LATEST NEWS
టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీ ఏపీ వైపు చూస్తున్నదా? క్ర‌మంగా ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే సినీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవ‌ల పుష్ప‌2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలంగాణ స‌ర్కార్  సీరియస్ కావడం, ఆ తరువాత తీసుకున్న నిర్ణయాలతో సినీ ప్ర‌ముఖులు కాస్త‌ ఇబ్బందిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్ర‌ముఖుల‌కు ద‌గ్గ‌రి వ్య‌క్తి. చాలా మంది సినీ హీరోలు, సినీ పెద్ద‌ల‌తో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, పుష్ప‌2 ఘ‌ట‌న విష‌యంలో మాత్రం రేవంత్ స‌ర్కార్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో కాస్త ఇబ్బందిగా ఫీలైన సినీ ప్ర‌ముఖులు తెలంగాణ‌తోపాటు ఏపీలోనూ సినీ ఇండ‌స్ట్రీని అభివృద్ధి  చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు, ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సినీ పెద్ద‌ల చూపు ఏపీ వైపు మ‌ళ్లింద‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినీ ఇండ‌స్ట్రీలోని కొంద‌రు ప్ర‌ముఖులు ఈ విష‌యంపై చర్చించారనీ,  ప్ర‌భుత్వం త‌ర‌పున కావాల్సిన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ప‌ష్ట‌మైన హామీఇచ్చిన‌ట్లు స‌మాచారం. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల ద్వారా ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది.  వైసీపీ హ‌యాంలో ఏపీలో తెలుగు సినీప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రెడ్డి కొన‌సాగిన ఐదేళ్లూ టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌మ సినిమాల రిలీజ్ విష‌యంలోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విష‌యంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ల పెంపు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ టాలీవుడ్ పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి వంటివారు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చేతులెత్తి దండంపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయినా, తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై జ‌గ‌న్ క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో సినిమాల‌కు సంబంధించిన అధిక‌శాతం ఈవెంట్లు హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వం మారింది. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చంద్ర‌బాబు అంటే సినీ ప‌రిశ్ర‌మ‌కు అభిమాన ముఖ్య‌మంత్రి. మ‌రోవైపు డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సాధార‌ణంగానే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఏపీ వైపు చూస్తున్నది. దీనికితోడు ఏపీ స‌ర్కార్ సినీ ఇండ‌స్ట్రీకి అధిక‌ ప్రాధాన్య‌త ఇస్తున్నది. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్ర‌స్తావించారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సినీ ఇండ‌స్ట్రీ ప‌ట్ల క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలో అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. కానీ, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం అలా కాద‌ని.. సినీ ఇండ‌స్ట్రీని త‌గిన విధంగా గౌర‌విస్తుంద‌ని ప‌వ‌న్ చెప్పారు. టాలీవుడ్ హీరోలు వ‌చ్చి త‌మ‌వ‌ద్ద న‌మ‌స్కారాలు చేయాల్సిన ప‌ని లేదంటూ గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీరుపై ప‌వ‌న్ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న సినీ రంగానికి చెందిన వ్య‌క్తి అయినా, కొంద‌రు సినీ పెద్ద‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసినా వారి జోలికి వెళ్ల‌లేద‌ని, సినీ ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయ రంగు పూయ‌లేద‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. అదే బాట‌లో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇదే క్ర‌మంలో టికెట్ల పెంపుపై కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్ చెక్ పెట్టారు. సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఊరికే పెంచ‌డం లేదు.. దాని వ‌ల్ల ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో కొంత ఆదాయం వ‌స్తోంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని ప‌వ‌న్ అన్నారు. అదే స‌మ‌యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బ‌ల‌మైన యువ‌త ఉంది. ఇక్క‌డ యువ‌త‌లో ఉన్న శ‌క్తిని వినియోగించుకోవాల‌ని సినీ పెద్ద‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కోరారు. ఏపీలోని ప‌లు చోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టండి. సినిమా స్టోరీలు ఎలా రాయాలి.. సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్లాలంటే ఎలాంటి శిక్ష‌ణ తీసుకోవాలో అందుకు సంబంధించిన ఇనిస్టిట్యూట్స్ ను ఏర్పాటు చేయండి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న నిపుణుల‌తో యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి పెంచండి. ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ లాంటి వ్య‌క్తుల‌ను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే త‌దిత‌ర విష‌యాల‌పై క్లాసులు తీసుకోమ‌ని చెప్పండి. కీర‌వాణి, త‌మ‌న్ లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లు ఇప్పించండి. రాష్ట్రంలోని ప్ర‌ముఖ ప్రాంతాల్లో స్టూడియోలు పెట్టండి. 24 క్రాప్ట్ ల‌కు సంబంధించిన విష‌యాల‌పై సినీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తి క‌లిగిన ఏపీలోని యువ‌త‌కు శిక్ష‌ణ ఇప్పించండ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరారు. అలా చేయడానికి ముందుకు వచ్చే వారికి  చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. మొత్తానికి గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా సినీ ఇండ‌స్ట్రీ ఏపీకి రావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ చెప్పారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (జనవరి 5)ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (జనవరి 4) శ్రీవారిని మొత్తం 71 వేల 990 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ 26లక్షల రూపాయలు వచ్చింది. 
సినీ నటుడు అల్లు అర్జున్  నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కండిషన్ బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.  ఇరు పక్షాల వాదనలు  విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరయ్యారు. పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. . చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు   జడ్జి ముందు సమర్పించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.   పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని  కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యలను , కేసును ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45   నివాసం నుంచి బయలు దేరినట్టు సమాచారం. 
సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.  దాదాపు 150  కిలోమీటర్లు  ఐదురోజుల్లో ఈది అరుదైన రికార్డు సాధించారు.  రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ గా ఆమె ఈత కొట్టారు. సముద్ర కెరటాల మీద ఈత కొట్టడం అంత ఆషామాషీ కాదు. హైద్రాబాద్ లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు ఆమె పని చేశారు. దురదృష్ట వశాత్తు బాగా నష్టపోయారు. ఆర్థికంగా పూర్తిగా  చితికి పోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మైండ్ డైవెర్షన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకుని అదే స్విమ్మింగ్ మీద అరుదైన రికార్డు చేరుకోవడం గమనార్హం.  డిప్రెషన్ లో ఉన్నప్పుడు కోచ్ జాన్ సిద్దిఖీ ఆమెకు స్విమ్మింగ్ నేర్పించాడు. జీరో లెవెల్ నుంచి కెరీర్ ప్రారంభించి 150 కిలో మీటర్లు సముద్రంలో చేరుకోవడం ఆసియా స్థాయిలో సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 28 కి ముందు వాతావరణం అనుకూలించక ఈ  సాహస యాత్రను రెండు పర్యాయాలు వాయిదా వేసుకున్నారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రంలో దూకి కాకినాడ గడ్డపై తేలారు.  2021లో ఆమె  శ్రీలంక నుంచి ఇండియావరకు రామసేతు  దాటానని గోలి శ్యామల చెప్పారు. ఈ యేడు ఫిబ్రవరిలో లక్ష్య ద్వీప్ లో 18 గంటలపాటు 48 కిలో మీటర్లు ఆమె స్విమ్ చేసారు.  బంగాళా ఖాతంలో స్విమ్ చేయాలని ఆమె రెండేళ్ల క్రితమే కలలు కని సాకారం చేశారు. ఒక ఫిషింగ్ బోట్ లో ఇద్దరు స్కూపర్ డ్రైవర్లతో ఈ సాహస యాత్ర చేశారు.  మహిళలకు ఈత కంపల్సరీ అని గోలిశ్యామల చెబుతున్నారు. గైనిక్ సమస్యలను బాధపడుతున్న వారికి ఈత చక్కటి ఉపశమనం అని ఆమె చెబుతున్నారు. స్విమ్ ను స్పోర్ట్స్ గా కాకుండా సర్వైకల్ స్పోర్ట్స్ గా బలంగా నమ్మే గోలి శ్యామల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు.    గోలి శ్యామల ఈత నేర్చుకునే సమయంలో చాలామంది హేళన చేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అపజయం నుంచి విజయం అందుకున్న వీర వనిత గోలి శ్యామల. 
ALSO ON TELUGUONE N E W S
మహాభారత నేపథ్యాన్ని తీసుకొని సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం గురించి ఎంతో మంది పండితులు, హిందూ సంఘాలు కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అశ్వథ్థామ, కర్ణుడు వంటి వారు దుష్టులనీ, సినిమాలో మాత్రం గొప్పగా చూపించారని చాలా మంది విమర్శించారు. సినిమా రిలీజ్‌ అయి కొన్ని నెలలు గడిచిన తర్వాత తాజాగా ప్రముఖ గీత రచయిత అనంతశ్రీరామ్‌ కల్కి సినిమా గురించి, అందులోని పాత్రల గురించి కొన్ని విమర్శలు చేశారు. సినిమా పుట్టిన నాటి నుంచి మహాభారత, రామాయణాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతశ్రీరామ్‌ మాట్లాడారు. పురాణ విషయాల గురించి, మన సినిమాల గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం.. భారత సాహితీ వాగ్మయ శరీరానికి రెండు కళ్లు లాంటివి. వాటిని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన సినిమాల నుంచి నిన్న, మొన్న విడుదలైన కల్కి సినిమా వరకు కూడా అదే జరిగింది. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. చాలా నిర్మొహమాటంగా చెబుతున్నాను. అది కూడా కృష్ణా జిల్లా గడ్డమీద నిలబడి చెబుతున్నాను. అప్పటి సినిమా దర్శకులు, ఇప్పటి సినిమా నిర్మాతలు కృష్ణా జిల్లాకి చెందిన వారైనప్పటికీ పొరపాటుని పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. ఇక్కడ సభలో వున్న సత్యవాణిగారిని అభినవ ద్రౌపది అని అభివర్ణించారు. ద్రౌపది వలువలు ఒలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడు గొప్పవాడు అంటే సత్యవాణి వంటి మహిళలు ఒప్పుకుంటారా? గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణ మిత్రుడ్ని కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుడ్ని వీరుడు, ధీరుడు, శూరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? తనకి వచ్చిన సంపదలో కొంత దానం చేస్తే ధర్మరాజు అంతటి గొప్ప దాత అని కర్ణుడ్ని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా?  కల్కి చిత్రంలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సును పట్టుకున్న అర్జునుడి కంటే, సూర్యుడు ఇచ్చిన ధనుస్సును పట్టుకున్న కర్ణుడు వీరుడని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా, ధర్మమా అని మనం ప్రశ్నించకుండా ఉంటామా? భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్ళను తేల్చి వారధి కట్టినట్టు, కూడా లవకుశులకు, రాముడికి యుద్ధం జరిగినట్టు.. ఇలా చిత్రీకరణకు అందంగా ఉండేందుకు ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతున్నప్పుడు మనం ఊరుకుంటూ ఉంటే ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయి. చిత్రీకరణలో, గీతాలాపనలో కూడా ఎన్ని రకాల హననాలు జరిగాయో మనం చూశాం, చూస్తున్నాం’ అంటూ ఆవేశంగా మాట్లాడారు అనంత శ్రీరామ్‌.  అనంత శ్రీరామ్‌ తన ప్రసంగంలో ప్రత్యేకంగా నటరత్న ఎన్‌.టి.రామారావును ఉద్దేశించే ఎక్కువ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. ఎందుకంటే కర్ణుడి కథతో దానవీరశూర కర్ణ అనే టైటిల్‌తో సినిమాను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమాలో కర్ణుడ్ని ఒక గొప్ప కథానాయకుడిగా చూపించారు. అనంత శ్రీరామ్‌ తన మాటల్లో అప్పటి దర్శకులు, ఇప్పటి నిర్మాతలు కృష్ణా జిల్లా వాసులు అనే మాటను వాడారు. ఎన్టీఆర్‌, కల్కి చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే. వారిని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. మరి అనంత శ్రీరామ వ్యాఖ్యలపై దర్శకనిర్మాతలు, ఇతర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.  
