LATEST NEWS
 ప్రముఖ సినీ రచయిత,వైకాపా నేత పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.  కుటుంబ కారణాల రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. వైకాపాలో తనకు కనీసం సభ్యత్వం లేదని పోసాని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోసాని నోరు అదుపులో పెట్టుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. పోసానిపై కేసు కూడా నమోదైంది తాజాగా పోసాని తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తాను వైకాపా నుంచి వైదొలగినంత మాత్రాన ప్రజా సేవ కొనసాగిస్తానన్నారు. జగన్ కు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు మోక్షం లభించే రోజులు వచ్చేశాయి. . నిజాంపేటలో 32  ఎకరాలు, పేట బషీర్ బాద్ లో 38  ఎకరాలు 2008లో జెఎన్ జె హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. న్యాయ వివాదాల్లో ఇరుక్కుని  రెండు దశాబ్దాలుగా లబ్దిదారులకు అంద లేదు. 2017 లో సుప్రీం ఇంటెరిం ఆర్డర్ వచ్చినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వం ఆ స్థలాలు  జర్నలిస్టులకు అప్పగించలేదు. తుది తీర్పు వచ్చినప్పటికీ అదే పరిస్థితి. టీం జెఎన్ జె నేతృత్వంలో  పోరాట ఫలితంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది.  ఇచ్చిన మాటకు రేవంత్ సర్కార్  కట్టుబడి ఆ స్థలాలను అప్పగించింది. కెసీఆర్ హాయంలో జరిగిన  ఈ భూముల ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే  స్పందిస్తోంది. గురువారం పేట్ బషీర్ బాద్ లో వెలిసిన అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్న కట్టడాల జోలికి పోవడం లేదు. గత ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ భూములుగా  రికార్డుల్లో ఉంది. వైఎస్ ఆర్ కేటాయించిన ఈ భూములను తిరిగి జర్నలిస్ట్ లకు అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సొసైటీ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. 
తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత తొలిసారి రాజకీయాలపై స్పందించారు. తెలంగాణ రాజకీయాలపై కాకుండా జాతీయ రాజకీయాలపై స్పందించారు. సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఆదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్​ వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్​కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అని ప్రశ్నించారు.  ఆదానిపై ఆరోపణలు కొత్తేమీ కాదు అయినా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించిందన్నారు. 164 జైలు జీవితం గడిపిన కవిత  నోరు విప్పడం చర్చనీయాంశమైంది.   
 కూకట్ పల్లిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు స్కూల్ లో దింపారు అయితే సాయంత్రం కూతుళ్లు రాకపోయేసరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఇద్దరు బాలికలు ఒక కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్డువైపు వెళుతున్న దృశ్యాలు సిసిటీవీలో రికార్డయ్యాయి. 
అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాలకు స్వస్థి చెప్పి గుజరాత్ వెళ్లిపోయింది. శైవక్షేత్రాల దర్శనార్థమే అఘోరీ గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ రంగ సాయి పేటలో వింతపూజలు చేసిన అఘోరీ ఐదు రోజుల పాటు మౌనవ్రతంలో ఉన్నారు. ఈ కారణంగానే ఆమె తనను కలవడానికి వచ్చిన ట్రాన్స్ జెండర్లకు చెప్పారు.  పురుషులతో తాను మాట్లాడనని స్మశాన వాటికలో  ట్రాన్స్ జెండర్లకు తెలిపారు. అఘోరీ గుజరాత్ వెళ్లేముందు తన ఐ 20 కారును సర్వీసింగ్  చేసుకున్నారు. స్మశాన వాటికలో వింత పూజలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యక్షమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో నానా రచ్చచేసి గుజరాత్ వెళ్లిపోయారు. 
