LATEST NEWS
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంద. సోమవారం (నవంబర్ 25) శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం స్వామివారిని 75 వేల 737 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల898 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది. 
బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు,  సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ కేటీఆర్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంట‌ర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు న‌డిపించే వారు ఎవ‌ర‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు   రాబోయే రోజుల్లో హ‌రీశ్‌రావు పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నాడ‌ని, ఆయ‌నే పార్టీని ముందుకు న‌డిపించే వ్య‌క్తి అంటూ  ప్ర‌చారం చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే క‌విత రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ గురుకులలో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేశారు. దీనికితోడు చాలారోజుల త‌రువాత త‌న నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వ‌హించారు. దీంతో క‌విత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్ల‌క‌ముందు క‌విత అసెంబ్లీలో పూలే విగ్ర‌హం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హ‌క్కుల సాధ‌న ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భార‌త జాగృతి సంస్థ‌ల త‌ర‌పున జిల్లాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌న‌మెంతో మ‌న‌కంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్య‌మాన్ని తలకెత్తుకున్నారు.   కుల‌గ‌ణ‌న చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే  అరెస్ట‌యి జైలుకెళ్లి,  బెయిల్ పై  విడుద‌లైన అనంత‌రం  సైలెంట్ అయిపోయారు.  పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  క‌విత ఉన్న‌ట్లుండి ఇప్పుడు రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అంద‌రూ ఊహించిన‌ట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ను క‌విత తీసుకోబోతున్నార‌ని, అందుకే ఆమె ఉన్న‌ట్లుంటి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. క‌విత పొలిటిక‌ల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వ‌చ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. క‌విత జైల్లో ఉన్న స‌మ‌యంలో త‌న చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్‌ ఢిల్లీలోనే మ‌కాం వేసి తీవ్రంగా శ్ర‌మించారు. జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత క‌విత‌ సైతం   అన్న‌ను హ‌త్తుకొని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క్ర‌మంలో అన్నాచెల్లెలు మ‌ధ్య ఒక‌రిపైఒక‌రికి ఉన్న ప్రేమ బ‌హిర్గ‌తం చేశారు. దీంతో రాజ‌కీయాల్లో తాను ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ.. త‌న అన్న త‌రువాత‌నే ఉంటాన‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పారు. ఈ క్ర‌మంలో ఒక‌వేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లిన‌ప్ప‌టికీ పార్టీ బాధ్య‌త‌లను క‌విత త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుంటార‌ని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయ‌న సార‌థ్యంలో రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం కృషి చేస్తూనే.. మ‌రో వ్య‌క్తి చేతికి పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారని, త‌ద్వారా కేసీఆర్ వార‌సుడు కేటీఆర్ అనే విష‌యాన్ని క్యాడ‌ర్ లోకి క‌విత‌  బ‌లంగా తీసుకెళ్తున్నార‌ని బీఆర్ఎస్‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత కేసీఆర్ పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌టం లేదు. అడ‌పాద‌డ‌పా పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. కేటీఆరే పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌రీశ్ రావు లాంటి సీనియ‌ర్ నేత‌కు బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని ఓ వ‌ర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ ప‌గ్గాలు హ‌రీశ్ రావు చేతికి అప్ప‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. త‌న కుమార్తె క‌విత‌ను రంగంలోకి దింపిన‌ట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క‌విత త‌న తండ్రి సూచ‌న‌తోనే ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా హ‌రీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగానే క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యార‌ని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టిచూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జ‌రుగుతోంది. ప్ర‌తీ విభాగంలోనూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ఫైళ్లు చ‌క‌చ‌కా ముందుకు క‌దులుతున్నాయి. దీంతో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్క‌డా రోడ్లు వేసినా దాఖ‌లాలు లేవు. క‌నీసం గుంత‌లు పూడ్చిన ఆనవాళ్లు కూడా లేవు.   కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న సాగింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్లకు పంపించ‌డం, వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కే వైసీపీ నేత‌లు, పోలీసులు ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుపైనా రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలోనూ, నందిగామ‌లో ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు నాయుడు టార్గెట్ గా వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. నందిగామ‌లో రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో వారు ప‌ట్టించుకోలేదు. ఆ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపేందుకు ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా.. పూలు చ‌ల్లుతున్న స‌మ‌యంలో రాళ్లు ప‌డ్డాయంటూ పోలీసులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాజాగా.. నందిగామ‌లో చంద్ర‌బాబుపై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. ఈ క్ర‌మంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ‌ల కేసులు పెట్టిన పోలీసుల‌పైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోని ప‌లువురి నేత‌ల‌పైనా, వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపైన‌ అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు. మార్ఫింగ్ ఫొటోలను పోస్టుచేసి రాక్ష‌సానందం పొందారు. అప్ప‌ట్లో అస‌భ్య పోస్టుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌దజాలంతో, మార్పింగ్ ఫొటోల‌తో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేయ‌గా.. మ‌రికొంద‌రికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇచ్చారు. తాజాగా, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన కేసులు రీ ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు.  ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను తాజాగా నందిగామ పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్​లో వీధిలైట్లు ఆర్పి చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలు చ‌ల్లే స‌మ‌యంలో పొర‌పాటున చిన్న‌చిన్న‌ రాళ్లు పడ్డాయని కవర్ చేశారు. కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు. అవే రాళ్లు చంద్రబాబుకు తగిలి ఉంటే ప్రాణపాయం జరిగేదని తెలిసిన‌ప్పటికీ సీపీ కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబుపై రాళ్ల దాడులు చాలా సంద‌ర్భాల్లో జరిగాయి. చంద్ర‌బాబును హ‌త‌మార్చాల‌న్న‌ ఉద్దేశంతో కుట్ర పూరితంగా పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్క అయ్యి దాడులు చేశారని ఇవి ఖచ్చితంగా హత్యా ప్రయత్నాలేనన్న అనుమానాల‌ను టీడీపీ శ్రేణులు గ‌తంలో ప‌లుసార్లు వ్య‌క్తం చేశారు. ఇదిలాఉంటే కుప్ప‌లోనూ చంద్ర‌బాబుపై ప‌లుసార్లు రాళ్ల‌దాడికి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కూడా కేసులు రీ ఓపెన్ చేసి విచార‌ణచేప‌ట్టాల‌ని తెలుగుదేశం నేత‌లు పోలీసుల‌ను కోరుతున్నారు. మొత్తానికి ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌ద‌జాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. ఇదే క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల‌పై న‌మోదైన కేసుల‌ను రీ ఓపెన్ చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.
భారత ప్రధాని మోడీ  ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌ లకు శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం  అన్నిఏర్పాట్లు చేసింది.  అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో  అతిపెద్ద ఎన్టిపిసి  గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మద్దిలపాలెంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 (సోమవారం)  నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ  నేపథ్యంలో  అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది.  కేంద్ర పార్లమెంటరీ  వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు  పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల  నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర  రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆదాని పై అమెరికాలో కేసు నమోదు కావడంపై చర్చించాల్సింది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ మహజన్ తెలిపారు.   పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబర్ 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవమైన  నవంబర్ 26న పార్లమెంటు సెషన్ జరగదు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై  ఏర్పాటైన  పార్లమెంట్ సంయుక్త  కమిటీ ఈ నెల 29న తన తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. 
ALSO ON TELUGUONE N E W S
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)అప్ కమింగ్ మూవీ పుష్ప 2(pushpa 2)డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.ఈ మేరకు కొన్నిరోజుల క్రితం బీహార్ లోట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం నిన్న చెన్నై వేదికగా  ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.  అత్యంత భారీగా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక(rashmika)తో  పాటు చిత్ర  బృందం మొత్తం పాల్గొంది.చెన్నై లో సాంగ్ రిలీజ్ చెయ్యడానికి ప్రధాన కారణం తమిళ సినీ మార్కెట్ లో అల్లు అర్జున్ తన హవాని కొనసాగించడానికే అని తెలుస్తుంది. ఇంత  వరకు ఏ తెలుగు సినిమా కూడా చెన్నైలో అంత భారీ ఎత్తున ఒక సాంగ్ విషయంలో ఈవెంట్ ని జరపలేదు.తమిళ తంబిలకి అల్లు అర్జున్ మీ వాడే అని అనిపించుకోవడానికే అక్కడ భారీ ఎత్తున ఈవెంట్ జరిపినట్టు తెలుస్తుంది.త్వరలోనే కేరళ, కర్ణాటక, ముంబైలలో కూడా భారీ ఈవెంట్ లు జరగనున్నాయి.  ఇలా పుష్ప 2 ని ఆ లాంగ్వేజ్ ల వాళ్ళు తమ మూవీగా భావించాలని అల్లు అర్జున్ తో చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా అంటున్నారు.తద్వారా పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సాధించాలని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇక నిన్న రిలీజైన సాంగ్ప్రముఖ హీరోయిన్ శ్రీలీల(sreeleela)అల్లు అర్జున్ మీద చిత్రీకరించగా ఆ ఇద్దరు ఒక రేంజ్ లో స్టెప్స్ వేశారనే టాక్ వస్తుంది.   
  లెజెండరీ నటుడు శోభన్ బాబు (Sobhan Babu) ఇంట విషాదం చోటు చేసుకుంది. శోభన్ బాబు తమ్ముడు ఉప్పు సాంబశివరావు (Uppu Sambasiva Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామమైన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిన్న నందిగామలో అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. సాంబశివరావు మృతితో చిన్న నందిగామ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శోభన్ బాబు 2008 మార్చి 20న 71 ఏళ్ళ వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  
సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'లగ్గం'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన చిత్రమిది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరిస్తోంది. (Laggam On OTT) లగ్గం సినిమా ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహాలలో అందుబాటులోకి వచ్చింది. లగ్గం అనే టైటిల్ కి తగ్గట్టుగా పెళ్లి తంతును చూపించడమే కాకుండా, ఇందులో కొన్ని ఆలోచించదగ్గ అంశాలను చర్చించారు. సాఫ్ట్ వేర్ అల్లుడు, అమెరికా అల్లుడు అంటూ అత్యాశకు పోయే కొందరు తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా ఈ సినిమా ఉంది. అశ్లీల సంభాషణలు, సన్నివేశాలు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ సినిమాను రూపొందించారు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా కావడంతో ఓటీటీలో 'లగ్గం'కి మంచి ఆదరణ లభిస్తోంది. లగ్గం సినిమాని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహించగా, మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. చరణ్ అర్జున్ పాటలు స్వరపరిచిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరించారు. ఎల్బీ శ్రీరామ్ గారు, రఘు బాబు, రచ్చ రవి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం 'మనదేశం' విడుదలై నేటికి 75 వసంతాలు పూర్తయింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రూపొందించిన 'మనదేశం' 1949, నవంబర్ 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రతో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు ఎన్టీఆర్. పాత్ర చిన్నదైనా నటుడిగా ఎంతో ప్రభావం చూపారు. 'మనదేశం' తర్వాత ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు. షావుకారు, పల్లెటూరి పిల్ల, పాతాళ భైరవి, మల్లీశ్వరి వంటి సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తన అసాధారణ నటనతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు చేస్తూ నటసార్వభౌముడు అనిపించుకున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. (NTR Mana Desam) అలాంటి మహానటుడి సినీ ప్రస్థానానికి పునాది వేసిన 'మనదేశం' చిత్రం నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, నటుడిగా తాను 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. "నేను అనునిత్యం స్మరించే పేరు.. నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై 'మన దేశం' చిత్రంతో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24తో 75 ఏళ్ళు పూర్తిచేసుకొని 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, హీరోగా నేను 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాన్న గారి నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతికనిపుణులకు, పంపిణీదారులకు, థియోటర్స్ యాజమాన్యం & సిబ్బందికి, మీడియాకి , అన్ని విభాగాల సినీ కార్మికులకు, నా ఉన్నతిని కోరే ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని బాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  
అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి పంచాయతీలో అలీకి ఫామ్ హౌస్ ఉందట. అయితే ఆ ఫామ్ హౌస్ లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, పన్ను చెల్లించకుండా అలీ నిర్మాణాలు చేపడుతున్నారట. ఇది అధికారుల దృష్టికి రావడంతో, గ్రామ సెక్రటరీ శోభారాణి అలీకి నోటీసులు జారీ చేశారు. నిజానికి ఈ నెల 5వ తేదీనే నోటీసు ఇవ్వగా, అలీ నుంచి ఎటువంటి స్పందనా లేదట. దీంతో తాజాగా మరోసారి నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కూడా స్పందించకపోతే అధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.