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ మరియు ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.  ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది.   ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్‌గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వరుణ్ సందేశ్‌కు మరింత మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాలి. త్వరలోనే ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.  వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘మా టీజర్‌ను విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నేను ఆయనతో చేసిన ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రం నాకు చాలా ఇష్టం. కానిస్టేబుల్ టీజర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ మూవీ టీజర్ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.  దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ‘మా మూవీ కానిస్టేబుల్ టీజర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా హీరో వరుణ్ సందేశ్, మా నిర్మాత బలగం జగదీష్ గారికి థాంక్స్’ అని అన్నారు.  నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ‘ ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. మా అమ్మ గారు చనిపోయిన రోజు ఇది. ఈ రోజునే మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా టీజర్‌ను రిలీజ్ చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా హీరో వరుణ్ సందేశ్‌కు ఈ చిత్రం కమ్ బ్యాక్ అవుతుందని నా గట్టి నమ్మకం. మా సినిమా టీజర్‌ను చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు. నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు 
విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో మరియు  ఇంకో హీరోయిన్లుగా  సిఎల్ఎన్  మీడియా  ప్రైవేట్ లిమిటెడ్, హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కలవరం. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శశాంక్ కథని అందించగా సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ అలాగే మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చదలవాడ శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేసి ఘనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న  సినిమా. ఇప్పటిదాకా చిన్న సినిమాలను పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైన చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వడం అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం టైటిల్ చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్ల కి మూవీ టీంకి మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.  దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ : ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి సపోర్ట్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు చెప్పడం జరిగింది. వెంటనే చెన్నై వెళ్లి హీరో కి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్క గారికి కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాము అని అన్నారు.  ఈ రోజున ఇలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. నన్ను నా కథని నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణి గారికి హీరో విజయ్ కనిష్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు. హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్నగారు విక్రమంగారు తమిళ్ లో ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టారు నిలబెటవ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. శోభ గారు డైరెక్టర్ హనుమాన్ గారు మంచి ప్యాషన్ తో ఈ కథని నాకు వినిపించారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు. కథ రచయిత శశాంక్ పి మాట్లాడుతూ :  కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ శోభారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్ ని తయారు చేశాం. అదేవిధంగా కథ విన్న వెంటనే హీరో విజయ్ కనిష్క గారు ఈ సినిమాను ఒప్పుకుని ముందుకు వచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ : కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. విజయ్ కనిష్క కథ వినిన వెంటనే సినిమా మనం చేస్తున్నాము అని అన్నారు. శశాంక్ ఇచ్చిన కథ అలాగే డైరెక్టర్ హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే కష్టంతో ఇష్టంతో ఈ సినిమాని పూర్తి చేస్తాము. అడగగానే మా ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి  మరియు సి  కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము.ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమా అవుతుందని కచ్చితంగా చెప్తున్నాను అన్నారు.
డిసెంబర్‌ 4న పుష్ప2 ప్రీమియర్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ను ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధిస్తూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి సంతకం చెయ్యాల్సి ఉంది. అందులో భాగంగా ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు బన్నీ. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ బయట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి వెళ్లి సంతకం పెట్టి పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు.  ఇదిలా ఉంటే.. కిమ్స్‌ హాస్పిటల్‌ పరిధికి చెందిన రాంగోపాల్‌పేట పోలీసులు మరోసారి అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావద్దని ఆ నోటీస్‌లోని సారాంశం. రోగుల వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే బన్నీని రావొద్దని చెప్తూ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ బన్నీ రావాలని అనుకుంటే పోలీసుల సూచనలు పాటించాలని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి అతనే పూర్తి బాధ్యత వహించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. వాస్తవానికి ఆదివారం శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలని అల్లు అర్జున్‌ డిసైడ్‌ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అతనికి నోటీసులు జారీ చేశారు. దీంతో హాస్పిటల్‌కి వెళ్ళేందుకు సిద్ధమైన బన్నీ పోలీసుల నుంచి నోటీసు రావడంతో తన విజిట్‌ను రద్దు చేసుకున్నారు. 
రాంగోపాల్‌పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసు జారీ చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావద్దని ముందుగానే నోటీసు పంపించారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు తాజాగా ఈ నోటీసు జారీ చేశారు. అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లి అతని మేనేజర్‌ మూర్తికి నోటీసు అందించారు. హాస్పిటల్‌కు రావాలంటే తమ సూచనలు పాటించాలని, అక్కడ ఏదైనా ఘటన జరిగితే పూర్తి బాధ్యత అల్లు అర్జున్‌ వహించాల్సి ఉంటుందని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై అల్లు అర్జున్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. 
