LATEST NEWS
ఫార్ములా ఈ కార్ రేస్  కుంభకోణంలో ఎ 1 గా మాజీ మంత్రి కెటీఆర్ ఉన్నట్లు ఎసిబి కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకూడదని కెటీఆర్ క్వాష్   పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కెటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని  కెటీఆర్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. కెటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు. న్యాయపరంగా పోరాడి గట్టెక్కాలని కెటీఆర్ భావిస్తున్నారు.  కెటీఆర్ పిటిషన్ పై  సింగిల్ బెంచ్ జడ్జి శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ అయిన జడ్జి  శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది.
భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది.  వారం క్రితం  వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్  ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో  ప్రవేశపెట్టింది.  220-148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీ కి బిల్లు పంపడానికి మార్గం సుగమం అయింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు,అధికారులు,మాజీ స్పీకర్లు తదితరుల  అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పోడిగిస్తారు.ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికారపార్టీ సభ్యులు ఉంటారు. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలలోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశాయి.  బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,సమాజ్ వారీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి.జమిలీ ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల మేజార్టీ లభించాలి.  .అలాగే 82ఏ నిబంధన, 83 నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాలపరిమితికి 172వ నిబంధన, 327 నిబంధన లకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమౌతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత లోక్ సభ  ఎన్నికల తర్వాత రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అప్పటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తరువాతే జమిలి ఎన్నికలు .అంటే టెక్నికల్ గా 2034 వరకూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు.  పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67 శాతం మంది సభ్యుల  మద్దతు అవసరం. అంటే 362మంది లోక్ సభలో,164మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కాని 543 సభ్యులున్న లోక్ సభ లో ఎన్డీఏకు 293, ఇండియాకూటమి 234 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో245 సభ్యుల్లో ఎన్డీఏకు 125,మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టమయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. కాని ఐదేళ్ల కాలపరిమితి లోగా అసెంబ్లీలో  అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చేయాలన్న దానిపై స్పష్టత లేదు. .అలాగే పార్లమెంటులో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్ప కూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? అప్పుడు అసెంబ్లీల పరిస్థితి ఏమిటని ప్రశ్నకూ సమాధానం లేదు. జమిలీ  ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా  ఒక అవరోధమేనని చెప్పాలి. అన్నిటికీ మించి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుగొన్నది కాదు.  స్వాతంత్య్రానంతరం 1952,1967లలో దేశంలో జరిగినవి జమిలి ఎన్నికలే. కనుక జమిలి అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అఃసంబద్ధంగానే కనిపిస్తోంది. రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న హడావుడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల  టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది. తెలుగుదేశం సభ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా దాదాపు 73 లక్షల మంది  పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో   54శాతం మంది కొత్త వారే.  ఒక రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు లో ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వారు సభ్యత్వం తీసుకోవడం ఒక రికార్డు అనుకుంటే..దానిని తలదన్నే రీతిలో ఒక గ్రామంలో మొత్తం జనాభా అంతా తెలుగుదేశం సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా నభూతో.. నభవిష్యతి అన్న రికార్డు కూడా తెలుగుదేశం వశమైంది. ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా.. దివంగత పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం.  ఆ  గ్రామంలోని ఓటర్లందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ఒక గ్రామంలో నమోదైన ఓటర్లందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని అనితర తెలుగుదేశం పార్టీకి అనితర సాధ్యమనదగ్గ రికార్డును అందించారు.   వెంకటాపురంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వారిలో  11 మంది మరణించారు. మిగిలిన 570 మంది ఓటర్లు అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ, పరిటాల కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవి భార్య పరిటాల సునీత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత   ఈ ఘనత సాధించిన మొదటి గ్రామం వెంకటాపురం అని చెప్పారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ణతలు తెలిపారు. 
