు ఒసంగుము. ప్రతి ప్రస్థానమును నాకు అగు గాక. శుక్రమును నాకు ఒసంగుము. మంథీ యనునదియును నాకు ఒసంగుము.
4) ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే. వైశ్వానరశ్చమే.
ఆగ్రయణమును నాకొసంగుము. వైశ్వ దేవమును నాకు ఒసంగుము. ధృవగ్రహమును నాకొసంగుము. వైశ్వానరమును నాకు ఒసంగుము.
5) ఋతు గ్రహాశ్చమే உతి గ్రాహ్యాశ్చమే  ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే.
ఆరు ఋతువులును నాకు ఒసంగ బడును గాక. నవ గ్రహములును నాకొసంగబడుదురు గాక. మిక్కిలి గ్రహింప దగిన ఇతర గ్రహమును నాకొసంగబడుదురు గాక. ఇంద్రాగ్నుల కలయికయును నాకొసంగబడును గాక. వైశ్వ ద్ఫేవమును నాకొసంగభడును గాక.
6) మరుత్వతీయాశ్చమే మాహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే.
మరుత్వతీయములును నాకు అగు గాక. మహేంద్రమును నాకు అగును గాక. ఆదిత్యమును నాకు అగును గాక. సావిత్రమును నాకు అగును గాక. 
7) సారస్వతశ్చమే పౌష్ణశ్చమే పాత్నీవతశ్చమే హారియోజనశ్చమే.
సారస్వతమును నాకు ఒసంగుఁడు. పౌష్ణమును నాకు ఒసంగుఁడు. పత్నీవతమును నాకు ఒసంగుఁడు. హరియోజనమును నాకు ఒసంగుఁడు.
అనువాకము 7 సమాప్తము.

అనువాకము 8.
1) ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిష్ణీయాశ్చమే.
ఇధ్మమును నాకు ఒసంగుము. బర్హిస్సును నాకు ఒసంగుము. వేదిని నాకు ఒసంగుము. ధిష్టియములను నాకు ఒసంగుము.
2) స్రుచశ్చమే చమసాశ్చమే  గ్రావాణశ్చమే స్వరవశ్చమే.
స్రుక్కులను నాకు ఒసంగుడు.  చమసలను నాకు ఒసంగుడు.  గ్రావాణములను నాకు ఒసంగుడు.  ఒక విధమగు యజ్ఞాంగములను నాకు ఒసంగుడు.
3) ఉపరవాశ్చమే ధిషవణేచమే ద్రోణ కలశశ్చమే వాయవ్యానిచమే.
ఉపరవములును నాకు అగు గాక. అధిషవణములును నాకు అగు గాక. ద్రోణ కలశమును నాకు అగు గాక.వాయవ్యములును నాకు అగు గాక.
4) పూత భృచ్చమ అధవనీయశ్చమ ఆగ్నీధ్రంచమే హవిర్థానంచమే.
పూత భృత్తును నాకు ఒసగుఁడు.అధవనీయమును నాకు ఒసగుఁడు. అగ్నీధ్రవమును నాకు ఒసగుఁడు.  హవిర్ధానమును నాకు ఒసగుఁడు. 
5) గృహాశ్చమే సదశ్చమే పురోడాశాశ్చమే పచతాశ్చమే உవభృథశ్చమే స్వగాకారశ్చమే.
పత్నీశాలౌదులను  నాకు చేకూర్పుఁడు.సదస్సులను  నాకు చేకూర్పుఁడు.పురోడాశములను నాకు చేకూర్పుఁడు. శామిత్రాదులను  నాకు చేకూర్పుఁడు.అవభృధమును  నాకు చేకూర్పుఁడు.శంయువాకమును   నాకు చేకూర్పుఁడు. 
అనువాకము 8 సమాప్తము.

అనువాకము 9.
1) అగ్నిశ్చమే ఘర్మశ్చమే உర్కశ్చమే సూర్యశ్చమే.
చీయమానమైన అగ్నుయును నాకు అగును గాక. ప్రవర్గ్యమును నాకు అగును గాక. అర్కయాగమును సూర్య యాగమును నాకు అగును గాక.
2) ప్రాణశ్చమే உశ్వమేధశ్చమే పృథివీచమే உదితిశ్చమే.
ప్రాణాహుతి హోమమును నాకు ఒసంగుము. అశ్వమేథమును నాకు ఒసంగుము.పృథివిని నాకు ఒసంగుము. అదితిని నాకు ఒసంగుము. 
3) దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీ రంగుళమో దిశశ్చమే యజ్ఞేన కల్పంతాం.
దితియును స్వర్గమున్ వృషభ సంబంధమైనవియును  అంగుళి వలె నుండు విరాట్పురుషుని అవయవ విశేషములును దిశలును, విదిశలును అవన్నియును నా యొక్క యజ్ఞముతో స్వస్వవ్యాపార సమర్థములు అగు గాక.
4) ఋక్చమే సాషుచమే స్తోమశ్చమే యజుశ్చమే.
పద్య రూప స్తోత్రములతో నిండిన ఋగ్వేదమును  నాకు ఒసంగుఁడు.గానముతో మిళితమైన మంత్రములు గల సామ వేదమును  నాకు ఒసంగుఁడు.సోమావృత్తి రూప స్తోత్రమును  నాకు ఒసంగుఁడు.వచన రూప మంత్రమును గల యజుర్వేదమును నాకు ఒసంగుఁడు.
5) దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచమే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రధంతరేచమే యజ్ఞేన కల్పేతాం.
దీక్షను నాకు అగు గాక.  తపస్సును నాకు అగు గాక.  ఋతువును వ్రతమును నాకు అగు గాక.  రాత్రిందివములు కురియునట్టి వర్షముచే కలుగు సస్యమును నాకు అగు గాక. బృహత్తు రథంతరము అను సామములును నాకు అగు గాక. నా యజ్ఞముచే తమతమ వ్యవహారములందు సమర్థములు అగు గాక.
అనువాకము 9 సమాప్తము.