Cast: Nazriya Fahadh, Basil Joseph, Akhila Bargavan, Merin Philip, Pooja Mohanraj, Deepak Parambol, Sidharth Bharathan, Kottayam Ramesh  Crew:  Written by Mc Jithin, Athul Ramachandran, Libin T.B. Cinematography by Sharan Velayudhan Nair Editing by Chaman Chakko Music by Christo Xavier Produced by A.V. Anoop, Shyju Khalid, Sameer Thahir Directed by MC Jithin Nazriya Nazim Fahadh has been taking gap between her projects and she is making her appearance on screen worth all the efforts. She starred in Ante Sundaraniki in Telugu with Nani and then did not accept any projects. But she has come up with Sookshmadarshini in Malayalam and raising star Basil Joseph has been cast in another leading role in the film. The movie released on 22nd November and let's discuss about the movie in detail.  Plot:  Priyadarshini (Nazriya Fahadh), wife of Antony (Deepak Parambol) and mother of a young daughter, decides to find a new job. But she gets suspicious of their new neighbor Manuel (Basil Joseph) and his connection with his mother. She starts to investigate into his actions with the help of her local neighborhood gang, Sulu (Akhila Bargavan), Asma (Pooja Mohanraj). Why she got so suspicious about Manuel? What is the reason behind his weird activities? Watch the movie to know more.  Analysis:  Nazriya showcased a highly matured side to her performing capabilties in this film. She is hyper-active at the same time very controlled, subdued from her previous performances. As a person, who is highly curious to get answers for her suspicion, she did a great job. Basil Joseph, once again, proved that he is one of the best performers with this role. He is able to create suspicion with a laughing face expression and his performance makes the film what it is.  While everyone impress us with their performances but Akhila stands out. Music by Christo Xavier adds to the intrigue and curiosity that we feel throughout. He is able to score aptly to the situation. Production values and technical aspects are top notch. With a very nominal budget, the makers have been able to give us a thrilling theatrical experience.  Writer and director MC Jithin has expertly crafted a thriller using realistic elements without exaggerating. While few elements seem to have been dramtised for effect, the core remains realistic and believable without over the top stunts to prove masculinity or feminism. With a grounded story telling and engaging screenplay, the director has been able to hold our interest with stunning twists. The cause, act and investigation everything is executed to pitch perfect level accuracy.  In Conclusion:  The movie holds your interest throughout and it is a must-have theatrical experience. Rating: 3.5/5 
ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా వేదికగా ప్రసారమయ్యే నందమూరి బాలకృష్ణ(balakrishna)వన్ మాన్ టాక్ షో అన్ స్టాప్పబుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఇప్పటికే మూడు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలగవ సీజన్ లో మొదటి నాలుగు ఎపిసోడ్ లని పూర్తి చేసుకుంది.  రీసెంట్ గా ప్రారంభమయిన ఐదో ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వచ్చిన విషయం   తెలిసిందే.మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ఎపిసోడ్ లో మొదటి భాగం ఇటీవలే టెలికాస్ట్ అవ్వగా,రెండవ భాగం రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యింది.ఈ ఎపిసోడ్ లో బన్నీ తన కూతురు,కొడుకు తో కలిసి పాల్గొన్నాడు.బాలయ్యతో కలిసి ఆ ముగ్గురు చేసిన హంగామ,ఎంతో ఇంట్రెస్టింగ్ గా,ఎంటర్ టైన్ మెంట్స్ సాగడంతో పాటు,బాలయ్య,అర్హ(arha)మధ్య సరదా సన్నివేశాలు, అర్హ తెలుగు భాషకి సంబంధించి చెప్పిన పద్యం,తెలుగు మాటలు, అల్లు అర్జున్, చిరంజీవి(chiranjeevi)గురించి మాట్లాడిన మాటలు,ఇలా మొత్తం ప్రేక్షకులకి ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కారణంతోనే ఇప్పుడు  ఆ ఎపిసోడ్ దెబ్బకి గత ఓటిటి రికార్డులన్నీ చెల్ల చెదురు అయ్యి హయ్యెస్ట్ వ్యూస్ ని  సంపాదించిందని తెలుస్తుంది.  
ప్రియురాలిపై ఉన్న వ్యామోహం వల్ల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని పాతాళానికి తొక్కేసింది. కన్నడ సినీ రంగంలో ఉజ్వలంగా సాగుతున్న అతని కెరీర్‌కి బ్రేక్‌ పడింది. సరిదిద్దుకోలేని తప్పు అతన్ని, అతని కుటుంబాన్ని అయోమయంలో పడేసింది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. బయటి ప్రపంచానికి కనిపించకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉంటున్నాడు దర్శన్‌. అయినా అతనికి ప్రశాంతత లేదు. ఈ హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దర్శన్‌తోపాటు మిగతా నిందితులపై కూడా అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.  రేణుకాస్వామి హత్య అనంతరం మూడు వేల పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశారు పోలీసులు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేయడానికి కారణం.. కేసులో మరిన్ని సాక్ష్యాలు, నేర నిరూపణకు ఉపయోగపడే కొన్ని ఫోటోలు పోలీసులకు లభించాయి. అందుకే 1300 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేస్తున్నారు. ఈ చార్జిషీటు కేసుకు అత్యంత కీలకంగా మారబోతోంది. ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్‌ పర్సనల్‌ స్టాఫ్‌లోని పవన్‌ అనే నిందితుడు కూడా ఉన్నాడు. అతను హత్యాస్థలంలో కొన్ని ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, అతను కొన్ని ఫోటోలను డిలీట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వాటిని కూడా రీస్టోర్‌ చేయగలిగారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆ ఫోటోల్లో దర్శన్‌ ఉన్నాడు. అంతేకాదు, ఇతర నిందితులు వాడిన కారు ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. వీటితోపాటు మరో మంది 30 సాక్షుల వాంగ్మూలాలు, 40కి పైగా సాక్ష్యాధారాల్ని కొత్త చార్జిషీటులో పొందుపరిచారు. రేణుకాస్వామి హత్య కేసును బెంగళూరు పోలీసులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ వచ్చిన తర్వాత ఆ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. దర్శన్‌, పవిత్రగౌడ్‌తోపాటు ఇతర నిందితులు సాధారణ బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు వినేందుకు 26వ తేదీకి వాయిదా వేసింది బెంగళూరు హైకోర్టు. అనారోగ్య కారణాల వల్ల దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది కోర్టు. అతని వెన్నెముక ఆపరేషన్‌ నిమిత్తం ఈ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరు వారాల్లోపు చికిత్స పూర్తి చేసుకొని కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈలోగా సాధారణ బెయిల్‌ వస్తుందని దర్శన్‌ ఆశ పడ్డాడు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేస్తుండడంతో ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవిధంగా దర్శన్‌ చాప్టర్‌ ముగిసినట్టే. తాజా చార్జిషీటుతో నిందితుల్ని నేరస్తులుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. 
బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించిన తేజసజ్జ(teja sajja)ఆ పై జాంబీ రెడ్డితో సోలో హీరోగా ఎంటర్ అయ్యి సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్(hanuman)తో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రెండువందల నలబై దేశాల్లోప్రసారం కాబోతున్న ది రానా దగ్గుబాటి(rana daggubati)షో కి మొదటి ఎపిసోడ్ లో హీరో నాని(nani)తో పాటు తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు.గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోఆ మొదటి ఎపిసోడ్‌ను వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారం కూడా చేశారు ఇక ఆ ఇంటర్వ్యూ లో తేజ మాట్లాడుతు సినిమా ఇండస్ట్రీలో వెయ్యికోట్ల మార్కెట్ కి ఒకే ఒక్క మొగుడు ప్రభాస్(prabhas)అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలవడమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ లో అయితే ఎనలేని జోష్ ని తీసుకొస్తున్నాయి.బాహుబలి(baahubali)తో వెయ్యి కోట్లు సాధించిన ప్రభాస్, ఆ తర్వాత కల్కి(kalki)తో పదకొండు వందల కోట్లు సాధించిన విషయం అందరకి తెలిసిందే.      
దక్షిణ భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు నిత్య మీనన్(nithya menen)తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.మూవీలో తన క్యారక్టర్ కి ప్రాధాన్య లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా కూడా రిజక్ట్ చేస్తుందంటే, నటన పట్ల ఆమెకి ఉన్న మక్కువని అర్ధం చేసుకోవచ్చు.బాలనటిగా 1998 లోనే ఒక ఇంగ్లీష్ చిత్రంలో చేసిన నిత్య మీనన్ ఇటీవలే 'తిరు'మూవీకి సంబంధించి జాతీయ ఉత్తమనటి అవార్డుని కూడా అందుకుంది.    ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (iifa )ఈవెంట్ కి హాజరయ్యింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మీడియాతో మాట్లాడుతు నటన అనేది భావోద్వేగానికి సంబంధించింది.దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు.ఒక మూవీలో తల్లి క్యారక్టర్ పోషించడానికి  అనుభవం అవసరం లేదు.ఆ క్యారక్టర్ లో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు.మనం చేసే క్యారెక్టర్స్ పై మనకి పూర్తి విశ్వాసం ఉండాలి.మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి.లేదంటే ఆ ప్రభావం మనం పోషించే క్యారక్టర్ మీద పడుతుంది. గతంలో నేనెప్పుడూ విచారంగా ఉండేదాన్ని.దాంతో సెంటిమెంట్ సీన్స్ లో  సులభంగా నటించేదాన్ని.ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చెయ్యడం చాలా కష్టంగా మారింది.బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో.ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో తేలికపాటి పాత్రలని ఎంచుకున్నందుకు చాలా మంది నుంచి విమర్శలు వచ్చాయి.దాంతో కథల్నిఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ధనుష్(dhanush)తో ఇడ్లి కడై, విజయ్ సేతుపతి(vijay sethupati)తో గోల్డెన్ వీసా వంటి చిత్రాల్లో నిత్య మీనన్ డిఫరెంట్ రోల్స్ ని నిత్య ప్లే చేస్తుంది.  
పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు.  తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా  అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు.  కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి.  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు.  చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి.  అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు.  ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. గౌరవం.. ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు.  ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు.  బయటి వారి నుండి పెద్దలు,  కుటుంబ సభ్యులు,  చివరకు భార్య,  పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు.  కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా,   అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం.. కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి.  తన భాద్యతగా భార్య, పిల్లలు,  తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది.  పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు. ఇతరుల మాట వినడం.. తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట,  తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి.  ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు. శారీరక శ్రద్ద.. ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి.  ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ,  మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక,  ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి. ఇంటి పనులు.. కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి..  ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ  ఇంటి పనులు చక్కబెడుతుంటారు.  మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.                                                  *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో మనుషులకు ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా కొత్త ఆహారపదార్థం లేదా కొత్త స్టైల్ ను అనుసరించడం ఇంకా ఇంకా కొత్తదనం అనుకుంటూ వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ ఉండటం అలవాటు. అలాంటి కొత్తదనం వెంట పరుగులుతీసే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో లేదా అంతకు మించి విషయాల్లో ఎక్కువగా మునిగిపోతుంటారు. ఆ విషయాల గురించే తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళు అవుతుంటారు. అలాంటి పిచ్చిని వ్యసనం అని కూడా అనొచ్చు. ఈ వ్యసనం చాలామందిలో, చాలా విషయాల్లో ఉన్నట్టు, చాలా రకాలుగా కూడా ఉంటుంది. అయితే ఆ వ్యసనం జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అంతలా జీవితాన్ని తికమకలోకి నెడుతున్నా ఒత్తిడికి లోనవుతూ కూడా ఆ వ్యసనాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వ్యసనం మరి.  ఈకాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు, ఫుడ్ విషయంలో, తాత్కాలిక సంతోషాన్నిచ్చే విషయాలకు, ఇంకా మనుషులకు, కొన్ని విచిత్రమైన అలవాట్లకు, మగవాళ్ళు అయితే ధూమపానం, మద్యపానం, అమ్మాయిలు అయితే షాపింగ్, మేకప్ ఇలా చాలా విషయాలను అతిగా ఇష్టపడుతూ వాటికి వ్యసనపరులుగా  మారిపోతున్నారు. అలా మారినవాళ్ళు కూడా చాలామంది ఉంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో.  దేన్నైనా జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవడం మంచిదే కానీ జీవితమే ఆ విషయానికి అంకితం చేసేయ్యకూడదు. అలా చేస్తే జీవితమంతా కల్లోలమే కదా!!  అలాంటి కల్లోలాన్ని తప్పించుకోవాలంటే వ్యసనానికి  విడాకులు ఇచ్చేయ్యాలి.  పరిధులు, పరిమితులు! మనిషి ఆలోచనలకు ఒక పరిధి ఉన్నట్టే అలవాట్లకు కూడా ఒక పరిధి  ఉంటుంది. ఆ పరిది దాటిపోతే మనిషి పరిమితులు కూడా అస్తవ్యస్తం అవుతాయి.  నిజానికి మనిషి స్థాయిని బట్టి పరిమితులు కూడా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తం అయితే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటన్నిటినీ ఒకటికీ రెండు సార్లు విశ్లేషించుకుంటూ ఉంటే వ్యసనం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ప్రతి విషయానికి ఒక పరిధి నిర్దేశించుకుంటూ ఉంటే అది అతిగా మారదు. భోజనం చేసేటప్పుడు కళ్లెదురుగా నచ్చిన పదార్థం ఎంతున్నా అది కడుపు నిండేవరకు మాత్రమే తినగలం, అలా కాదని ఎక్కువ తింటే రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా ఒక పదార్థాన్ని మితంగా తింటే హాయిగా ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం తినేస్తే అజీర్తి, దాని వెంట మళ్లీ అనుబంధంగా బోలెడు సమస్యలు కూడా వస్తాయి. తీపి పదార్థాలు ఇష్టమని అతిగా తింటే చెక్కర వ్యాధి శరీరాన్ని కబళించి ఇక మళ్లీ తీపిని కన్నెత్తి చూడనివ్వని పరిస్థితికి నెట్టేస్తుంది. మార్పు కోసం మంత్రం! వ్యాసనాల బారినపడ్డవారికి వాటి నుండి బయటకు వచ్చేయ్యాలి అని ఉన్నా గట్టిగా దాన్నుండి దూరం కాలేరు. మనసు నిలకడ లేనితనం దానికో పెద్ద కారణం.  నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దానిమీద గట్టిగా నిలబడటమే కొంచం కాదు చాలా కష్టం. అయితే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లవాడి వేలుకు వేపనూనె పూస్తే వాడు నోట్లో వేలు పెట్టుకోవడానికి ఎలా భయపడి ఆ అలవాటు నుండి దూరమవుతాడో అలాగే వ్యసనం అనుకున్న  విషయం నుండి దూరమవ్వడానికి ఏదో ఒక పరిస్థితిని అడ్డు కల్పించుకుంటూ ఉండాలి.  "పిల్లాడంటే తెలియని అమాయకుడు, పెరిగి పెద్దయిన ఈ ఉద్దండుల సంగతేంటి??" అనే ప్రశ్న గనుక వస్తే ఈ పిచ్చి మనసును బుజ్జగించడం అంతే సులువేమీ కాదు. కాబట్టి ఒకపని తప్పించుకోవాలి అంటే మరొకపనిని తప్పనిసరిగా, తప్పకుండా చెయ్యాల్సిన పనిగా ఒక లక్ష్యంగా ముందేసుకోవాలి. అప్పుడే అనుకున్నది సాదించగలం. ఊగిసలాట వద్దు! ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మళ్లీ ముందుకూ వెనక్కు మనసును ఊగించకూడదు. మొదట్లో అలా వ్యసనంగా మారిన పని నుండి, విషయం నుండి దూరంగా ఉంటున్నందుకు అసహనంగానూ, బాధగానూ ఉన్నా అది మెల్లిగా తగ్గుతూ మరొకవిషయంలో మనసును లీనం చేస్తుంది. కాబట్టి ఊగిసలాట ఇక్కడ అసలు ఉండకూడదు. చాలామంది నిర్ణయాలు తీసుకుని, దారులు మార్చుకుని, పట్టుమని నిమిషాలు గంటలు కూడా కాకముందే చేతులెత్తేస్తారు. అలా కాకుండా మెల్లి మెల్లిగా ఆ పనికి తక్కువ సమస్య కేటాయిస్తూ వెళ్తే ఆ వ్యాసనమనే భూతం నుండి తప్పించుకోవడం పెద్ద సమస్యేమీ కాదు! కాబట్టి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ఏ సమస్యనూ, వ్యసనంగా మార్చుకోవద్దు, వ్యసనంగా మారిన దేన్నీ భరించద్దు దానికి వెంటనే మార్పు అనే మంత్రంతో విడాకులు ఇచ్చేయండి. ◆ వెంకటేష్ పువ్వాడ  
రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే.. ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు. మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.   రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.                                            *రూపశ్రీ.
  టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి.  శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు.  కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం,  మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు.  వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా  పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే.. పోషకాలు.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు  అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి. ఐరన్,  కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.  ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి,  శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా,  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు,  ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మునగ ఆకులను  తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది.  ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్  ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ  ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.  జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ ఆకులలో కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్,  కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి,  బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.  కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి  వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది,  వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది.                                                      *రూపశ్రీ.
చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.   ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్‌నట్‌లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు.  అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం  నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు  చర్మ సమస్యలను  నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్‌ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.  
  టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్.  ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి.. ఫిల్టర్ పేపర్ తో.. టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద  కొంచెం నీరు చిలకరించాలి.  తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు. నీటితో.. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ  నీటిలో టీ ఆకులు వేయాలి.  నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. రుచి.. స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి.  కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం.  మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి.  వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి  తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు. రంగు.. స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి.  కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది. స్వభావం.. నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి.  ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. కల్తీ టీ .. చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి.  పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది.  ఇది   నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది.                                             *రూపశ్రీ.