ఇటీవల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న నందమూరి బాలకృష్ణ..  ఇప్పటి ప్రేక్షకులకు అనుగుణంగా, ప్రజెంట్‌ ట్రెండ్‌ని ఫాలో అవుతూ సినిమాలు చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లో చెయ్యని ఓ డిఫరెంట్‌ మూవీ ‘డాకు మహారాజ్‌’ అనే విషయం ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఎప్పటి నుంచో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్‌ రానే వచ్చేసింది. నిమిష నిమషానికీ వ్యూస్‌ వేలల్లో పెరుగుతూ వెళుతోంది. ఆడియన్స్‌ అంత ఈగర్‌గా ఈ ట్రైలర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ బాబీ టేకింగ్‌ అద్భుతంగా ఉంది. బాలయ్యను ఎలా ప్రజెంట్‌ చేస్తే ప్రేక్షకులు, అభిమానులు థ్రిల్‌ అవుతారో ఆ విధంగా ప్రతి షాట్‌నీ తీసినట్టుగా అనిపించింది.  ఓ చిన్న పాప వాయిస్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ‘అనగనగా ఒక రాజుండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవారు.. నాకు మాత్రం మహారాజు’ ఈ డైలాగ్‌తో డాకు మహారాజ్‌ క్యారెక్టర్‌ ఏమిటి అనేది అర్థమవుతుంది. సినిమాలో ఎన్నో మ్యాజికల్‌ మూమెంట్స్‌ ఉన్నాయని ట్రైలర్‌లోని విజువల్స్‌ చెబుతున్నాయి. భారీ యాక్షన్‌ సీన్స్‌తోపాటు ఎమోషనల్‌ సీన్స్‌ కూడా సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా ‘కింగ్‌ ఆఫ్‌ జంగిల్‌’ అంటూ పాప చెప్పే మాట బాలయ్య క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్‌ చేసేలా ఉంది. ఇంతకు ముందు గ్లామర్‌ హీరోయిన్‌గా కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌కి చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆమెతో యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా చేయించినట్టు అర్థమవుతోంది. ఇక ఊర్వశీ రౌతెలాను గ్లామర్‌ కోసమే తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాథ్‌కి కూడా సినిమాలో మంచి ఇంపార్టెన్స్‌ ఉన్నట్టుగా ఉంది. అన్నింటినీ మించి బాలయ్యతో ఢీ అంటే ఢీ అనే క్రూరమైన విలన్‌ క్యారెక్టర్‌లో బాబీ డియోల్‌ అదరగొట్టినట్టుగా కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఓ నలభై నిమిషాల పాటు కనిపించే ఈ డాకు ఎపిసోడ్స్‌ సినిమాకు హైలెట్‌ అని అర్థం అవుతోంది.   ఏ విధంగా చూసినా బాలకృష్ణకు ఇది కొత్త తరహా సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. డైరెక్టర్‌ బాబీ.. బాలకృష్ణను ఎలివేట్‌ చేసిన సీన్స్‌ అన్నీ అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు తమన్‌ మ్యూజిక్‌ కూడా మంచి సౌండిరగ్‌తో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌పై ఫ్యాన్స్‌ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘జై బాలయ్య..’, ‘దబిడి దిబిడే..’, ‘సంక్రాంతికి దిమ్మ తిరిగిపోవాలి..’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ట్రైలర్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. జనవరి 12న థియేటర్లలో సందడి చేయబోతున్న ‘డాకు మహారాజ్‌’కి ట్రైలర్‌తో మరింత క్రేజ్‌ పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్‌ కోసం  బాలయ్య డల్లాస్‌లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి అభిమానులతో బాలయ్య సందడి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌ బాలయ్య అభిమానులకు నిజమైన పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేయబోతోంది. 
Thandel starring Naga Chaitanya and Sai Pallavi has created huge level of anticipation with its announcement video. The movie is directed by Chandoo Mondeti and produced by Bunny Vasu. The movie team unveiled Namo Namah Shivaya has second single and it imbibes a divine trance upon first listen itself.  Devi Sri Prasad has been able to create a vibe with this song that we inadvertently start to sing praises of Lord Shiva's glory and his Ardhanareeshwara avatar. Even the makers have highlighted the avatar with a huge sculpt and it is impressive.  Jonnavithula Ramalingeswara Rao's lyrics about Lord Shiva and Goddess Shakti gives a good account on divinity of romance. The song, the energy and the vibe it carries are so infectious that we start hailing the greatness of Lord Shiva and Goddess Shakti's romance.  Naga Chaitanya and Sai Pallavi's chemistry and their energy is also great in the song. Thandel is being  on a huge scale with massive budget and the movie is releasing on 7th February all over. Renowned producer Allu Aravind is presenting the movie. 
Game Changer starring Ram Charan, Kiara Advani, SJ Suryah, Anjali, Sunil, Srikanth is gearing up for huge release on 10th January. The movie directed by Shankar and he is produced on a massive budget. Dil Raju produced the film and he is anticipating it to be a huge blockbuster.  The big budget movie got big hikes in AP state on ticket prices during the Sankranti festival week till 23rd January. The state government allowed for one extra show from 11th to 23rd January, that is, 5 shows at Rs.175/- more than existing amount for multiplexes each ticket and Rs.135/- more than existing amount for single screens.  On all important 10th January, the movie can have a benefit show at 1:00 AM and the ticket is allowed to be Rs.600/-. On the 10th January, 6 shows have been allowed from 4:00 AM. And the ticket rates can be hiked till Rs.175/- more than existing amount for multiplexes each ticket and Rs.135/- more than existing amount for single screens, all rates are including GST.  This makes ticket prices in AP for the movie as from Day 1-14 Multiplexes - ₹352 and Single screens - ₹282.50, and, From Day15- Full Run ₹177 & ₹147. Game Changer is all set to collect huge in the state AP, if it manages to secure positive word of mouth. 
ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా బడా హీరోల సినిమాలు ప్రేక్షకులని కనువిందు చెయ్యడానికి సిద్ధమవుతున్నాయి.ఇద్దరు సీనియర్ హీరోలైన బాలకృష్ణ(Balakrishna)వెంకటేష్(Venkatesh)తో రామ్ చరణ్(Ram charan)పోటీ పడుతున్నాడు.ముందుగా చరణ్ జనవరి 10 న గేమ్ చేంజర్(Game changer)తో వస్తుండగా,12 న బాలకృష్ణ 'డాకు మహారాజ్'(Daku maharaj)తో 14 న వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankrathiki vasthunnam)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనరల్ గా ఏ హీరో అభిమానులైన  తమ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడం సహజం.బాలయ్య,వెంకీ,చరణ్ అభిమానులు కూడా ఇదే తరహాలో ఆలోచించడం కామన్.కానీ ఇందుకు భిన్నంగా గేమ్ చేంజర్,డాకుమహారాజ్,సంక్రాంతికి వస్తున్నాం   మూడు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.ముగ్గురు హీరోలు కూడా ఇపుడు తమ సినిమాల ప్రమోషన్స్ లో మూడు సినిమాలు బాగా ఆడి, అంతిమంగా సినిమా గెలవాలని చెప్తున్నారు.దీంతో ముగ్గురు హీరోల అభిమానులు కూడా తమ హీరోల దారిలోనే సినిమా గెలవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇక బాలయ్య,వెంకీ, చరణ్ తమ సినిమాల ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.చరణ్ ఈ రోజు రాజమండ్రిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుండగా,బాలకృష్ణ  యుఎస్ లో జరుగుతున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటున్నాడు.వెంకటేష్ కూడా తన యూనిట్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి.  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు(hariharaveeramallu).పోరాట యోధుడు గా పవన్ తన ఎంటైర్ కెరీర్లోనే ఫస్ట్ టైం చేస్తున్నచారిత్రాత్మక మూవీ కావడంతో వీరమల్లుపై పవన్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు,టీజర్ కూడా హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి 'మాట వినాలి'(Maata Vinaali)అనే లిరిక్ తో కూడిన సాంగ్ ఈ నెల 6 న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.  నిండు పున్నమి లో చలి మంట మధ్య చేతిలో 'కంజర' దరువేస్తు ఉన్న పవన్ స్టిల్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ పాటకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే పవన్ స్వయంగా ఈ పాటని పాడాడు.గతంలో కూడా పవన్  కొన్ని సినిమాల్లో పాటలు పాడి తన అభిమానులని,ప్రేక్షకులని ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సాంగ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 'వీరమల్లు' నుంచి రిలీజ్ అవుతున్న తొలి సాంగ్ కూడా ఇదే. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎఏం రత్నం(Am Rathnam)నిర్మిస్తున్న వీరమల్లులో పవన్ సరసన నిది అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుంది.నోరా ఫతేహి,బాబీడియోల్,సునీల్ జిష్హుసేన్ గుప్తా,రఘుబాబు,పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకుడు కాగా రెండు పార్టులుగా మూవీ తెరకెక్కనుంది.మొదటి భాగం మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్నిఅందించాడు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సామెత అందరికీ తెలిసిందే. దీనర్ధం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. అలా ఎందుకన్నారంటే  మనిషి తన జ్ఞానంలో  80 శాతందాకా కళ్ల ద్వారా చూసి నేర్చుకోవటంవల్లనే పొందుతాడు. కంటిచూపున్నవారు కళ్ళతో చూసి, చదివి విద్యావంతులై జీవితంలో స్థిర పడతారు. మరి రోజువారీ జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు పడే అంధులెలా చదువుతారు? చదవాలనే తపన వాళ్ళలో ఉన్నా కూడా వారికున్న వైకల్యమే వారిని వెక్కిరిస్తుంది. కానీ, అంధుల  భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే  తన ఆవిష్కరణతో వారికి ఒక ఆశాకిరణంలా నిలిచాడు ఫ్రెంచ్ విద్యావేత్త, ఆవిష్కర్త అయిన లూయీ బ్రెయిలీ. ఆయన  చేసిన సేవలకి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. చీకటికి అక్షరాలతో చూపును ఇచ్చి.. ప్రపంచంలో ఉన్న అంధుల జీవితాలలో వెలుగులు నింపిన లూయీ బ్రెయలీ గురించి తెలుసుకుంటే.. లూయీ బ్రెయిలీ ఎవరు…. లూయీ బ్రెయిలీ  1809,  జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి సైమన్-రెనె బ్రెయిల్ రాచరిక గుర్రాలకు పగ్గాలు, సాడిల్స్ తయారు చేసే పని చేస్తుండేవారు. అయితే, మూడు సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న బ్రెయిలీ చూపు, తర్వాత అయిదేళ్లలోపే అతన్ని పూర్తిగా అంధుడిగా మార్చేసింది. అయినాసరే ధైర్యం కోల్పోని ఆయన పారిస్ లోని ఒక అంధుల పాఠశాలకి వెళ్ళి చదువుకుని అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తించబడ్డాడు. అప్పటివరకూ అంధులకి అందుబాటులో ఉన్న ‘’లైన్ టైప్’’ పద్ధతిలోనే కష్టపడి చదువుకుని 17ఏళ్లకే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడున్నప్పుడే అంధులకి సులువుగా ఉండే లిపి తయారుచేయాలన్న తపన  మొదలైంది.   బ్రెయిలీ లిపి ఆవిష్కరణ ఇలా జరిగింది..... అప్పటి వరకు అంధుల కోసం ఉన్న పుస్తకాల ప్రింటింగ్ విధానాలు సరైనవి కాదనిపించేవి. అందుకే  ప్రొఫెసర్గా పగలు విధ్యార్ధులకి  బోధిస్తూ, రాత్రిళ్ళు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారు చేయటానికి లూయీ బ్రెయిలీ కృషి చేశాడు.  