LATEST NEWS
చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  ఈ విషయాన్ని  బీజాపూర్ ఎస్ పి  జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు. సిఆర్ పిఎప్ అధికారుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా బీజాపూర్ లో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టారు. లొంగిపోయిన మావోయిస్టులకు పరిహారం ఇస్తామని ఆశచూపారు. ఆదివారం రోజే చెక్కులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. మావోయిస్టులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని  ఇప్పటికే ప్రభుత్వం  ప్రకటించింది.లింగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోలున్నారు.  లొంగిపోయిన 14 మంది తలలపై రూ 68 లక్షల రివార్డు ఉంది. తమ ఆయుధాలతో   మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయ్యింది. 
ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు.  రైతులు అనాదిగా చేసే ఏరువాక సేద్యం ప్రతీ యేడు ఉగాది రోజు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.  ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపి ఆకాక్షించారు. రైతు కుటుంబాల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 
మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో  పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.  పురాణ ఇతిహాసాల ప్రకారం బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నాడు. బీబీనాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు. శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు. అని ముస్లింల నమ్మిక. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది. 
పండుగ పూట  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం  చోటు చేసుకుంది.   ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు  ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి  గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పెద్ద కుమారుడు సంతోష్ పదో తరతి పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేశ్ తొమ్మిదో తరగతి చువుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఈ కుటుంబాలకు లబ్ది చేకూరవిధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 23, 418 మంది పేద కుటుంబాలను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పేదల వైద్యం కోసం రూ, 281. 38 కోట్లు రిలీజ్ చేసినట్టు పేర్కొంది.   
ALSO ON TELUGUONE N E W S
  పుష్ప-2 తో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. నేషనల్ వైడ్ గా తిరుగులేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ సొంతం. ఆయనకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు బన్నీ తన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. (Allu Arjun)   ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ముందుగా ఏప్రిల్ 5న ఆర్య-2 రీరిలీజ్ అవుతోంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన పర్ఫామెన్స్, డ్యాన్స్ లతో ఆర్య-2 ని తన కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా మలిచాడు. ఈ మూవీని మళ్ళీ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.   బన్నీ బర్త్ డేకి రెండు కొత్త సినిమా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశముంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను డైరెక్టర్స్ త్రివిక్రమ్, అట్లీలతో చేయనున్నాడు. త్రివిక్రమ్ మూవీని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అట్లీ ప్రాజెక్ట్ ని బన్నీ పుట్టినరోజుకి అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే, త్రివిక్రమ్ ఫిల్మ్ కి సంబంధించిన కొత్త అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.   ఆర్య-2 రీరిలీజ్, అట్లీ మూవీ అనౌన్స్ మెంట్, త్రివిక్రమ్ ఫిల్మ్ అప్డేట్ తో తన బర్త్ డేకి అల్లు అర్జున్ ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.  
  Icon Star Allu Arjun and brilliant director Sukumar—this is a sensational combo! After delivering blockbusters like Pushpa and Pushpa-2, their collaboration has gained worldwide recognition. Before these massive hits, this dynamic duo worked together on Arya and its sequel, Arya-2, which became a sensational love story when it was released in 2009.   With Allu Arjun’s phenomenal performance, Devi Sri Prasad’s sensational music, and Sukumar’s brilliant screenplay, Arya-2 remains one of the most beloved films among fans and audiences.   Amidst the growing trend of re-releases, the makers have now officially announced that Arya-2 will hit the big screens once again on April 5. This exciting news has thrilled fans who have been eagerly waiting for its re-release.   Produced under the Aditya Arts banner, Arya-2 was presented by BVSN Prasad and produced by Aditya Babu. The film also stars Navdeep and Kajal Aggarwal in key roles. After nearly 15 years, Arya-2 is making a grand comeback to theaters!    
