ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కుమాడుకు కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నఅన్నా లెజనోవో.. మార్క్ శంకర్ కోలుకోవడంతో అన్నా లెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆమె తిరుమల పర్యటన సందర్భంగా విదేశీయులు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో వాటిని   ఖ‌చ్చితంగా పాటించారు. తిరుమలలోనే ఆమె తిరుమల స్వామివారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చారు.    తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. 
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.   మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్లి స్థానికులు, అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.    ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని అనిత చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారనీ, ఏడుగురు గాయపడ్డారనీ తెలిపారు.  ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు  ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో  జరిగిన అక్రమాలు, అన్యాయాలు ప్రజల ముందుంచుతానన్నారు.   మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  జగన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో  జగన్ చేయాలనుకున్నది చేస్తే.. తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇక ఆ అధ్యాయం ముగిసిందనీ, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.  జగన్ అరాచకాలు  బయటకు తెస్తానన్నారు. సండూర్ పవర్‌తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు.  అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారన్నారు. జగన్ బాధితులందరికీ తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులు  తనకు సమాచారం అందించాలని కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.  అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. 
ALSO ON TELUGUONE N E W S
  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 దాదాపు పూర్తయింది. ఇది ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెలలోనే ఎన్టీఆర్ షూట్ లో పాల్గొననున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 2 చేయనున్నాడు ఎన్టీఆర్. వీటితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో ఒక మూవీ కమిట్ అయ్యాడు. (NTR Nelson)   ఎన్టీఆర్, నెల్సన్ కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని లాక్ చేశారట.   నెల్సన్ సినిమాలకు ఫస్ట్ నుండి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2 కి కూడా అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి కూడా లాక్ అయినట్లు సమాచారం.   ఎన్టీఆర్ గత చిత్రం దేవర కి కూడా అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. దేవర మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వీరి కాంబోలో మరో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.   సితార బ్యానర్ తో కూడా అనిరుధ్ ట్రావెల్ అవుతున్నాడు. గతంలో జెర్సీ చేశాడు. ప్రస్తుతం కింగ్ డమ్, మ్యాజిక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ కాంబో ఫిల్మ్ కోసం భారీ రెమ్యూనరేషన్ తో అనిరుధ్ ని లాక్ చేసినట్లు వినికిడి.  
  అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ 'పోలీస్ వారి హెచ్చరిక'. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు.    ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. "నేను గతంలో బాబ్జీతో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.   తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.."సమాజంలో జరిగే చెడులను ప్రశ్నించే సినిమాలు రావాలి. ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందిన సినిమా. గతంలో ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మోహన్ బాబు గారు లాంటి నటులు ఎర్ర జెండాను పట్టుకొని కమ్యూనిస్ట్ అంశాలతో చక్కటి సందేశాత్మక చిత్రాలు తీశారు. ఆ సినిమాలను జనాలు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాబ్జీ అలాంటి ఆశయాలతో  ఈ సినిమా చేశారు. విలువలతో కూడిన సందేశాత్మక సినిమాలను కచ్చితంగా మనం సపోర్ట్ చెయ్యాలి. ఇలాంటి సినిమాని అందిస్తున్నందుకు డైరెక్టర్ బాబ్జికి, నిర్మాత బెల్లి జనార్దన్ కి అభినందనలు తెలుపుతున్నాను" అన్నారు.   జయసుధ మాట్లాడుతూ, "బాబ్జి సినీ పరిశ్రమ లోకి వచ్చినప్పటి నుంచి  నాకు బాగా పరిచయం. చాలా అద్భుతమైన డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా తీశారు. సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పాటలు విన్నాను. వినసొంపుగా చాలా బాగున్నాయి. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ బాబ్జీ గారికి, నిర్మాత బెల్లి జనార్దన్ గారికి ఆల్ ది బెస్ట్ " అని అన్నారు.   ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ప్రజా నాట్యమండలి  వేదిక నుంచి వచ్చిన బాబ్జీ తీసిన ఈ  సినిమా గురించి విన్నప్పుడు ఇది సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సినిమా అని అర్థమయ్యింది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. ఈ సందేశాత్మక చిత్రం ఘన విజయం సాధించాలి. బాబ్జి గారు మంచి సినిమా తీయడం కోసం ఎంత టైం అయినా తీసుకొని ఆ సినిమా బాగా వచ్చే దాకా కష్టపడతారు. ఇప్పుడు ఆయన బిడ్డతో ఇంత మంచి సినిమా తీశారు. ఆయన నుంచి జనాలకి ఉపయోగపడేలా మంచి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటూ, బాబ్జికి, నిర్మాత బెల్లి జనార్దన్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను" అని అన్నారు.   అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. " నాకు ఈ చిన్న గుర్తింపు రావడానికి కారణం కమ్యూనిస్ట్  పార్టీ. నేను  కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని కాకపోయినా నా కుటుంబం అంతా కూడా కమ్యూనిజంకే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లో నేను  చాలా గొప్ప  పాత్రను  పోషించాన. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.  ఈ సినిమా విడుదల తరువాత మా దర్శకుడు బాబ్జీ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా సినీ పరిశ్రమలో తనదైన సంతకం చేసేస్తారు . నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ బాబ్జీ గారికి, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని అన్నారు.  
  ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి 'టీచ్ ఫర్ చేంజ్' అనే కార్యక్రమాన్ని నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది హైదరాబాద్ లో సెలబ్రిటీ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. ఈ శనివారం జరిగిన ఈవెంట్ లో తన సోదరి లక్ష్మిని సర్ ప్రైజ్ చేస్తూ మంచు మనోజ్ (Manchu Manoj) పాల్గొన్నారు. మనోజ్ వెంట ఆయన సతీమణి మౌనిక కూడా ఉన్నారు. మనోజ్ ని చూసిన లక్ష్మి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తమ్ముడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని కంటపడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్క-తమ్ముడు బాండింగ్ అంటే ఇది అంటూ నెటిజెన్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.   కాగా, కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సోదరులు విష్ణు, మనోజ్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో మోహన్ బాబు.. విష్ణు పక్షాన ఉన్నారు. మనోజ్ అంటే మొదటి నుంచి ఎంతో ప్రేమగా ఉండే లక్ష్మి.. సోదరుల మధ్య విభేదాలను పరిష్కరించలేక దూరంగా ఉండిపోయారు. ఇలాంటి సమయంలో మనోజ్ తన ఈవెంట్ దగ్గరకు వచ్చి సర్ ప్రైజ్ చేయడంతో.. తమ్ముడిని చూసి లక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.  
  నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేశ్ కొల‌ను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హిట్-3' (Hit 3). 'హిట్' ప్రాంఛైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర విడుదలకు దాదాపు మూడు వారాల ముందే సెన్సార్ పూర్తి కావడం విశేషం.   ఇటీవల 'హిట్-3' సెన్సార్ పూర్తయింది. ఫైనల్ రన్ టైంని 2 గంటల 35 నిమిషాలకు లాక్ చేశారు. ఇక ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. దానికి కారణం చిత్రంలో విపరీతమైన వయలెన్స్ ఉండటమే.    నానికి ఫ్యామిలీ స్టార్ లాంటి ఇమేజ్ ఉంది. అలాంటి నాని, ఇటీవల మాస్ బాట పట్టాడు. ఇక ఇప్పుడు 'హిట్-3'తో పూర్తి వయలెంట్ గా మారిపోయాడు. టీజర్ చూసినప్పుడే ఈ విషయం అర్థమైంది. ఇక తాజా సెన్సార్ టాక్ తో.. వయలెన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ ఉందని క్లారిటీ వచ్చేసింది.   'హిట్-3' సినిమా బాగుందట. కానీ, స్క్రీన్ ని ఎరుపెక్కించేలా చాలా వయలెంట్ గా ఉందట. అందుకే కొన్ని షాట్స్ ని బ్లర్ చేస్తూ, ఎ సర్టిఫికెట్ ఇచ్చిందట సెన్సార్. బ్లర్ చేస్తేనే ఎ సర్టిఫికెట్ అంటే.. చేయకపోతే రక్తపాతం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.    నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతుంటారు. కానీ, ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే అవకాశముంది.  