చీకట్లో కూడా  సందేశాలను చదవడానికి అనువుగా 12 ఉబ్బెత్తు చుక్కలతో రూపొందించబడిన ప్రత్యేకమైన సైనిక గూఢచార పద్ధతి గురించి తెలుసుకున్నాడు. దీని ప్రేరణతో ఆరు ఉబ్బెత్తు చుక్కలని  అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, అంకెలని, సంగీత చిహ్నాలని సూచించే బ్రెయిలీ లిపిని తయారుచేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సాధనంగా నిలిచింది. బ్రెయిలీ లిపి అంటే..... బ్రెయిలీ లిపి  ఒక స్పర్శ ఆధారిత వ్రాతపద్ధతి. ఇందులో ఉబ్బెత్తుగా ఉండే ఆరు చుక్కల  ద్వారా అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను సూచిస్తారు. ఉబ్బెత్తు చుక్కల  సమూహాన్ని 'సెల్' అని అంటారు. ప్రతీ సెల్లోనూ భిన్నంగా అమర్చిన  చుక్కల  ఆధారంగా  అంధులు అక్షరాలు, అంకెలని గుర్తించి చదవగలుగుతారు. ఈ విధానం దృష్టిలోపం ఉన్నవారికి వ్రాతపూర్వక సమాచారం పొందడానికి సహాయపడుతుంది. బ్రెయిలీ  వివిధ భాషలతో పాటు గణితం, సంగీతం వంటి సాంకేతిక నోటేషన్లకు అనుకూలంగా తయారు చేయబడింది. బ్రెయిలీ  వ్రాయడానికి బ్రెయిలీ  రైటర్ యంత్రం లేదా స్టైలస్, స్లేట్ వంటి సాధనాలని  ఉపయోగిస్తారు.  ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది పూర్తి అంధులుగా ఉన్నారు. 253 మిలియన్ల మంది ఏదో ఒక విధమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరందరికీ బ్రెయిలీ లిపి ఒక చేయూతలా పనిచేస్తుంది. అలా ఇంతమంది అంధులకి  సహాయపడుతున్న  బ్రెయిలీ లిపి  ప్రాముఖ్యతను గుర్తించిన  ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 నవంబర్ 6న  ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లూయీ బ్రెయిలీ  జయంతిని పురస్కరించుకుని   ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంధుల కోసం ఏం చేయాలి? దృష్టి లోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వారికి విద్యా, వృత్తి అవకాశాలు అందించడం, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  పెరుగుతున్న టెక్నాలజీవల్ల బ్రెయిలీ  కూడా అభివృద్ధి చెందుతోంది. రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఆధునిక పరికరాలు దృష్టి లోపం ఉన్నవారికి డిజిటల్ కంటెంట్‌ను చేరువ చేయడంలో పెద్ద మార్పును తెచ్చాయి. అయితే, బ్రెయిలీ  పుస్తకాలు, ఇతర వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయడం, దాని ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన పెంపొందించడం అవసరం. ప్రపంచ బ్రెయిలీ  దినోత్సవం  లూయీ బ్రెయిలీ చేసిన అమూల్యమైన సేవలకు నివాళి . దృష్టి లోపం ఉన్నవారి హక్కులు, గౌరవానికి గుర్తింపు.   దృష్టి లోపం ఉన్నవారిని తక్కువ చేసి చూడకుండా, జాలి పడి వదిలేయకుండా మనలో ఒకరిగా, వారికి కాస్త  ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధిస్తారు.                               *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాముల పాత్ర చాలా ప్రత్యేకమైనది. జీవితంలో ఒక దశ వచ్చాక బయటి నుండి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు.  వారితోనే ఇక జీవితం అనుకోవాల్సి ఉంటుంది. కష్టం, నష్టం, సుఖం,  బాధ.. ఇలా అన్నీ వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాగడం చాలా అరుదు.  ఎందుకంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు,  వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలలో పెరిగిన వ్యక్తులు ఒకచోట కలసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమే.. కానీ ఇద్దరూ నిజాయితీగా ఉండే వ్యక్తులు అయితే సమస్య ఎక్కువ ఉండదు. కానీ ఒకరు కుటిల మనస్తత్వం కలిగిన వారు అయితే వారితో బంధం సాగడం కష్టమే కాదు.. అలాంటి వారు తమ భాగస్వామిని వాడుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారో.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. అపరాధ భావం.. లైఫ్ పార్ట్నర్ తప్పు చేసిన భావనను వ్యక్తం చేయడం ద్వారా తన పార్ట్నర్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.  లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే.. తన అవసరాలను,  తన సంతోషానికి తగిన విధంగానూ తన పార్ట్నర్ లేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. దీనికి తగిన కారణాలను కూడా వ్యక్తం చేస్తారు. దీంతో పార్ట్నర్ కోసం మారిపోయే అమాయకులు ఉంటారు. ఇలా మారిపోగానే తమ అవసరాల కోసం వాడేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చాలా దారుణమైన చర్య.  ఇది మనిషిని నేరుగా ఏమీ అనకుండా తమకు నచ్చినట్టు మార్చుకునే మార్గం.  తన భాగస్వామిని తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వారు చెప్పిన మాట వినకపోతే కోపంగా ఉండటం, విచారంగా ఉండటం, అదే పనిగా బాధపడటం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వారికోసం మారిపోతారని వారికి తెలుసు. అబద్దాలు.. అబద్దాలు జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం. ఇవి చాలా సహాయపడతాయి.  జీవితాలను నిలబెడతాయి.  కొన్ని పనులను సులభతరం చేస్తాయి.  ఎదుటివారికి నష్టం జరగనంతవరకు  అబద్దం చెప్పడం తప్పేమీ కాదు.. కానీ భాగస్వామి అబద్దాలు చెప్పడం ద్వారా తన పార్ట్నర్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారు. తప్పు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా తప్పు దారిలో పార్ట్నర్ ను తీసుకెళతారు.  దీనివల్ల వారు లాభపడి,  పార్ట్నర్ ను వాడుకుంటారు. గ్యాస్ లైటింగ్.. గ్యాస్ లైటింగ్ చాలామందికి తెలియదు కానీ.. ఇది మనిషిని మానసికంగా గందరగోళానికి గురి చేసే చర్య. ఏదైనా మర్చిపోయినట్టు,  ఏదైనా గుర్తులేనట్టు,  మతి భ్రమించిందని నమ్మించేట్టు, జ్ఞాపకశక్తి క్షీణించిందని చెప్పడం,  పిచ్చి పట్టిందని నమ్మేలా చేయడం.. అబద్దాలు చెబుతున్నారని నిందలు వేయడం, అనుమానించడం, మనుషులలో కలవనీయకుండా ఒంటరిగా ఉంచడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం చేయడం..   ఇలాంటివి చేసి మనిషిని మానసికంగా ఆలోచలు లేకుండా, వారు ఎప్పుడూ ఇతరుల ముందు మాట్లాడకుండా చేస్తారు.  ఇలాంటివి చేసే వారు తమ భాగస్వామిని చాలా దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు.                                           *రూపశ్రీ.
