జర్నలిస్ట్ ల భూములకు మోక్షం... పేట్ బషీర్ బాద్ లో తొలి కూల్చివేత
posted on Nov 21, 2024 6:09PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు మోక్షం లభించే రోజులు వచ్చేశాయి. . నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీర్ బాద్ లో 38 ఎకరాలు 2008లో జెఎన్ జె హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. న్యాయ వివాదాల్లో ఇరుక్కుని రెండు దశాబ్దాలుగా లబ్దిదారులకు అంద లేదు. 2017 లో సుప్రీం ఇంటెరిం ఆర్డర్ వచ్చినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వం ఆ స్థలాలు జర్నలిస్టులకు అప్పగించలేదు.
తుది తీర్పు వచ్చినప్పటికీ అదే పరిస్థితి. టీం జెఎన్ జె నేతృత్వంలో పోరాట ఫలితంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. ఇచ్చిన మాటకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఆ స్థలాలను అప్పగించింది. కెసీఆర్ హాయంలో జరిగిన ఈ భూముల ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తోంది. గురువారం పేట్ బషీర్ బాద్ లో వెలిసిన అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్న కట్టడాల జోలికి పోవడం లేదు. గత ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉంది. వైఎస్ ఆర్ కేటాయించిన ఈ భూములను తిరిగి జర్నలిస్ట్ లకు అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సొసైటీ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు.