విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. వాస్తవానికి మంగళవారం (జనవరి 7) విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు ఈడీ ఇటీవల నోటీసులు పంపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ పై అదే రోజు తీర్పు వెలువరిస్తుందనీ, కనుక విచారణకు హాజరు కావడానికి మరి కొంత సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో  కేటీఆర్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఈడీ  విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అన్నట్లుగానే ఆయనను ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఇలా ఉండగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్డు డిస్మిస్ చేసిన తరువాత ఈడీ, ఏసీబీలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఏకంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఇక ఈడీ విచారణకు తేదీ ఖరారు చేస్తూ కేటీఆర్ కు నోటీసులు దాఖలు చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా  ఒక వేళ తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలంటూ కేవియెట్ దాఖలు చేసింది. 
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఐటీ పరిశ్రమ అధోగతికి పడిపోయినా.. కొడిగుడ్డు కథ చెప్పి.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సమయం పడుతుందంటూ సమర్ధించుకున్న తీరు అప్పట్లో ఆయనను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాలన అన్ని విధాలుగానూ అధోగతి పాలు చేసింది. విభజిత రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం విభజిత రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో  ఐటీ రంగంలో  లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి.  ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా దానిని  శాశించే స్థాయికి ఎదిగింది.   చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా  చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది.  కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్‌ నిర్వాకం వలన గత  5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది. రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది.  అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్.  చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  అయితే జగన్ నిర్వాకంతో గత ఐదేళ్లలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది.   విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.    ఔను నిజమే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ ఎగుమతులలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కేవలం రూ.1,000 కోట్లే. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ కూడా ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేసింది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.  2021-22 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం.  ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే.    ఇదీ ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ వెలగబెట్టిన నిర్వాకం. మంత్రిగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఆయన చెప్పిన గుడ్డు కథ అప్పట్లో పెద్ద ఎత్తున హేళనకు గురైంది. ఇంతకీ అప్పట్లో ఆయనేం చెప్పారంటే.. ‘ కోడి గుడ్డును పెట్టగలదు కానీ కోడిని పెట్టలేదుగా.. ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డును పెట్టిందనీ, దానిని పొదగాలి, అది కోడి కావాలి పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి అని చెప్పుకునేవారు. అందులోని లాజిక్ కనీసం ఆయనకైనా అర్ధమయ్యిందో లేదో కానీ, జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో కోడి గుడ్డూ పెట్టలేదు, పొదగా లేదు, పిల్లలూ కాలేదు, అవి పెరిగి పెద్దా కాలేదు. అందుకే అన్ని రంగాలతో పాటు తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా వెలుగొందుతున్న ఐటీ రంగం కూడా రాష్ట్రంలో కుదేలైంది.  ఇప్పుడు జగన్  అధికారంలో లేరు. మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా మాజీ మంత్రి అయిపోయారు. అయినా ఆయన గుడ్డు కథను మాత్రం వదలడం లేదు.  ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు సాకారం అవుతోంది.  ప్రధాని నరేంద్రమోడీ బుధవారం (జనవరి 8) విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ రైల్వే జోన్,  నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.  మూడు రాజధానులు అంటూ జగన్ విశాఖను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేస్తాను, ఇక్కడ నుంచే పాలన సాగిస్తానంటూ గొప్పలు చెప్పినా.. తన భార్య కోసం రుషికొండకు బోడిగుండు కొట్టించి విలాసవంతమైన భవనం నిర్మించడం తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఆరు నెలలలోనే విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో పాటు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. గుడివాడ అమర్నాథ్ తెరమీదకు వచ్చి మరో సారి కోడిగుడ్డు కథ చెప్పేశారు. ఇప్పుడు అంటే మంగళవారం (జనవరి 8) మోడీ భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులన్నిటికీ జగన్ హయాంలోనే అంకురార్పణ జరిగిందనీ, ఇప్పడు చంద్రబాబు ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ విమర్శలకు దిగారు. అయితే ఆయన మాటలను నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. గుడ్డు కథలు ఆపు అమర్నాథూ అంటూ చురకలం టిస్తున్నారు. మాజీవి అయినా గుడ్డు కథ మారలేదేంటి? అని సెటైర్లు వేస్తున్నారు. 
తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు.  తెలంగాణాలో కాంగ్రెస్ బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారయ్యింది.  బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను బిజెపి ఖండించడమే గాక ర్యాలీ నిర్వహించింది. ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్, ఎస్ బి అప్రమత్తమై ప్రభుత్వానికి హెచ్చరిక  చేసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ వైపు రాళ్లు రువ్వడంతో వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు 
ALSO ON TELUGUONE N E W S
The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide release on January 12, 2025. The movie has successfully completed all post-production formalities and is ready to hit the big screens.  Directed by Bobby Kolli and produced by Naga Vamsi, the film features Pragya Jaiswal and Shraddha Srinath in pivotal roles. At a press meet held in Hyderabad, the team expressed their confidence in the film's success. Speaking at the event, Director Bobby Kolli said, “We Didn't Take Any References; We Made Daaku Maharaaj to Serve as a Reference Point. We have crafted a unique trailer, unlike previous Balakrishna films, and the response has been phenomenal. We are anticipating a similar reception on January 12." Producer Naga Vamsi added, “Daaku Maharaaj will be remembered as a landmark film in Nandamuri Balakrishna's career. We are also thrilled to announce a simultaneous theatrical release in Tamil.” Actress Pragya Jaiswal shared, “I am fortunate to have Daaku Maharaaj release on my birthday, January 12. I have portrayed a deglam role in the film, and it’s something audiences must experience on the big screen.” Shraddha Srinath expressed, “I am very confident in this film, and I believe Daaku Maharaaj will bring a significant turning point in my career.”   The film promises a unique cinematic experience, and the team eagerly awaits its grand worldwide release on January 12.
Superstar Rajinikanth has been reacting to several issues at airport when media gets hold of him. But his reactions have lead to trolls about him and his awareness. The actor seems to have been fed up with such questions. He shouted at a reporter in his recent interaction to stay on topic, that is, films with him.  Rajinikanth has been staying away from politics recently and he has decided to not react on political issues as well. He used to give his reaction at airports while travelling for shoots or holidays. He has decided to not entertain anymore after watching negative reactions.  Hence, while flying to Thailand for his upcoming movie, Coolie shoot, he had such a stern reaction. Social media people are supporting his stance and stating that he is not entitled to react on every issue that too about issues that he is unaware of.  Well, the actor is fully involved in completing his Coolie movie, directed by Lokesh Kanagaraj. Nagarjuna, Upendra are also part of the film's ensemble cast along with Shruti Haasan. After this movie, he will be seen in Jailer 2, sequel to his recent big blockbuster, Jailer. 
Pushpa 2 The Rule has become the biggest hit in Indian Cinema with a record breaking gross of Rs 1,831 crores in just 32 days of its release. The film has surpassed the previous record holder Baahubali 2: The Conclusion. Now, the movie is aiming to break Dangal record of Rs.2000 crores collection with a renewed energy.  Starting from January 11, additional footage of 20 minutes will be added to the film and re-released in theatres all over. Movie team is following Avatar vs Avengers EndGame technique to mint more money with extended cut. Avengers EndGame team released extended cut to cross Avatar in 2019.  In Hindi markets, the movie has been performing phenomenally well despite it completing 4 weeks of theatrical run. This extended cut might propel the movie run and collections in the North markets further during Sankranti period. But in Telugu, new films release won't give it the same advantage.  Allu Arjun's performance as Pushpa became the major highlight of the film and the connection with the character has yielded this huge BO collection. Sukumar has directed the film and Mythri Movie Makers produced it. Let's see how the reloaded version will propel its BO fortune. 