  The stage is set for the unstoppable Megastar Chiranjeevi to redefine entertainment once again. Known for his legendary legacy in Indian cinema, Chiranjeevi has conquered nearly every genre, from action-packed entertainers to emotional dramas, and remains a force to be reckoned with in the industry. His career spans decades of hits, countless awards, and a fanbase that transcends generations. Now, the Megastar is gearing up for an exhilarating line-up of projects that promise to raise the stakes even higher. The Megastar who is awaiting the release of the socio-fantasy Vishwambhara, is all set to join forces with the Blockbuster Hit Machine Anil Ravipudi for an exciting new entertainer, following the latter’s streak of success with a remarkable 8 blockbusters out of his 8 films. Anil Ravipudi's previous release, Sankranthiki Vasthunnam, not only emerged as a massive hit but also shattered records, crossing an impressive 300 Cr gross. This highly anticipated collaboration for #Mega157 will be produced by Sahu Garapati under the esteemed Shine Screens banner, in association with Sushmita Konidela's Gold Box Entertainments, and presented by Smt. Archana.   The project #Mega157 was officially launched today with a grand pooja ceremony, which coincided with the auspicious festival of Ugadi, marking an ideal start for the film. The ceremony was graced by Victory Venkatesh, who sounded the clapboard, Allu Aravind who had the honor of switching on the camera, and the legendary director K Raghavendra Rao directed the first shot. Star producers Dil Raju & Shirish handed over the script to the makers. The event also witnessed the presence of many other prominent personalities from the film industry such as Naga Vamsi, UV Creations Vikram, Director Vassishta, Srikanth Odela, Bobby, Shiva Nirvana, Vamshi Paidipally, Mythri Naveen & Ravi, Shirish, Aswini Dutt, Ram Achanta, Sharrath Marar, Vijayendra Prasad, KS Rama Rao, KL Narayana, Suresh Babu, Venkata Satish Kilaru, Gemini Kiran, Chukkapalli Avinash, Gemini Kiran, and Nimakayala Prasad.   Anil Ravipudi, renowned for his impeccable comedic timing and his ability to craft family-oriented blockbusters, is all set to make a film that promises a perfect blend of humor, heart, and high-energy action. The screenplay, meticulously penned by Anil Ravipudi himself, is designed to present Chiranjeevi in a fresh and dynamic avatar, combining laughter with emotions in a way that will resonate deeply with audiences across generations. Shankar Varaprasad is the character name of Megastar Chiranjeevi.   The technical team behind the success of Sankranthiki Vasthunnam has been retained for this project, ensuring a technically stunning experience. Cinematographer Sameer Reddy will capture the essence of the film, while music director Bheems Ceciroleo will compose the score. Tammiraju will take charge of editing, and S Krishna and G Adi Narayana will contribute as writers, with S Krishna also serving as the executive producer. The film’s production design will be handled by A S Prakash.   The regular shooting of this highly anticipated film will commence shortly, and fans can expect a spectacular and out-and-out entertainer.  
  'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.   ఈ సంద‌ర్భంగా  'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ''ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవ‌రికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండ‌గ రోజున ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల డాక్ట‌ర్ల‌తో క‌లిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వ‌హించాము. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్రామానికి శ్రీకారం చుట్టాము. గత 10 సంవ‌త్స‌రాలలో  50 వేల మంది నిస్సాహ‌యుల‌కు మా ఫౌండేషన్ నుంచి సాయం అందించాం. అలాగే సపర్య వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం, అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. 'మనంసైతం' అండ‌గా ఉంటుంది''  అని కాదంబ‌రి కిర‌ణ్ హామీ ఇచ్చారు.   న‌టుడు వినోద్‌బాల‌ మాట్లాడుతూ.. మనంసైతం కాదంబ‌రి ఫౌండేష‌న్ ‌నుంచి కాదంబ‌రి కిర‌ణ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. ఆయ‌న టీంలో మేము కూడా ఇలా సేవ‌ల్లో పాలుపంచుకోవ‌డం అదృష్టంగా భావిస్తాం. చిత్ర‌పురి కాల‌నీలోని కార్మికుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డం నిజంగా సంతోషంగా ఉంది. అని అన్నారు.    మనంసైతం సేవ య‌జ్ఞంలో తాము కూడా నిరంతరం పాలుపంచుకుంటామ‌ని కస్తూరి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో LIG వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులూ,ప‌లువురు న‌టీన‌టులు, వివిధ శాఖల సినీ కార్మికులు పాల్గొన్నారు.  
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పెద్ది'. మార్చి 27న  రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఆరోజు గ్లింప్స్ విడుదల చేయాలని భావించింది మూవీ టీం. కానీ, దానికి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో ఫస్ట్ లుక్ తో సరిపెట్టింది. దీంతో గ్లింప్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి సర్ ప్రైజ్ ఇస్తూ.. తాజాగా 'పెద్ది' గ్లింప్స్ కి ముహూర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. (Peddi Glimpse)   ఉగాది సందర్భంగా 'పెద్ది' టీం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. పెద్ది మూవీ గ్లింప్స్ ని శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. పోస్టర్ లో బరిలోకి దిగుతున్నట్టుగా జంప్ చేస్తున్న రామ్ చరణ్ స్టిల్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ తోనే మెగా ట్రీట్ ఇచ్చిన దర్శకుడు చరణ్.. ఇక గ్లింప్స్ తో అంతకుమించిన ట్రీట్ ఇవ్వబోతున్నాడని పోస్టర్ తోనే అర్థమవుతోంది.   మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, 2026 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.  