తెలంగాణలో రాజ‌కీయాలు మ‌రింత‌ హీటెక్కాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టుతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణపై ఫోక‌స్ పెట్టగా.. దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? రేవంత్ స‌ర్కార్ ఏం చేస్తోంది? అనే అంశాల‌పై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. దాదాపు వారం రోజుల పాటు అల్లు అర్జున్ అరెస్టు ఘ‌ట‌న‌ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. అయితే,  ఈ వ్య‌వ‌హారం స‌ర్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా రేవంత్ స‌ర్కార్ మ‌రో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు గురిపెట్టింది. ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో రేవంత్ స‌ర్కార్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది. అయితే, గ‌త నెల రోజులుగా ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్ అరెస్టు ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం రేవంత్ స‌హా ప‌లువురు మంత్రులు కేటీఆర్ అరెస్టు కావ‌టం ఖాయ‌మంటూ గ‌తంలో పేర్కొన్నారు. కేటీఆర్ సైతం స్పందిస్తూ.. అరెస్టు చేసి జైలు పంపిస్తే హాయిగా వెళ్తా.. జైల్లో యోగా చేసి మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తా అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ నుంచి అనుమ‌తులు   రావ‌డంతో ఏసీబీ రంగంలోకి దిగింది.  ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైంది. ఆయ‌న‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా, అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌‌, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టింది.  తాము కేటీఆర్ పై  కేసులు పెట్టామని నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టుచేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త‌న‌పై కేసు న‌మోదు కావ‌డంపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ-కారు రేసులో కుంభ‌కోణం జ‌రిగింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే ఈ వ్య‌వ‌హారంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌పెట్టాలి. ఫార్ములా ఈ-కారు రేసుపై అన్ని వాస్త‌వాలు వివ‌రిస్తా అని పేర్కొన్నారు. మ‌రోవైపు రేవంత్ స‌ర్కార్ పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.   2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని  కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో నిధుల గోల్ మాల్ వాస్తవమేనన్న అనుమానాలు   వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. మూడు రోజుల క్రితం సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు. కేటీఆర్ ను విచార‌ణ‌కు పిలిచి అరెస్టు చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తోంది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాల‌యంలో అధికారులతో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సమావేశం అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి, ఆయనను   ఎలా విచార‌ణ‌ చేయాలి, ఒకవేళ విచారణకు కేటీఆర్ సహకరించకపోతే,  న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధివిధానాలు ఏంటి.. అనే అంశంపై ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. లీగల్ టీమ్, ఎవిడెన్స్ టీమ్, ఐటీ సెల్ టీమ్.. ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్ర‌మంలో కేటీఆర్ విచార‌ణ‌కు హాజరైతే ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏసీబీ అరెస్టు నుంచి త‌ప్పించుకునేందుకు కేటీఆర్ సైతం త‌న ప్ర‌య‌త్నాల‌ను షురూ చేశారు. ఆయ‌న  హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. శుక్ర‌వారం (డిసెంబర్ 20) హైకోర్టులో క్వాష్​ పిటీషన్​ వేయనున్నారని తెలిసింది.  మ‌రోవైపు.. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పే అవ‌కాశాలు   ఉన్నాయ‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ‌ను డీజీపీ ఇప్ప‌టికే అలెర్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (డిసెంబర్ 19) శ్రీవారిని మొత్తం 58 వేల 165 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
  Cast: Upendra, Reeshma Nanaiah, Sadhu Kokila, Ravi Shankar, Achyuth Kumar  Crew:  Cinematography by H.C. Venugopal  Edited by Vijay Raj B. G. Music by Ajaneesh Loknath  Written - Directed by Upendra  Produced by G. Manoharan, Sreekanth K. P. Upendra is one of the biggest stars of Kannada Cinema who has enormous popularity in Telugu, Tamil languages as well. His films created sensation in different languages from original Kannada and hence, people to wait for his directorials with a bated breathe. After a decade, his directorial UI The Movie released on 20th December and let's discuss about it in depth.  Plot:  Satya(Upendra) is prophecised to bring Satya Yugam back by eliminating Kali Yugam. But his alter-ego Kalki(Upendra), an evil twin, wants to be a dictator by ruining the people who ruined mother nature. He uses all sorts of sins to lure them to his side and a huge political leader Vamana Rao(Ravi Shankar), who started out as a pick-pocketer, becomes his aid. Why? How does this psychological battle between Satya and Kalki turn out? Watch the movie to know more.  Analysis:  Upendra has never been a normal storyteller and director. His way of narrating something prominent has always been different and innovative. Once again, Upendra did the same by starting his movie with post release reactions and then continuing with his story.  He transfers us into his brain to understand the story and his thoughts behind it. The set-up is clever in telling us that one needs to try to understand what his ideology behind the story and intentions are. His performance and visuals, technical values, production values everything are top notch.  But the execution and eccentricity behind the thoughts and scenes are so raw that it tests patience of majority. The thought behind showcasing how purity of soul gets corrupt by people and how manipulative ways implemented by "uneducated pretentious leaders" gets into focus is all great yet execution is too weird.  Upendra is in no mood to tell you a story in simplistic terms and ways. He wants you to travel with him at his level and that's the issue with this film. Ajaneesh Loknath's BGM works, performances are good, visuals are stunning yet film is hard to digest.  In Conclusion:  Only for those who have patience to dvelve into Upendra's thought process.  Rating: 2.25/5
నటీనటులు : అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌, రావు రమేష్‌, సాయికుమార్‌, హరితేజ, రోహిణి తదితరులు సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌ సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌ ఎడిటింగ్‌: ఛోటా కె. ప్రసాద్‌ నిర్మాతలు: రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా బ్యానర్‌: హాస్య మూవీస్‌ రచన, దర్శకత్వం: సుబ్బు మంగాదేవి విడుదల తేదీ: 20.12.2024 తన అల్లరితో మొదటి విజయాన్ని అందుకున్న నరేష్‌ ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత కామెడీ హీరోగా తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్‌ చేసుకొని ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. అతని సినిమాలను ప్రేక్షకులు మొనాటనీ ఫీల్‌ అవుతుండడంతో తన ట్రాక్‌ మార్చాడు. కామెడీని పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆ విధంగా కొంత సక్సెస్‌ సాధించాడు. అయితే ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ప్రజెంట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ‘బచ్చలమల్లి’ చిత్రంలో మరో కొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా నరేష్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంది? సినిమాలోని ప్లస్‌లు, మైనస్‌లు ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ :  సాదా సీదాగా సాగిపోతున్న బచ్చలమల్లి(నరేష్‌) జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా తన తల్లికి తండ్రి అన్యాయం చేశాడని అతనిపై ద్వేషం పెంచుకుంటాడు. అది పగగా మారుతుంది. దీంతో చదువు మానేస్తాడు. అన్నిరకాల వ్యసనాలకు బానిసవుతాడు. మందు, సిగరెట్‌ వంటి దురలవాట్ల వల్ల జీవితం పక్కదారి పడుతుంది. వీటన్నింటి వల్ల అతనిలో మానవత్వం కంటే మూర్ఖత్వం పెరిగిపోతుంది. అల్లరి చిల్లరగా తిరుగుతున్న అతనికి కావేరి(అమృత అయ్యర్‌) తారసపడుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసం వ్యసనాలన్నింటినీ పక్కన పెట్టేస్తాడు. మల్లి జీవితం ఒక దారికి వస్తుందనుకుంటున్న తరుణంలో అతనిలోని రాక్షసుడు, అతని మూర్ఖత్వం ఒక్కసారిగా బయటికి వస్తాయి. తనను తాను మార్చుకొని మంచి జీవితంలోకి వెళ్ళబోతున్న మల్లి అలా మారడానికి కారణాలు ఏమిటి? కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మల్లి మళ్ళీ పాతరోజుల్లోకి వెళ్లిపోయాడా? తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  విశ్లేషణ : సినిమా అంటే ఒక కథ, దానికి తగ్గ కథనం, హీరో క్యారెక్టరైజేషన్‌, ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే ట్విస్టులు, లేదా గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌ ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన సినిమా అనిపించుకుంటుంది. కానీ, బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే అవన్నీ వదిలేసి కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌ మీదే కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు దర్శకుడు సుబ్బు. ప్రతి సన్నివేశంలోనూ హీరో క్యారెక్టరైజేషనే కనిపిస్తుంది. దాంతో కథపై పట్టు సడలిపోయింది. హీరో కోపం, పంతం, మూర్ఖత్వం ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్న టైమ్‌లో స్టార్ట్‌ అయ్యే లవ్‌ ట్రాక్‌ కూడా చాలా సాదా సీదాగా ఉంటుంది. ప్రతి సినిమాలో మాదిరిగానే ఇందులోనూ హీరోయిన్‌ చిల్లరగాడ్ని ప్రేమించిందేమిటి? అనిపిస్తుంది. మూర్ఖంగా ఉండే మల్లి.. ఒక అమ్మాయి రావడంతో ఒక్కసారిగా మారిపోవడం సహజంగా అనిపించదు. ఆ తర్వాత తల్లి చెప్పే మాటలతో మరింత మారిపోతాడు. తల్లి చెప్పే మాటలు క్లైమాక్స్‌లో ఉంటాయి. ఆ తల్లి కొడుక్కి చేసే హితబోధ ప్రారంభంలోనే చేస్తే ఇంత కథ ఉండదు కదా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్‌ ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. అతనిపై హీరో పగ పెంచుకోవడం అనేది అసహజంగా అనిపిస్తుంది. ఇక సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఎందుకు పెట్టారో అర్థం కాదు. హీరో ఉన్నప్పుడు విలన్‌ కూడా ఉండాలి అని ఆ క్యారెక్టర్‌ పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఉపయోగం కనిపించదు. ఒక దశలో హీరో మూర్ఖత్వాన్ని మరీ పీక్స్‌లో చూపించారు. దాంతో హీరో పట్ల ఎవరికీ సానుభూతి కలగకపోగా కోపం వస్తుంటుంది. సినిమాని ఒక బలమైన ఎమోషన్‌తో ముగించినా అది ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవ్వలేదనే చెప్పాలి.  నటీనటులు :  బచ్చలమల్లి క్యారెక్టర్‌కి నరేష్‌ జీవం పోశాడని చెప్పొచ్చు. కామెడీని పక్కన పెట్టి ఈ తరహా క్యారెక్టర్లు గతంలో కూడా నరేష్‌ చేశాడు. కానీ, ఈ సినిమా మాత్రం అతనికి ప్రత్యేకం అని చెప్పొచ్చు. అతని కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ క్యారెక్టర్స్‌ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్‌ అమృత అయ్యర్‌ ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించి ఆకట్టుకుంది. రావు రమేష్‌ షరా మామూలే అనే క్యారెక్టర్‌ చేశాడు. ప్రవీణ్‌కి చాలా కాలం తర్వాత మంచి గుర్తింపు తెచ్చే క్యారెక్టర్‌ వచ్చింది. ఇక ప్రసాద్‌ బెహరా, వైవా హర్ష తమ పంచులతో నవ్వించారు.  సాంకేతిక నిపుణులు :  సాధారణంగా నరేష్‌ సినిమాల్లో టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ హై రేంజ్‌లో ఉండవు. ఎందుకంటే గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ బేస్డ్‌ కాబట్టి ఆ అవసరం రాలేదు. కానీ, ఈ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంది. దాని కోసం బడ్జెట్‌ బాగానే పెట్టారనిపిస్తుంది. సినిమాలోని పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ కూడా బాగానే ఉంది. టోటల్‌గా ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే.. రెగ్యులర్‌ సినిమాలను చూసి బోర్‌ కొట్టిన ఆడియన్స్‌ ఈ సినిమాను కొత్తగా ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. రేటింగ్‌: 2.5/5
Cast: Mahesh Babu, Satyadev, Brahmanandam, Ayyappa Sharma, RCM Raju, Ali, Shaking Sheshu  Crew:  Based on Disney's The Lion King by Irene Mecchi, Jonathan Roberts, Linda Woolverton Screenplay by Jeff Nathanson Music by Dave Metzger, Nicholas Britell (score), Lin-Manuel Miranda (songs) Editing by Joi McMillon  Cinematography by James Laxton  Directed by Barry Jenkins  Produced by Adele Romanski, Mark Ceryak The Lion King has acquired a huge cult following among audiences worldwide as an animated feature. Later, Disney has decided to bring a "Live Action Animated verson" for the same in 2019 and it became a huge blockbuster as well. Now, they have decided to bring prequel to it featuring Mufasa's story. The movie released on 20th December worldwide with Mahesh Babu giving voice over to Mufasa in Telugu. Let's discuss about the film in detail.  Plot:  Mufasa (voiced by Mahesh Babu), an estranged lion cub, is always told by their parents to find Mulale, a place with lots of green pastures to live peacefully. He is saved by Taka (voiced by Satyadev), a royal cub. When white lions and their pride leader Kiros (voiced by Ayyappa Sharma) decide to attack Taka's parents and upon their advice, Mufasa, Taka run-away and take on a journey to find Mulale. Did they? Watch the movie to know more.  Analysis:  The Lion King became a cult classic due to its music, fun adventure style of storytelling and strong emotional connect. Here, Mufasa misses such connection. Everything seems to be forced rather than organic. The character dynamics and the change in their behavior doesn't really sit well.  We feel like we already know the story and where it is heading within few minutes into the film. While the animation is great and a huge improvement from the The Lion King, the characters' journey doesn't really inspire us.  It almost seems like makers tried to match beat to beat with original and written the story. Even the emotional beats don't completely land due to the rushy nature in screenplay.  Mahesh Babu, Ayyappa Sharma, Satyadev bring characters to life with their voice acting. Still, the songs and story don't really have such strength to make us sit through.  In Conclusion:  Mufasa feels unnecessary prequel!  Rating: 2.25/5
Cast: Allari Naresh, Amrita Aiyer, Rohini, Prasad Behara, Achyuth Kumar, Hari Teja, Praveen, Harsha Chemudu, Ankith Koyya, Rao Ramesh  Crew:  Music by Vishal Chandrasekhar  Cinematography by Richard M Nathan  Editing by Chota K Prasad  Directed by Subbu Mangadevvi  Produced by Razesh Danda  Allari Naresh has been looking to diversify his choices from his regular staple comedy flicks and since Nandhi, he is consistently choosing serious roles to showcase other side of his acting prowess. Now, he did Bachhala Malli in the direction of Subbu Mangadevvi and the makers promoted it as Naresh's Rangasthalam. The movie released on 20th December and let's discuss in detail if it delivers on that promise.  Plot:  Bachhala Malli(Allari Naresh) lives in Tuni and tops in tenth class board exams, in 1985. His father loves him deeply and his affection towards him is also very high. But his father chooses his second wife's family over Malli and his mother(Rohini). So, Malli decides to hate his father to the core.  In 1995, he meets a girl, Kaveri(Amrita Aiyer) and persuades her to love him with his sincerity. He decides to leave all bad habits for her which he started after his father chose others over him. But in 2005, he is seen again drinking and smoking like he did before meeting her. What happened to his love story? What happened to his father? Watch the movie to know more.  Analysis:  Allari Naresh, once again proved that as an actor he is one of the best in Telugu Cinema. He can pull off any given character, once he immerses himself into it. Bachhala Malli is one of his best performances. Amrita Aiyer gets few good scenes but director could not bring out a consistent performance from her.  Hari Teja, Praveen got some interesting characters and we want to explore their relationship with Malli even more. But director failed to connect us with them and even mother's character. Rao Ramesh, Achyuth Kumar, Harsha Chemudu all are there but we don't get strong scenes to really connect with them.  To avoid predictability factor director tired to go for a screenplay that keeps some beats hidden and they are delivered like twists. But those scenes are the key point for us to really emotionally connect with characters. Rayye than building the animosity, love and emotions, there is an emptiness in the entire journey.  Even if we are expected to connect with a character, at least we should be given other perspectives effectively to anticipate the change that this character has to go through. The writing and execution turn out weak even though Vishal Chandrasekhar's music, Richard's camera work did try to elevate the content.  While the director tried hard still the predictability factor brings the movie down. Connectivity factor in emotions could have helped it. Production values are good and Razesh Danda proves yet again he is a producer with taste. Just a better script would have really made this movie impactful.  In Conclusion:  Allari Naresh's  performance tries to elevate but writing pulls him down.  Rating: 2.5/5
