బాలకృష్ణుని నామకరణం ఎలా జరిగిందంటే!

దుష్టశిక్షణ శిష్ఠరక్షణకు  యుగయుగానా జన్మిస్తానని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని గురించి ఆయన చెప్పిన మాటలు గురించి ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంత పరిపక్వత పొందుతుంది. అలాంటి శ్రీకృష్ణుడి మమకారం ఎలా జరిగిందంటే.. ఒకనాడు దేవకి, తన భవనంలోని, మేడమీద గది ముందరున్న విశాల ప్రదేశంలో నిల్చుంది. యధాలాపంగా ప్రకృతిని పరవశించి చూసే ఆమె ఆకాశాన్ని చూసింది. నీలాకాశం, కదిలే మబ్బులపై కళ్ళు పడ్డాయి ఇలాగే వుంటాడు నా పిల్లాడనుకుంది. అలాగ చూస్తు నిల్చుంది. వినీలాకాశంలో మబ్బులు చెల్లాచెదురయ్యే వరకు పిచ్చిదానిలా చూస్తూ నిలబడింది. ఆ మబ్బులు తమాషాగా ఓ పిల్లవాని ఆకారంగా కనబడటంతో మరింత ఆశ్చర్యపోయింది.

ఆ ఆకారంలో దేవకి  కాళ్ళు, చేతులు మరచిపోలేని కళ్ళు, ముఖం, స్పష్టంగా చూసింది. ఆ మేఘశ్యాముని తలచుకుని మురిసిపోయింది. ఆ సమయంలో గర్గాచార్యులవారు, వసుదేవుడు అక్కడికి వచ్చారు. ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు. కులగురువులు, దేవకి-యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూసారు.

మహర్షులు, పండితుల సూచన ప్రకారం ఆ పిల్లవాని పేరు, "క", "చ", "ఘ"లతో ప్రారంభమవ్వాలి. తమాషాగా దేవకి వూహించుకున్న వూహల "ఘనశ్యాముడే” ఆ పిల్లవాడి పేరయింది. దేవకి ఆరాధనలోని ఆంతర్యాన్ని గ్రహించిన వసుదేవుడు, ఆ మర్నాడు, మేఘశ్యాముని ప్రతిరూపంగా ఓ నల్లపాలరాతి విగ్రహాన్ని తెచ్చి ఆమెకిచ్చాడు. అందుకెంతో సంతోషపడిన ఆమె, ఆమె ఆరాధనను, ఆ విగ్రహంతో ప్రారంభించింది. ప్రాణప్రదం చేసుకుంది. దానికి ఘనశ్యాముడని పేరు పెట్టుకుని మురిసిపోసాగింది. ఈ బొమ్మ, అందులోని ఆమె ఆనందం, దేవకి వసుదేవులకు, గర్గులవారికి తప్ప మరెవ్వరికి తెలీదు.

అక్కడ గోకులంలో, తన పిల్లవానికి నామకరణ మహోత్సవం, నంద యశోదలు చేయదలిచారు. దానికి తగ్గట్లుగానే నందుని భవంతి, సభా ప్రాంగణం వగైరాలు అలంకరిస్తున్నారు. అద్భుత శోభలతో, మామిడి తోరణాలు, అరటి చెట్లతో అందరిని ఆహ్లాదపరుస్తుందా వాతావరణం, ఆ గృహశోభ.

కులగురువులు గర్గాచార్యులవారు, తమ పరివారంతో నందుని ఇంటికి వచ్చారు. "కుల గురువులను మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారు. నందుడు, కులగురువులను విలువైన బహుమతులతో గౌరవించాడు. యశోద తన ముద్దుల పిల్లవాడిని తెచ్చి కులగురువుల చేతిలో వుంచిది. గర్గులవారు తన అదృష్టంగా ఆ పిల్లవాడిని స్వీకరించి, పూజ చేయించారు. పాలు, తేనె నాకించారు. ఆచార వ్యవహారాల మధ్య ఆ బాలునికు "కృష్ణు"డని నామకరణం చేసారు. ఇలా కృష్ణుని నామకరణం జరిగింది.

                                  ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories