LATEST NEWS
జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. అలా నోటీసులు అందుకున్న వారిలో జగన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి మావ మనోహర్ రెడ్డి, సోదరుడు అభిషేక్ రెడ్డి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా మరో ఐదుగురు సాక్షులకు నోటీసులు అందాయి. ఈ పది మందినీ కూడా గురువారం (డిసెంబర్ 5) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.   అయితే ఈ నోటీసులు వివేకా హత్య కేస దర్యాప్తులో భాగంగా కాకుండా వివేకానందరెడ్డి మాజీ పీఎ  కృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్ 15న చేసిన ఫిర్యాదు మేరకు జారీ చేశారు. వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి అలాగే సీబీఐ అధికారి రామ్ సింగ్ లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు తాజాగా జగన్ బంధువులు సహా పది మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వాస్తవానికి వివేకా హత్య కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు విధించిన గడువు ముగిసిపోయింది. దీంతో సీబీఐ విచారణ ఆపివేసింది. గడువు పెంచాలన్న సీబీఐ వినతిపై సుప్రీం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగానే వివేకా హత్య కేసు విషయంలో ఇటు దర్యాప్తు కానీ, అటు కోర్టుల్లో విచారణ కానీ జరగడం లేదు. అయితే ఇప్పుడు పోలీసులు వివేకా హత్య కేసులో తనను వేధిస్తున్నారంటే ఆయన మాజీ పీఏ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.  దీంతో ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆ విచారణలో ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగానే ఇప్పుడు జగన్ బంధువులు సహా పది మందిని పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.  
రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెదరాయుడి తీరు నడిచిందేమో కానీ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే భరించలేకపోతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు.  అధికారంలో ఉన్నంత వరకూ జగన్ చూసి రమ్మంటే కాల్చేసి వచ్చినట్లుగా తెగరెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయనో కలిసి నడిచిన నేతలు కూడా ఇప్పుడు వేరు దారి చూసుకుంటున్నారు.   మరో  వైపు జగన్ హయాంలో యథేచ్ఛగా అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్ హయాంలో జరిగిన అవకతవలక మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లోనే ఉన్నాయన్నది దర్యాప్తులో వెల్లడౌతుండటంతో.. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టుల నుంచి, అవినీతి, కుంభకోణాలు, హత్యల తీగ లాగే వరకూ అక్కర్లేకుండా ముట్టుకుంటేనే తాడెపల్లి డొంక కదిలిపోతున్నది. దీంతో జగన్ తో ఇంకా అంటకాగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు, కొందరైతే పార్టీకీ దూరమౌతున్నారు.   జగన్ కు సన్నిహితులుగా ఉన్న వారైతే ఉన్న పదవులకు సైతం రాజీనామాలు చేసేసి పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెడుతుంటే.. జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గతంలోలా ఆయన మాటలకు వంత పాడే వారు పార్టీలో కరవయ్యారు. అంబటి, పేర్ని వంటి ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారే కరవైన పరిస్థితి. ఇక పార్టీ క్యాడర్ ఇప్పటికే కకావికలైపోయింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు.   ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో  జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.     ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో  పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ  అజెండాగా  చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి జగన్ ప్రజలలోకి వస్తారని చెబుతున్నారు.   ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పార్టీ క్యాడర్ నూ, ప్రజలనూ పట్టించుకోని జగన్ ఇప్పుడు వారితో మమేకమౌతానంటూ ముందుకు రావడాన్ని వారు స్వాగతించే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.  వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో అత్యధికులు జగన్ తీరు కారణంగానే ఓటమి పాలయ్యామని బాహాటంగానే చాటారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలనూ, కార్యకర్తలనూ పూర్తిగా విస్మరించిన జగన్ క్షేత్ర స్థాయి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించారు. చెబుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ గళమెత్తారు.   ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు  జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. ఆ కేసు విచారణ, దర్యాప్తు నత్తనడకన నడవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వివరాలన్నీ సమర్పించాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ తరుణంలో పూర్తిగా చేతులు కాలిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ  నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీ కావడం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసిందంటే అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కారణమనడంలో సందేహం లేదు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పటికి అధికారంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మోడీ సర్కార్ విపక్షంగా వైసీపీ ఏపీలో బలపడటానికి తన వంతు సహకారం అందించారు.  అయిదేళ్ల జగన్ పాలన కారణంగా బీజేపీకి ఇంకా ఆ పార్టీకి వంత పాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో వైసీపీకి తెగదెంపులు తెచ్చి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు వల్ల ఏపీలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. అంతే కాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం రూపంలో బలమైన అండ కూడా లభించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ ఇప్పుడు తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. అయినా కూడా బీజేపీకి వైసీపీతో అనుబంధం వదులుకోవడానికి మనసు రావడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ ఎంపీతో అమిత్ షా భేటీని, ఆ భేటీ జరిగిన సమయాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.   తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విజయసాయి అమిత్ షా భేటీ అయిన సమయాన్ని బట్టి చూస్తుంటే... వైసీపీ అధినేతను ఆదుకోవడానికి, ఆయనను ఆపదలలోంచి బయటపడేయడానికి బీజేపీ ఇంకా తహతహలాడుతోందని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఇటీవలే అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. ఆ కేసులో జగన్ పేరు, ప్రస్తావన ఉంది.  సరిగ్గా ఈ తరుణంలో విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది.  జగన్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఆయన దూతగా విజయసాయి అమిత్ షాను కలిశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పైగా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హస్తిన పర్యటన జరిగిన వెంటనే ఉండటంతో తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అదానీ, జనగ్ అమెరికా కేసు విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడంతో బీజేపీ ఈ విషయంలో జగన్ కు సహకారం అందిస్తున్నదా? అందుకే పవన్ కల్యాణ్ ను అమెరికా కేసు గురించి మాట్లాడవద్దని సూచించిందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.  
భోపాల్  గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది. ఆ విషాదం నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తు.. పర్యావరణం, ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలకు తిలోదకాలిచ్చేస్తున్నాయి.  ముఖ్యంగా ఏమైనా విపత్తులు సంభవిస్తే సదరు కంపెనీలే పూర్తి బాధ్యత వహించాలన్న దిశగా ఇప్పటికీ చట్టాలు లేకపోవడం దారుణం.  1884 డిసెంబర్ 3వ  భోపాల్లో  యూనియన్ కార్బైడ్  ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసనియేట్ వాయువు లీకైంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న  చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిద్రలోనే ఈ విషవాయువు ను పీల్చడంతో కళ్లు విపరీతంగా మండడంతో ఇళ్లు నుంచి బయటకు వచ్చారు.ఊపిరి తిత్తులలోకి ఈ వాయువు వెళ్ళడంతో ఆస్పత్రులకు పరిగెత్తారు. మధ్యలోనే రోడ్లపై ప్రాణాలు వదిలారు. తెల్లవారేసరికి నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. విషవాయువు పీల్చి మరణించిన వారి సంఖ్య  పాతిక వేలకు పైనే ఉంటుదన్నది ఒక అంచనా, మృతులే కాకుండా మరో ఆరు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఇప్పటికీ వారిని ఆ పీడ వదలలేదు. అప్పుడు గర్భవతులు గా ఉన్న తల్లులు కన్న పిల్లలు ఇప్పటికీ అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. వారి తరువాత తరాల వారు కూడా అనేక రోగాలతో బాధపడుతునే ఉన్నారు. అత్యంత దారుణమేమంటే ప్రమాదం జరిగిన వెంటనే 6వతేదీ అమెరికా నుంచి ఆ కంపెనీ చైర్మన్ వారెన్ అండర్సన్ భోపాల్ వచ్చారు.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిధి గృహంలో బంధించారు. కేవలం మూడు వేల మంది చనిపోయారని,1.2లక్షల మంది అస్వస్థతకు గురైనారని అంచనా వేసి1989లో నష్టం పరిహారం 47కోట్ల డాలర్లతో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ ఈ  గ్యాస్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కంపెనీ సరిగా వెల్లడించలేదు. అ  అండర్సన్ వెంటనే  స్వదేశానికి తిరిగి వెళ్లేలా  అమెరికా ప్రభుత్వం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ఒత్తిడి తీసుకువచింది. దీంతో   కేవలం నామమాత్రపు పూచికత్తుపై బెయిల్ తీసుకుని అండర్సన్  విమానంలో అమెరికా వెళ్లిపోయాడు.పరిహారం నామమాత్రమే పుట్టడంతో బాధితులు కోర్టులు,అంతర్జాతీయ సంస్థలు చుట్టూ తిరిగినా ప్రయోజనం కలగలేదు. అండర్సన్ భారత్ వైపు తిరిగి చూడలేదు. కంపెనీ నష్టపరిహారం ఒప్పందం మించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి.  ఆ కర్మాగారం మూతపడినా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. నిజానికి మిథైల్ ఐసోసనియేట్ వాయువు సైనేడ్ అంత ప్రమాదమని అనంతర పరిశోధనలలో తేలింది.ఈ ప్రమాదం అనంతరం జన్మించిన అనేక మంది పిల్లలు వికలాంగులుగా పుట్టారు.శిశు మరణాల రేటు భోపాల్ లో ఇప్పటికీ అధికంగానే ఉంది. మూడు తరాలు మారినా అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.నేటికీ న్యాయంకోసం ప్రధాని మోడీకి కన్నీళ్లతో విజ్ఞాపనలు పంపేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క కంపెనీ నిర్లక్షమే ఇంతటి వినాశనం సృష్టిస్తే భారత్ కు కుప్పలుతెప్పలుగా వస్తున్న కంపెనీలు ఎంతవరకూ క్షేమదాయకమో ఊహించలేం.ఉన్న స్వదేశీ కంపెనీలే విషాన్ని కక్కుతుంటే కాలుష్య నియంత్రణ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ మందుల తయారీ కంపెనీలు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిషిద్ధ వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. అయినా అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.అదే విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా ఉంటారా అనేది అనుమానమే. అలాంటి పరిస్థితి రాకుండా కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు చేపట్టేలా అధికారులు,ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకునేలా చట్టాలు రావలసిన అవసరం ఉంది.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో  అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెళ్లడించారు. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.  అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా శాశ్వత నివాసాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇందు కోసం ఇటీవల వెలగపూడి లో పాతికవేల  చదరపు గజాల స్థలాన్ని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. రాష్ట్ర ల్యాండ్ పూలింగ్ పథకం కింద ముగ్గురు రైతుల నుండి కొనుగోలు చేసిన ఈ భూమి   గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలకు సమీపంలోనే ఉంది.  ఈ ప్లాట్‌కు నాలుగు వైపులా రహదారి సౌకర్యం ఉంది.  అలాగే  సీడ్ యాక్సెస్ మార్గానికి అనుసంధానమై ఉంది. దాదాపు 5.5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ నివాసంలో పార్కింగ్ సౌకర్యాలు, సిబ్బందికి వసతి కల్పించనున్నారు. సన్నాహక భూ పరీక్షలు  జరుగుతున్నాయి మరియు త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.  
ALSO ON TELUGUONE N E W S
Cast: Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Rao Ramesh, Sreeleela, Jagapathi Babu, Jagadeesh, Ajay  Crew:  Written by Sukumar, Srikanth Vissa Cinematography by Miroslaw Kuba Brozek Editing by Navin Nooli Music by Devi Sri Prasad, Sam CS (BGM), Ajaneesh Loknath (BGM - few portions)  Direction by Sukumar  Produced by Naveen Yerneni, Ravi Yalamanchali  Plot:  Pushpa Raj(Allu Arjun) becomes huge as syndicate head. Bhagawant Singh Shekhawat(Fahadh Faasil) plots to arrest him but fails. Pushpa tries to get a photograph from CM with the help of MP Siddappa(Rao Ramesh). But CM rejects and Pushpa decides to change CM and put Siddappa in his place.  He decides to deal directly with the biggest buyer for Rs.5000 crores. Bhagawant Singh starts to attack the syndicate members and kills one. Now, Pushpa is forced to apologise to Bhagawanth. While he decides to apologize upon Srivalli(Rashmika Mandanna)'s insistence but he reacts in his own way. What did he do? What did Syndicate decide after that? What did Shekhawat decide? Watch the movie for answers.  Analysis: Allu Arjun did give his career best performance once again. This time, he got an opportunity to explore a different angle in his performance and he did give his best. Jathara episode and his performance will be remembered for a long time.  Rashmika Mandanna seems to have been asked to overreact way bit more. She annoys at times. Sreeleela song is shot well but doesn't have Oo antava impact. Rao Ramesh is good and Jagapathi Babu did his best. Fahadh Faasil is one of the best performers and he is able to handle psychotic character very well with comedy and terrifying screen presence.  The problem lies in second half writing where after Jathara episode, the movie starts to drag for part-3. Sukumar could have easily avoided such ambition and only add it aa a new challenge. But he drags the same sequence till climax with same output.  The cinematography, grand production values, background score does give the movie the massive scale it desires. Cat and mouse game between Fahadh and Allu Arjun really keeps us interested. Had Sukumar did not try to force Part-3 and added a little bit more spicyness to confrontational scenes, movie would have been even better.  In Conclusion:  Allu Arjun's one man show makes it a one-time watch.  Rating: 2.75/5
ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 పండుగ మొదలైంది. డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు కూడా పూర్తయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ లభిస్తోంది. (Pushpa 2 The Rule) అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ మెచ్చేలా డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని మలిచాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ అదిరిపోయాయట. ఫస్ట్ హాఫ్ ని ఎక్కువగా డ్రామాతో నడిపించిన సుకుమార్.. సెకండ్ హాఫ్ ని మాత్రం అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో నడిపించాడని అంటున్నారు. ముఖ్యంగా 20 నిమిషాల జాతర ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని, ఇది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిందని టాక్. అయితే పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ పీక్స్ అని, మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో బన్నీ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో పీలింగ్స్ సాంగ్, సెకండ్ హాఫ్ లో కిస్సిక్ సాంగ్ ఒక ఊపు ఊపాయట. మొత్తానికి ఇది ఫ్యాన్స్ ని, మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని.. లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన హిట్ మాస్ బొమ్మ అని టాక్ వస్తోంది.
మూడేళ్ళ నిరీక్షణకు తెర పడింది. పుష్ప-1 కి కొనసాగింపుగా రూపొందిన పుష్ప-2 మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. నిజానికి ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5 కాగా, డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ పూర్తయింది. (Pushpa 2 The Rule) పుష్ప-2 ఫస్ట్ హాఫ్ కి అదిరిపోయే టాక్ వస్తోంది. నిడివి 100 నిమిషాలు ఉన్నప్పటికీ, బోర్ కొట్టకుండా వందకి వంద శాతం ఫ్యాన్స్ సంతృప్తి చెందేలా డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ ని మలిచాడని, డ్రామా బాగా పండిందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ పీక్స్ అని, మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ లో బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ అంటున్నారు. పీలింగ్స్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఉందని, ఇది ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ కి ట్రీట్ అని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఫస్ట్ హఫ్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.