Ajith Kumar has crashed his racing car during an accident in the practice session for the upcoming 24H Dubai 2025 endurance race. The accident occured around 12:45 PM in Dubai. The 24H Dubai 2025 race is scheduled from January 11th to 12th. Ajith Kumar after completing his impending movie shoots for Vidaamuyarchi and Good Bad Ugly, decided to dedicate his time for racing circuit till September. He launched his own Ajith Kumar Racing team with high ambition to participate in these races.  He even slimmed down and decided to give his lifetime dream a full on go. But he hit a wall during the partice session with his car and has been immediately rescued by the rescue team. Fortunately, he returned unhurt and the actor has been taken to hospital for security health check-ups.  Earlier, Ajith Kumar had accident during Vidaamuyarchi shooting while performing a car stunt. He recovered quickly and now again, he had an accident while driving at speed. The actor has been known for his resilience to make a comeback after set back. Let's wish him all the good luck to continue his dream in racing circuit, unhurt.
  కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో అజిత్ రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. (Ajith Kumar)   అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. పలు రేసింగ్ ఛాంపియన్ షిప్స్ లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 11, 12 తేదీల్లో జరగనున్న 24H Dubai 2025 కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం అజిత్ నడుపుతున్న రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. కారు వేగంగా వెళ్లి సైడ్ వాల్ కి ఢీ కొట్టింది.  గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై కారు గిర్రున తిరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  
నందమూరి నటసింహం,గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'(Daku Maharaj)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచారచిత్రాలు,ట్రైలర్,సాంగ్స్ బాలయ్య మాస్ రేంజ్ కి తగ్గట్టుగా ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా 'డాకు మహారాజ్' వచ్చే 12 వ తారీకు కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మాట అక్షర సత్యమని చాటి చెప్పేలా ప్రముఖ ఆన్ లైన్ యాప్ 'బుక్ మై షో'లో 'డాకు మహారాజ్' కి  2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి.దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు డాకు మహారాజ్ కోసం ప్రేక్షకులు,అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అని. రేపు మూవీ రిలీజ్ అయ్యాక 'డాకు మహారాజ్' సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని నందమూరి అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా ప్రగ్యా జైస్వాల్,శ్రద్దా శ్రీనాథ్, లు హీరోయిన్లుగా చేస్తుండగా కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కూడా ఒక  కీలక పాత్రల్లో కనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బాలకృష్ణ కెరీరి లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా వాల్తేరు వీరయ్య  ఫేమ్ బాబీ దర్శకుడు. ఇక ఈ మూవీ బెనిఫిట్ షో ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారు జామున నాలుగు గంటలకి పడనుంది.తెలంగాణాలో మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.ధరల విషయంలో కూడా ఏపి ప్రభుత్వం మొదటి రెండు వారాలు పెంచుకునేలా అనుమతి ఇవ్వగా ఈ విషయంలో కూడా తెలంగాణాకి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.  
అడవి శేషు(Adavi Seshu)హీరోగా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గూఢచారి(goodhachari 2)యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్నిఅందుకోవడమే కాకుండా,కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని రాబట్టింది.అడవి శేషు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెట్ హిట్ గా కూడా నిలిచిందని చెప్పవచ్చు.ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా గూఢచారి 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory)ఏకే ఎంటర్ టైన్మెంట్స్(Ak entertainments),అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Agarwal Arts)వంటి మూడు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ అందించారు.బాలీవుడ్ బ్యూటీ 'వామికా గబ్బి(Wamiqa Gabbi)తమ సినిమాలో భాగమయినట్టుగా,ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వెల్లడి చెయ్యడం జరిగింది.వామికా రాకతో గూఢచారి 2 పై పాన్ ఇండియా లెవల్లో మరింత క్రేజ్ పెరగడం ఖాయమని చెప్పవచ్చు.ఎందుకంటే వామికా గబ్బి హిందీతో పాటు తమిళ,మలయాళ భాషలకి చెందిన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే పొందింది.'ఇరవకాలం', 'జెనీ' అనే రెండు తమిళ చిత్రాలు కూడా ప్రస్తుతం షూట్ దశలో ఉన్నాయి.లేటెస్ట్ గా బాలీవుడ్ లో రిలీజైన 'బేబీ జాన్' లో కూడా సూపర్ గా నటించింది.దీంతో ఆ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా 'వామికా' నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.దీంతో గూఢచారి 2 కి 'వామికా' ఎంట్రీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.   ఇక మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని జనవరి ఎండింగ్ లోనే ఇస్తున్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.అడవి శేషు,వామికా గబ్బి తో పాటు మధు శాలిని,ఇమ్రాన్ హష్మి,ప్రకాష్ రాజ్,జిష్ణు సేన్ గుప్తా,సుప్రియ యార్లగడ్డ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి వినయ్ కుమార్ సిరిగినీడి(vinaykumar Sirigineedi) దర్శకుడు కాగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.  
  నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. రీసెంట్ ఎపిసోడ్ లో బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ 'డాకు మహారాజ్' టీం సందడి చేసింది. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఓ వివాదానికి కారణమైంది. ఈ వివాదం నందమూరి అభిమానుల్లో కాస్త గందరగోళాన్ని క్రియేట్ చేసింది. (Unstoppable with NBK)   అన్ స్టాపబుల్ షోలో పలువురు హీరోల ఫోటోలను ప్రదర్శించి, వారి గురించి డైరెక్టర్ బాబీని అడిగాడు బాలకృష్ణ. అయితే బాబీ దర్శకత్వంలో నటించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తప్ప మిగతా హీరోలందరి ఫోటోలు అక్కడ ప్రదర్శించారు. ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో 'జై లవ కుశ' వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది. బాబీ కెరీర్ లో 'జై లవ కుశ' సినిమాకి ప్రత్యేక స్థానముంది. అలాంటిది అన్ స్టాపబుల్ షోలో ఈ సినిమా ప్రస్తావన కానీ, అందులో నటించిన ఎన్టీఆర్ ప్రస్తావన కానీ రాలేదు. దీంతో కావాలనే షోలో ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన రాకుండా చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఇంకా కొందరైతే.. షోలో 'జై లవ కుశ' ప్రస్తావన వస్తే, బాలకృష్ణ కావాలని తీసేయించాడని న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే ఆ న్యూస్ లో నిజం లేదని ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి వర్క్ చేస్తున్న వారిలో కొందరు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, షూటింగ్ గ్యాప్ లో స్వయంగా బాలయ్యే బాబీ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ని తీసుకొచ్చారట. "మా వాడితో సినిమా చేశావు కదా.. అందులో యాక్టింగ్ అదరగొట్టాడు" అని బాలయ్య మాట్లాడినట్లు అన్ స్టాపబుల్ టీం మెంబర్స్ చెప్పుకొచ్చారు. తాజాగా నిర్మాత నాగవంశీ సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు.   తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీకి 'జై లవ కుశ' వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన నాగవంశీ.. అసలు షోలో 'జై లవ కుశ' సినిమా ప్రస్తావనే రాలేదని, బాలకృష్ణ గారు ఎడిట్ చేయించారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు షూట్ బ్రేక్ లో ఒక సినిమా ప్రస్తావన వస్తే.. ఆ క్యారెక్టర్ జూనియర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ గారు అన్నారని నాగవంశీ చెప్పుకొచ్చాడు. నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వస్తుంది అనడంలో సందేహం లేదు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే.. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది.... యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.    ఎందుకు జరుపుకోవాలి.... యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం.. యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.  ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.                                             *రూపశ్రీ.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.  
  ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సామెత అందరికీ తెలిసిందే. దీనర్ధం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. అలా ఎందుకన్నారంటే  మనిషి తన జ్ఞానంలో  80 శాతందాకా కళ్ల ద్వారా చూసి నేర్చుకోవటంవల్లనే పొందుతాడు. కంటిచూపున్నవారు కళ్ళతో చూసి, చదివి విద్యావంతులై జీవితంలో స్థిర పడతారు. మరి రోజువారీ జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు పడే అంధులెలా చదువుతారు? చదవాలనే తపన వాళ్ళలో ఉన్నా కూడా వారికున్న వైకల్యమే వారిని వెక్కిరిస్తుంది. కానీ, అంధుల  భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే  తన ఆవిష్కరణతో వారికి ఒక ఆశాకిరణంలా నిలిచాడు ఫ్రెంచ్ విద్యావేత్త, ఆవిష్కర్త అయిన లూయీ బ్రెయిలీ. ఆయన  చేసిన సేవలకి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. చీకటికి అక్షరాలతో చూపును ఇచ్చి.. ప్రపంచంలో ఉన్న అంధుల జీవితాలలో వెలుగులు నింపిన లూయీ బ్రెయలీ గురించి తెలుసుకుంటే.. లూయీ బ్రెయిలీ ఎవరు…. లూయీ బ్రెయిలీ  1809,  జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి సైమన్-రెనె బ్రెయిల్ రాచరిక గుర్రాలకు పగ్గాలు, సాడిల్స్ తయారు చేసే పని చేస్తుండేవారు. అయితే, మూడు సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న బ్రెయిలీ చూపు, తర్వాత అయిదేళ్లలోపే అతన్ని పూర్తిగా అంధుడిగా మార్చేసింది. అయినాసరే ధైర్యం కోల్పోని ఆయన పారిస్ లోని ఒక అంధుల పాఠశాలకి వెళ్ళి చదువుకుని అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తించబడ్డాడు. అప్పటివరకూ అంధులకి అందుబాటులో ఉన్న ‘’లైన్ టైప్’’ పద్ధతిలోనే కష్టపడి చదువుకుని 17ఏళ్లకే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడున్నప్పుడే అంధులకి సులువుగా ఉండే లిపి తయారుచేయాలన్న తపన  మొదలైంది.   బ్రెయిలీ లిపి ఆవిష్కరణ ఇలా జరిగింది..... అప్పటి వరకు అంధుల కోసం ఉన్న పుస్తకాల ప్రింటింగ్ విధానాలు సరైనవి కాదనిపించేవి. అందుకే  ప్రొఫెసర్గా పగలు విధ్యార్ధులకి  బోధిస్తూ, రాత్రిళ్ళు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారు చేయటానికి లూయీ బ్రెయిలీ కృషి చేశాడు.  చీకట్లో కూడా  సందేశాలను చదవడానికి అనువుగా 12 ఉబ్బెత్తు చుక్కలతో రూపొందించబడిన ప్రత్యేకమైన సైనిక గూఢచార పద్ధతి గురించి తెలుసుకున్నాడు. దీని ప్రేరణతో ఆరు ఉబ్బెత్తు చుక్కలని  అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, అంకెలని, సంగీత చిహ్నాలని సూచించే బ్రెయిలీ లిపిని తయారుచేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సాధనంగా నిలిచింది. బ్రెయిలీ లిపి అంటే..... బ్రెయిలీ లిపి  ఒక స్పర్శ ఆధారిత వ్రాతపద్ధతి. ఇందులో ఉబ్బెత్తుగా ఉండే ఆరు చుక్కల  ద్వారా అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను సూచిస్తారు. ఉబ్బెత్తు చుక్కల  సమూహాన్ని 'సెల్' అని అంటారు. ప్రతీ సెల్లోనూ భిన్నంగా అమర్చిన  చుక్కల  ఆధారంగా  అంధులు అక్షరాలు, అంకెలని గుర్తించి చదవగలుగుతారు. ఈ విధానం దృష్టిలోపం ఉన్నవారికి వ్రాతపూర్వక సమాచారం పొందడానికి సహాయపడుతుంది. బ్రెయిలీ  వివిధ భాషలతో పాటు గణితం, సంగీతం వంటి సాంకేతిక నోటేషన్లకు అనుకూలంగా తయారు చేయబడింది. బ్రెయిలీ  వ్రాయడానికి బ్రెయిలీ  రైటర్ యంత్రం లేదా స్టైలస్, స్లేట్ వంటి సాధనాలని  ఉపయోగిస్తారు.  ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది పూర్తి అంధులుగా ఉన్నారు. 