  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ గా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతోంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.   రాజమౌళి సినిమాలలో డైలాగ్ లు తక్కువే ఉన్నప్పటికీ, అవి బలంగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. డైలాగ్ రైటర్ ఎవరైనా కానీ, రాజమౌళి సినిమాల విషయంలో జరిగేది ఇదే. అలాంటిది ఇప్పుడు మహేష్ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు దేవా కట్టాను రాజమౌళిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. బాహుబలి ఫ్రాంచైజ్ కి అజయ్-విజయ్ మాటల రచయితలుగా వ్యవహరించగా.. కొన్ని కీలక సన్నివేశాలకు దేవ కట్టా కూడా డైలాగ్స్ అందించారు. ఇక ఇప్పుడు 'SSMB29' కి పూర్తిస్థాయి డైలాగ్ రైటర్ గా దేవ కట్టాను తీసుకున్నట్లు సమాచారం.    టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో దేవ కట్టా ఒకరు. ఆయన సినిమాలలోని మాటలు లోతైన భావాన్ని కలిగి, బలంగా ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటాయి. ముఖ్యంగా ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలలోని మాటల గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అందుకే రాజమౌళి.. దేవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి సమయంలో ఆయన టాలెంట్ దగ్గరుండి చూశారు. పైగా ఆయనకు ఇంగ్లీష్ మీద గ్రిప్ కూడా ఉంది. 'SSMB29'ని గ్లోబల్ ఫిల్మ్ గా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి.. కేవలం తెలుగు డైలాగ్స్ కోసమే కాకుండా, ఇంగ్లీష్ డైలాగ్స్ కి కూడా దేవ కట్టా టాలెంట్ హెల్ప్ అవుతుందని రాజమౌళి ఆయనను తీసుకున్నట్లు వినికిడి.  
Hrithik Roshan and Jr. NTR have come together for War 2, a big Spy Universe film from Yash Raj Films. This marks NTR's debut in Hindi Cinema and YRF kept his character details secret. Ayaan Mukherji is directing the film after Brahmastra and the anticipation for this sequel is huge.  Kiara Advani has played the leading lady role in the film. Now, Hrithik Roshan thanked NTR for making it special to work with him in War 2. He stated that without NTR it would not have been possible for them to finish the film as planned. He also stated that he will remember the song shoot and learnt a lot from NTR's dedication.  He stated that Ayaan Mukherji will shock audiences as the movie has come out perfectly as they have planned. He also stated that the huge action sequences will be loved by everyone. He recently started working on his long pending Krrish 4 and he will be directing the superhero film, too. War 2 is releasing on 14th August. 
Prabhas has become the biggest Pan-India star and his popularity is growing around the world, too. The actor has five films in the pipeline and he promised to complete them one after another. But his producers are now worried about their investments.    According to the reports, the actor has flown to Italy for his leg injury and he did not return yet. It has been two months and producers are waiting for an official confirmation about his return. As per the reports, he did not give new dates to complete The Raja Saab shoot and his film with Hnau Raghavapudi.    The Raja Saab shoot has to be completed soon as the makers have invested huge and the movie has been postponed from its planned release date. The reports suggest that there is a huge amount of portion to be re-shot as well. Director Maruthi has been waiting for dates of the actor, say reports with everything set ready to shoot.    Prabhas did finish Hanu Raghavapudi films three schedules quickly and makers have shot portions that don't involve him, also, it seems. But now they need his dates to shoot big action episodes and they are also waiting for his confirmation. Due to this delay, even Spirit is getting pushed back, it seems.    If the reports are to be believed Prabhas needs to rest his knees further to have a complete recovery but due to continuous schedules, he couldn't. But as the producers are having trouble to balance their investments and worried about going over budget, they have been waiting for a positive reply from him, it seems.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Megastar Chiranjeevi fans are known for being active and celebrate a small glimpse their idol on social media. But they seem to be not so impressed by Vishwambhara Rama Raama song. They are not so active even after the song release and the song is not trending too.    MM Keeravaani after a long gap returned to compose to a Chiranjeevi starrer and he gave a devotional song going by the theme of Vishwambhara. But the kind of reception that a big star hero film's first single release gets is not seen for this song and film.    More or less, fans of the actor seem to be very silent and tensed about the VFX quality of this film. Until, a big glimpse or teaser is released with new improved version, the anticipation for this movie could be low among the hardcore fans too.    Ashika Ranganath, Trisha Krishnan are playing prominent roles in the film. Mallidi Vassishta is directing the film and UV Creations are producing it. The movie official release has not been announced yet but it is scheduled for July release, currently. 
ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju),దీపికా పిల్లి(Deepika Pilli)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'అక్కడ అమ్మాయిఇక్కడ అబ్బాయి నిన్న ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వెన్నెలకిషోర్,మురళీధర్ గౌడ్,జాన్ విజయ్,సత్య కీలక పాత్రల్లో కనపడగా 'మాంక్స్ అండ్ మంకీస్' నిర్మాణ సారథ్యంలో నితిన్,భరత్(Nithin Barath)ద్వయం దర్శకత్వం వహించారు.ఇప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయపదాన దూసుకుపోతుంది. ఈ మూవీ తొలి రోజు 15 లక్షల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి.కాకపోతే మేకర్స్ నుంచి అధికార ప్రకటన మాత్రం రాలేదు.మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.ఇక చిత్ర బృందం రీసెంట్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది.అందులో ప్రదీప్ మాట్లాడుతు తమ సినిమాని ప్రమోట్ చేసిన మహేష్ బాబు,రామ్ చరణ్ కి ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా,మూవీ ఆధ్యంతం ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని రిలీజ్ కి ముందే ఇచ్చిన  మాటని నిలబెట్టుకున్నామని చెప్పడం జరిగింది.    
మనదేశంలో సినిమా ఆర్టిస్టులకు, క్రికెట్‌ ప్లేయర్లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా స్టార్స్‌ ఏదైనా ఫంక్షన్‌కి లేదా షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌కి వెళ్లినపుడు అభిమానుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆయా ఆర్టిస్టులతో మాట్లాడాలని, సెల్ఫీలు తీసుకోవాలని జనం ఎగబడుతుంటారు. సర్వసాధారణంగా ఏ ఆర్టిస్టుకైనా ఇదే జరుగుతుంది. కానీ, మన జగపతిబాబుకి మరో విధంగా జరిగింది. హైదరాబాద్‌లోని కొన్ని వీధుల్లో ఒక్కడే నడుచుకుంటూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఆయన్ని షాక్‌కి గురి చేసింది. ఆ వీడియో చూస్తే జగపతిబాబే కాదు, మనం కూడా షాక్‌ అవ్వడం ఖాయం. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 200 సినిమాల్లో నటించారు జగపతిబాబు.  ఇటీవల హైదరాబాద్‌లోని వీధుల్లో జగపతిబాబు ఒంటరిగా నడుచుకుంటూ ఒక మొబైల్‌ షాప్‌కి వెళ్లారు. ఇదంతా ఆయన సిబ్బంది వీడియో తీస్తూ అనుసరించారు. అలా వీడియో తీస్తున్నంత సేపూ ఒక్కరు కూడా జగపతిబాబును గుర్తు పట్టి పలకరించలేదు. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. అలాంటి జగ్గుభాయ్‌ ఒక కామన్‌ మ్యాన్‌లా వీధుల్లో కనిపించేసరికి.. ఎవరో జగపతిబాబును పోలిన మనిషి అనుకున్నారు తప్ప ఎవరూ దగ్గరకు రాలేదు. తాజాగా తీసిన ఈ వీడియోను స్వయంగా జగ్గుభాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడీ వీడియో బాగా వైరల్‌ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక స్టార్‌ యాక్టర్‌ అయి ఉండి ఇంత సింపుల్‌గా ఉండడం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.