ప్రస్తుతం దేశమంతా పుష్ప2 మేనియాలో ఉంది. మరికొద్ది గంటల్లో పుష్పరాజ్‌ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డిసెంబర్‌ 5న ఈ సినిమా రిలీజ్‌ అవుతుండగా, ఒకరోజు ముందే అంటే డిసెంబర్‌ 4 రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ప్రారంభం కాబోతున్నాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అవుతున్న పుష్ప2 ఇప్పుడు అన్నిచోట్లా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని నెలలుగా బన్నీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కొన్ని మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియాలో వార్‌ జరుగుతోంది. అల్లు అర్జున్‌ కొత్త సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో దానికి మెగా అభిమానుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంటుందోననే ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. అసలు సినిమా రిలీజ్‌ అనేది సజావుగా జరుగుతుందా లేదా అనే సందేహం కూడా అందరికీ కలిగింది. కానీ, అనూహ్యంగా ఈరోజు హీరో సాయిధరమ్‌తేజ్‌ ‘పుష్ప2’ టీమ్‌కి విషెస్‌ చెబుతూ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వాలని ఆశిస్తూ బన్నికి, సుకుమార్‌కి, యూనిట్‌లోని సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్‌ వేశారు.  తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ట్విట్టర్‌ ద్వారా తన సందేశాన్ని పంపారు. అయితే ‘పుష్ప2’ పేరును ప్రస్తావించకుండా ట్వీట్‌ వేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘24 క్రాప్ట్స్‌ కష్టంతో, వందల మంది టెక్నీషియన్స్‌ శ్రమతో, వేల మందికి ఉపాధి కల్పిస్తూ కోట్ల మందిని అలరించేదే సినిమా. అందుకే ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినిమా అభిమానినీ కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. మెగా అభిమానుల వల్ల ‘పుష్ప2’ చిత్రానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని ముందు నుంచీ అందరూ భావిస్తున్నారు. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగానే నాగబాబు ఈ ట్వీట్‌ చేశారని అర్థమవుతోంది. ‘పుష్ప2’ పేరును ప్రస్తావించకపోయినా ఈ ట్వీట్‌ ద్వారా మెగా అభిమానులు సంయమనం పాటించాలని పరోక్షంగా చెప్పారనేది స్పష్టంగా తెలుస్తోంది. 
Lucky Baskhar starring Dulquer Salmaan became a huge blockbuster after releasing for Diwali. The movie created a huge sensation at the box office by collecting over Rs.100 crores at the worldwide box office.  Writer-director Venky Atluri transported everyone to 90's with his incredible writing and execution. Each and every craft worked to the perfection to make this movie memorable in theatres. GV Prakash Kumar's music and major theatrical moments have contributed immensely to its success.  After being a grand success in theatres, the movie released on OTT platform, Netflix, for an overwhelming positive response. The movie created new records with 5.1 Million views in its debut week. Also, the movie is trending on Top 1 position in India and Top 2 worldwide and in Top 10 in 20 nations.  Producers Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are happy with this thunderous response and Lucky Baskhar is continuing his winning ways.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఈ నెల ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.పైగా ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్ షోస్ తో పాటు బెనిఫిట్ షోస్ కూడా పడనున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా  సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇక పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(pitapuram)నియోజక వర్గంలో కొంత మంది పుష్ప వాల్  పోస్టర్స్ ని  చించి వెయ్యడం జరిగింది.మరొకొన్ని గంటల్లో స్క్రీన్ పై సినిమా పడనుండగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే మెగా ఫ్యాన్స్ నే   పోస్టర్స్ ని చించారని అంటున్నారు. మరి ఈ  విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.    
తోటి డాన్సర్ పై లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ప్రముఖ డాన్సర్ జానీ మాస్టర్(jani master)ఇటీవలే బెయిల్ పై  విడుదలైన విషయం తెలిసిందే. 2009 లో సినీరంగ ప్రవేశం చేసిన జానీ మాస్టర్ తెలుగు,తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకి  కొరియోగ్రఫీ ని అందించి   మంచి పేరు సంపాదించాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన 'తిరు' మూవీకి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. కానీ కేసు నమోదయిన దృష్ట్యా కమిటీ వాళ్ళు అవార్డుని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక జానీ మాస్టర్ కి ఇప్పుడు కొత్తగా ఒక సినిమాకి డాన్స్ మాస్టర్ గా అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది.బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావన్(varun davan)కీర్తి సురేష్(kirthi suresh) హీరో హీరోయిన్లుగా హిందీలో బేబీ జాన్(baby john)అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.తమిళంలో విజయ్(vijay)హీరోగా వచ్చిన తేరి(teri)కి రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పుడు ఈ మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ సమకూరుస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.  