ALSO ON TELUGUONE N E W S
శివకార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా రాజ్ కుమార్ పెరియస్వామి(raj kumar periyaswami)దర్శకత్వంలో దివాలి కానుకగా, ఈ నెల 31 న విడుదలైన మూవీ అమరన్(amaran)పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసింది.అగ్ర హీరో కమల్ హాసన్(kamal haasan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా తమిళనాడుకి చెందిన దివగంత మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా అమరన్ తెరకెక్కడం జరిగింది. ఈ మూవీలో సాయిపల్లవి తన క్యారక్టర్ ప్రకారం శివ కార్తికేయన్ కి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.ప్రేక్షకులకి అర్థమయ్యేలా బహిరంగంగానే చెప్తుంది.ఇందుకోసం చిత్ర బృందం ఒక నెంబర్ ని ఉపయోగించడం జరిగింది.దీంతో కొంత మంది సాయి పల్లవి అభిమానులు,ఆ నెంబర్ నిజంగానే సాయి పల్లవి ఒరిజినల్ ఫోన్ నెంబర్ అని భావించి కాల్స్ చెయ్యడం మొదలుపెట్టారు.సినిమాలో వాడిన నెంబర్ నాదే అని,వరుస ఫోన్ కాల్స్ తో వ్యక్తిగత ప్రశాంతత అనేది లేకుండా పోయిందని, కుటుంబ సభ్యులతో సమయం కూడా గడపలేకపోతున్నానని విగ్నేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించాడు.నష్ట పరిహారంగా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అందులో పొందుపరిచాడు. ఇప్పడు ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమ లోనే హాట్ టిపిక్ గా మారింది. మరి ఈ విషయం మీద చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.  
అక్కినేని నాగార్జున కుటుంబంపై, నాగచైతన్య మాజీ భార్య సమంతపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబంలోని అందరూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అయితే వాటిని బయట పెట్టకుండా చట్టపరంగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆమెపై పరువు నష్టం దావా వెయ్యడంతోపాటు ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు.  రెండు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దానికి కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్‌ సింగ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాగార్జునగారి కుటుంబంపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ కోరుతూ పోస్టు పెట్టారు’ అంటూ దాన్ని కోర్టు ముందు చదివి వినిపించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆమె క్రిమినల్‌ చర్యలకు అర్హురాలని అన్నారు.  తాజాగా నవంబర్‌ 21న మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. నాంపల్లి కోర్టులో ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తన క్లయింట్‌ ఆ వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్‌ వలన కొందరు ఆడపిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతూ సమంత పేరును ఉదహరించారు తప్ప మరో కారణం లేదన్నారు. పిటిషనర్‌ మరొకరి అభిప్రాయాలతో కూడిన పిటిషన్‌ వేశారని, అది అర్హత లేనిదని, దాన్ని కొట్టివేయాలని వాదించారు. వాదన విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 
గోవాలో ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు'ఇంటర్నేషనల్ ఆఫ్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(iifi)కార్యక్రమం జరుగుతుందనే విషయం అందరకి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 కి సంబంధించి 55 వ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇండియన్ చిత్రపరిశ్రమకి చెందిన పలువురు స్టార్ట్స్ ఇప్పటికే గోవాకు చేరుకున్నారు. ఈ కోవలోనే అక్కినేని ఫ్యామిలీ కూడా గోవా చేరుకుంది.నాగార్జున(nagarjuna)అమల(amala)నాగ చైతన్య(naga chaintanya)తో పాటు చైతు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)కూడా ఈ వేడుకకి హాజరయ్యింది. రెడ్ కార్పె్ట్‌పై ఆ నలుగురు వాక్ చేస్తూ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.ముఖ్యంగా కాబోయే వధూవరుల హోదాలో చైతు, శోభిత లు రెడ్ కార్పెట్ పై నడవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఇటీవలే ఆ ఇద్దరి నిశ్చితార్థం జరగగా డిసెంబర్ 4న వివాహం జరగనుంది. ఇక ఈ ఫెస్టివల్‌లో అత్యంత ప్రభావితం కలిగించిన సినిమాలని ప్రదర్శించడం జరుగుతుంది.ఈ క్రమంలోనే లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు(anr)నటించిన దేవదాసు(devadas)చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.  
‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలతో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా కంటే ముందే ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని వారి బేనర్‌లోనే నిర్మించారు. మేకింగ్‌ విషయంలో గానీ, మార్కెటింగ్‌ విషయంలోగానీ రాజమౌళికి ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ నిర్మాతలు కూడా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో వారు కూడా రాజమౌళికి అద్భుతమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు లభించడం వెనుక శోభు యార్లగడ్డ హస్తం ఉందని చెబుతుంటారు. నాటు నాటు పాటను ఆస్కార్‌ వరకు తీసుకెళ్లడం, ఆస్కార్‌ కమిటీ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా స్క్రీనింగ్‌ చేయించడం వరకు శోభు పాత్ర ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మహేష్‌తో చేయబోయే సినిమాకి కూడా శోభు సహకారం అవసరమని రాజమౌళి భావిస్తున్నారట. శ్రీదుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా శోభు యార్లగడ్డ వ్యవహరిస్తారని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి చేసే సినిమాలకు సంబంధించి చాలా శాఖల్లో వారి కుటుంబ సభ్యులే పనిచేస్తుంటారు. కథ, సంగీతం, కాస్ట్యూమ్స్‌, ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ వంటి శాఖల్లో అతని కుటుంబ సభ్యులే ఉంటారు. కానీ, మహేష్‌తో చేయబోయే సినిమాకి కొత్తగా శోభు యార్లగడ్డ ఎంటర్‌ అవుతున్నారని సమాచారం. శోభుపై రాజమౌళికి ఉన్న అపారమైన నమ్మకం కారణంగానే అతన్ని ఈ ప్రాజెక్ట్‌లోకి  తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రపంచస్థాయి మార్కెట్‌ను అందుకునేందుకు రాజమౌళి పక్కాగా ప్లానింగ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. 
వైజయంతి మూవీస్ బ్యానర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)జూన్ 27 న కల్కి 2898 ఏడి(kalki 2898 ad)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.పురాణాలకి సైన్స్ ఫిక్షన్ ని జోడించి తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకునే,రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటులు ప్రధాన పాత్రలు పోషించగా నాగ్ అశ్విన్(nag ashwin)దర్శకత్వాన్ని వహించాడు.ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పన్నెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించడంతో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇక యుఎస్ లో కల్కి ని ప్రత్యంగిరా సినిమాస్ యాభై కోట్ల రిఫండబుల్ అడ్వాన్స్ కింద డిస్ట్రిబ్యూట్ చెయ్యడం జరిగింది.అంటే సినిమా ఫలితంలో ఏమైనా తేడా వస్తే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ యాభై కోట్లని తిరిగి ప్రత్యంగిరా సినిమాస్ కి చెల్లించాలి.ఒక వేళ సినిమా యాభై కోట్ల కంటే ఎక్కువ సాధిస్తే  వైజయంతి, ప్రత్యంగిరాలు ఒప్పందం చేసుకున్నదాని ప్రకారం ఇద్దరు పంచుకోవాలి. ఈ కండిషన్ తో ప్రత్యంగిరా సంస్థ యుఎస్ లో ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థలైన రీగర్,ఏఎంసి ద్వారా రిలీజ్ చెయ్యడం జరిగింది. ఆ తర్వాత కల్కి ఘన విజయాన్ని అందుకోవడంతో పాటుగా తొంబై కోట్ల షేర్ ని కూడా రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి.దీంతో ఇప్పుడు వైజయంతి మూవీస్(vyjayanthi movies)ఆ తొంబై కోట్లలో మాకు అరవై శాతం రావాలని, కలెక్షన్ల వివరాలు కూడా చెప్పాలని యుఎస్ నిబంధనల ప్రకారం రిగర్, ఏఎంసి మల్టిపెక్స్ సంస్థలకి కోర్టు నోటిసులని పంపించడం జరిగింది.  
‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఇదే నయనతార రూపొందించిన డాక్యుమెంటరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మూడు రోజులుగా స్ట్రీమ్‌ అవుతోంది. తను సినిమా రంగానికి ఎలా వచ్చింది, ఏయే సినిమాలు తనకు పేరు తెచ్చాయి, తను స్టార్‌ హీరోయిన్‌ ఎలా కాగలిగింది వంటి అంశాలతోపాటు విఘ్నేష్‌తో తన ప్రేమ వ్యవహారం, అది పెళ్లికి ఎలా దారి తీసింది వంటి విషయాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించింది. ఈ డాక్యుమెంటరీ విషయమై ఇటీవల నయనతార, ధనుష్‌ మధ్య ఓ వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌, నయనతార మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లికి దారి తీసింది. తాను నిర్మించిన డాక్యుమెంటరీలో తన ప్రేమ గురించి చెప్పాలంటే ఆ సినిమా గురించి, ఆ సమయంలో జరిగిన సన్నివేశాల గురించి ప్రస్తావించాలి. అలా చెయ్యాలంటే దానికి సంబంధించిన క్లిప్పింగ్స్‌ అవసరమవుతాయి. అవి తన డాక్యుమెంటరీలో వాడుకోవాలంటే నిర్మాత అయిన ధనుష్‌ పర్మిషన్‌ ఇవ్వాలి. కానీ, ధనుష్‌ దానికి అంగీకరించలేదు.  అయితే డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత.. తన సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ వాడారని, అందుకే తనకు రూ.10 కోట్లు చెల్లించాలని నయనతారకు లీగల్‌ నోటీస్‌ పంపాడు ధనుష్‌. మూడు సెకన్ల క్లిప్పింగ్‌ వాడినందుకే రూ.10 కోట్లు కట్టాలని ధనుష్‌ నోటీస్‌ పంపాడని నయనతార సీరియస్‌ అయింది. అయితే డాక్యుమెంటరీలో ఆ సినిమాకి సంబంధించి 25 సెకన్ల క్లిప్పింగ్స్‌ వాడినట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నయన్‌పై ఫైర్‌ అవుతున్నారు. అంత నిడివి క్లిప్పింగ్స్‌ వాడినందుకు ధనుష్‌ నీకు నోటీస్‌ పంపించడం, డబ్బు డిమాండ్‌ చేయడం తప్పు కాదు అంటున్నారు. నువ్వు డాక్యుమెంటరీ చేసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి డబ్బు తీసుకున్నావు కదా అంటూ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. తాజాగా నయనతార తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నేను చేసిన ప్రతి సినిమాలోని క్యారెక్టర్‌ ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. చాలా సినిమాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నవే చేశాను. నా సినీ ప్రయాణం ఎంతో ఆనందంగా సాగింది. అలాంటి అద్భుతమైన జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని భావించాను. నేను ఆయా నిర్మాతల అనుమతి కోరినపుడు ఏమీ ఆలోచించకుండా నాకు ఎన్‌ఓసిలు ఇచ్చారు. నేను అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుడా ఎన్‌ఓసీలు ఇచ్చిన నిర్మాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు.  ఈ లెటర్‌ విడుదల చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను రూపొందించిన డాక్యుమెంటరీ చాలా నాసిరకంగా ఉందని కోలీవుడ్‌లో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు దానికి పబ్లిసిటీ ఇచ్చుకునేందుకే కొత్తగా తన నిర్మాతలు అంటూ అందరికీ లెటర్స్‌ పంపించింది అంటున్నారు. తమిళ్‌, మలయాళ ఇండస్ట్రీలో తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీకి చెందిన చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌లకు, కామాక్షి పిక్చర్స్‌కి చెందిన డి.శివప్రసాద్‌రెడ్డికి, శ్రీసాయిబాబా మూవీస్‌కి చెందిన యలమంచిలి సాయిబాబులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  వాస్తవానికి నయనతార నిర్మాతల శ్రేయస్సును ఎప్పుడూ కోరుకోలేదని ఆమెతో సినిమాలు చేసిన నిర్మాతలు కొందరు అంటున్నారు. తను ఏ సినిమా చేసినా షూటింగ్‌ వరకే పరిమితం అయ్యేదని, ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలకు, ప్రెస్‌మీట్స్‌కు, ఫంక్షన్స్‌కు కూడా హాజరయ్యేది కాదనీ, అవన్నీ మర్చిపోయి తన అవసరం కోసం ఇలా అందర్నీ పొగుడుతూ లెటర్‌ పోస్ట్‌ చేసింది అని అందరూ విమర్శిస్తున్నారు. నిర్మాతలను అన్ని ఇబ్బందులకు గురి చేసిన నయనతార ఇప్పుడు వారికి థాంక్స్‌ చెబుతూ లెటర్‌ పోస్ట్‌ చేయడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.  నిర్మాతల నుద్దేశించి ఈ లెటర్‌ పోస్ట్‌ చేయడం వెనుక మరో కారణం కూడా వుందని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. తనతో సినిమాలు చేసిన నిర్మాతలందరి పేర్లు ప్రస్తావించి ధనుష్‌ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ధనుష్‌ను టార్గెట్‌ చేసింది కాబట్టే అతని పేరును పక్కన పెట్టి మిగతా అందరి పేర్లను ఆ లెటర్‌లో పేర్కొంది. నయనతార ఇదంతా కావాలనే చేస్తోందని, ఈ వివాదం మరింత పెద్దది అయ్యేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. 
Nayanthara has become Lady Superstar of Tamil Cinema with a good fan base in Malyalam, Telugu, Kannada languages as well. She even debuted in Hindi besides SRK in Jawan, which became a Rs.1000 crore grosser. With such a successful career spanning over two decades, she is not a stranger for controversies too.  The actress has alleged her one time friend, co-star Dhanush, as a fake person with amplified ego and bad attitude. She made such allegations as Dhanush, who is the producer of Naanum Rowdy Dhaan, directed by her husband Vignesh Shivn, denied to give them NOC to use clippings from the film in their marriage documentary, Nayanthara - Beyond the Fairy Tale on Netflix.  Nayanthara also stated that Dhanush sent legal notice for Rs.10 crores for using 3 seconds of NRD music, clip in the show promo. While her open letter created a storm in media, Dhanush remained silent about the issue. Media reports have stated that Dhanush and Nayanthara were once besties - best friends and even had an affair that triggered Aishwarya Dhanush to separate from him.  Some media reports have claimed that Vignesh Shivn, who is hurt by Dhanush's behavior as a producer against him while directing the film and post its success, has triggered even Nayanthara to make this a big issue against him. They are saying Vignesh has used all possible tacts to acquire rights without the knowledge of Dhanush and hence, the actor-producer is also taking the matter seriously.  On the other hand, some state that Dhanush recurred Rs.10 crores loss as the film went over budget and he is trying to compensate for that loss in this manner. Even though the movie became a huge blockbuster Dhanush did not get any share from profits, they claim.  Nayanthara did not respond to such rumors but she once again struck against Dhanush with a detailed thanks letter to all the producers who gave her NOC free of cost and without any drama. She thanked even Megastar Chiranjeevi, Konidela Ram Charan for letting her using clips from Sye Raa Narasimha Reddy.  So, it seems like even if Dhanush wants to let the issue bury down on its own, Nayanthara and Vignesh Shivn seem to be going against him with a vengeance. 
తమిళ అగ్ర హీరోల్లో ఒకడైన ధనుష్(dhanush)సూపర్ స్టార్ రజనీకాంత్(rajini kanth)కూతురు ఐశ్వర్య(aishwarya)ఇరువురు కూడా  తమ భార్య భర్తల బంధానికి స్వస్తి చెప్తున్నామని 2022 లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో  విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు కూడా చేసారు.అప్పట్నుంచి ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది.విడాకులు లేట్ అయ్యే కొద్దీ ధనుష్, ఐశ్వర్య కలిసి పోతారనే చర్చ కూడా ఒక దశలో  జరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా ఇద్దరు మళ్ళీ కోర్టు కి హాజరు కావడం జరిగింది. తాము కలిసి ఉండాలని అనుకోవడం లేదని, విడాకులు తీసుకుంటామని ఖరాకండిగా చెప్పడంతో పాటుగా విడిపోవడానికి గల కారణాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇక వాళ్ళు కలడం అనేది జరగని పనని అర్ధమయ్యింది కాకపోతే ఈ నెల ఇరవై ఏడూకి కోర్టు వాయిదా వేసింది 2004 నవంబర్ 18 న ధనుష్, ఐశ్వర్య ల వివాహం జరగగా సంతానంగా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ధనుష్ సోదరి, ఐశ్వర్య మంచి స్నేహితురాళ్ళు కావడంతో ధనుష్, ఐశ్వర్య మధ్య పరిచయం పెరిగి  ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో రెండేళ్ల పెద్ద.    
Kalki 2898 AD has been a massive hit for Prabhas post Baahubali 2. His immediate releases like Saaho, Radhe Shyam, Adipurush have failed big time while Salaar recovered budget. Kalki went on to collect more than Rs.1200 crores gross worldwide and the actor's fans are eagerly waiting for the proposed sequel. But currently, producer Vyjayanthi Movies are gearing up for a legal battle with US Distributor Prathyangira Cinemas.  The distribution company has distributed Prabhas's Salaar and then Kalki 2898 AD in USA, Canada and Europe. Now, producer of Kalki are asking for 60% to 65% distributor share from US exhibitors. These terms go in hand with what RRR and Baahubali 2 have secured before. But Prathyangira Cinemas have reportedly offered only 45% of share from collected gross.  This has shocked the producer Swapna Dutt and after launching a complaint about discrepancies with Producer Council, she is taking legal action as well. New reports have suggested that legal notices have been sent to US theatre chains to report the film collection details to production house for reference against the distributor's data.  Vyjayanthi Movies have decided to inquire deeply about the discrepancies. Going into the details, the distributor has paid Rs.50 crores in advance for the rights on refundable terms, with 20% commission on share. The film performed well and it collected Rs.156 crores in the market. So, the distributor now owes Rs.25 crores to the producer with 60% share value but with 45% share value they owe nothing.  Hence, the producer has decided to put an end to these discrepancies but some distributors are claiming that in case of losses, several producers do not issue refunds on time as agreed but when the film earns a profit, they immediately ask for their share which is diabolical.  Well, for now though, director Nag Ashwin is looking into the creative part of the sequel while producer is busy with the collection settlements. Let's see when will much awaited sequels Salaar Part 2 and Kalki 2 will go on floors. 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)రీసెంట్ గా కడప దర్గాలో జరిగిన ఎనభయ్యవ నేష‌న‌ల్ ముషాయిరా గ‌జ‌ల్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడనే విషయం తెలిసిందే.అయ్యప్ప మాలలో ఉన్నచరణ్ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(ar rehman)కి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది.ఆ సమయంలో దర్గాలో ఉన్న సమాధికి మొక్కుకొని,మత పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.కానీ అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ఒక సమాధి దగ్గరకి ఎలా వెళ్తాడంటూ, అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషయంలో చరణ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం పై చరణ్ వైఫ్ ఉపాసన(upasana)సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ 'దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది. అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు.మన బలం ఐక్యమత్యంగా ఉండటం.తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం అంటే సనాతన ధర్మాన్ని పాటించడమే అవుతుందంటూ ట్వీట్ చెయ్యడమే కాకుండా వన్‌ నేషన్‌, వన్‌ స్పిరిట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా షేర్‌ చేసింది. ఒక మహిళా నెటిజన్ కూడా చరణ్ దర్గాకి వెళ్లడంపై నెగిటివ్ గా స్పందించగా' శబరిమలలో అయ్యప్పని దర్శించుకునే భక్తులు ముందుగా ఎరుమేలి మసీదులో ఉన్న వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత  మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది తో పాటు ప్రసాదం కూడా తీసుకుంటారు.ఈ సాంప్రదాయం గత ఐదువందల సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ లేని వివాదం,ఇక్కడ ఎందుకంటు ఉపాసన రిప్లై ఇచ్చింది. తన మతాన్ని అనుసరిస్తూ,ఇతర మతాలను గౌరవించడం అనేది గొప్ప వ్యక్తుల గుణం.చరణ్‌ సైతం అదే చేసాడనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు.         
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే.. ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు. మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.   రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.                                            *రూపశ్రీ.
మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
మగవాడు... ఈ పదం ఏమీ పెద్ద బిరుదు కాదు కానీ, పుట్టిన తర్వాత  బాధ్యతగా పెరిగి, తన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమార్గంలో నడిపించటానికి పాటుపడుతున్న ప్రతివాడూ మగాడే.. మొనగాడే... అటువంటి వారిని గుర్తించి,  వాళ్ళని అలా మార్చే విషయాల గురించి, అలా మారకుండా చేసే విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మగాడు సరిగా లేకపోతే.. అంటే బాధ్యతగా లేకపోతే అతని కుటుంబం, కుటుంబ సభ్యులు మానసికంగానూ, ఆర్థికంగాను, సామాజికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయపరంగా  వారు  చేస్తున్న సేవలను  జ్ఞాపకం చేసుకోవడమే లక్ష్యం.  పురుషులు సమాజంలో తీసుకొచ్చే మంచి మార్పులని గుర్తు చేసి, వారిని ఆదర్శంగా చూపించే వీలు కల్పించే రోజు ఇది.   పురుషుల భావోద్వేగ స్వేచ్ఛ, పెరుగుతున్న  పురుషుల ఆత్మహత్యలు  వంటి అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి వేదికగా నిలుస్తుంది.  పురుషులు కూడా ఇతరుల మాదిరిగా మామూలు మనుషులేనని, వారికీ బాధ, నిరాశ కలిగినప్పుడు భావోద్వేగ మద్దతు అవసరమే అని  సమాజం గుర్తించేలా ప్రేరేపిస్తుంది.  సమాజంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన కొన్ని భావనలు, పురుషులు తమ  భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటపెట్టనివ్వకుండా చేస్తున్నాయి.  ‘మగ పిల్లాడు ఏడవటం ఏంటిరా? చూస్తే నవ్వుతారు’ అంటారు చాలా మంది. దాంతో వాళ్ళు తమ బాధ బయటపెట్టరు.   ఇది వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకే మగాళ్ళు చాలా కరుకు స్వభావం కలిగి ఉంటారు అంటారు. ఈ సమస్యలను గుర్తించటం ద్వారా  ఇంటర్నేషనల్ మెన్స్ డే మగావారి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది. కుటుంబంలో, వివిధ రంగాల్లో,   సమాజంలో పురుషులు అనేక పాత్రలను పోషిస్తారు. కంటికి రెప్పలా కాపాడే  తండ్రిలా, మద్దతు ఇచ్చే అన్నగా, నమ్మకమైన స్నేహితుడునిగా, ప్రేమించే భాగస్వామిగా, సమాజంపట్ల బాధ్యత ఉన్న మనిషిగా పురుషులు చుట్టూ ఉన్నవారి కోసమే జీవితాన్ని   వెచ్చిస్తారు. ఇంత చేసినా వారి కృషి, త్యాగానికి అంతగా   గుర్తించబడవు. మెన్స్ డే ఈ విషయాలను గుర్తించేలా చేస్తుంది. పురుష దినోత్సవం సందర్భంగా కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని  ప్రధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.. నైతిక విలువలు, బాధ్యతలు కలిగిన మగవారిని గుర్తించి, వారిని ఆదర్శంగా చూపించడం. ఇలా చేయడం వల్ల మగవారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుంది.     స్త్రీ, పురుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రోత్సహించటం. ఇలా చేస్తే ప్రతి మగవాడి నుండి స్త్రీ కి సంరక్షణ, సహాయ సహకారాలు అందుతాయి. పురుషులు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేయడం  ప్రధానం. కుటుంబ జీవితంలో, పనిచేసే చోట, బయట సమాజంలో   పురుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర అనేక సమస్యల గురించి అవగాహన కల్పించటం. ఇది మగవారిలో నిగూఢంగా దాగున్న శక్తిని, వారి మానసిక స్వభావాన్ని బయటపెడుతుంది. మన సమాజం పురుషాదిక్యంలా కనపడుతున్నప్పటికీ బాధపడుతున్న, అణచివేయబడుతున్న అమాయకపు పురుషులు కూడా ఉంటారు, చాలాసార్లు తప్పుడు ఆరోపణల వల్ల  వాళ్ల జీవితాలనే కోల్పోతుంటారు. అటువంటివారిని కాపాడేందుకు  న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రధానంగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. గణాంకాల ప్రకారం, పురుషులు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.  వైద్య సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. అందుకే మెయిన్స్ డే రోజు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టటం వంటి విషయాలపై చర్చలను ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే కేవలం పురుషులకే సంబంధించినది కాదు,  ఇది లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.  అప్పుడే  పురుషులు, స్త్రీలు కలిసి శాంతి కోసం, ప్రగతి కోసం  పనిచేస్తారు. ప్రతిమగవాడు తనకు  ఒక కుటుంబం ఏర్పడ్డాక తన జీవితాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తాడు. కుటుంబ సంతోషమే తన సంతోషం అని అనుకుంటాడు. తల్లి పడే కష్టం పిల్లల కాళ్ళ ముందు కనబడితే తండ్రి కష్టం కనిపించదు. అలా మగవాడి కష్టం బయటకు కనిపించదు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా తనను తాను కోల్పోయే మగాళ్ళు ఎప్పుడూ గౌరవించబడాలి. అలాంటి మగ మహారాజులకు అందరికీ హ్యాపీ మెన్స్ డే..!                                 *రూపశ్రీ 
  టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్.  ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి.. ఫిల్టర్ పేపర్ తో.. టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద  కొంచెం నీరు చిలకరించాలి.  తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు. నీటితో.. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ  నీటిలో టీ ఆకులు వేయాలి.  నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. రుచి.. స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి.  కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం.  మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి.  వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి  తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు. రంగు.. స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి.  కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది. స్వభావం.. నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి.  ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. కల్తీ టీ .. చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి.  పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది.  ఇది   నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది.                                             *రూపశ్రీ. 
అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక  రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల  అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా. పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. సిమ్లా మిర్చి... సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది. దానిమ్మ పండు.. ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం  నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా  పనిచేస్తుంది. అల్లం... అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది. పాల కూర... పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది. టమాట రసం... విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది. యాపిల్... యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు. బీన్స్... బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది. కమలా పండు... సంత్రా... విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.  
  ఎండుద్రాక్ష తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడే డ్రై ఫ్రూట్. సాధారణ ద్రాక్షను ఎండబెట్డడం ద్వారా దీర్ఘకాలంగా నిల్వ చేస్తారని అందరికీ తెలిసిందే.  అయితే సాధారణ ద్రాక్ష కంటే ఎండుద్రాక్ష మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ద్రాక్ష ఎండేకొద్ది అందులో పోషకాలు, తీపిదనం పెరుగుతుంది.  ఎండుద్రాక్షను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు,  ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు.  ఆహార నిపుణులు అయితే మహిళలు ఎండుద్రాక్షను  ఖచ్చితంగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు.  ముఖ్యంగా ఎండుద్రాక్ష నీరు తాగుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా నయమవుతాయట.  అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. ఎండుద్రాక్షల ఐరన్, కాల్షియం,  ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది కూడా. ఎండుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి ఎండుద్రాక్షను కూడా తినడం కొందరికి అలవాటు.   ప్రయోజనాలు.. ఎండుద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి ఎండుద్రాక్షలను కూడా తింటుంటే శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే విషపదార్థాలు  టాక్సిన్లు  బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఎండుద్రాక్ష నీరు గొప్ప మెడిసిన్.  ఈ నీరు స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తిని ఆ నీటిని తాగుతుంటే సులువుగా బరువు తగ్గుతారు. ఎండుద్రాక్ష నీటిలో నానిన తరువాత అందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఏర్పడుతుంది.  ఈ నీటిని ఉదయాన్నే తాగి ఆ నానిన ఎండుద్రాక్షలు కూడా తింటుంటే జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.  ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎండుద్రాక్ష డ్రై ఫ్రూట్ గా పరిగణించబడుతుంది.  ఇందులో సాధారణ ద్రాక్ష కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి.  వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగుతున్నా,  నానిన ఎండుద్రాక్ష తింటున్నా రోజంతా శరీరం చురుగ్గా ఉంటుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు.  చాలా రకాల ఆహారాలను అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్ష నీరు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండుద్రాక్ష నీటిని ఉదయాన్నే తాగడం చాలా మంచిది.  ఒకవేళ ఆ సయమంలో తాగలేక పోతే.. ఉదయం టిఫిన్ సమయంలో లేదా.. సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా తాగవచ్చు.  కనీసం 15 నుండి నెల రోజులు దీన్ని క్రమం తప్పకుండా ఫాల్లో అవుతుంటే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.                                                           *రూపశ్రీ.