వ్యర్థాలు అంటే నిరుపయోగకరమైన వస్తువులు లేదా పదార్థాలు.  ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి ఇలాంటి వ్యర్థాలు ఎన్నెన్నో బయటకు వెళుతూ ఉంటాయి. ఇది చాలా సహజ విషయం అని అందరూ అంటారు. కానీ ఈ వ్యర్థాలే పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 62మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయట. దేశం అంతా ఇంత వ్యర్థాల మధ్య కుళ్లిపోతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం నిశ్శబ్ద యుద్దం జరుగుతోంది. ఇవి కూడా ఏ పట్టణ ప్రాంతాలలోనో ఏ పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నవో అనుకుంటే పొరపాటు పడినట్టే..  భారతదేశంలో ఆరు గ్రామాలు వ్యర్థాలు లేని గ్రామాలుగా మారి దేశం దృష్టిని తమ వైపు ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ గ్రామాలు అలా ఎలా మారాయి అనే విషయం తెలుసుకుంటే.. భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో ఉండే కొన్ని గ్రామాలు వ్యర్థాలే లేని  గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి.  భారతదేశం మొత్తం మీద ఎంతో గర్వంగా గుర్తింపు పొందాయి. ఈ గ్రామాలలో పిల్లలు శుభ్రపరిచే కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. పెద్దలు సరళంగా జీవించడం గురించి జ్ఞానాన్ని పంచుకుంటారు. ఇక్కడ  "వ్యర్థం" అనే ఆలోచన నెమ్మదిగా కనుమరుగవుతోంది.  ఎందుకంటే ఇక్కడ ఏదీ వృధా కాదు. ఇవి కేవలం విధానాలే కాదు, ప్రజల కథలు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అట్టడుగు స్థాయి చర్య. ఇది శుభ్రమైన వీధుల గురించి మాత్రమే కాదు - ఇది పరిశుభ్రమైన భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే.. ఆంధి, జైపూర్, రాజస్థాన్.. జైపూర్ నుండి కొద్ది దూరంలో ఉన్న ప్రశాంతమైన ఆంధి గ్రామం అసాధారణమైన పని చేస్తోంది. ఈ గ్రామంలో వ్యర్థాలను స్వచ్ఛమైన అవకాశంగా మారుస్తోంది. వినూత్నమైన గ్రీన్ టెక్నాలజీల సహాయంతో ఇప్పుడు ఆహార వ్యర్థాలు,  వ్యవసాయ వ్యర్థాల నుండి ఆసుపత్రి వ్యర్థ జలాలను కూడా శక్తి, స్వచ్ఛమైన నీరు,  కంపోస్ట్‌గా మారుస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్లు, సౌరశక్తితో నడిచే వ్యవస్థలు,  సహజంగా నీటిని శుద్ధి చేసే తడి భూములను ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సైన్స్ నేతృత్వంలో,  ప్రజలచే శక్తిని పొందుతూ, గ్రామీణ భారతదేశం వ్యర్థాలు లేని  దిశగా మారడానికి చైతన్యం ఇస్తుంది. నయా బస్తీ, డార్జిలింగ్.. ఇదివరకు డార్జిలింగ్ కొండలలోని ఒక చిన్న గ్రామం నయా బస్తీ చెత్త కుప్పల కింద ఇబ్బంది పడుతుండేది. నేడు ఈ గ్రామం రూపు రేఖలు మారిపోయాయి.  దీనిని దాదాపుగా గుర్తించలేనంత అద్బుతంగా మారిపోయింది.  ఈ మార్పుకు  ఉట్సోవ్ ప్రధాన్,  అతని బృందం కీలకంగా ఉన్నారు. వారు తమ చేతులను చుట్టి సమాజంతో కలిసి పనిచేశారు. కంపోస్టింగ్ వంటి పురాతన పద్ధతులను తీసుకువచ్చారు. వాటిని పెర్మాకల్చర్ వంటి ఆధునిక ఆలోచనలతో కలిపారు.  వ్యర్థాలను జీవితంగా మార్చారు. ఇది ఇప్పుడు శుభ్రంగా ఉండటమే కాదు..  పచ్చగా, బలంగా ఉంది.  చోటా నరేనా, రాజస్థాన్.. ఒకప్పుడు ప్లాస్టిక్ కుప్పలు, కాలిపోతున్న వ్యర్థాల మధ్య పాతుకుపోయిన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని చోటా నరేనా గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల్లోనే. ఒకప్పుడు కలుషితమైన ఈ గ్రామం రాష్ట్రంలో మొట్టమొదటి వ్యర్థ రహిత గ్రామంగా  మారింది - ఇదంతా అక్కడ నివసించే ప్రజల వల్లే సాధ్యమైంది. పటోడా, మహారాష్ట్ర.. మహారాష్ట్ర నడిబొడ్డున ఉన్న పటోడా గ్రామం సుస్థిర జీవనం అంటే ఏమిటో చూపిస్తుంది. ఇక్కడ,వ్యర్థాలను బయట పడేయడం కాదు - వాటిని పనిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇల్లు తన వ్యర్థాలను క్రమబద్ధీకరిస్తుంది. వంటగది వ్యర్థాలను పొలాలకు ఎరువుగా మారుస్తుంది.  ప్లాస్టిక్,  పొడి వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం విక్రయిస్తుంది, ఇది గ్రామ ఆదాయాన్ని పెంచుతుంది. మేలతిరుప్పంతురుతి, తమిళనాడు.