253 మిలియన్ల మంది ఏదో ఒక విధమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరందరికీ బ్రెయిలీ లిపి ఒక చేయూతలా పనిచేస్తుంది. అలా ఇంతమంది అంధులకి  సహాయపడుతున్న  బ్రెయిలీ లిపి  ప్రాముఖ్యతను గుర్తించిన  ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 నవంబర్ 6న  ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లూయీ బ్రెయిలీ  జయంతిని పురస్కరించుకుని   ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంధుల కోసం ఏం చేయాలి? దృష్టి లోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వారికి విద్యా, వృత్తి అవకాశాలు అందించడం, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  పెరుగుతున్న టెక్నాలజీవల్ల బ్రెయిలీ  కూడా అభివృద్ధి చెందుతోంది. రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఆధునిక పరికరాలు దృష్టి లోపం ఉన్నవారికి డిజిటల్ కంటెంట్‌ను చేరువ చేయడంలో పెద్ద మార్పును తెచ్చాయి. అయితే, బ్రెయిలీ  పుస్తకాలు, ఇతర వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయడం, దాని ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన పెంపొందించడం అవసరం. ప్రపంచ బ్రెయిలీ  దినోత్సవం  లూయీ బ్రెయిలీ చేసిన అమూల్యమైన సేవలకు నివాళి . దృష్టి లోపం ఉన్నవారి హక్కులు, గౌరవానికి గుర్తింపు.   దృష్టి లోపం ఉన్నవారిని తక్కువ చేసి చూడకుండా, జాలి పడి వదిలేయకుండా మనలో ఒకరిగా, వారికి కాస్త  ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధిస్తారు.                               *రూపశ్రీ.
  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే.. వాల్ నట్,  బాదం.. వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి. వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.                                                  *రూపశ్రీ.
  హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్ చైనా నుండి మొదలైంది. ఇది కొత్తగా పుట్టినదేమీ కాదట.  ఇది ఆరు దశాబ్దాల నుండి ఉనికిలో ఉంది.  శాస్త్రవేత్తలకు గత 25 సంవత్సరాలుగా దీని గురించి తెలుసు. ఇది ఆర్‌ఎన్‌ఏ వైరస్.  అందుకే ఇది సజీవంగా ఉండటానికి సహజంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం హెచ్ఎంపీవీలో  కొత్త మ్యుటేషన్ కూడా సంభవించింది.  దీని కారణంగా చైనాలో  కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీడియా నివేదికలు,  వీడియోలు చైనాలోని ఆసుపత్రులు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో జనాలను తరలించడం చూపించాయి. ఈ వార్తలు చూస్తుంటే చైనా నుండి మరో అంటువ్యాధి కరోనా మాదిరిగా  ప్రపంచమంతటా వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.  ప్రజలు ఇంకా కరోనా నుండి సరిగ్గా కోలుకోలేదు.  కానీ అప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఇది ప్రజలను కలవరపెడుతోంది.  అన్నింటిలో మొదటిది దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా  ఆసుపత్రులు,  శ్మశానవాటికలలో రద్దీని పెంచిందని చైనా నుండి వార్తలు వచ్చాయి. పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. చైనా తర్వాత ఇతర దేశాలలో కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది. సోమవారం (డిసెంబర్ 6), ఈ అంటు వ్యాధి మొదటి కేసు భారత్ లో కూడా నమోదైంది ఈ వైరస్ గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కరోనా వైరస్‌తో సమానంగా ఉంటుందట.  దాని లక్షణాలు కరోనా కంటే కొంచెం ఎక్కువ లేదా కరోనా కంటే కొంచెం తక్కువ తీవ్రతతో ఉంటాయట.  కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ప్రజలు జలుబు,  శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారట.                                                 *రూపశ్రీ.