దుర్వాసునికి ప్రాణబిక్ష పెట్టిన అంబరీషుడు

AmbarIsha saved Doorvasa

 

భాగవతము, స్కంద పురాణాల్లో అంబరీషుని ప్రస్తావన ఉంది. అంబరీషుడు నాభాగుడనే రాజు కుమారుడు, గొప్ప విష్ణు భక్తుడు. కావడానికి రాజు అయినా ఎలాంటి ఆడంబరాలూ ఉండేవి కావు. ధనాన్ని చిల్ల పెంకులతో సమానంగా చూసేవాడు.

 

అశ్వమేధయాగము కూడా చేసిన ఈ రాజు, ఒకసారి ఏకాదశి వ్రతం పూర్తిచేసి, ఉపవాసం ఉన్నాడు. మర్నాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి, భోజనానికి కూర్చునే సమయానికి దుర్వాస మహర్షి వచ్చాడు. అప్పుడు అంబరీషుడు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి దూర్వాసుని భోజనానికి ఆహ్వానించాడు.

 

స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళిన దుర్వాసుడు, సూర్యాస్తమయం అవుతున్నా తిరిగిరాలేదు. ద్వాదశి ఘడియలు గడవక ముందు భోజనం చేసి దీక్ష విరమించకపొతే వ్రతభంగం అవుతుంది.

 

ఎంతకూ దూర్వాసమహర్షి రాకపోయేసరికి, వ్రత భంగం కాకుండా, అతిధికి అమర్యాద కలగకుండా ఏం చేస్తే బాగుంటుందని అంబరీషుడు పెద్దలను సలహా అడిగాడు.

 

తీర్థం సేవించి, దీక్ష విరమించమని పురోహితులు, పెద్దలు సలహా ఇచ్చారు. పెద్దల మాటను అనుసరించి అంబరీషుడు తీర్థం సేవించి, ఉపవాస దీక్ష విరమించాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన దుర్వాసుడు జరిగింది తెలుసుకుని, ''అతిథి సత్కారం తెలీదంటూ'' కోపంతో తన జటాజూటం నుంచి మహాకృత్య అనే రాక్షసిని సృష్టించి అంబరీషుని సంహరించమని ఆదేశించాడు.

 

అంబరీషుడు నిశ్చలంగా విష్ణుమూర్తిని ప్రార్థించేసరికి సుదర్శనము వచ్చి, దుర్వాసుని వెంట పడుతుంది. సుదర్శనం బారినుంచి తప్పించుకోవడానికి ముల్లోకాలు తిరిగిన దుర్వాసుడు చివరకు నారదుని సలహా మీద అంబరీషుని వేడుకోగా, అంబరీషుడు సుదర్శనాన్ని స్తుతించి, దూర్వాసుడికి ప్రాణభిక్ష పెట్టాడు.

 

ఆవిధంగా అంబరీషుడి పేరు మహాభక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోయింది.

 

hindu mythological character ambarisha, ambarisha devotee of lord vishnumurthy, ambarisha performed Yagnam, ambarisha expected blessings of sudarshana chakra, AmbarIsha, who saved Durvasa maharshi


More Purana Patralu - Mythological Stories