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణ పంచాయతీగా మేలతిరుప్పంతురుతి పేరు సంపాదించింది. ఈ పట్టణం వ్యర్థాలను మూలంలోనే క్రమబద్ధీకరిస్తుంది. సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. నివాసితులకు ఉచితంగా మొక్కలను అందజేస్తారు.  బయోడిగ్రేడబుల్ బ్యాగుల కోసం ప్లాస్టిక్‌ను తొలగించమని ప్రోత్సహిస్తారు. ఇది పనిచేసే సరళమైన, సమాజ-ఆధారిత వ్యవస్థ. ఇంట్లోనే పెద్ద మార్పు ఎలా ప్రారంభమవుతుందో చూపించే చిన్న పట్టణం.  అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్.. ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ చెత్తకుప్పగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కథను పూర్తిగా మార్చేసింది. నేడు ఇది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి.  ఇక్కడ ప్రతి ఇల్లు చెత్తను వేరు చేస్తుంది.  ఒక్క చెత్త కూడా చెత్తకుప్పలో పడదు.   *రూపశ్రీ  
  ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల త్రయోదశి నాడు దేశవ్యాప్తంగా మహావీర్ జయంతిని భక్తి, విశ్వాసం,  శాంతి.. మొదలైన  సందేశాలతో జరుపుకుంటారు. జైన మతం  24వ తీర్థంకరుడు అయిన  మహావీరుడి జన్మదినం కేవలం జైన మతస్థులకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా  సత్యం, అహింస,  సంయమనం మొదలైన వాటిని ప్రేరేపిస్తుంది.  వర్థమాన మహావీరుడు అని పిలుచుకునే మహావీరుడు జైన మతంలో చివరి తీర్థంకరుడు కూడా.  ఈయన తన జీవితంలో 5 జీవన సూత్రాలను ప్రజలకు చెప్పాడు.  ఈ జీవన సూత్రాలు ప్రజలకు ఎంతో నేర్పిస్తాయి.  ఇది పూర్తీగా మతానికి మినహాయించి ఆలోచించాల్సిన అంశం.  వర్థమాన మహావీరుడు చెప్పిన ఐదు జీవన సూత్రాలు.. ఆయన చరిత్ర తెలుసుకుంటే.. వర్థమాన మహావీరుడు  క్రీస్తుపూర్వం 599లో బీహార్‌లోని కుందల్‌పూర్‌లో జన్మించాడు. అతని తండ్రి రాజు సిద్ధార్థ లిచ్చవి రాజవంశానికి పాలకుడు,  తల్లి త్రిషల గణతంత్ర యువరాణి. చిన్నప్పటి నుంచీ మహావీరునికి లోతైన సున్నితత్వం, నిర్లిప్తత,  సత్య అన్వేషణ అనేవి ఉండేవి. 30 సంవత్సరాల వయసులో తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, విలాసాలను త్యజించి ఒక సాధువు జీవితాన్ని చేపట్టాడు. దీని తరువాత అతను 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు, ధ్యానం,  నిశ్శబ్ద సాధన చేసాడు. చివరికి  జ్ఞానోదయం పొందాడు.   'జిన్' అంటే ఇంద్రియాలను జయించినవాడు అని పిలువబడ్డాడు. దీని తరువాత  తన జీవితమంతా ప్రజా సంక్షేమం,  మత ప్రచారానికి అంకితం చేశాడు. మతపర,  సామాజిక ప్రాముఖ్యత.. వర్థమాన మహావీరుడి జయంతి కేవలం ఒక మతపరమైన విషయం కాదు. ఇది  మానవ విలువల పునరుద్ధరణకు ప్రతీక. ఈ రోజున జైన సమాజం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కలశ యాత్ర, శోభా యాత్ర,  ప్రబోధాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జైన దేవాలయాలలో మహావీరుడి విగ్రహాలను ప్రతిష్టించారు. అనేక చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, ఆహార దానం, పుస్తక పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మహావీరుడి 5 జీవన సూత్రాలు.. మహావీరుడి జీవిత తత్వశాస్త్రానికి ప్రాథమిక పునాది ఆయన చెప్పిన ఐదు ప్రధాన ప్రమాణాలు. అహింస.. ప్రతి జీవికి ఒక ఆత్మ ఉంటుంది. కాబట్టి ఎవరినైనా బాధపెట్టడం పాపం. మహావీరుడు ఆలోచనలు, మాటలు,  చర్యలలో అహింసను అనుసరించాలనే సందేశాన్ని ఇచ్చాడు. సత్యం.. ఆత్మను పవిత్రం చేసుకోవడానికి నిజం మాట్లాడటమే ఏకైక మార్గం. అబద్ధాలు చెప్పడం వల్ల మనసు చంచలమై సమాజంలో అపనమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. అస్తేయ.. అనుమతి లేకుండా ఏదైనా తీసుకెళ్లడం లేదా దొంగిలించడం నేరం. జీవితంలో ఆనందానికి సంతృప్తి,  స్వీయ నియంత్రణ మార్గం. బ్రహ్మచర్యం.. ఆత్మ పురోగతికి బ్రహ్మచర్యం, ఇంద్రియాలపై నియంత్రణ, మానసిక,  శారీరక నిగ్రహం చాలా అవసరం. అపరిగ్రహ.. మీరు ఎంత తక్కువ సేకరిస్తే, మీ జీవితం అంత సరళంగా,  ప్రశాంతంగా ఉంటుంది. నిజమైన త్యాగం అంటే సంపద, వస్త్రాలు, సంబంధాలు,  కోరికల పట్ల మమకారాన్ని త్యజించడం. మహావీరుడి ఈ సూత్రాలు నేటి యుగంలో కూడా అంతే సందర్భోచితంగా ఉన్నాయి. హింస, మోసం, అనుబంధం లేకుండా కూడా జీవితాన్ని అందంగా, విజయవంతం చేయవచ్చని ఆయన జీవితం మనకు బోధిస్తుంది.                                 *రూపశ్రీ.
