LATEST NEWS
ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం (డిసెంబర్ 18) వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆటో డ్రైవర్ల  యూనిఫారంలో అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్లారు.   ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.  ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్  గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా  రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని   కోరారు. అలాగే ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.    లగచర్ల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం (డిసెంబర్ 17) అసెంబ్లీకి నల్ల చొక్కా లు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.   రోజుకో సమస్యపై వినూత్న నిరసనలతో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం ఆసక్తి రేపుతోంది.
 పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బస్టాండ్ కి వెళ్లే దారిలో గల శ్రీదేవి భూదేవి సమేత ఏలేశ్వర మాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలపు శిల్పకళాఖండాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని, వాటిని భద్రపరిచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఏలేశ్వర స్వామి ఆలయం వెనక 700 సంవత్సరాల నాటి భిన్నమైన నంది, ఆలయ ద్వారశాఖలు, విడిభాగాలు, ఇంకా రెండు సహస్ర లింగాలున్నాయని, వాటిని ప్రాంగణంలోనే పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో పేరు పలకలను(లేబుల్) ఏర్పాటు చేస్తే, భక్తులు, పర్యాటకులు వాటి వివరాలు తెలుసుకునే వీలు చిక్కుతుందన్నారు.  1954-60 మధ్యకాలంలో నాగార్జునసాగర్ జలాశయ నీటి ముంపు ప్రాంతమైన ఏలేశ్వరం నుంచి వీటిని తరలించి ఇక్కడికి చేర్చారని, గత 65 ఏళ్లుగా ఇవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ 13వ శతాబ్ది కళాఖండాలను భద్రపరిచి, భావితరాలకు అందించాలని ఆలయ అధికారులకు, నందికొండ హిల్ కాలనీ వాసులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
అల్లు అర్జున్ మధ్యంతర బెయిలు రద్దు కోసం హైదరాబాద్ పోలీసులు హైకోర్టుకు, ఇంకా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఏ 11గా పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 13న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని ఈ నెల 14 ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.   అసలు విషయమేంటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా  ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ11 అల్లు అర్జున్ ను పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసి నాంపల్ల్లి కోర్టులో హాజరు పరచగా, నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అదే రోజు అల్లు అర్జున్‌ క్వాష్ పిటిషన్ పై   విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు చంచల్‌గూడ జైలుకు   అందడంలో జాప్యం కారణంగా ఆయన ఒక రాత్రి జైలులో ఉండాల్సి వచ్చింది.ఆ మరుసటి రోజు అంటే  డిసెంబర్ 14  ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.   తాజాగా సేకరించిన ఆధారాల మేరకు వారు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.     మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. థియేటర్‌ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  మీడియా నివేదికల ప్రకారం, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన సమయంలో అల్లు అర్జున్ మరియు నటి రష్మిక మందన్నను థియేటర్ లోకి అనుమతించవద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి సూచించినట్లు పోలీసులు ప్రాసిక్యూషన్, అదనపు అడ్వకేట్ జనరల్ కు లేఖ సమర్పించారు.   అల్లు అర్జున్ ను థియేటర్ లోకి అనుమతించవద్దని చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ కు రాసిన లేఖ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ప్రీమియర్ షోకు అల్లు అర్జున్  హాజరైతే సంధ్య థియేటర్ లో జనసమూహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు. అదే కారణాన్ని పేర్కొంటూ, అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని మేజిస్ట్రేట్ ను అభ్యర్థిస్తూ పోలీసులు  అప్పీల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
Telugu Cinema big stars - Allu Arjun, Jr. NTR, Prabhas and Mahesh Babu released their films in this year 2024. Except for Mahesh Babu, all others have gone for huge Pan-India releases. This year Ram Charan and Pawan Kalyan did not release any films.  Senior stars Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Nagarjuna and Venkatesh have set their eyes on 2025 release. Chiranjeevi wanted to release his film for Sankranti but postponed his huge budget film, Vishwambhara for Summer 2025. NBK will release his Daaku Maharaaj for Sankranti 2025.  Nagarjuna released his Naa Saami Ranga for Sankranti and achieved breakeven success. Victory Venkatesh's Saindhav released for Sankranti and bombed. He is looking to get a hat-trick success with director Anil Ravipudi for 2025 Sankranti season. Nagarjuna is playing a prominent role in Rajinikanth's Coolie and has a multi-starrer Kubera with Dhanush. Both the films are scheduled for 2025 release.  In 2024, Allu Arjun emerged as big Pan-India star as his Pushpa 2 The Rule has collected over Rs.1450 crores gross worldwide and his film is also breaking records in Hindi circuit. The movie is given him huge momentum to cement his place as a Top Indian star.  Prabhas did not disappoint with his Kalki 2898 AD as it crossed Rs.1100 crores gross worldwide. He is looking to repeat the feat with The Raja Saab in 2025. NTR after two years wait released Devara Part-1 and the movie collected huge Rs.450 crores gross.  Mahesh Babu's Guntur Kaaram did not get critical acclaim but did collect Rs.180 crores gross worldwide. The producers and distributors did not loss huge money as anticipated and movie became a safe bet.  On the whole, we can say that 2024 ended up being a good year for big stars as none of them really disappointed while TFI got two huge Rs.1000 crores grossers to add to the elite list of Pan-India successes. 
విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్స్ 2023-2024 సంవత్సరాలకు గాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ఘనంగా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం లో అవార్డుల ప్రధానోత్సవం చేసారు. ఈ ఈవెంట్ కి సమర్పకులు, వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ కి సంబందించిన వైగండ్ల వెంకటేశ్వర్లు , వీవీకే హోసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబందించిన విజయ్ కుమార్, ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి, మరియు అడ్వాకేట్ నాగేశ్వర్ రావు పూజారి.  ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు, దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి, నిర్మాత కె అచ్చి రెడ్డి, నిర్మాత మరియు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ. జేడీ లక్ష్మి నారాయణ, హీరో పూరి ఆకాష్, మరియు హీరోయిన్ అర్చన. ఈ ఈవెంట్ లో సీనియర్ నటి శ్రీలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. అంతే కాకుండా టీవీ ఆర్టిస్ట్స్ కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్ కి, యూట్యూబర్స్ కి కూడా అవార్డుని ప్రధానం చేశారు. అంతే కాకుండా, పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు. లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “వీబీ ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డు వారికి నా ధన్యవాదాలు. ఇన్నేళ్ళుగా సినిమాల్లో నటిస్తున్న నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ని అందించారు. మొదటగా నేను మా గురువు గారి జంధ్యాల గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ తర్వాత నేను పని చేసిన డైరెక్టర్స్ అందరికీ తాంక్స్. నా మీద ఎప్పటికప్పుడు విశేష ప్రజాధారణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటాను. మరొక్క సారి ఇక్కడున్న వారందరికీ వీబీ ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు” అన్నారు.ఈ ఈవెంట్ కి హాజరైన అతిథులందరికీ ఘానా స్వాగతం లభించింది. అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు నిర్వాహకులు. శ్రీలక్ష్మి గారితో పాటు అవార్డ్స్  అందుకున్న వారు మరియు పాల్గొన్నవారు : మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 యియర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్య వాని, రీతూ చౌదరి, బులెట్ భాస్కర్, రామ సత్యనారాయణ, మా అసోషియేషన్ మెంబర్ మాణిక్యం, మాదాల రవి
యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకొని ఆమధ్య విడుదలైన ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్‌ బెహరా అరెస్ట్‌ అయ్యాడు. తనను కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి ప్రసాద్‌ బెహరాను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఈరోజు కోర్టులో హాజరుపరచగా ప్రసాద్‌ బెహరాకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అతనిపై 460, 75(2), 79, 351(2)బిఎన్‌ఎస్‌, సెక్షన్స్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ప్రసాద్‌ బెహరాతోపాటు బాధితురాలు ఓ మీడియా హౌస్‌లో పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లలో కలిసి నటించారు. ప్రసాద్‌ బెహరా ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చింది. ప్రసాద్‌, బాధితురాలు తరచూ షూటింగ్స్‌లో పాల్గొంటారు. ఆ సమయంలో తనను అసభ్యకరంగా తాకడం, అసభ్యకరంగా మాట్లాడడం వంటివి చేస్తున్నాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తనను సంవత్సరంన్నర నుంచి వేధిస్తున్నాడని తెలిపింది. పెళ్లివారమండీ అనే వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు తనను అసభ్యకరంగా తాకడమే కాకుండా, యూనిట్‌ అందరూ చూస్తుండగానే తనపై పడ్డాడని, ఆ తర్వాత తనను తాకరాని చోట గట్టిగా చరిచాడని తెలిపింది. అది చూసి యూనిట్‌లోని వారంతా నవ్వారని తెలియజేసింది. దాంతో వెబ్‌ సిరీస్‌ నుంచి తాను వచ్చేశానని, చాలా నెలల తర్వాత తనకు క్షమాపణ చెప్పడంతో షూటింగ్‌ కంటిన్యూ చేశానని పేర్కొంది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, అంతకుముందు కంటే ఎక్కువ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, అసహ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తెలిపింది. డిసెంబర్‌ 11న మెకానిక్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు అతని ప్రవర్తన తారాస్థాయికి చేరిందని, అది తట్టుకోలేక ఫిర్యాదు చేస్తున్నానని తెలియజేసింది. 