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(chandrahaas)తన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీతో హీరోగా తన సత్తా చాటాడు.ఇప్పుడు'బరాబర్ ప్రేమిస్తా'(barabar premistha)అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా 'సంపత్ రుద్ర' దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్,ఎవిఆర్ మూవీ వండర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజయ్యింది. డైనమిక్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో రిలీజయిన  టీజర్ విడుదలైన కాసేపట్లోనే సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. టీజర్ ని చూస్తుంటే లవ్,యాక్షన్,ఎమోషనల్ కి చెందిన అన్ని ఎలిమెంట్స్ ని నింపుకున్న సినిమాగాఅర్ధమవుతుంది.తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంతో  కథా కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. హీరో చంద్రహాస్ రోల్ పవర్ పుల్ గా ఉండటంతో పాటుగా హీరోయిన్ మేఘనా ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేసింది.  చంద్రహాస్,ప్రతినాయకుడుగా చేస్తున్న అర్జున్ మహీ మధ్య టగ్ ఆఫ్ వార్ కూడా  ఆకట్టుకుంది.'నువ్వు నన్ను కొడతాంటే నొప్పి నీ కళ్లలో తెలుస్తుందేంట్రా..'అనే  డైలాగ్ అయితే  హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.బీజీఎం,సినిమాటోగ్రఫీ,ప్రొడక్షన్‌ వ్యాల్యూస్ కూడా టాప్ క్వాలిటీతో ఉన్నాయి.   ఇక  టీజర్ రిలీజ్ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కి బాగా రీచ్ అయ్యింది.నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా "బరాబర్ ప్రేమిస్తా'.ఈ సినిమా టీజర్ లాంఛ్ చేసినందుకు వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా.ఈ మూవీలో నేను హీరోగా నటించడానికి మా డీవోపీ శేఖర్  కారణం  ఆయన నా బ్లాక్ డాగ్ వైట్ చిక్ సినిమా టీజర్ చూసి ఈ టీమ్ కు పరిచయం చేశారు. శేఖర్ బ్రదర్ కు థ్యాంక్స్.సంపత్ గారు ఎంతో క్లారీటీతో,మంచి క్వాలిటీతో రూపొందించారు.నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చందు,వెంకి, చిన్ని గార్లకి థ్యాంక్స్.మేఘన అద్భుతంగా నటించింది. అర్జున్ బ్రదర్ తో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది.ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. మూవీకి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. యాక్టర్ అర్జున్ మహి కూడా మాట్లాడుతూ  2018లో 'ఇష్టంగా, సినిమాతో మీ ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు ఆ మూవీ రూపొందించారు.ఇదే ప్రొడక్షన్ లో వచ్చింది. ఇష్టంగా సినిమా చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇదే టీమ్ "బరాబర్ ప్రేమిస్తా " సినిమాను చేస్తోంది. చిన్న చిత్రంగా మొదలైన ఈ సినిమా రోజు రోజుకూ స్పాన్ పెంచుకుంటూ వచ్చింది. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ లో ఉండేవారు. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చాడు.దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ మా మూవీ టీజర్ లాంఛ్ చేసిన మా ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను గతంలో ఇష్టంగా, ఏక్ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు పేరు వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని  'బరాబర్ ప్రేమిస్తా'ని ప్రారంభించాం.చంద్రహాస్ హీరోగా ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆటిట్యూడ్ స్టార్ గా ఆయన గుర్తింపు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా మా సినిమా ఉంటుంది. కాస్ట్ అండ్ క్రూ మాకు బాగా సపోర్ట్ చేశారు.మూవీ గురించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్ లో  చెబుతానని చెప్పుకొచ్చాడు.మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా అయిన హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ బరాబర్ ప్రేమిస్తా " సినిమాతో హీరోయిన్ గా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్, ప్రొడ్యూసర్స్ చందు, చిన్ని, ఎవిఆర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు థియేటర్స్ లోకి వస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ - "బరాబర్ ప్రేమిస్తా " సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను పరుచూరి మురళి, జయంత్ సి పరాన్జే గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేశాను. సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.డైలాగ్స్  రమేష్ రాయ్,డీవోపీ  వైఆర్ శేఖర్, మ్యూజిక్ ఆర్ఆర్ ద్రువన్, ఎడిటర్  బొంతల నాగేశ్వర రెడ్డి,కథ ఎంఏ తిరుపతి,స్క్రీన్ ప్లే సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి పీఆర్ఓ, సాయి సతీష్, ప్రొడ్యూసర్స్ గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్  
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 న హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ సంఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్  తీసుకుంటున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కూడా ఈ రోజు హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్ ని కలిసి బాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని మీడియా సముఖంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్(sukumar)కూడా హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించడం జరిగింది. తన భార్య తబిత(tabitha)ద్వారా శ్రీ తేజ్ తండ్రికి ఘటన జరిగిన నాలుగు రోజులకే అంటే డిసెంబర్ 9 న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్నిఅందచేయగా ఇప్పుడు వైద్య,విద్య,ఆర్థిక సహకారం అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.  
