పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష (హి, హు, హే, హొ,డా, డీ, డూ, డే, డో )

ఆదాయం : 8, వ్యయం : 2 - రాజపూజ్యం: 7, అవమానం : 3

వీరికి ఈ సంవత్సరమంతయు శని అష్టమ, భాగ్యరాశులయందు సంచరించును కావున అనుకూలుడు కాదు. మిక్కిలి శ్రమకరమగు కాలము. ప్రయత్నించినను కార్యములు సానుకూలపడవు. ధనవ్యయమగును. ప్రమాదములు, అపనిందలు, గౌరవహాని కలుగును. మనోవ్యాకులత, కళత్ర పుత్ర మూలకవ్యధ కలుగును. సంవత్సరారంభము నుండి వైశాఖ శుక్లం వరకు ఏకాదశ గురువు అయినందున పరిస్థితులు అనుకూలించుటచే కీర్తివృద్ధి, బలము, తేజస్సు విరోధినాశనము కలుగును. పిమ్మట గురువు వ్యయ జన్మరాశులలో సంచరించును.

కావున ధనవ్యయము, స్థానచలనము కలుగును. పరిస్థితులు శ్రమకరముగ నుండగలవు. రాజానుకూలత లేకపోవుట, కీర్తిహాని కలుగును. ఆస్తిసంబంధ విచారము, వ్యాజ్యములు కలుగును. సంవత్సరారంభము నుండి వైశాఖ బహుళం వరకు తృతీయ కేతువు, భాగ్యరాహువు అగుటచే కొంత లాభము జయము ప్రోత్సాహము కలిగిననూ, మర్యాదాభంగము, పశునష్టము కలుగును. పిమ్మట ద్వితీయ కేతువు, అష్టమరాహువు అయినందున అకారణ కలహములు, అపనిందలు, చతుష్పాజ్జంతువుల వలన పీడ కలుగును. ప్రారంభమున నాలుగు మాసములు, సంవత్సరాంతమున రెండు మాసములు కుజానుకూలత లేనందున జాగ్రత్త అవసరము.

పునర్వసు వారికి, సంవత్సరారంభము నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభము నుండి కార్తిక బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరించుదురు. పుష్యమి వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరించును. ఆశ్లేష వారికి, మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు రాహువు సంచరించును. కావున జాగ్రత్త అవసరము. మొత్తము మీద వీరు నవగ్రహ శాంతియొనర్చిన మేలు. ఆదిత్యహృదయ పారాయణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజతో పాటు ప్రతి నెల తమ జన్మనక్షత్రము నాడు మరియు మాస శివరాత్రియందు పరమేశ్వర ప్రీతిగ మహన్యాస పూర్వక రుద్రాభిషేకము చేయుట మంచిది.

 


More Rasi Phalalu 2025 - 2026