తమిళ బ్లాక్ బస్టర్ 'డా..డా' మూవీని తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఆ సంద‌ర్భంగా తాజాగా ‘పా.. పా..’ మూవీ ట్రైల‌ర్‌ను ప్రముఖ డైరెక్ట‌ర్ మారుతి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ.. త‌మిళ సెన్సేష‌న‌ల్‌ మూవీ ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ పేరిట విడుద‌ల‌వ్వ‌డం సంతోషంగా ఉంద‌ని, ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఈ స‌బ్జెక్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంద‌న్నారు. ‘పా.. పా..’ చిత్ర‌యూనిట్‌కు ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపారు. గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. హార్ట్ టచ్ అయ్యే పాటలు ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటి పాపులర్ సాంగ్స్ మాదిరిగానే ఈ సినిమా పాటలు స్థిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలోని పాటలు చాలా హైలెట్ గా నిలుస్తాయని అన్నారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. భావోద్వేగం, ప్రేమ, కామెడీ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్టు అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు.
2003 లో రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)దర్శకత్వంలో వచ్చిన 'కంపెనీ' సినిమా ద్వారా బాలీవుడ్ లోకి చిత్ర రంగ ప్రవేశం చేసిన నటుడు వివేక్ ఒబెరాయ్(vivek oberoi) ఆ తర్వాత సాతియా,ఓంకార,మస్తీ,కాల్,రోడ్,క్రిష్ 3 వంటి సినిమాల్లో నటించి అగ్ర హీరో రేంజ్ ని సంపాదించాడు.తెలుగులో కూడా పరిటాలరవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రక్త చరిత్ర'లో రవి క్యారక్టర్ లో సూపర్ గా చేసి తెలుగు ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు.రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామతో పాటు తమిళ మూవీ వివేగం లో కూడా విలన్ గా నటించి తన సత్తా చాటిన వివేక్  కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకి దూరంగా ఉంటూ అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ  వ్యాపారంపైనే పూర్తి  దృష్టి పెట్టాడు.   రీసెంట్ గా వివేక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో మాట్లాడుతూ 2007 లో'షూట్ అవుట్ ఎట్ లోకండవాలా'లో నటించాను.సినిమా హిట్ అవ్వడంతో పాటుగా అందులోని 'గణపత్' సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో వరుస అవకాశాలు వస్తాయని ఆశించాను.కానీ ఒక్క అవకాశం కూడా రాకపోయే సరికి పదిహేను నెలల పాటు ఇంట్లోనే కూర్చున్నాను.దాంతో కేవలం సినిమాల మీదే  ఆధారపడకూడదని నిర్ణయించుకొని వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాను.ఇండస్ట్రీలోని ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు.అందుకే ప్లాన్ బి ని కూడా లైన్ లో పెట్టుకోవాలి. నటన అంటే ఇష్టం కాబట్టి ఈ పరిశ్రమకి వచ్చాను. అంతే గాని మధ్యవర్తుల లాబీయింగ్ నా భవిష్యత్తుని నిర్ణయించాలని కోరుకోలేదు.అందుకే జీవనోపాధి కోసం వ్యాపార రంగంలోకి వెళ్లాలని నిర్ణయంచుకున్నాను.ఆర్ధికంగా స్థిరపడడానికి ఇది నాకు మంచి తోడ్పాటుని అందించిందని చెప్పుకొచ్చాడు.ఇక ఈ ఏడాది రిలీజైన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్' లో వివేక్ ఒక కీలక పాత్ర పోషించి ఆ సిరీస్ ఘన విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు.       
ప్రముఖ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న దురాగ‌తాలపై తెరకెక్కుతోన్న సినిమా అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఈ సినిమాపై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ణ పూర్త‌య్యింది. అదే ఎన‌ర్జీతో మేక‌ర్స్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ అప్‌డేట్ ఇస్తూ సెట్స్ నుంచి ఓ స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోలో అప్పటి స్టార్ హీరోయిన్ భూమిక‌ మ‌న‌కు క‌నిపించారు. సెట్స్‌లో ఆమె మేక‌ప్ వేసుకోవ‌టం, షూటింగ్‌లో పాల్గొన‌టం వంటి స‌న్నివేశాల‌ను మ‌నం ఆ వీడియోలో చూడొచ్చు. ఆమె రాక‌తో ఆ సెట్స్‌కు మ‌రింత ఉత్సాహం వ‌చ్చింది. ఈ గ్లింప్స్ వీడియోలో డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌ ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. 20 ఏళ్ల క్రితం గుణ శేఖ‌ర్‌, భూమిక సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఒక్క‌డు' మూవీ కోసం క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. యుఫోరియా కోసం మ‌రోసారి ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో చేతులు క‌లిపింది. భూమిక‌ను దృష్టిలో ఉంచుకుని గుణ‌శేఖ‌ర్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు విడుద‌ల చేసిన గ్లింప్స్ చూస్తుంటే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో భూమిక ఎలా మెప్పించ‌నున్నారోన‌ని ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇంకా ఈ చిత్రంలో సారా అర్జున్‌, నాజ‌ర్‌, రోహిత్‌, విఘ్నేష్ గ‌విరెడ్డి, లికితా య‌ల‌మంచిలి, అడ్డాల పృథ్వీరాజ్‌, క‌ల్ప‌ల‌త‌, సాయిశ్రీనికా రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వ‌ర్గీస్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వి ప్ర‌కాష్‌, న‌వీన్ రెడ్డి, లికిత్ నాయుడు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో యుఫోరియా చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.పోత‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిటర్‌. కాల భైర‌వ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.  ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయం తో ముడి పడి.. పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది.  ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి.  పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు.  అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అసలు మ్యారేజ్ సర్ఠిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్ళి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా ప్రతి జంట మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. వివాహ ధృవీకరణ పత్రం.. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక,  పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫొటో ప్రభుత్వానికి సమర్పించాలి.  ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది.  ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది.  ఇందులో ఎవరూ మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. ఇప్పటి భార్యాభర్తలు భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్ తో ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసే వారు అయితే వారు విదేశాలకు వెళ్లాలనే ప్లానింగ్ తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి.  మ్యారేజ్ సర్టిఫికెట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు,  జీవిత భీమా, భీమా సౌకర్యాలు,  బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ,  ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు.  అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం.  ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులపై తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.  అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమే చాలా పోరాడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం.  ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు.  రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్టవిరుద్ధమైనవిగా సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహాల చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. కొన్ని సార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతుంటారు.  వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా.. సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతుంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.                                                 *రూపశ్రీ.  