Telugu Youtubers and social media influencers have been facing harassment allegations from quite some time. Latest to add to the dishonorable list is Prasad Behara. With web series like Pellivaramandi and several others, he became famous as a comedian, comedy writer and director.  He transistioned to big screen successfully with Committee Kurrollu film. The actor-writer and director has become a huge talking point in the industry and famous as well. Now, he is facing sexual harassment charges against him. A young actress Kanchan Bamne filed case against him alleging that he misbehaved with her on sets.    She also works with same YouTube channel as him and she has been part of his web-series as well. Prasad Behara has been arrested by police following her strong allegations and he has been sent to 14-days custody to get into the depth of the matters.  Fun Bucket Bhargav faced similar allegations but in his case, he has been accused on getting physical with an underaged teen. Shanmukh Jaswant faced cases about drug abuse and Vinay Shanmukh faced cheating and sexual abuse cases as well. Let's see how this case will move forward as Prasad Behara earned a name for being friendly and respectable in content creation. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్,(mythri movie makers)దేవిశ్రీప్రసాద్(devi sriprasad)చంద్రబోస్(chandrabose)ఈ ఆరుగురి కాంబోలో మరోసారి పుష్ప పార్ట్ వన్ కి సిక్వెల్ గా పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్   వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా కూడా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అయితే పుష్ప 2 ఫీవర్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్స్ లో అక్కడి హీరోల సినిమాలని కూడా దాటేసిన పుష్ప రాజ్ ఇప్పుడు మరో నయా రికార్డుని సాధించాడు.  లేటెస్ట్ గా హిందీ బెల్ట్ లో పుష్ప 2 600 కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మంగళవారం 19 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న పుష్ప 2  అఫీషియల్ గా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు ఈ లెక్కలతో పుష్ప 2 కలెక్షన్స్ కి హిందీ బెల్ట్ లో ఎప్పుడు ఎండింగ్ కార్డు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే సినిమా వచ్చి కేవలం పదమూడురోజులే అయ్యింది.పైగా హిట్ టాక్ కూడా ఉండటంతో లాంగ్ రన్ లో వెయ్యి కోట్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.    
Pushpa 2 The Rule has become a huge record-breaking blockbuster and it is racing to collect Rs.1500 crores gross worldwide. Allu Arjun starrer used the overwhelming connection with Pushpa Raj character, mainly in Hindi markets, to create such sensation.  Movie has collected record numbers in Central India and mass pockets of UP, Bihar. No other Hindi film has been able to create such sensation in those markets in recent times. Jawan, Pathaan, Stree 2, Gadar 2 have been able to collect big but still, Pushpa 2 has crossed every record in these markets for any movie.  Looking at such a great response, Sukumar has been suggested to plan a sequel to Rangasthalam as Chitti Babu character played by Ram Charan has many fans in Telugu States. Undoubtedly, it is the career best performance and role of Ram Charan.  Sukumar has been asked to plan a sequel to Rangasthalam with Chitti Babu character taking another village's rebellion against another oppressor. But the director has plainly rejected to this idea it seems. He has plans to create a different character for the actor and not make another sequel after going through Pushpa 2 process.  The director felt it is taxing to work on a sequel while working on Pushpa 2. So, he wants to go with a new story for Ram Charan and after #RC16, he wants to follow up with another great character. Let's see what the director will decide as he will be working with same producers Mythri Movie Makers. 