Shankar, one of the legendary directors of Indian Cinema faced a humiliating disaster with Indian 2. His critically unappreciated films like I, 2.0 also collected good box office collections. But Indian 2 failed to even collect good amounts in the first weekend.  The movie also brought up a discussion if Shankar lost his touch in making his brand of commercial cinema. The director reacted to the negative feedback in one of his recent interviews. He stated that he did not anticipate such negative feedback for the film.  He further stated that Ram Charan's Game Changer will be devoid of any such mistakes or issues. He guaranteed that the movie will be highly entertaining and engaging. He appreciated Ram Charan for giving an apt performance and stated that people will love him.  Shankar further stated that Ram Charan trusted him fully and went for a short hair look as a government officier. At last, he clarified that Indian 3 will release only in theatres. Well, he also revealed that producer Dil Raju prompted Ram Charan's name for Game Changer. Movie is releasing on 10th January. 
విక్టరీ వెంకటేష్(venkatesh)ఐశ్వర్య రాజేష్(aiswarya rajesh)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)కాంబోలో అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam)టైటిల్ కి తగ్గట్టే సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది.హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు(dil raju)నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై వెంకటేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి 'మీను' అనే ఒక సూపర్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.ప్రోమోగా రిలీజ్ అయిన ఆ సాంగ్ లోని పదాలన్ని చాలా క్యాచీగా ఉండి ప్రతి ఒక్కరు పాడుకునేలా ఉన్నాయి.భార్యకి,తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడం,లవర్ కూడా వాళ్ళ పక్కనే ఉన్న ఉంటూ సాగిన సాంగ్ ప్రోమో సినిమాపై అందరిలో అంచనాలు పెంచిందని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్,ఉపేంద్ర లిమయే,నరేష్,విటివి గణేష్,ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బీమ్స్ సిసోరియా సంగీతాన్ని అందించాడు. అనిల్ రావిపూడి,వెంకటేష్ కాంబోలో ఇంతకుముందు ఎఫ్ 2 ,ఎఫ్ 3 వచ్చి ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' హ్యాట్రిక్ సాధించడం ఖాయమనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.    
  ఎన్టీఆర్,(ntr)రామ్ చరణ్(ram charan)హీరోలుగా రాజమౌళి(rajamouli)దర్శకత్వంలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే.పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ మూవీ అన్ని ఏరియాల్లోను కూడా రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేసింది.తెలుగు వారు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ ని సైతం అందుకొని ప్రపంచ సినిమా పితామహుడు గా గుర్తింపు ని పొందిన జేమ్స్ కామెరూన్ ప్రశంసల్నిసైతం అందుకుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన విశేషాలన్నింటిని రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపంలో తెరెకెక్కించిన విషయం తెలిసిందే.డిసెంబర్ 20 న ఎంపిక చేసిన మల్టిప్లెక్స్ థియేటర్స్ లో  విడుదల కానుంది.టికెట్ ధరని 200 నుంచి 300 రూపాయిల దాకా నిర్ణయించారు. గంట ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో తెరెక్కిన ఈ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆస్కార్ అందుకునే వరకు చోటు చేసుకున్న సంఘటనల్ని చూపిస్తున్నారు.  
