పాదాలను తాకి నమస్కారం చేయడం వెనుక నిజాలు తెలుసా...

పాదాలను తాకి నమస్కారం చేయడం, ఆశీర్వాదం తీసుకోవడం హిందూ సంప్రదాయంలో శతాబ్దాల నాటి నుండి ఉంది. పురాణాలలో చెప్పబడిన దేవాదివేవతలు కూడా పాదాలను తాకి నమస్కారం చేసుకోవడం అనే ప్రక్రియకు అతీతులు కాదు. ఇది పెద్దల పట్ల ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే సాంప్రదాయ మార్గం. పాదాలను తాకడం వల్ల పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుందని, అదృష్టం వస్తుందని, తలపెట్టే పనులు కూడా సఫలం అవుతాయని అంటారు. అయితే ఇలా పాదాలను తాకి నమస్కారం చేయడం అనేది ఎంతవరకు సరైనది? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా? తెలుసుకుంటే..
హిందూ మతంలో పాదాలను తాకి నమస్కారం చేసుకునే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది పెద్దల పట్ల ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే సాంప్రదాయ మార్గమని అందరికీ తెలుసు. దీనితో పాటు పాదాలను తాకి నమస్కారం చేసుకోవడం వల్ల కలిగే అద్బుతమైన ఫలితం ఏమిటంటే..సానుకూల శక్తి మార్పిడి జరుగుతుంది. ఇది సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది మాత్రమే కాదు ఒక వ్యక్తి తన గురువుల పాదాలను తాకినప్పుడల్లా ప్రతిఫలంగా ఆశీర్వాదాలను పొందుతాడు. అంటే సంకల్పించే బలం పెరుగుతుంది. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు దాన్ని సాధించడంలో గురువులు, పెద్దవారి మనసు నుండి వెలువడిన మాటలకు శక్తి పెరిగి ఆ పని విజయం సాధించడంలో సహాయపడుతుంది. అలాగే కష్టాల సమయంలో ఆ కష్టాల నుండి బయటపడటంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పాదాలను తాకి నమస్కారం చేసుకోవడం వల్ల ఇంత ఫలితం లభించినా.. అందరి పాదాలను తాకడం ద్వారా ఇలాంటి ఫలితం అనేది లభించదని పండితులు చెబుతున్నారు. మత గ్రంథాల ప్రకారం పాదాలను తాకి నమస్కారం చేసుకోవడం అనేది మంచిదే అయినా.. కొన్నిసార్లు కొందరి విషయంలో ఇది చాలా చెడు ఫలితాలు ఇస్తుందని కూడా అంటున్నారు పండితులు. ఇంతకీ ఎవరి పాదాలను తాకడం మంచిది కాదు.. ఎందుకంటే..
పురాణాల ప్రకారం, మేనల్లుడు తన మేనమామ పాదాలను ఎప్పుడూ తాకకూడదట. ఇది అశుభం అంటున్నారు. శ్రీ కృష్ణుడు, కంసునికి సంబంధించిన వృత్తాంతాన్ని దీనికి ముడిపెట్టి చెబుతారు.
ఒక వ్యక్తి అపవిత్ర స్థితిలో ఉంటే లేదా అపవిత్రంగా ఉంటే పొరపాటున కూడా అతని పాదాలను తాకకూడదని అంటారు. ఇలా తాకడం వల్ల ఆ అపవిత్ర వ్యక్తిలోని అపవిత్రత పాదాలను తాకే వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది అంటారు.
ఒక వ్యక్తి పూజ చేస్తుంటే లేదా జపమాలతో జపిస్తున్నట్లయితే అతని పాదాలను తాకకూడదని అంటారు.
శివుడు దక్ష రాజు శిరస్సు నరికినప్పటి నుండి అల్లుడు తన మామగారి పాదాలను తాకే సంప్రదాయం కొనసాగుతోందని నమ్ముతారు. అయితే ఇది సముచితం కాదు కాబట్టి అల్లుడు తన మామగారి పాదాలను తాకకూడదని అంటారు.
గమనిక..
పై విషయాలు సోషల్ మీడియాలో పొందుపరిచిన పలు సమాచారాల నుండి సేకరించబడింది.
*రూపశ్రీ.