Prabhas has made a huge name all over the world as Baahubali. With his performance, he made huge number of fans all over. His latest release Kalki 2898 AD grossed over Rs.1000 crores worldwide. The movie is now releasing in Japan on 3rd January, 2025.  Director Nag Ashwin has already flown to the country to promote the film. On the other hand, Prabhas could not go to the country for promotions due to his injury. He released a video stating about his health condition. He stated that he sprained his ankle during shooting and he is feeling well, currently.  But as he is in recovering phase, he is unable to fly to the country and meet his fans. With Baahubali, he has become a superhero for Japan people and Kalki distributors are expecting a huge box office turnout owing to his popularity and movie genre.  Amitabh Bachchan, Deepika Padukone, Kamal Haasan played prominent roles in this Mythological science fiction film. With Japan release, the movie could be looking at improving its worldwide gross further. 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)నటించిన  ఎపిక్ సైన్స్ అండ్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆరువందల కోట్ల భారీ బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కుని కూడా అందుకుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి నేషనల్ స్టార్స్ కూడా నటించారు. ఇక ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి 3 న జపాన్ లో జపాన్ లాంగ్వేజ్ లోనే విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ప్రభాస్ ఒక వీడియో విడుదల చెయ్యడం జరిగింది.అందులో ఆయన జపాన్ ప్రేక్షకులని ఉద్దేశించి  మాట్లాడుతు కల్కి జపాన్ లో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది.మూవీ మీ అందరకి బాగా నచ్చుతుంది.నేను ప్రమోషన్స్ కి వద్దామని అనుకున్నాను. కానీ చిన్న ఇంజురీ కావడం వలన రాలేకపోతున్నాను. ఈ సారి ఖచ్చితంగా వస్తానని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సదరు వీడియోలో ప్రభాస్ కొంచంసేపు  జపాన్ భాషలో కూడా మాట్లాడటం జరిగింది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ఎసిడిటీ అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ   ఎప్పుడో ఒకప్పుడు ఎసిడిటీ సమస్యను అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసిడిటీ కారణంగా అజీర్ణం, జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎసిడిటీని ప్రధానంగా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు. అయితే దీనికి  ఇతర  కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వచ్చే సమస్య ఎసిడిటీ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడినప్పుడు యాసిడ్ ఆహార నాళంలోకి  తిరిగి వస్తుంది.  దీని కారణంగా ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంట వస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఎసిడిటీ రావచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎసిడిటీకి ప్రధాన కారణమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కాకుండా, ఎసిడిటీని కలిగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ రావడానికి ఆహారం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమున్నాయి?  కడుపులో ఉండే యాసిడ్ (గ్యాస్ట్రిక్ జ్యూస్) అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ కడుపు ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు గోడలలో విచ్చలవిడిగా  వ్యాపించడం జరిగినప్పుడు అది కడుపులో మంట, నొప్పి,  ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసిడిటీ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి.  ఇవి కూడా  తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల  వరకు ఉంటాయి. తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపు మండే అనుభూతి కలిగి ఉంటుంది. త్రేనుపులు బాగా వస్తాయి ముఖ్యంగా పుల్లని త్రేనుపులు ఎక్కువ ఉంటాయి. తరచుగా నోటిలో పుల్లని రుచి ఉంటుంది. కడుపులో భారం, నొప్పి,  కడుపు ఉబ్బరం వంటి  సమస్యలు ఎప్పుడూ అనిపిస్తుంటాయి. గొంతులోకి యాసిడ్ చేరడం వల్ల మంట,  పొడి దగ్గు. వికారం,  వాంతులు లేదా తరచుగా రెగ్యురిటేషన్ ఆహారమే కారణమా? ఆహార సంబంధిత అలవాట్లు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన కారంగా,  వేయించిన ఆహారాన్ని తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఎసిడిటీకి ప్రధాన కారణాలు. తిన్న వెంటనే పడుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎక్కువ సేపు ఆకలితో ఉండడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ రావచ్చు. ఇవి కూడా  కారణాలే.. తినే అలవాట్లతో  పాటు అనేక జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కూడా  ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం,  మద్యం సేవించే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఇది కాకుండా అధిక ఒత్తిడి,  ఆందోళనలో ఉన్నా.. తగినంత నిద్ర లేకున్నా..  లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ,  ఉన్నా ఎసిడిటీకి గురవుతారు.                                           *రూపశ్రీ.  
    ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం.  ముఖ్యంగా ఈ మద్యకాలంలో శారీరక స్పృహ, ఆరోగ్య స్పహ పెరగిన కారణంగా  ప్రోటీన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరిగింది.  ప్రోటీన్ లోపం ఉండకూడదని చాలామంది ప్రోటీన్ పౌడర్లు కూడా వాడుతుంటారు.  దీనికి తగ్గట్టే ప్రోటీన్ పౌడర్ ఉత్పత్తులు చాలా విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.  వీటిలో వెయ్ ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  వెయ్ ప్రోటీన్ అంటే పాటవిరుగుడుతో తయారుచేస్తారు.మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ వాడటం మంచిదేనా? దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవ్చచు? తెలుసుకుంటే..  మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ చాలా ఖరీదుగా ఉంటుంది.  అయితే ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు.  ఈ వెయ్ ప్రోటీన్ కూడా బాడీ బిల్డింగ్ చేసేవారు, అధికంగా వ్యాయామాలు చేసేవారికి అవసరం.  జిమ్ కు వెళుతూ వెయ్ ప్రోటీన్ ను వాడిన 19 ఏళ్ల కుర్రవాళ్లు కిడ్నీ ఫెయిల్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో లభించే వెయ్ ప్రోటీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా చాలా రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని చాలా దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ అవసరమే కానీ బాడీ బిల్డర్లకు అవసరమైనంత మాత్రం అవసరం లేదు.  అందుకే వెయ్ ప్రోటీన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం సురక్షితం అంటున్నారు పోషకాహార నిపుణులు. పాలు.. పాలు తాగడం వల్ల చాలావరకు వెయ్ ప్రోటీన్ లభిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ పాలు తాగాలని అది ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.  పాలలో దాదాపు 80శాతం పైన కేసైన్ ప్రోటీన్,  20శాతం వెయ్ ప్రోటీన్ ఉంటుంది. వెయ్ ప్రోటీన్.. పాల విరుగుడుతో చేసే ప్రోటీన్ నే వెయ్ ప్రోటీన్ అంటారు. అయితే దీన్ని ఇంట్లో కూడా తీసుకోవచ్చు.  పాలను మొదటగా జున్నులాగా చేయాలి.  దీని నుండి పన్నీర్ వస్తుంది.  పన్నీర్ ను వేరు చేసిన తరువాత నీరు మిగిలిపోతాయి.  చాలామంది ఈ నీటిని పడేస్తుంటారు. కానీ వెయ్ ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది.  పాలలో ఉండే కేసైన్ ప్రోటీన్ పన్నీర్ లోకి వెళ్లిపోతుంది. పాలలో ఉండే వెయ్ ప్రోటీన్ ఈ నీటిలో ఉంటుంది.  ఈ నీటిని పారబోయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. వెయ్ ప్రోటీన్ కండరాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది శరీర బరువును పెంచుతుంది,  బలాన్ని పెంచుతుంది. కొన్ని పరిశోధనలలో, ఇది అధిక BP మరియు మధుమేహాన్ని నియంత్రించగలదని కూడా కనుగొనబడింది . ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.                                                       *రూపశ్రీ.