ఇంట్లో గంగాజలాన్ని ఏ దిక్కులో ఉంచాలో తెలుసా..

 

 


గంగాజలం.. భారతీయులకు గంగా నది అన్నా గంగా జలం అన్నా చాలా  భక్తి ఉంటుంది.  గంగానదిని, గంగా  జలాన్ని పవిత్తమైనదిగా భావిస్తారు. ఇంటిని శుద్ది చేసుకోవాలంటే గంగాజలం చల్లుతుంటారు. ఇది మాత్రమే కాకుండా గంగా నదిని దర్శించినప్పుడు గంగా జలాన్ని ఏదైనా ఒక బాటిల్ లేదా చిన్నపాటి క్యాన్ లలో తెచ్చుకుని ఇంట్లో పెట్టుంకుంటారు. అయితే గంగాజలాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి అనే విషయం చాలామందికి తెలియదు.  చాలా మంది ఏం చేస్తారంటే.. గంగాజలాన్ని దేవుడి గదిలో పెడుతుంటారు. అయితే గంగాజలాన్ని ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలో.. ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుంటే..


ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. పుష్కర జలాలలో స్నానం చేయడం చాలా పవత్రంగా భావిస్తారు.  ఆ పుష్కర జలాలలో అమృత బిందువులు కలిసి ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ పుష్కర జలాన్ని ఇంటికి కూడా తెచ్చుకుంటారు.  ఏదైనా పండుగ, శుభకార్యం అంటే ఈ గంగాజలం వాడతారు. ఇంటికి ఏదైనా అంటు, ముట్టు కలిశాక ఇంటిని శుద్ది చేసుకుంటే గంగాజలం చల్లి ఇంటిని సంప్రోక్షణ చేసుకుంటారు.  

వాస్తు ప్రకారం గంగాజలాన్ని ఇంటిలో దేవుడి గదిలో ఉంచితే మంచిది. గంగాజలాన్ని దేవుడి గదిలో ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం,  దేవతల శక్తి, పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందట.

కొంతమంది గంగాజలాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో వేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు. కానీ ఇది తప్పు.  ఇంట్లో గంగాజలాన్ని దేవుడి గదిలో ఉంచితే రాగి లేదా ఇత్తడి లేదా వెండి లేదా మట్టి పాత్రలో ఉంచాలట.

పుణ్యక్షేత్రాల నుండి గంగా జలాన్ని తీసుకుని రావడం అందరూ చేస్తారు. దాన్ని  పూజ గదిలో కూడా ఉంచుతారు. కానీ దాన్ని అలాగే పూజ గదిలో ఉంచడం కాదు..  వారానికి ఒకసారి,  పది రోజులకు ఒకసారి లేదా పండుగలు.. మొదలైనవి జరిగినప్పుడు  ఇల్లంతా శుభ్రం చేశాక గంగాజలాన్ని కొన్ని నీటిలో కలిపి ఇల్లంతా చల్లుకోవాలి.  ఇలా చేయడం వల్ల  ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది.  పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. అంతేకాదు.. వాస్తుప్రకారం ఇంట్లో గంగాజలం చల్లుకోవడం వల్ల వాస్తు సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయట.

                                  *రూపశ్రీ.
 


More Enduku-Emiti