Vetrimaaran has become one of the most sought after directors in Indian Cinema. Based in Tamil language, he has created a name for himself all over. His films like Aadukalam, Visaranai, Vada Chennai, Asuran garnered great critical acclaim and box office success.  His previous film, Viduthalai Part 1 became a huge blockbuster and he announced part-2, at the end of the film. Now, the movie Viduthalai Part-2 is releasing on 20th December. Before release, Vetrimaaran announced in a special video that the movie is trimmed by 8 minutes before release.  Unlike the films that have been forced to trim post release, like in the case of Kanguva, Vetrimaaran wanted to trim it before the release itself. He stated that the entire team wanted to make the film to the best of their capacities and they did it.  He stated that he doesn't know how much people will appreciate the film post release but he is happy with the process. Vijay Sethupathy, Manju Warrier, Soori, Gautham Vasudev Menon, Rajiv Menon are playing important characters in the film while Ilaiyaraaja scored music. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  చలికాలంలో  తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్‌లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు.  మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.  రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది.   అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది.  ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ  చాలా తియ్యగా మారుతుంది.  ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.  ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.  
  సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.  అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి,  ఆహార వేళలు,  శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది.  దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.  ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.  ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది.  ఈ కారణాల వల్ల ఇంటి పనులు,  ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు.  పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు,  సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది.  దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు,  సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.  వీటిని ఎక్కువ తినడం వల్ల  బరువు పెరుగుతారు. చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు.  దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది.  ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు  ఏర్పడతాయి.  దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.                            *రూపశ్రీ.
  చలికాలం శరీరానికి పరీక్ష కాలం.  చాలామంది శరీరం వెచ్చగా ఉండటం కోసం ఆహారంలో చాలా మార్పులు చేసుకుంటారు.  అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి ఔషద మూలికలు కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు.   వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని,  సీజన్ సమస్యలు తగ్గించడంలో బాగా సహాయపడుతుందని అంటారు.  చలి నుండి ఊరట పొందడానికి చాలామంది టీ, కాఫీలు బాగా తాగుతారు. ముఖ్యంగా చలికాలంలో అల్లం టీ తాగడానికి చాలమంది ఇష్టపడతారు. అయితే అల్లం టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. అల్లం టీ తాగడం చాలా రిలీఫ్ గా అనిపించినప్పటికీ ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.  రోజులో ఒకటి లేదా రెండు సార్లకు మించి అల్లం టీ తాగితే యాసిడ్ చాలా ఎక్కువ పెరిగి ఎసిడిటీ సమస్య విజృంభిస్తుంది.  ఇప్పటికే ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు అల్లం టీ ఒకటి లేదా రెండు సార్లకు మించి తాగితే అది సమస్యను తీవ్రం చేస్తుంది. అల్లంలో రక్తపోటు సమస్యకు మంచి ఔషధం. అధిక రక్తపోటును నియంత్రించడంలో, తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇప్పటికే రక్తపోటు తక్కువ వారు అల్లం టీని పదే పదే తాగుతుంటే అది శరీరంలో రక్తపోటు తగ్గిపోయి లో బీపీ, మైకం వంటి సమస్యలు కలుగజేస్తుంది. రక్తం శరీరంలో చాలా కీలకమైన  ద్రవ పదార్థం.  అయితే అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి.  ఇప్పటికే రక్తం పలుచన కావడం కోసం మందులు వాడుతున్న వారు అల్లం టీ తాగితే చాలా సమస్య ఏర్పడుతుంది.   గర్భవతులకు వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  అజీర్ణం కూడా చేస్తుంటుంది. అయితే అల్లం టీ తాగితే ఈ సమస్య చాలా వరకు సద్దుమణుగుతుంది.  కానీ ఇది మేలు చేస్తుంది కదా అని పదే పదే అల్లం టీని తాగితే గర్భవతులకు మేలు కంటే ఎక్కువ కీడు జరిగే అవకాశం ఉంది. అల్లం టీ తాగితే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.  కడుపులో వికారం కలిగించి అతిసారం సమస్య సృష్టిస్తుంది. అల్లంలో టానిన్ లు ఉంటాయి. అలాగే అల్లంటీలో కెఫీన్ కూడా ఉంటుంది.  దీన్ని ఎక్కువగా తాగితే తీసుకునే ఆహారం నుండి ఐరన్  ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని వల్ల ఐరన్ లోపం ఏర్పడి  రక్తహీనత సమస్య వస్తుంది.                                                *రూపశ్రీ.