   తెలుగు రాష్ట్రాలలో చాలామందికి సగ్గు  బియ్యం  ఒడియాలు పెడతారు అని మాత్రమే తెలుసు. సోషల్ మీడియా కారణంగా సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారని కూడా చూసే ఉంటారు. కానీ  ఇతర రాష్ట్రాలలో సగ్గుబియ్యాన్ని చాలా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యాన్ని చేర్చుకుంటారు.  అయితే సగ్గుబియ్యం ప్రయోజనాలు చాలా మందికి తెలియవు.  సగ్గు బియ్యం కిచిడి,  సగ్గుబియ్యం పాయసం,  సగ్గు బియ్యం ఒడియాలు.. సగ్గుబియ్యం చాట్.. ఇలా చాలా రకాలుగా ఉపయోగించే సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.  సగ్గుబియ్యంలో ఉండే పోషకాలు ఏంటి? సగ్గుబియ్యం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. సగ్గుబియ్యం మంచి ఎనర్జీని ఇస్తుంది.  అంతే కాదు.. ఇందులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.  సగ్గుబియ్యంలో పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో  సహాయపడతాయి. సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు శరీరాన్ని ఆవరించిన అలసట,  బలహీనత మొదలైనవి తొలగిపోతాయి. సగ్గుబియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బలహీనమైన పేగు ఆరోగ్యం ఉన్నవారు సగ్గుబియ్యం తింటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రోటీన్ పరంగా చూస్తే సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.  ఇది కండరాల మరమ్మత్తుకు, కండరాలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.  అందుకే ప్రోటీన్ తీసుకోవాలి  అనుకునే వారు ఆహారంలో సగ్గుబియ్యం ను చేర్చుకోవచ్చు. చాలా సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు పెరగాలని అనుకుంటే అందుకు సగ్గుబియ్యం బాగా సహాయపడతుంది.  సగ్గుబియ్యంలో ఉండే ప్రోటీన్,  కార్బోహేడ్రేట్స్, పోషకాలు ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది.  ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. సగ్గుబియ్యంలో ఐరన్ కంటెంట్, ఫోలేట్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.  గర్భవతులు సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల కడుపులో పిండం అబివృద్ది ఆరోగ్యకరంగా జరుగుతుంది.  ఇది రక్తహీనత వంటి రక్తలోపం సమస్య ఉన్నవారికి కూడా మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు,  దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.  రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ నేటి కాలంలో జీవనశైలి, అంటువ్యాధుల ప్రమాదం పెరగడం,  తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వంటి కారణాల వల్ల చాలామందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా కోవిడ్-19 తరువాత చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా మారింది. అయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని,  ఆరోగ్యం దృఢం చేసుకోవాలని ట్రై చేసేవారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికోసం ఇమ్యూనిటీని పెంచే టాప్ 7   టిప్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుసుకోండి మరి.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. సమతుల్య ఆహారం రోగనిరోధక ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన విటమిన్లు,  ఖనిజాలను అందిస్తుంది. విటమిన్ సి: సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్,  స్ట్రాబెర్రీలలో లభిస్తుంది, ఇది రోగనిరోధక కణాల పనితీరును పెంచుతుంది మరియు వాపును తగ్గిస్తుంది. విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది . సూర్యరశ్మికి గురికావడం మరియు కొవ్వు చేపలు మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. జింక్: గింజలు, చిక్కుళ్ళలో లభించే ఈ ఖనిజం రోగనిరోధక కణాల కార్యకలాపాలకు మరియు గాయం నయం కావడానికి మద్దతు ఇస్తుంది. ప్రోబయోటిక్స్: పెరుగు,  కిమ్చి, ఇడ్లీ,  దోస  వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది.  