  2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన యాక్షన్ కామెడీ ఫిల్మ్.. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇదే మ్యాజిక్ ని 2026 సంక్రాంతికి రిపీట్ చేయడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. (Chiranjeevi)   ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రం చేస్తున్న చిరంజీవి, తన తదుపరి సినిమాని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కమిట్ అయిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ హాజరై, ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టడం విశేషం. ఈ క్రమంలో ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారట. (Mega157 Launch)   అనిల్ రావిపూడికి, వెంకటేష్ కి మంచి అనుబంధముంది. వీరి కలయికలో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో అనిల్ అడగ్గానే.. చిరంజీవి సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరవడానికి వెంకటేష్ ఒప్పుకున్నారట.   చిరు-అనిల్ మూవీని 2026 సంక్రాంతికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అసలే రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ గా పేరు పడిపోయింది. దానికి తోడు, చిరంజీవికి కూడా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. 2023 సంక్రాంతికి రవితేజతో కలిసి వచ్చి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 2026 సంక్రాంతికి వెంకటేష్ తో కలిసి వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాకి 'చిరు నవ్వుల పండగ' అనే పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.  
  నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. (Mad Square Collections)   'మ్యాడ్' వంటి సూపర్ హిట్ కామెడీ ఫిల్మ్ కి సీక్వెల్ కావడంతో పాటు, వేసవి సెలవులు తోడు కావడంతో.. మ్యాడ్ స్క్వేర్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.20.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ రూ.16.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ సాధించింది.    మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.15-20 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. దీంతో మూడు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది. ఇక నాలుగో రోజు రంజాన్ సెలవు కావడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. యూత్ ఎంజాయ్ చేసే కామెడీ సినిమా కావడంతో.. ఫుల్ రన్ లో మ్యాడ్ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.    
  జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) ఒకరు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ లకు జపాన్ లో ఎందరో అభిమానులు ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' రాకముందే, 'బాద్‍షా' టైంలోనే తారక్ కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ పొందిన ఎన్టీఆర్.. ఇప్పుడు జపాన్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవర'తో జపాన్ ప్రేక్షకులను పలకరించాడు. (Devara In Japan)   'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. దేవర మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మంచి వసూళ్లు రాబట్టి, ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి.. ఎన్టీఆర్ స్టార్డంను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అలరిస్తోంది.    దేవర సినిమా జపాన్ లో మార్చి 28న విడుదలైంది. ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్ళి, అక్కడ ప్రమోషన్స్ చేయడం విశేషం. దీంతో ఈ మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబడుతోంది. ఈ సినిమాకి ప్రీమియర్స్ ఫుట్ ఫాల్స్ 2308 కాగా, ఫస్ట్ డే ఫుట్ ఫాల్స్ 1553. ఇక రెండో రోజు మొదటిరోజుకి మించిన ఫుట్ ఫాల్స్ నమోదు కావడం విశేషం. జపాన్ లో దేవర సెకండ్ డే ఫుట్ ఫాల్స్ 2327. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రెండు రోజుల్లోనే 6188 అడ్మిట్స్ నమోదు అయ్యాయి. ఇండియన్ సినిమాల పరంగా ఇది రికార్డు ఫుట్ ఫాల్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.   జపాన్ లో దేవర రెండు రోజుల్లోనే 11.1 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు రెండోరోజుకి మించిన ఫుట్ ఫాల్స్ నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో దేవర.. అక్కడ రికార్డు వసూళ్ళు రాబట్టే అవకాశముంది.  
దేవస్థానం, విశ్వదర్శనం, శ్లోక చిత్రాలను నిర్మించిన సర్వేజన సుఖినోభవంతు ఫిలింస్‌ తమ ప్రొడక్షన్‌ నెం.4గా ‘సంస్కృత’ పేరుతో సంస్కృత భాషలో ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అందుకోసం 30 నుంచి 45 మధ్య వయసు ఉన్న 16 మంది నటీనటులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఆసక్తిగల నటీనటులు లేటెస్ట్‌ ఫుల్‌ సైజ్‌, మిడ్‌ రేంజ్‌ ఫోటోలు ఒక వీడియోతోపాటు తమ వివరాలను sivasubrahmanyam.23@gmail.comకి మెయిల్‌ చెయ్యవచ్చు. లేదా +91 88974 96143 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా కూడా పంపించవచ్చు. 