  ఏ దేశానికయినా అన్నివైపుల నుంచి రక్షణ కల్పించటానికి భద్రతా దళాల పాత్ర చాలా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ దేశాల స్థితిగతులు, విధివిధానాల వల్ల  మన దేశ భద్రత పరంగా, ఆర్ధికపరంగా  భారత నేవీ పాత్ర ముఖ్యమైనదిగా  మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటంలో సముద్రమార్గాల ద్వారా  జరిగే వాణిజ్య రవాణా  కీలకమవుతుంది. ఒక పక్క రవాణా  సజావుగా సాగేలా చేస్తూ,  ఇంకో పక్క విదేశీ శక్తులనుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన  నేవీ ఎంతో గొప్పది.      1971లో భారతదేశానికి, పాకిస్థానుకి  మధ్య  జరిగిన యుద్ధంలో  డిసెంబర్ నాలుగో తేదీన   ట్రైడెంట్ ఆపరేషన్లో  వీరోచితంగా పొరాడి, భారత నేవీ గొప్ప విజయాన్ని  సాదించింది. ఆ యుద్ధంలో  భారత నేవీ  పాకిస్థాన్ ప్రధాన పోర్ట్ నగరమైన  కరాచీపై ధైర్యంగా దాడి చేసింది. ఇది ఒక ప్రధాన సైనిక విజయమే కాకుండా, భారత నేవీకి ఉన్న  శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. అందుకే దేశ రక్షణలో వారి పాత్రను, త్యాగాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. మన దేశ  భద్రత కోసం ప్రాణత్యాగాలు చేసి, దేశ రక్షణ కోసం  సముద్ర సరిహద్దులను అహర్నిశలు కాపుకాసి మన నౌకాదళం చేస్తున్న కృషిని, వారు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవటానికి జరుపుకునే  నేవీ డే చాలా ప్రత్యేకమైనది.  నౌకాదళ ప్రాముఖ్యత -పాత్ర: భారత దేశం  విస్తృతమైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇంత పొడవైన  తీరప్రాంతాన్ని రక్షించటంలోనూ,   మన దేశానికి చెందిన సముద్ర ప్రాంతంలో  శాంతిని  కాపాడడంలోనూ,  సముద్ర మార్గాలను పర్యవేక్షించి,   వాణిజ్య  మార్గాలకి  భద్రత కల్పించటంలోనూ,  ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ, అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ  భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంది.  ప్రతి సంవత్సరం, భారత నౌకాదళం తన వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఓ థీమ్‌ను ఎంచుకుంటుంది. వీటిలో.. రక్షణ, సాంకేతిక అభివృద్ధి, సముద్ర భద్రత వంటి అంశాలపై అవి కేంద్రీకృతమవుతాయి. 2024 సంవత్సరానికి "ఆవిష్కరణ, స్వదేశీకరణ ద్వారా  నౌకాదళ శక్తిని, బలాన్ని పెంచుకోవటం." అనే థీమ్‌ను ఎంచుకోబడింది.  ఇప్పటి నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను కలిగిన మిస్సైల్స్, ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలను కలిగి ఉంది. భారత నావికాదళంలో INS విక్రాంత్, INS అరిహంత్ వంటి సమర్థవంతమైన  యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి మన దేశ భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి నేవీ డే వేడుకలు:  నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.  వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు నౌకాదళానికి నివాళులు అర్పిస్తారు.  గౌరవనీయులంతా  జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సముద్రతీర రక్షణలో  కీలకమైన నౌకాదళ అధికారులను గౌరవించడమే కాకుండా, దేశ భద్రత కోసం సముద్రంలో  ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన, పనిచేస్తున్న వీర  సైనికులని గుర్తించి, గౌరవిస్తారు. మాజీ నావికుల సేవలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భారత నౌకాదళ  సైనికుల త్యాగాలను, నిబద్ధతను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాలతో  నేవీ డే ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ప్రజలకు ప్రదర్శనకు అందుబాటులో ఉంటాయి. నేటి విద్యార్థులు, యువతకి భారత నౌకాదళ గొప్పతనం గురించి, దేశ రక్షణలో దాని ప్రాముఖ్యత గురించి  అవగాహన కల్పించటం ద్వారా  నేవీ పట్ల ఆసక్తి కలిగేలా చేయటానికి ఇదొక అవకాశం.  భారత నౌకాదళానికి లాల్ సలామ్..!!                                         *రూపశ్రీ.  