నాణ్యమైన నిద్ర.. రోగనిరోధక నియంత్రణకు నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలిక నిద్ర లేమి వాపును పెంచుతుంది,  రక్షిత సైటోకిన్‌ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రాత్రికి 7–9 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.  శారీరక శ్రమ.. మితమైన వ్యాయామం రోగనిరోధక కణాల ప్రసరణను పెంచుతుంది. శరీరం వ్యాధికారకాలను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వారానికి 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. రోగనిరోధక పనితీరును అణిచివేస్తుంది,  వాపుకు దారితీస్తుంది. ఒత్తిడిని నిర్వహించడానికి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రకృతిలో సమయం గడపడం,  అభిరుచులు,  సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ఉత్తమమైనవి. ఒత్తిడిని తగ్గించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది,  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. హైడ్రేటెడ్.. శరీరం నుండి పోషకాలను రవాణా చేయడానికి,  విషాన్ని తొలగించడానికి నీరు చాలా అవసరం.  శరీరం అంతటా రోగనిరోధక కణాలను తీసుకువెళ్ళే శోషరస ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా డీహేడ్రేషన్ రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుంది .  వాతావరణాన్ని బట్టి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. హెర్బల్ టీలు,  పుచ్చకాయ వంటి నీటితో కూడిన పండ్లు కూడా హైడ్రేషన్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి.  పరిశుభ్రత,  టీకాలు వేయడం.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరైన పరిశుభ్రత పాటించడం,  టీకాలు వేయించుకోవడం ముఖ్యం. చేతులు కడుక్కోవడం: సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌లు,  బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. టీకాలు: టీకాలు శరీరానికి నిర్దిష్ట వ్యాధికారకాలను గుర్తించి పోరాడటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ధూమపానం,  మద్యం .. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీసి రోగనిరోధక కణాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర  సామర్థ్యం తగ్గుతుంది.   ధూమపానం,  మద్యం సేవించడం మానేయడం వల్ల రోగనిరోధక పనితీరు మొత్తం ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు,   అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి.  ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో  వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట. కడుపు నిండుగా తినకూడదు.. పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా  ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట.  అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా  జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం.. తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని  అనుసరిస్తుందట.   మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి. సమయం.. రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది,  ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహార స్థితి.. ఆహారం చల్లగా అయిన తరువాత  మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత   గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉపవాసం.. అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట.  దీనికి బదులుగా  ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే   తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం.  దీని వల్ల  తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే  భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఉష్ణోగ్రత..  తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.  ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది.                                    *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...