NTR is promoting his blockbuster Devara Part-1 in Japan with director Koratala Siva. The actor has attended several interviews as part of promotions. In one his interviews, anchor asked him to mention the best places to eat in Hyderabad. He listed out his favorite and it has Naga Chaitanya's Shoyu among the list.  He listed out the restaurants:  Shoyu Shadab Spice Venue kakatiya Deluxe Mess Telangana Spice Kitchen Palamuru Grill Naga Chatianya has opened Shoyu - an Asian cuisine place for fine dining in Hyderabad venturing into food and beverages business like his father Akkineni Nagarjuna. The place has been receiving huge amount praises for food quality.  Now, NTR recommending the restaurant showcases how well it is performing. Also, it showcases the friendly relations that NTR and Naga Chaitanya pertain. This is a big showcase of friendship and solid brotherhood.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది.  రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.  రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది  శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం  కూడా  తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే  రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.                                       *రూపశ్రీ.
చిన్న విషయాలకే కోపంగా ఉంటారా?  ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చని అంటున్నారు ఆరగ్య నిపుణులు. కోపం,  చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే..  లేదా ఇంట్లో వాళ్లు ఏదైనా సాధారణ పని చెబితే ఊహించని విధంగా వారి మీద అరిచేస్తుంటాం.  అలాగే స్నేహితులు,  చుట్టాలు,   తెలిసిన వారు పలకరించినప్పుడు  లేదా ఏదైనా విషయం గురించి సమాచారం అడిగినప్పుడు చిరాకుగా సమాధానం ఇస్తుంటారు.  ఎదుటి వ్యక్తులు ఈ మాత్రం దానికే ఇంత కోపమా? అని,  ఈ మాత్రం దానికే ఇలా చిరాకు పడాలా అని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇదంతా మనిషి ఒత్తిడి వల్ల కలిగే సమస్య లేదా వాతావరణం వల్ల కలిగే సమస్య కానే కాదట.  ఇది స్పష్టంగా ఆహారం వల్ల వచ్చే సమస్య కూడా కావచ్చు అని అంటున్నారు ఆహార నిపుణులు,  ఆరోగ్య నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయో తెలుసుకుంటే.. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు,  శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం,  హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు.  కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది.  ఇది  మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం.. విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి1, బి6,  బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా,  సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్,  డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు,  కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం.. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది.  కాబట్టి దీనిని 'సూర్యరశ్మి విటమిన్' అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  దీని లోపం వల్ల  వ్యక్తి నిరాశగా,  చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే, విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం,  జింక్ లోపం..  మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం,  జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు,  గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు  సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  యోగా,  ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  కండరాల నిర్మాణానికి,  శరీరం బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే శాకాహారులలో ప్రోటీన్ కు సంబంధించి భయాలు ఎక్కువ ఉంటాయి.  దీనికి కారణం.. ప్రోటీన్ అంటే మాంసాహారం లోనే ఉంటుందని నమ్మడం. చాలా వరకు ప్రోటీన్ కోసం అధిక శాతం మంది గుడ్లు ఎక్కువ తీసుకుంటారు.  కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన కొన్ని శాఖాహార ఆహారాలు ఉన్నాయి.  మీరు శాఖాహారులు అయి, కండరాలను బలంగా పెంచుకోవాలనుకుంటే, ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇవి మీ శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి.. సోయాబీన్.. సోయాబీన్‌ను శాఖాహార ప్రోటీన్లకు రాజు అంటారు. ఇందులో 100 గ్రాములకు దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు కంటే చాలా రెట్లు ఎక్కువ! సోయాబీన్స్‌లో కండరాల నిర్మాణానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీనిని టోఫు, సోయా పాలు లేదా సోయా ముక్కలుగా తినవచ్చు. శనగపప్పు.. మన భారతీయ ఆహారంలో శనగపప్పు ఒక ముఖ్యమైన భాగం. 100 గ్రాముల శనగలల దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అది కాబూలి శనగలు  అయినా లేదా మినప్పప్పు అయినా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు.. పప్పులు, పెసలు, శనగ,  మినపప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్కు  అద్భుతమైన వనరులు. 100 గ్రాముల పప్పు దినుసులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ మరియు ఫైబర్,  పుష్కలంగా ఉంటాయి. పనీర్.. పనీర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించబడుతుంది. 100 గ్రాముల పనీర్ ల  దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వేరుశనగ.. వేరుశెనగలు చౌకగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని స్నాక్ గా లేదా వేరుశెనగ వెన్న రూపంలో తినవచ్చు.                                    *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...