  మనం స్కూలులోనో, కాలేజీలోనో చదివేటప్పుడు క్లాస్ రూంలో టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు  సరిగా వినకుంటే ఓ మాట అనేవారు.. మనిషివి ఇక్కడే ఉన్నావ్ కానీ ఎక్కడ ఆలోచిస్తున్నావ్ అని.  దీన్నే “బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్” అని అంటుంటారు.  అప్పట్లో దీని గురించి పెద్దగా అర్థమయ్యేది కాదు కానీ రాన్రానూ వయసు పెరిగేకొద్ది ఇందులో ఉన్న నిజం, దీని వల్ల మనిషికి ఏర్పడిన పరిస్థితి  స్పష్టంగా అర్థమవుతోంది అన్నది నిజం.  ఎలాంటి  పనినైనా  ఏకాగ్రతతతో చక్కగా చేయాలంటే దానికి మన శరీరం, మనస్సు రెండూ ఆ పని మీదనే ధ్యాస పెట్టాలి. ఆ రెండూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనం చేసే పనికి సరైన ఫలితం దక్కుతుంది. రెండూ ఒక పనిమీద ఏకాగ్రత కాలేదంటే దాని అర్థం మనిషి శరీరం, మనసు రెండూ సమన్వయంలో లేవని.  మనిషి  శరీరం, మనస్సులు ఆరోగ్యంగా ఉండటం  ఎంత ముఖ్యమో అందరూ అర్ధం చేసుకోవాలన్న లక్ష్యంతో  ప్రతీ సంవత్సరం జనవరి3 వ తేదీన ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే మైండ్ హెల్త్,  బాడీ హెల్త్.. ఈ రెండింటిని సంపాదించుకునే మార్గం.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అనేది శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు.  మానసికంగా ప్రశాంతత, సంతృప్తిగా ఉండటం   కూడా అవసరం. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్యులు, పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  గుండె జబ్బులు,  తలనొప్పి వంటి సమస్యలకు మానసిక ఒత్తిడి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు..  సానుకూల ఆలోచనల ప్రభావంతో  రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, దేని నుంచైనా త్వరగా కోలుకునే  శక్తి  కలుగుతుందని  తేలింది. మైండ్-బాడీ ఆరోగ్యం ఇప్పుడు చాలా అవసరం.. ప్రస్తుత పరిస్థితుల్లో  బిజీ లైఫ్, పనిలో ఒత్తిడి, అనారోగ్య అలవాట్లు తదితర కారణాల వల్ల  ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారనే మాట వాస్తవం. దానివల్ల  ఇప్పటి తరం వారు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమైపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు అర్థం కావాలి.  శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు చాలా ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యమని మైండ్-బాడీ వెల్నెస్ డే అందరికి అర్థమయ్యేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు, అవగాహన పెంచేందుకు వారధిగా నిలుస్తుంది.  ఈ రోజు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించవచ్చు.  మంచి  ఆహారపు అలవాట్లను, వ్యాయామ పద్ధతులని  అందరికీ తెలియజేయవచ్చు..  యోగా, మెడిటేషన్ క్యాంపులు పెట్టి,  మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా వంటివి చేయడం ఎంత అవసరమో తెలియజేస్తారు. మానసిక ఆరోగ్యంపై సెమినార్స్ పెట్టి సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తారు. మనమేం చేయాలి.... మైండ్-బాడీ వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకంటే ఒకరు చెప్పడం వల్ల ఎవరి శరీరంలోనూ మార్పు రాదు. మానసిక, శారీరక ఆరగ్యం బాగుండాలంటే ప్రతి ఒకరు తమ గురించి తాము కేర్ తీసుకుని తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకోవాలి.  జీవనశైలి సరిచేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు త్రాగటం,  నిత్యం వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం,  తగినంత నిద్రపోవటం వంటివి ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషుల  ఆలోచనా విధానం మంచిగా ఉంటుంది.  ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి శారీరక, మానసిక శ్రేయస్సు సాధించడంలో అందరూ  కలసి పనిచేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా ఈ రోజుల్లో  ఆరోగ్యమే   చేతిలో ఉండే నిజమైన సంపద.. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.                                                                  *రూపశ్రీ.
  యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే ఒక వ్యర్థ పదార్థం.  శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలు ప్రాసెస్ అయినప్పుడు లేదా అవి విచ్చిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.  సాధారణంగా శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ రక్తంలో కరికి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది శరీరంలో పేరుకుపోతుంది.  ఇలా పేరుకుపోవడం వల్ల శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ సమస్య కూడా వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాపకింద నీరులా శరీరంలో పెరిగిపోతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. గొడ్డు మాంసం.. గొడ్డు మాంసం చాలా మంది తింటుంటారు.  అలాగే గొర్రె మాంసం అధికంగా తింటారు. ఇక పంది మాంసం విదేశాలలో ఎక్కువగా తింటారు.  ఈ మాంసాలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల ఉత్పత్తి దారుణంగా పెరుగుతుంది.  యూరిక్ యాసిడ్ సమస్య ఇప్పటికే ఉన్నవారు పైన చెప్పుకున్న మాంసాలకు దూరంగా ఉండటం మంచిది. సముద్ర ఆహారాలు.. సముద్ర ఆహారాలలో ప్రోటీన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయని చెబుతారు. అయితే సముద్ర చేపలు, జీవులు అయిన మాకేరెల్,  ఆంకోవీస్ వంటి సముద్ర చేపలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. షుగర్ డ్రింక్స్.. అధికంగా ప్రక్టోజ్ కలిగిన కార్న్ సిరప్ తో తయారు చేసే శీతల పానీయాలు, ఇతర పానీయాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.  ఈ చక్కెర పానీయాలు కేవలం యూరిక్ యాసిడ్ స్థాయినే కాకుండా మధుమేహం పెరగడానికి,  ఊబకాయానికి కూడా కారణం అవుతాయి. ఆల్కహాల్.. ఆల్కహాల్ తాగే అలవాటు రోజురోజుకూ ఎక్కువ అవుతూందని చెప్పవచ్చు.  ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ లో భాగం అయిపోయింది. బీర్ తో సహా ఇతర ఆల్కహాల్ పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా పెంచుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయి వల్ల జరిగే ప్రమాదం ఎక్కువ  ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ చేసిన ఆహారాలలో శుద్ది చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.  అలాగే శుధ్ది చేసిన చక్కెరల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో పనిచేస్తాయి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలామంచివి.  వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, విటమిన్-డి లభిస్తాయి. అయితే పుట్టగొడుగులలో మితంగా ప్యూరిన్ లు ఉంటాయి. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగుతాయి. కాలీఫ్లవర్.. కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన సీజనల్ కూరగాయ.  ఇందులో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కాలీఫ్లవర్ ను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింత పెరుగుతాయి.  అంతేకాదు.. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి.                                         *రూపశ్రీ.  
  భారతదేశం కళలకు పుట్టినిల్లు అని అంటారు. అంతేకాదు..  భారతదేశం ప్రాచీన సంపదకు కూడా నిలయం. ఇక్కడ కళల నుండి వైద్యం,  సంస్కృతి,  అలవాట్లు,  సంప్రదాయాలు, పద్దతులు.. ఇలా చాలా విషయాలలో భారతదేశం గొప్పదే.. ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి వాటిలో నాభిలో నూనె వేయడం కూడా ఒకటి.  సాధారణంగా వాడుక భాషలో నాభిని బొడ్డు అని అంటారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డు నుండే తల్లి నుండి బిడ్డకు ఆహారం అందుతుంది. అందుకే బొడ్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో  బాదం నూనె వేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే.. బాదం నూనెలో పోషకాలు.. బాదం నూనెలో విటమిన్-ఎ,  విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం,  బయోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రయోజనాలు.. బాదం నూనెను బొడ్డులో వేయడం వల్ల పనిభారం,  ఒత్తిడి,  కాలుష్యం మొదలైన వాటి కారణంగా చర్మం కోల్పోయిన గ్లోను తిరిగి తీసుకు వస్తుందట.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుందని,  బొడ్డు చుట్టూ ఉండే నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుందని అంటారు. ముఖం వాడిపోయి కళా విహీనంగా ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల బాదం నూనె వేస్తుంటే చర్మం కాంతివంతం అవుతుంది. రోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో బాదం నూనె కొన్ని చుక్కలు వేస్తుంటే జుట్టు రాలే సమస్య కూడా  తగ్గుతుందట.  ఇది నాడీ వ్యవస్థను సక్రియం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.  దీని వల్ల జుట్టు, చర్మానికి మేలు జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం బాదం నూనెలో బొడ్డులో వేస్తుంటే కడుపులో నొప్పి,  గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.                                           *రూపశ్రీ.  
  ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  దీని కోసం చాలామంది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఉదయాన్నే వేడి నీరు తాగడం తో మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పానీయంతో ముగిస్తారు. రాత్రి సమయంలో చాలామంది పసుపు పాలు తాగడం,  త్రిఫల జ్యూస్,  ఉసిరి జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణశక్తికి,  రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.  అలాంటి వాటిలో దాల్చిన చెక్క, అల్లం తో తయారు చేసిన టీ కూడా ఒకటి.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అల్లం, దాల్చిన చెక్క కలిపి  తయారు చేసిన టీ తాగితే ఏమవుతుందంటే.. దాల్చిన చెక్క, అల్లం రెండూ చాలా ఆహ్లాదకరమైన గుణాలు కలిగి ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరానికి విశ్రాంతి ఇస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.  నిద్రకు ఒక 30 నిమిషాల ముందు ఈ టీని తాగడం వల్ల  రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. అల్లం జీర్ణశక్తికి పేరుగాంచింది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అలాగే సహాయపడుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు భారం తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే  ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అల్లం, దాల్చిన చెక్క టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అల్లంలోనూ, దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ప్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  ముఖ్యంగా దాల్చిన చెక్క మధుమేహం ఉన్నవారికి గొప్ప వరం కంటే తక్కువ కాదు.  దీన్ని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు నియంత్రణలోనే ఉంటాయి. అంతేకాదు ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల రాత్రి పూట నిద్ర మధ్యలో ఆకలి వేయడం,  రాత్రి సమయంలో బయటి ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినాలనే కోరిక తగ్గుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటే దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా  శీతాకాలంలో ఈ టీని తాగడం వల్ల చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇప్పటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు.  అల్లం, దాల్చిన చెక్క రెండూ జీర్ణక్రియను వేగవంతం చేసేవే. ఈ రెండూ కలిపి తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులలోనే మార్పు తెలుస్తుంది.                                        *రూపశ్రీ.