  “నన్ను నా సామర్ధ్యం నుంచి తెలుసుకో, నా  వైకల్యం నుంచి కాదు”  -  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈ లోకంలో ప్రతీ తల్లీతండ్రీ తమకి  పుట్టే  బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలనే ఆశపడతారు. అలా ఇవ్వమనే  భగవంతుణ్ణి ప్రార్దిస్తారు. కానీ చాలా కారణాల వల్ల కొన్నిసార్లు పిల్లలు రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు చాలామటుకు ఈ లోకంలోకొచ్చిన మొదటి క్షణం నుంచే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎంతో వివక్షని ఎదుర్కొంటారు. పెద్దయ్యేవరకూ ఇదే వివక్ష కొనసాగిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మన సమాజంలో భాగమేనని, వారికీ సామర్ధ్యాలు ఉంటాయని  గుర్తించి, వాళ్లపై వివక్ష చూపించకుండా వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది.  అందుకే వికలాంగుల హక్కులపై అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన   ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా, 1992 నుంచి డిశంబర్3వ తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా  జరపటం మొదలుపెట్టింది. ఈ రోజు, సమాన అవకాశాలు, అందుబాటు, సమగ్రత యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ, వికలాంగుల విజయాలు గురించి, సమాజానికి వారు చేసిన  సేవలని గురించి ప్రశంసిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు3న జరుపుకునే వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఒకో ఏడాది ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రవేశపెడుతుంది. "వికలాంగుల నాయకత్వాన్ని పెంపొందించి, సమగ్రత,  స్థిరమైన భవిష్యత్తుకు దారితీయడం." ఇది ఈ ఏడాది థీమ్.  ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల విలువైన పాత్రను,  నాయకత్వాన్ని ఇది గుర్తిస్తుంది. అలాగే, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారిని  చేర్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఈ రోజు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన కలిగించడం,  సమాజంలోని అన్ని రంగాల్లో సమానంగా, సంపూర్ణంగా పాల్గొనేలా వారిని  కూడా  ప్రోత్సహించడం కోసం ఒక  వేదికగా పనిచేస్తుంది. వికలాంగుల జీవితాలను మెరుగుపరిచి, వారికి తగిన గౌరవం ఇవ్వటంలో  ప్రభుత్వాలు, సంస్థలు,  సమాజానికి అవకాశాన్ని అందిస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమానికి  మద్దతు ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత.  వివిధ మార్గాల్లో ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని వారి అభివృద్ధికి సాయపడవచ్చు.  అందులో కొన్ని తెలుసుకుంటే..  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం:  వికలాంగులకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వర్కుషాపులు నిర్వహించటం ద్వారా ప్రజలకి వారి సమస్యలపై అవగాహన తెప్పించవచ్చు. వైకల్యం అనేది కేవలం  బయటకి కనిపించేది మాత్రమే కాదు, బయటకి కనిపించని (ఆటిజం, డిస్లెక్సియా, డిస్కాల్కులియా) వైకల్యాలు కూడా ఉంటాయని పాఠశాల స్థాయినుంచే గుర్తించి, అటువంటివారి అభివృద్ధి కోసం మనం అందించగలిగే సహకారం ఏమిటనేది అందరికీ అవగాహన కల్పించాలి.   విజయాలను గుర్తించటం:   పుట్టినప్పటి నుంచో లేక ప్రమాదం వల్లనో వైకల్యం వచ్చినప్పటికీ, కఠిన పరిస్థితులకి తలొగ్గకుండా, ఏ వైకల్యం  మమ్మల్ని ఆపలేదని నిరూపిస్తూ,  విజయాలు సాధించిన ఎంతో మంది వికలాంగుల విజయాలను గుర్తించి ప్రశంసించాలి. అప్పుడే అలాంటివారిని చూసి మిగిలిన వారికి ప్రేరణ కలుగుతుంది.  జీవిత అనుభవాలు చెప్పించటం:   ఈ వివక్ష చూపించే సమాజంలో తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ,  వికలాంగుల అనుభవాలను పంచుకుని అవగాహన పెంచవచ్చు. టెక్నాలజీ,  విధానాలలో మార్పులు తీసుకురావటం:  వికలాంగులు కూడా మనలాగే  రోజువారీ జీవితాన్ని గడపగలగాలంటే,   వికలాంగులకి తగిన మౌలిక సదుపాయాలు, రవాణా,  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించటం ద్వారా వారు కూడా మనలాగే  అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సమాజంలోని  వైద్య, విద్య, రవాణా సంస్థల్లోనూ,  వారు పని చేసే సంస్థల్లోనూ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావటం, వారికి ఉపయోగపడే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటం వంటివి చేయాలి.  అప్పుడే ఉద్యోగుల వృత్తిపరమైన అవసరాలు తీరి వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగమవుతారు.  వికలాంగుల సంస్థలకు మద్దతు ఇవ్వటం:  వికలాంగుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేయండి లేదా సహాయం చేయండి. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, గ్లోబల్ నుండి లోకల్ వరకు అన్నిరంగాల్లో, అన్ని విధాలుగా  మనం సులభతరం చేసే మార్గాలు గురించి మాత్రమే కాకుండా, వికలాంగులు కూడా తమ గొంతును వినిపించి, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని కూడా గుర్తించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వికలాంగుల మేలు కోసం దీర్ఘకాలిక మార్పులను అమలు చేయడం ప్రారంభించి, వారికి ప్రాముఖ్యతని ఇవ్వటం ద్వారా మరింత సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు.  మనలో ఉన్న వైకల్యాన్ని ఒప్పుకొని క్రుంగిపోవటమే అసలు వైకల్యమని,  మానసికంగా  దృఢంగా నిలబడి,  వైకల్యాన్ని కూడా విజయపధం వైపు నడిచే ప్రేరణగా, బలంగా  మార్చుకున్న గొప్ప వ్యక్తులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటివారు మిగిలిన అందరికీ ఆదర్శంగా నిలిచి ఈ సమాజంలో వారి పాత్ర కూడా ఉందన్న నిజాన్ని ప్రపంచమంతా  అర్ధం చేసుకుని, వారిపై ఎటువంటి వివక్షా లేని సమాజం వైపు అడుగువేయాలని కోరుకుందాం…                                             *రూపశ్రీ 