అనువాకము 10.
1) గర్భాశ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే.
కడుపులో నున్న ప్రాణులను నాకు ఒసంగుము. వత్సలను నాకు ఒసంగుము.ఒకటిన్నర సంవత్సరముల వయసు మగ గోవులను నాకు ఒసంగుము. అదే వయసు గల ఆడ గోవులను నాకు ఒసంగుము.
2) దిత్యవాట్చమే దిత్యౌహీచమే పంచావిశ్చమే పంచా వీచమే.
రెండు సంవత్సరముల వయసు గల ఋషభమును నాకు ఒసంగుము. రెండు సంవత్సరముల గోవును నాకు ఒసంగుము. రెండున్నర సంణ్వత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. రెండున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము.
3) త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌహీచమే.
మూడు సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడు సంవత్సరముల వయసు కల గోవును  నాకు ఒసంగుము.మూడున్నర సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము.
4) పష్ఠవాచ్చమే పష్ఠౌహీచమే ఉక్షాచమే వశాచమే.
నాలుగు సంవత్సరముల వయసు కల ఋషభమును  నాకు ఒసంగుము.నాలుగు సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. సేచన క్రియకు సమర్థమైన ఋషభమును నాకు ఒసంగుము. వంధ్య యైన గోవును నాకు ఒసంగుము.
5) మేవేహచ్చమే உనడ్వాంచమే ధేనుశ్చమ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతా మపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్ ం.శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతా మాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం.
వేహత్తును నాకు ఒసంగుము. శకట వాహనమునకు ఉపయోగ పడు ఋషభమును నాకు ఒసంగుము. ధేనువును నాకుఒసంగుము. ఆయువును నాకు ఒసంగుడు.ప్రాణ శక్తిని నాకు ఒసంగుడు. అపానమును నాకు ఒసంగుడు.వ్యాన శక్తిని నాకు ఒసంగుడు. చక్షు శ్శక్తిని నాకు ఒసంగుడు. శ్రోత్ర శక్తిని నాకు ఒసంగుడు. మనశక్తిని నాకు ఒసంగుడు. వాక్శక్తిని నాకు ఒసంగుడు. 
అనువాకము 10 సమాప్తము.

అనువాకము11.
1) ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ.
ఒకటి సంఖ్యకు ప్రతీకయగు ప్రకృతి నా పట్ల ప్రసన్న మగును గాక. మూడుకు ప్రతీకయైన ఇచ్చ్ఛా క్రియా జ్ఞాన శక్తులు(సరస్వతి.లక్ష్మి,పార్వతి)నాయందు ప్రసన్నమగును గాక. ఐదుకు ప్రతీకలైన పంచ భూతమును నాయందు ప్రసన్నమగును గాక. జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ధి యను ఏడును నయందు ప్రసన్నమగును గాక. నవ దుర్గలు నాయందు ప్రసన్నమగును గాక. నవద్వారములు కపాల బిలము మరియు నాభి బిలము అను పదకొండును నాయందు ప్రసన్నమగును గాక. పది దిక్కులును త్రిమూర్తులును నాయందు ప్రసన్నమగును గాక. శ్రోత్రాది పదులాలుగు నాడులు, సుషుమ్నాడి నాయందు ప్రసన్నమగును గాక. దశేంద్రియములును వాటికి తోడుగా ఉన్న సప్త ధాతువులును నాయందు ప్రసన్నమగును గాక. నవదశ ఓషధులును నాయందు ప్రసన్నమగును గాక.
2) ఏకవిగ్ ం  శతిశ్చమే త్రయోవిగ్ ం శతిశ్చమే పంచవిగ్ ం శతిశ్చమే  సప్తవిగ్ ం శతిశ్చమే నవవిగ్ ం శతిశ్చమ ఏకత్రిగ్ ం శతిశ్చమే త్రయస్త్రిగ్ ం శచ్చమే.
మనో జ్ఞాన కర్మేంద్రియమును (11) పంచ తన్మాత్రలు(5) పంచ భూతములు (5) అను 21 జీవ తత్వములకు చెందిన మర్మములువైద్య శాస్త్ర ప్రసిద్ధమైనవి నాకు అనుకూలముగానుండును గాక. జ్వరము మొదలుగా గల 23 రోగములు నాయందు ప్రసన్నమగును గాక. అప్సరాదులు 25 మందియు నా యందు ప్రసన్నమగుదురు గాక. చిత్రసేనాది 27 మంది గంధర్వులు నాయందు ప్రసన్నమగుదురు గాక. కృత్యాది విద్యుద్దేవతలు 29 మందీ నాయందు ప్రసన్నమగుదురు గాక. ఊర్ధ్వ లోకములు 7 అధో లోకములు 7వైకుంఠ, రాధా లోక, గోలోక, మణిద్వీప, మహాకాలపుర,శివపుర, గణేశ లోకములను ఉపస్వరగములు అను 7 అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ అవంతిక, ద్వారావతి యను 7 భూస్వర్గములును, కైలాస, మానస, మేరు వను 3 ఈ మొత్తము 31 నాయందు ప్రసన్నమగును గాక.   వసువులు 8మంది,రుద్రులు11 మంది, ఆదిత్యులు 12 మంది, అస్వినీ దేవతలు2, (ప్రజాపతి) యను 33 మంది దేవతలు నాయందు ప్రసన్నమగుదురుగాక.
3) చతస్రశ్చమే உష్టాచమే ద్వాదశచమే షోడశచమే  విగ్ ంశతిశ్చమే చతుర్విగ్ ం శతిశ్చమే உ ష్టావిగ్ ం శతిశ్చమే ద్వాత్రిగ్ ం శచ్చమే చతుశ్చత్వారిగ్ ంశచ్చమే உష్టౌచత్వారిగ్ ం శచ్చమే.
ధర్మార్థకామమోక్ష అను 4 విద్యలు నాయందు పేసన్నమగును గాక. అష్టవిధ ప్రకృతులు నాయందు ప్రసన్నమగును గాక. శిక్షాది వేదాంగములు 6 ను, ధర్మ శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 నాయందు ప్రసన్నమగును గాక.  దూర శ్రవణ దూర దర్శన విద్య1. జ్ఞానేంద్రియములకు చెందిన సిద్ధి విద్యలు5.కర్మేంద్రియములకు చెందిన సిద్ధివిద్యలు5. స్థాపత్య వేద సిద్ది1.ఫర్జన్య సిద్ధి1. జ్యోతిర్విద్య1. ఆయుర్విద్య1. పరోక్ష బ్రహ్మ విద్య1.
ఈ 16 నాయందు ప్రసన్నమగును గాక.  పంచ భూతములు సూక్ష్మ రూపముచే5 స్థూలరూపముచే5.  శబ్దస్పర్శాది విషయములు స్థూలము5 సూక్ష్మము5 ఈ20 నాయందు ప్రసన్నమగును గాక. పంచ భూతములు, శబ్దస్పర్శాదులు5 జ్ఞాన కర్మేంద్రియములు10 మనోబుద్ధి చిత్త అహంకారములు4 .ఈ 24 నాయందు ప్రసన్నమగును గాక. ఆవు, మేక మున్నగు భేదములతో 28 విధములగు సృష్టి నాయందు ప్రసన్నమగునుగాక. దేవసృష్టివిధములు 8 స్థావర సృష్టి విధములు 6 కౌమార మానస సృష్టి విధములు 2 జ్ఞాన కర్మేంరియ సృష్టి విధములు 10 అహంకార సృష్టి విధములు 3. సత్వ రజస్తమోగుణసృష్టి విధములు 3 ఈ 32 నాయందు ప్రసన్నమగును గాక. 36 అక్షరములు గల బృహతీ ఛందస్సు నాయందు ప్రసన్నమగును గాక. 40 అక్షరములు గల పంక్తి ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 44అక్షరములు గల త్రిష్టుప్ ఛందము నాయందు ప్రసన్నమగును గాక.  48 అక్షరములు గల జగతీ ఛందము నాయందు ప్రసన్నమగ్ను గాక.
4) వాజశ్చ ప్రసవశ్చాஉపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధాచ వ్యశ్నియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భౌవనశ్చభుపనశ్చాధిపతిశ్చ.
అన్నమును, ఉత్పత్తియును, మరల మరల ఉత్పత్తియును, భోగాది విషయకమైన సంకల్పమును, భోగాది సంకల్పము కలుగుటకు కారకుఁడైన ఆదిత్యుఁడును, ఆకాశమును, విశేషముగనంతటను వ్యాపించు ఆకాశమున సంభవించునదియును, అంతమున జనించునదియును, అంతమందున్నదియును, భువనమున ఉండునదియును, జగదాత్మకమును, అధిష్ఠించి పాలించు రాజును, నాకు సంభవించును గాక.
అనువాకము 11సమాప్తము.
చమకము - భావము -  సంపూర్ణము.

సమాప్తం

 


More Shiva