  సీజన్ ను బట్టి శరీరానికి ఆహారం అందించాలి. అలా అందించినప్పుడే  శరీరం వాతావరణానికి తగినట్టు బలంగా ఉంటుంది.  ముఖ్యంగా ఇప్పుడు చలికాలం మొదలైంది.  ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి.   అదే విధంగా పోషకాలు అధికంగా ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి.  ఇలాంటి ఆహారాలలో నువ్వులు  ముఖ్యమైనవి. నువ్వులలో రెండు రకాలు ఉంటాయి.  వాటిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉన్నాయి.  కానీ చలికాలంలో తెల్ల నువ్వులు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.  అవేంటో తెలుసుకుంటే.. నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులను రోజూ కనీసం ఒక స్పూన్ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  చలికాలంలో వచ్చే జలుబు,  దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడలో ఇది సహాయపడుతుంది. తెల్ల నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  చలికాలంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది.  ఈ జీర్ణక్రియను ఆరోగ్యంగాను,  వేగంగా చేయడంలో తెల్ల నువ్వులు సహాయపడతాయి.  దీని కారణంగా మలబద్దకం సమస్య కూడా దరిచేరదు. తెల్ల నువ్వులలో లిగ్నాన్స్,  ఫైటూస్టెరాల్స్ ఉంటాయి.  ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుంది. నువ్వులలో కాల్షియం,  మెగ్నీషియం, మాంగనీస్,  ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.  ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.  ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ,  ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ సహాయపడతాయి. చలికాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్,  కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కానీ తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.                                                       *రూపశ్రీ.
శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.  ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు.  అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది.  ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు.  బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.  చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది.  చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి. చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి.  ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  మలబద్దకం,  మోషన్ కావడంలో ఇబ్బందులు,  అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది.  ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన  వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా,  ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయికి చాలా మేలు చేస్తుంది.  ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.  విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  కేవలం ఆహారంగానే కాకుండా  చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు.  బొప్పాయి ఫేస్ వాష్,  బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు. చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది.  ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు,    వడలు,  సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు.  వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు.  కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు.  ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.  కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు.                                                    *రూపశ్రీ.
శరీరానికి ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు,  డ్రై ఫ్రూట్స్,  డ్రై నట్స్ వంటివి ఉండాలి.  వీటి నుండి విటమిన్లు,  మినరల్స్, ప్రోటీన్లు అన్నీ శరీరానికి లభిస్తాయి. అయితే సీజన్ అనుగుణంగా లభించే వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్ నట్స్ కూడా ఒకటి.  వీటిని తెలుగులో సింగోడ అని అంటారు.  ఇవి శీతాకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  శీతాకాలంలో ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తప్పకుండా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇంతకీ ఇవి తింటే కలిగే లాబాలు తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తింటూ ఉంటే తొందరగా రికవరీ కావచ్చు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.  దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ వాటర్ చెస్ట్ నట్స్ తింటే  జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.  మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది.  దీని కారణంగా చలికాలంలో గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.  సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గడం వల్ల గుండె కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కానీ ఈ సమస్య తగ్గించడంలో వాటర్ చెస్ట్ నట్స్ సహాయపడతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మం మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ముఖం మీద మొటిమలను  తొలగించడమే కాకుండా కాలుష్యం వల్ల వచ్చే సమస్యల నుండి కూడా ఇవి కాపాడతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వాటర్ చెస్ట్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఈ ఫైబర్ శరీరానికి చాలా అవసరం.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.  ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ.